కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభవార్త చెప్పారు..! డంపింగ్ యార్డ్ పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. స్వచ్ఛ భారత్ పథకం కింద ఇప్పటికే 16 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. యూసీఎఫ్ నిధుల నుంచి మరో 80 కోట్ల రూపాయలను డంపింగ్ యార్డ్ కోసం వెచ్చిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్‌లో 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. రోడ్లు, డ్రెయిన్లు, పైప్‌లైన్లు, ఓపెన్ జిమ్ పనులను ప్రారంభించారు. గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం.. ప్రతి డివిజన్‌లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తాం అని బండి సంజయ్ తెలిపారు. యూసీఎఫ్ కింద కరీంనగర్‌కు మొత్తం 840 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నామని.. కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌కు టెండర్లు.. యూసీఎఫ్ నుంచి మరో 80 కోట్లు.. కరీంనగర్ అభివృద్ధికి భారీ ప్రణాళిక..!
కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభవార్త చెప్పారు..! డంపింగ్ యార్డ్ పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. స్వచ్ఛ భారత్ పథకం కింద ఇప్పటికే 16 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. యూసీఎఫ్ నిధుల నుంచి మరో 80 కోట్ల రూపాయలను డంపింగ్ యార్డ్
కోసం వెచ్చిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్‌లో 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. రోడ్లు, డ్రెయిన్లు, పైప్‌లైన్లు, ఓపెన్ జిమ్ పనులను ప్రారంభించారు. గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం.. ప్రతి డివిజన్‌లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తాం అని బండి
సంజయ్ తెలిపారు. యూసీఎఫ్ కింద కరీంనగర్‌కు మొత్తం 840 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నామని.. కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌కు టెండర్లు.. యూసీఎఫ్ నుంచి మరో 80 కోట్లు.. కరీంనగర్ అభివృద్ధికి భారీ ప్రణాళిక..!
- కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభవార్త చెప్పారు..! డంపింగ్ యార్డ్ పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. స్వచ్ఛ భారత్ పథకం కింద ఇప్పటికే 16 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. యూసీఎఫ్ నిధుల నుంచి మరో 80 కోట్ల రూపాయలను డంపింగ్ యార్డ్ కోసం వెచ్చిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్‌లో 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. రోడ్లు, డ్రెయిన్లు, పైప్‌లైన్లు, ఓపెన్ జిమ్ పనులను ప్రారంభించారు. గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం.. ప్రతి డివిజన్‌లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తాం అని బండి సంజయ్ తెలిపారు. యూసీఎఫ్ కింద కరీంనగర్‌కు మొత్తం 840 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నామని.. కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌కు టెండర్లు.. యూసీఎఫ్ నుంచి మరో 80 కోట్లు.. కరీంనగర్ అభివృద్ధికి భారీ ప్రణాళిక..!3
- కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.1
- ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాల విద్యార్థులకు న్యూట్రిషన్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కరీంనగర్ లో ప్రారంభం.... విద్యా వైద్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని న్యూట్రిషన్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కరీంనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రేక్ ఫాస్ట్ తో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని ఆలోచిస్తున్నామని మంత్రి తెలిపారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో 8 కోట్లతో జిల్లాలోని 49 వేల మంది విద్యార్థులకు పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ చిత్రమిశ్రా, హరేకృష్ణ ఫౌండేషన్ సిఈవో కౌంటియా దాస స్వామీజీ తో కలిసి ప్రారంభించారు. అధునాతన సాంకేతిక టెక్నాలజీతో రూపొందించిన భారీ కిచెన్ ను పరిశీలించారు. ఇడ్లీ, దోశ, పూరీ, సాంబార్, బోండా తయారీ మిషన్లు, పాత్రలు క్లీన్ చేసే మిషన్లు ,పాల కేంద్రం ,ఆహార పదార్థాల టెస్టింగ్ ల్యాబ్ లను, వెజిటేబుల్ కట్ చేసే మిషన్లు, కూరగాయలు కడిగే మిషన్లు , చట్నీ పౌడర్ తయారీ మిషన్ల పనితీరును పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఆరో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించామని ఈ కిచెన్ ద్వారా జిల్లాలోని 17 మండలాల్లో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11జూనియర్ కళాశాలల విద్యార్థులకు పోషకాలతో కూడిన బ్రెక్ ఫాస్ట్ అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 లక్షల 72 వేల 291 మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 23106 ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు 31 జిల్లాల్లో 31 కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 1400 పంపిణీ వాహనాలు, 5,000 మంది సిబ్బంది, కేంద్రీకృత వంటశాలల ద్వారా సుమారు 15 వేల మందికి ప్రత్యక్షంగా 10 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలున్నాయని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం భూములు ఇచ్చేలాంటి పథకాలు అమలు చేసిందని ప్రస్తుతం భూములు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన పథకాలతో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అందుకే తమ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. డ్రాప్స్ లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా చర్యలు చేపడుతున్నామని అందులో భాగంగానే బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేస్తున్నామని త్వరలో హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం అమలు చేసే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. ప్రయోగాత్మకంగా ముందుగా కొడంగల్ లో బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేయడంతో 75 నుంచి 90% ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం పెరిగిందని స్పష్టం చేశారు. పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని కోరారు. బకాయి ఫీజు రియంబర్స్మెంట్ సైతం త్వరలోనే క్లియర్ చేస్తామని, విజిలెన్స్ విచారణ అనంతరం బకాయిలన్నీ క్లియర్ చేయడం జరుగుతుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై అసెంబ్లీ లో సీఎం క్లారిటీగా చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.4
- డేంజర్ జోన్ గా జగిత్యాల బైపాస్ రోడ్డు: గుంతలు పూడ్చేదెప్పుడు? ప్రయాణం సురక్షితమయ్యేదెప్పుడు? జగిత్యాల పట్టణంలో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే కొత్త బస్ స్టాండ్ సమీపంలోని తెలంగాణ వైన్స్ చౌరస్తా నుండి బైపాస్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డు పునర్నిర్మాణం లేదా డ్రైనేజీ/పైప్‌లైన్ పనుల కోసం తవ్విన భారీ గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చకుండా, మట్టి మరియు రాళ్ల శిథిలాలను (Debris) రోడ్డు పైనే అస్తవ్యస్తంగా వదిలేశారు. ప్రాణసంకటంగా రాత్రి ప్రయాణం: తెలంగాణ వైన్స్ చౌరస్తా వద్ద నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ గుంతల వద్ద ఎటువంటి రేడియం సూచికలు గానీ, ప్రకాశించే బారికేడ్లు గానీ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు ట్రాఫిక్ దిగ్బంధం: కొత్త బస్ స్టాండ్ వైపు, బైపాస్ వైపు వెళ్లే వాహనాలు ఈ గుంతలను తప్పించబోయి హఠాత్తుగా బ్రేకులు వేయడం వల్ల చౌరస్తా ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. ప్రయాణికులకు దుమ్ము ఇబ్బందులు: రోడ్డుపై విసిరేసినట్లున్న కంకర, మట్టి వల్ల వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతంగా దుమ్ము రేగి కాలినడకన వెళ్లే ప్రయాణికులు, స్థానిక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త బస్ స్టాండ్ మరియు బైపాస్ రోడ్డును కలిపే ఈ కీలకమైన చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ మరియు ఆర్ అండ్ బి (R&B) అధికారులు తక్షణమే స్పందించాలి. వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి, తవ్విన గుంతలకు శాశ్వత మరమ్మతులు చేపట్టి వాహనదారుల ప్రయాణాన్ని సురక్షితం చేయాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.1
- ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను: 1) పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. 2) మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు. ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.1
- శ్రీరాంపూర్: కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: HMS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంపూర్ సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని HMS రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య డిమాండ్ చేశారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 నెలలుగా గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. గనుల్లో పనిచేసే కార్మికులకు అవసరమైన పనిముట్లు, రక్షణ పరికరాలు తక్షణమే అందించాలని కోరారు. కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు.1
- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం ఇచ్చే అతిపెద్ద బహుమతి.. నాణ్యమైన విద్య.. పోషకాహారం..!” అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆకలితో ఉన్న పిల్లవాడు చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేడు..! అందుకే ఉదయం పూటే విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. చదువు కోసం పుస్తకాలు ఇస్తున్నాం..! చదువుకునే వాతావరణం కల్పిస్తున్నాం..! ఇప్పుడు ఆకలి లేకుండా చదువుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం..! ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మౌలిక వసతులతో పాటు ట్రెయిన్డ్ టీచర్లు, నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్‌లోని ఈ కేంద్రీకృత వంటశాల ద్వారా రోజుకు 49,025 మంది విద్యార్థులకు అల్పాహారం అందుతుందని చెప్పారు. “ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే తల్లిదండ్రుల మద్దతు కూడా అవసరం.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా ప్రోత్సహించాలి” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియాకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. “ఈరోజు విద్యార్థులకు అందుతున్న ఈ అల్పాహారం.. రేపటి వారి ఆరోగ్యం, చదువు, భవిష్యత్తుకు బలమైన పునాది కావాలి..!” అని మంత్రి ఆకాంక్షించారు.4