logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గణనాధుని సేవలో తరిస్తున్న భక్తులు... వాసవి అపార్ట్మెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గోపాలకృష్ణావతార గణేషుడు తొలిపూజలు అందుకుని విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కన్నుల పండువలా జరుగుతున్నాయి. ఊరువాడ పల్లె పట్టణం అనే తేడా లేకుండా గల్లి గల్లిన బొజ్జ గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విబిన్న ఆకృతుల్లో ఉన్న గణనాథులను అందంగా అలంకరించిన మండపాలలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అన్నదానాలతో గణనాథుడి సేవలో భక్తులు తరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేలకు పైగా గణేష్ మంట పాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలతో గణనాధున్ని కొలుస్తున్నారు. కరీంనగర్లో 3500 విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రతి మంటపం వద్ద గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లోని తిరుమలనగర్ వాసవి అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన శ్రీ గోపాలకృష్ణావతార గణనాథుడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. గోపాల కృష్ణావతార గణనాథుని వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో వాసవి అపార్ట్మెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ కార్యదర్శి విజేందర్ రెడ్డి, కోశాధికారి సురేష్, సభ్యులు భాస్కర్, శివ, సాయితేజ, లాకేష్, నరేందర్ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. నగరంలో పలుచోట్ల విభిన్న ఆకృతుల్లో ఉన్న వినాయకులను భక్తులను ఆసక్తిగా తిలకిస్తూ దర్శనం చేసుకుంటున్నారు. ‌

1 hr ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
1 hr ago

గణనాధుని సేవలో తరిస్తున్న భక్తులు... వాసవి అపార్ట్మెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గోపాలకృష్ణావతార గణేషుడు తొలిపూజలు అందుకుని విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కన్నుల పండువలా జరుగుతున్నాయి. ఊరువాడ పల్లె పట్టణం అనే తేడా లేకుండా గల్లి గల్లిన బొజ్జ గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విబిన్న ఆకృతుల్లో ఉన్న గణనాథులను అందంగా అలంకరించిన మండపాలలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అన్నదానాలతో గణనాథుడి సేవలో భక్తులు తరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేలకు పైగా గణేష్ మంట పాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలతో గణనాధున్ని కొలుస్తున్నారు. కరీంనగర్లో 3500 విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రతి మంటపం వద్ద గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లోని తిరుమలనగర్ వాసవి అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన శ్రీ గోపాలకృష్ణావతార గణనాథుడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. గోపాల కృష్ణావతార గణనాథుని వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో వాసవి అపార్ట్మెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ కార్యదర్శి విజేందర్ రెడ్డి, కోశాధికారి సురేష్, సభ్యులు భాస్కర్, శివ, సాయితేజ, లాకేష్, నరేందర్ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. నగరంలో పలుచోట్ల విభిన్న ఆకృతుల్లో ఉన్న వినాయకులను భక్తులను ఆసక్తిగా తిలకిస్తూ దర్శనం చేసుకుంటున్నారు. ‌

More news from Telangana and nearby areas
  • కరీంనగర్ నగర పాలక సంస్థలో వాటర్ పైప్‌లైన్ టెండర్ నిబంధనలపై తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా... కేవలం పైపుల తయారీ సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. ఇదే పైప్‌లైన్ పనికి గతంలో 45 లక్షల రూపాయల టెండర్ నిర్వహించగా... దాదాపు 28 శాతం లెస్‌కు పని దక్కిందని, దీంతో నగర పాలక సంస్థకు సుమారు 12 లక్షల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు. అయితే ఇప్పుడు అదే పనికి సంబంధించిన టెండర్ నిబంధనలను ఉన్నట్టుండి ఎందుకు మార్చారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధనల మార్పు వెనుక ఎవరికి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశం ఉందో స్పష్టం చేయాలని కోరారు. మేయర్, కమిషనర్‌కు ఈ నిబంధనల మార్పు గురించి తెలుసా..? తెలియకుండానే జరిగిందా..? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి, ఎక్కువ మంది అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనేలా పారదర్శకంగా టెండర్ నిర్వహించాలని కోరారు. అవినీతి ఆరోపణలపై స్పష్టత ఇవ్వకపోతే ఉన్నతాధికారులు, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
    1
    కరీంనగర్ నగర పాలక సంస్థలో వాటర్ పైప్‌లైన్ టెండర్ నిబంధనలపై తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు.
రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా... కేవలం పైపుల తయారీ సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు.
ఇదే పైప్‌లైన్ పనికి గతంలో 45 లక్షల రూపాయల టెండర్ నిర్వహించగా... దాదాపు 28 శాతం లెస్‌కు పని దక్కిందని, దీంతో నగర పాలక సంస్థకు సుమారు 12 లక్షల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు.
అయితే ఇప్పుడు అదే పనికి సంబంధించిన టెండర్ నిబంధనలను ఉన్నట్టుండి ఎందుకు మార్చారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నిబంధనల మార్పు వెనుక ఎవరికి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశం ఉందో స్పష్టం చేయాలని కోరారు.
మేయర్, కమిషనర్‌కు ఈ నిబంధనల మార్పు గురించి తెలుసా..? తెలియకుండానే జరిగిందా..? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు.
టెండర్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి, ఎక్కువ మంది అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనేలా పారదర్శకంగా టెండర్ నిర్వహించాలని కోరారు.
అవినీతి ఆరోపణలపై స్పష్టత ఇవ్వకపోతే ఉన్నతాధికారులు, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.
    1
    పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ 
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా
తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    4 hrs ago
  • అవసరమైన చోట ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆర్డీవో ఆఫీసుల నిర్మాణాలు చేస్తాం*_ _*ఇప్పటికే మొదటి విడత రూ. 600 కోట్లకు పైగా నిధులు కేటాయించాం*_ _*అవసరమైన చోట ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆర్డీవో ఆఫీసుల నిర్మాణాలు చేస్తాం*_ _*ఇప్పటికే మొదటి విడత రూ. 600 కోట్లకు పైగా నిధులు కేటాయించాం*_ -శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
    1
    అవసరమైన చోట ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆర్డీవో ఆఫీసుల నిర్మాణాలు చేస్తాం*_
_*ఇప్పటికే మొదటి విడత రూ. 600 కోట్లకు పైగా నిధులు కేటాయించాం*_
_*అవసరమైన చోట ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆర్డీవో ఆఫీసుల నిర్మాణాలు చేస్తాం*_
_*ఇప్పటికే మొదటి విడత రూ. 600 కోట్లకు పైగా నిధులు కేటాయించాం*_ 
-శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    4 hrs ago
  • క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ జనగామ: క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ​ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.
    1
    క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్
జనగామ:
క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు.
​ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు.
​ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.
    user_Parushuram goud
    Parushuram goud
    Singer జనగాం, జనగాం, తెలంగాణ•
    22 hrs ago
  • వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
    1
    వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.
వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను: 1) పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. 2) మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు. ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
    1
    ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు 
గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న నిందితులను:
1)	పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి.
2)	మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి.
నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు.
ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    3 hrs ago
  • రామగుండంలో యువతి ఆత్మహత్య కలకలం...యువతి ఆత్మహత్యకు సింగరేణి షిఫ్ట్ ఓవర్ మెన్ కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థి ఆత్మహత్య ఆందోళనకు దారి తీసింది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ట్రైనింగ్ కోసం వెళితే , ఓర్ మెన్ ఆమెపై అత్యాచారం చేయడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోదావరిఖని కి చెందిన తాండ్ర అక్షితరాణి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఇండస్ట్రియల్ టూర్ లో భాగంగా ట్రైనింగ్ కోసం రామగుండం అర్జీ-వన్ లోని రెండవ బొగ్గు గనిలో విధుల్లో చేరింది. అయితే షిఫ్ట్ ఓవర్ మెన్ గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్ అక్షిత రాణిపై అత్యాచారం చేశాడని గని మేనేజర్ తోపాటు జీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మృతురాలి తల్లి రజిత బోరున విలపిస్తు తెలిపారు. సింగరేణి అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందిన అక్షితరాణి లెటర్ రాసి సూసైడ్ చేసుకుందని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి చదివించుకున్న కూతురును పని స్థలంలో సూపర్వైజర్ అత్యాచారం చేశారని చెప్పిన పట్టించుకోకపోవడంపై కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు శవంతో ఆందోళనకు దిగారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద మృతదేహంతో ధర్నా రాస్తారోకో చేశారు.షఅత్యాచారానికి యత్నించిన రవికుమార్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన కూతురుకు పట్టిన గతి సూపర్వైజర్ రవికుమార్ పట్టాలని తల్లి శాపనార్ధాలు పెట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి దర్యాప్తు చేపట్టి బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు.
    3
    రామగుండంలో యువతి ఆత్మహత్య కలకలం...యువతి ఆత్మహత్యకు సింగరేణి షిఫ్ట్ ఓవర్ మెన్ కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థి ఆత్మహత్య ఆందోళనకు దారి తీసింది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ట్రైనింగ్ కోసం వెళితే , ఓర్ మెన్ ఆమెపై అత్యాచారం చేయడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోదావరిఖని కి చెందిన తాండ్ర అక్షితరాణి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఇండస్ట్రియల్ టూర్ లో భాగంగా ట్రైనింగ్ కోసం రామగుండం అర్జీ-వన్ లోని రెండవ బొగ్గు గనిలో విధుల్లో చేరింది. అయితే షిఫ్ట్ ఓవర్ మెన్ గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్ అక్షిత రాణిపై అత్యాచారం చేశాడని గని మేనేజర్ తోపాటు జీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మృతురాలి తల్లి రజిత బోరున విలపిస్తు తెలిపారు. సింగరేణి అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందిన అక్షితరాణి లెటర్ రాసి సూసైడ్ చేసుకుందని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి చదివించుకున్న కూతురును పని స్థలంలో సూపర్వైజర్ అత్యాచారం చేశారని చెప్పిన పట్టించుకోకపోవడంపై కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు శవంతో ఆందోళనకు దిగారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద మృతదేహంతో ధర్నా రాస్తారోకో చేశారు.షఅత్యాచారానికి యత్నించిన రవికుమార్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  తన కూతురుకు పట్టిన గతి సూపర్వైజర్ రవికుమార్ పట్టాలని తల్లి శాపనార్ధాలు పెట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి దర్యాప్తు చేపట్టి బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభవార్త చెప్పారు..! డంపింగ్ యార్డ్ పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. స్వచ్ఛ భారత్ పథకం కింద ఇప్పటికే 16 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. యూసీఎఫ్ నిధుల నుంచి మరో 80 కోట్ల రూపాయలను డంపింగ్ యార్డ్ కోసం వెచ్చిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్‌లో 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. రోడ్లు, డ్రెయిన్లు, పైప్‌లైన్లు, ఓపెన్ జిమ్ పనులను ప్రారంభించారు. గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం.. ప్రతి డివిజన్‌లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తాం అని బండి సంజయ్ తెలిపారు. యూసీఎఫ్ కింద కరీంనగర్‌కు మొత్తం 840 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నామని.. కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌కు టెండర్లు.. యూసీఎఫ్ నుంచి మరో 80 కోట్లు.. కరీంనగర్ అభివృద్ధికి భారీ ప్రణాళిక..!
    3
    కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభవార్త చెప్పారు..!
డంపింగ్ యార్డ్ పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. స్వచ్ఛ భారత్ పథకం కింద ఇప్పటికే 16 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. యూసీఎఫ్ నిధుల నుంచి మరో 80 కోట్ల రూపాయలను డంపింగ్ యార్డ్ కోసం వెచ్చిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు.
కరీంనగర్‌లో 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. రోడ్లు, డ్రెయిన్లు, పైప్‌లైన్లు, ఓపెన్ జిమ్ పనులను ప్రారంభించారు.
గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం.. ప్రతి డివిజన్‌లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తాం అని బండి సంజయ్ తెలిపారు.
యూసీఎఫ్ కింద కరీంనగర్‌కు మొత్తం 840 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.
పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నామని.. కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
డంపింగ్ యార్డ్‌కు టెండర్లు.. యూసీఎఫ్ నుంచి మరో 80 కోట్లు.. కరీంనగర్ అభివృద్ధికి భారీ ప్రణాళిక..!
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యం: ఉత్తమ్ కుమార్ రెడ్డి*... గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. *గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యం: ఉత్తమ్ కుమార్ రెడ్డి*... గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. *గత ఏడాది అక్టోబర్‌లో హుజూర్‌నగర్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో సుమారు 3,500 మంది విద్యావంతులైన యువతకు ఉద్యోగ ఆఫర్ లెటర్లు అందాయని ఆయన పేర్కొన్నారు*. ఈ ఏడాది సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలోని పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు తమ పరిధిలోని నిరుద్యోగ యువతను గుర్తించి జాబ్ మేళాకు హాజరయ్యేలా మోటివేట్ చేసి, ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో టామ్‌టామ్ ద్వారా కూడా జాబ్ మేళాపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అదేవిధంగా విద్యాసంస్థల ప్రతినిధులు తమ కళాశాలల్లో చదువుతున్న, గతంలో చదివిన యువతకు సమాచారం అందించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించి సెప్టెంబర్ 19న జరిగే జాబ్ మేళాకు హాజరయ్యేలా చూడాలని కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిశ్రమలు జాబ్ మేళాలో పాల్గొని వీలైనంత ఎక్కువ మంది యువతను నియమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మూడు జిల్లాల జిల్లా పరిశ్రమల అధికారులు, జిల్లా కార్మిక అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తదితరులు కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యాసంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు...
    1
    గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యం: ఉత్తమ్ కుమార్ రెడ్డి*...


 గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 
*గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యం: ఉత్తమ్ కుమార్ రెడ్డి*...
గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 
*గత ఏడాది అక్టోబర్‌లో హుజూర్‌నగర్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో సుమారు 3,500 మంది విద్యావంతులైన యువతకు ఉద్యోగ ఆఫర్ లెటర్లు అందాయని ఆయన పేర్కొన్నారు*.
ఈ ఏడాది సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రతి గ్రామంలోని పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు తమ పరిధిలోని నిరుద్యోగ యువతను గుర్తించి జాబ్ మేళాకు హాజరయ్యేలా మోటివేట్ చేసి, ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో టామ్‌టామ్ ద్వారా కూడా జాబ్ మేళాపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
అదేవిధంగా విద్యాసంస్థల ప్రతినిధులు తమ కళాశాలల్లో చదువుతున్న, గతంలో చదివిన యువతకు సమాచారం అందించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించి సెప్టెంబర్ 19న జరిగే జాబ్ మేళాకు హాజరయ్యేలా చూడాలని కోరారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిశ్రమలు జాబ్ మేళాలో పాల్గొని వీలైనంత ఎక్కువ మంది యువతను నియమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మూడు జిల్లాల జిల్లా పరిశ్రమల అధికారులు, జిల్లా కార్మిక అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తదితరులు కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 
సూర్యాపేట జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యాసంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు...
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.