ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాల విద్యార్థులకు న్యూట్రిషన్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కరీంనగర్ లో ప్రారంభం.... విద్యా వైద్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని న్యూట్రిషన్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కరీంనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రేక్ ఫాస్ట్ తో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని ఆలోచిస్తున్నామని మంత్రి తెలిపారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో 8 కోట్లతో జిల్లాలోని 49 వేల మంది విద్యార్థులకు పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ చిత్రమిశ్రా, హరేకృష్ణ ఫౌండేషన్ సిఈవో కౌంటియా దాస స్వామీజీ తో కలిసి ప్రారంభించారు. అధునాతన సాంకేతిక టెక్నాలజీతో రూపొందించిన భారీ కిచెన్ ను పరిశీలించారు. ఇడ్లీ, దోశ, పూరీ, సాంబార్, బోండా తయారీ మిషన్లు, పాత్రలు క్లీన్ చేసే మిషన్లు ,పాల కేంద్రం ,ఆహార పదార్థాల టెస్టింగ్ ల్యాబ్ లను, వెజిటేబుల్ కట్ చేసే మిషన్లు, కూరగాయలు కడిగే మిషన్లు , చట్నీ పౌడర్ తయారీ మిషన్ల పనితీరును పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఆరో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించామని ఈ కిచెన్ ద్వారా జిల్లాలోని 17 మండలాల్లో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11జూనియర్ కళాశాలల విద్యార్థులకు పోషకాలతో కూడిన బ్రెక్ ఫాస్ట్ అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 లక్షల 72 వేల 291 మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 23106 ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు 31 జిల్లాల్లో 31 కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 1400 పంపిణీ వాహనాలు, 5,000 మంది సిబ్బంది, కేంద్రీకృత వంటశాలల ద్వారా సుమారు 15 వేల మందికి ప్రత్యక్షంగా 10 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలున్నాయని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం భూములు ఇచ్చేలాంటి పథకాలు అమలు చేసిందని ప్రస్తుతం భూములు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన పథకాలతో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అందుకే తమ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. డ్రాప్స్ లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా చర్యలు చేపడుతున్నామని అందులో భాగంగానే బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేస్తున్నామని త్వరలో హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం అమలు చేసే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. ప్రయోగాత్మకంగా ముందుగా కొడంగల్ లో బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేయడంతో 75 నుంచి 90% ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం పెరిగిందని స్పష్టం చేశారు. పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని కోరారు. బకాయి ఫీజు రియంబర్స్మెంట్ సైతం త్వరలోనే క్లియర్ చేస్తామని, విజిలెన్స్ విచారణ అనంతరం బకాయిలన్నీ క్లియర్ చేయడం జరుగుతుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై అసెంబ్లీ లో సీఎం క్లారిటీగా చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాల విద్యార్థులకు న్యూట్రిషన్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కరీంనగర్ లో ప్రారంభం.... విద్యా వైద్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని న్యూట్రిషన్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కరీంనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రేక్ ఫాస్ట్ తో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని ఆలోచిస్తున్నామని మంత్రి తెలిపారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో 8 కోట్లతో జిల్లాలోని 49 వేల మంది విద్యార్థులకు పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్,
ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ చిత్రమిశ్రా, హరేకృష్ణ ఫౌండేషన్ సిఈవో కౌంటియా దాస స్వామీజీ తో కలిసి ప్రారంభించారు. అధునాతన సాంకేతిక టెక్నాలజీతో రూపొందించిన భారీ కిచెన్ ను పరిశీలించారు. ఇడ్లీ, దోశ, పూరీ, సాంబార్, బోండా తయారీ మిషన్లు, పాత్రలు క్లీన్ చేసే మిషన్లు ,పాల కేంద్రం ,ఆహార పదార్థాల టెస్టింగ్ ల్యాబ్ లను, వెజిటేబుల్ కట్ చేసే మిషన్లు, కూరగాయలు కడిగే మిషన్లు , చట్నీ పౌడర్ తయారీ మిషన్ల పనితీరును పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఆరో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించామని ఈ కిచెన్ ద్వారా జిల్లాలోని 17 మండలాల్లో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11జూనియర్ కళాశాలల విద్యార్థులకు పోషకాలతో కూడిన బ్రెక్ ఫాస్ట్ అందించడం
జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 లక్షల 72 వేల 291 మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 23106 ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు 31 జిల్లాల్లో 31 కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 1400 పంపిణీ వాహనాలు, 5,000 మంది సిబ్బంది, కేంద్రీకృత వంటశాలల ద్వారా సుమారు 15 వేల మందికి ప్రత్యక్షంగా 10 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలున్నాయని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం భూములు ఇచ్చేలాంటి పథకాలు అమలు చేసిందని ప్రస్తుతం భూములు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన పథకాలతో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అందుకే తమ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యకు ప్రాధాన్యత
ఇస్తున్నామని తెలిపారు. డ్రాప్స్ లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా చర్యలు చేపడుతున్నామని అందులో భాగంగానే బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేస్తున్నామని త్వరలో హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం అమలు చేసే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. ప్రయోగాత్మకంగా ముందుగా కొడంగల్ లో బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేయడంతో 75 నుంచి 90% ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం పెరిగిందని స్పష్టం చేశారు. పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని కోరారు. బకాయి ఫీజు రియంబర్స్మెంట్ సైతం త్వరలోనే క్లియర్ చేస్తామని, విజిలెన్స్ విచారణ అనంతరం బకాయిలన్నీ క్లియర్ చేయడం జరుగుతుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై అసెంబ్లీ లో సీఎం క్లారిటీగా చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
- కరీంనగర్ లో వారం రోజుల్లో డంపింగ్ యార్డ్ పనులకు టెండర్...యూసీఎఫ్ నుండి మరో 80 కోట్లు డంపింగ్ యార్డ్ కు వెచ్చిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ పనులకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ స్కీం నిధుల్లో భాగంగా 16 కోట్లతో చేపట్టిన డంపింగ్ యార్డు పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో పర్యటించారు. కరీంనగర్ లోని 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు బండి సంజయ్ భూమి పూజ చేశారు. 42వ డివిజన్ లోని భగత్ నగర్ మమత థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం సమీపంలోని పొలాడి ఆనందరావు అపార్ట్ మెంట్ గల్లీలో 50 లక్షల రూపాయల Uidf నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కరీంనగర్ 49వ డివిజన్ లోని భాగ్యనగర్ బాలాజీ సూపర్ మార్కెట్ సమీపంలో 50 లక్షల యూఐడిఎఫ్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ లోని పోచమ్మ కమాన్ సమీపంలో 10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక శ్రీ గాయత్రి అసోయేషన్ ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని దర్శించుకున్నారు. 13వ డివిజన్ లోని శివనగర్ బైపాస్ రోడ్ సమీపంలోని లారెల్ (Laureal) స్కూల్ వద్ద 75 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మీడియాతో సంజయ్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ కు సంబంధించి పనులను వేగవంతం చేస్తామన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లు మంజూరయ్యాయని, అందులో భాగంగా మరో 80 కోట్లను డంపింగ్ యార్డ్ పనులకు వెచ్చించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ లోని ప్రతి డివిజన్ లో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నామని, గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.3
- కరీంనగర్ నగర పాలక సంస్థలో వాటర్ పైప్‌లైన్ టెండర్ నిబంధనలపై తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా... కేవలం పైపుల తయారీ సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. ఇదే పైప్‌లైన్ పనికి గతంలో 45 లక్షల రూపాయల టెండర్ నిర్వహించగా... దాదాపు 28 శాతం లెస్‌కు పని దక్కిందని, దీంతో నగర పాలక సంస్థకు సుమారు 12 లక్షల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు. అయితే ఇప్పుడు అదే పనికి సంబంధించిన టెండర్ నిబంధనలను ఉన్నట్టుండి ఎందుకు మార్చారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధనల మార్పు వెనుక ఎవరికి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశం ఉందో స్పష్టం చేయాలని కోరారు. మేయర్, కమిషనర్‌కు ఈ నిబంధనల మార్పు గురించి తెలుసా..? తెలియకుండానే జరిగిందా..? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి, ఎక్కువ మంది అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనేలా పారదర్శకంగా టెండర్ నిర్వహించాలని కోరారు. అవినీతి ఆరోపణలపై స్పష్టత ఇవ్వకపోతే ఉన్నతాధికారులు, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.1
- కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.1
- సిరిసిల్లలో పెట్రోల్‌లో నీరు వచ్చిందంటూ వాహనదారుడి ఆందోళన. సిరిసిల్ల: పెట్రోల్‌లో నీరు కలిసిందని ఆరోపిస్తూ ఓ వాహనదారుడు ఆందోళనకు దిగాడు. పాత బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించిన అనంతరం తన వాహనం మొరాయించిందని జిల్లెల్లకు చెందిన కృష్ణ తెలిపారు. పరిశీలించగా పెట్రోల్‌లో నీరు ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై బంక్ సిబ్బందిని ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కృష్ణ కోరారు.1
- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- ఇల్లు అద్దెకు ఇస్తే వాడు ఏకంగా దర్గా గా మార్చేసాడు, .. .. 💦😡 ఇల్లు అద్దెకు ఇస్తే వాడు ఏకంగా దర్గా గా మార్చేసాడు, .. .. 💦😡👆1
- పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.1
- గణనాధుని సేవలో తరిస్తున్న భక్తులు... వాసవి అపార్ట్మెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గోపాలకృష్ణావతార గణేషుడు తొలిపూజలు అందుకుని విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కన్నుల పండువలా జరుగుతున్నాయి. ఊరువాడ పల్లె పట్టణం అనే తేడా లేకుండా గల్లి గల్లిన బొజ్జ గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విబిన్న ఆకృతుల్లో ఉన్న గణనాథులను అందంగా అలంకరించిన మండపాలలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అన్నదానాలతో గణనాథుడి సేవలో భక్తులు తరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేలకు పైగా గణేష్ మంట పాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలతో గణనాధున్ని కొలుస్తున్నారు. కరీంనగర్లో 3500 విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రతి మంటపం వద్ద గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లోని తిరుమలనగర్ వాసవి అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన శ్రీ గోపాలకృష్ణావతార గణనాథుడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. గోపాల కృష్ణావతార గణనాథుని వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో వాసవి అపార్ట్మెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ కార్యదర్శి విజేందర్ రెడ్డి, కోశాధికారి సురేష్, సభ్యులు భాస్కర్, శివ, సాయితేజ, లాకేష్, నరేందర్ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. నగరంలో పలుచోట్ల విభిన్న ఆకృతుల్లో ఉన్న వినాయకులను భక్తులను ఆసక్తిగా తిలకిస్తూ దర్శనం చేసుకుంటున్నారు. 1