రామగుండంలో యువతి ఆత్మహత్య కలకలం...యువతి ఆత్మహత్యకు సింగరేణి షిఫ్ట్ ఓవర్ మెన్ కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థి ఆత్మహత్య ఆందోళనకు దారి తీసింది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ట్రైనింగ్ కోసం వెళితే , ఓర్ మెన్ ఆమెపై అత్యాచారం చేయడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోదావరిఖని కి చెందిన తాండ్ర అక్షితరాణి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఇండస్ట్రియల్ టూర్ లో భాగంగా ట్రైనింగ్ కోసం రామగుండం అర్జీ-వన్ లోని రెండవ బొగ్గు గనిలో విధుల్లో చేరింది. అయితే షిఫ్ట్ ఓవర్ మెన్ గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్ అక్షిత రాణిపై అత్యాచారం చేశాడని గని మేనేజర్ తోపాటు జీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మృతురాలి తల్లి రజిత బోరున విలపిస్తు తెలిపారు. సింగరేణి అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందిన అక్షితరాణి లెటర్ రాసి సూసైడ్ చేసుకుందని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి చదివించుకున్న కూతురును పని స్థలంలో సూపర్వైజర్ అత్యాచారం చేశారని చెప్పిన పట్టించుకోకపోవడంపై కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు శవంతో ఆందోళనకు దిగారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద మృతదేహంతో ధర్నా రాస్తారోకో చేశారు.షఅత్యాచారానికి యత్నించిన రవికుమార్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన కూతురుకు పట్టిన గతి సూపర్వైజర్ రవికుమార్ పట్టాలని తల్లి శాపనార్ధాలు పెట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి దర్యాప్తు చేపట్టి బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు.
రామగుండంలో యువతి ఆత్మహత్య కలకలం...యువతి ఆత్మహత్యకు సింగరేణి షిఫ్ట్ ఓవర్ మెన్ కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థి ఆత్మహత్య ఆందోళనకు దారి తీసింది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ట్రైనింగ్ కోసం వెళితే , ఓర్ మెన్ ఆమెపై అత్యాచారం చేయడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోదావరిఖని కి చెందిన తాండ్ర అక్షితరాణి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఇండస్ట్రియల్ టూర్ లో భాగంగా
ట్రైనింగ్ కోసం రామగుండం అర్జీ-వన్ లోని రెండవ బొగ్గు గనిలో విధుల్లో చేరింది. అయితే షిఫ్ట్ ఓవర్ మెన్ గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్ అక్షిత రాణిపై అత్యాచారం చేశాడని గని మేనేజర్ తోపాటు జీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మృతురాలి తల్లి రజిత బోరున విలపిస్తు తెలిపారు. సింగరేణి అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందిన అక్షితరాణి లెటర్ రాసి సూసైడ్ చేసుకుందని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి చదివించుకున్న కూతురును పని స్థలంలో సూపర్వైజర్ అత్యాచారం
చేశారని చెప్పిన పట్టించుకోకపోవడంపై కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు శవంతో ఆందోళనకు దిగారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద మృతదేహంతో ధర్నా రాస్తారోకో చేశారు.షఅత్యాచారానికి యత్నించిన రవికుమార్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన కూతురుకు పట్టిన గతి సూపర్వైజర్ రవికుమార్ పట్టాలని తల్లి శాపనార్ధాలు పెట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి దర్యాప్తు చేపట్టి బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు.
- కరీంనగర్ లో వారం రోజుల్లో డంపింగ్ యార్డ్ పనులకు టెండర్...యూసీఎఫ్ నుండి మరో 80 కోట్లు డంపింగ్ యార్డ్ కు వెచ్చిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ పనులకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ స్కీం నిధుల్లో భాగంగా 16 కోట్లతో చేపట్టిన డంపింగ్ యార్డు పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో పర్యటించారు. కరీంనగర్ లోని 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు బండి సంజయ్ భూమి పూజ చేశారు. 42వ డివిజన్ లోని భగత్ నగర్ మమత థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం సమీపంలోని పొలాడి ఆనందరావు అపార్ట్ మెంట్ గల్లీలో 50 లక్షల రూపాయల Uidf నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కరీంనగర్ 49వ డివిజన్ లోని భాగ్యనగర్ బాలాజీ సూపర్ మార్కెట్ సమీపంలో 50 లక్షల యూఐడిఎఫ్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ లోని పోచమ్మ కమాన్ సమీపంలో 10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక శ్రీ గాయత్రి అసోయేషన్ ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని దర్శించుకున్నారు. 13వ డివిజన్ లోని శివనగర్ బైపాస్ రోడ్ సమీపంలోని లారెల్ (Laureal) స్కూల్ వద్ద 75 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మీడియాతో సంజయ్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ కు సంబంధించి పనులను వేగవంతం చేస్తామన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లు మంజూరయ్యాయని, అందులో భాగంగా మరో 80 కోట్లను డంపింగ్ యార్డ్ పనులకు వెచ్చించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ లోని ప్రతి డివిజన్ లో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నామని, గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.3
- కరీంనగర్లో దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి, దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లోని తోటలో ఉన్న ఆయన ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, మాజీ ఎమ్మెల్యేలు నాగుల సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్తో పాటు పలువురు ముఖ్య నేతలు పొన్నం సత్తయ్య ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య అందించిన సేవలను నాయకులు, కుటుంబ సభ్యులు స్మరించుకున్నారు. ఆయన ప్రజా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.4
- కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.1
- సిరిసిల్లలో పెట్రోల్‌లో నీరు వచ్చిందంటూ వాహనదారుడి ఆందోళన. సిరిసిల్ల: పెట్రోల్‌లో నీరు కలిసిందని ఆరోపిస్తూ ఓ వాహనదారుడు ఆందోళనకు దిగాడు. పాత బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించిన అనంతరం తన వాహనం మొరాయించిందని జిల్లెల్లకు చెందిన కృష్ణ తెలిపారు. పరిశీలించగా పెట్రోల్‌లో నీరు ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై బంక్ సిబ్బందిని ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కృష్ణ కోరారు.1
- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- ఇల్లు అద్దెకు ఇస్తే వాడు ఏకంగా దర్గా గా మార్చేసాడు, .. .. 💦😡 ఇల్లు అద్దెకు ఇస్తే వాడు ఏకంగా దర్గా గా మార్చేసాడు, .. .. 💦😡👆1
- పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.1
- గణనాధుని సేవలో తరిస్తున్న భక్తులు... వాసవి అపార్ట్మెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గోపాలకృష్ణావతార గణేషుడు తొలిపూజలు అందుకుని విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కన్నుల పండువలా జరుగుతున్నాయి. ఊరువాడ పల్లె పట్టణం అనే తేడా లేకుండా గల్లి గల్లిన బొజ్జ గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విబిన్న ఆకృతుల్లో ఉన్న గణనాథులను అందంగా అలంకరించిన మండపాలలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అన్నదానాలతో గణనాథుడి సేవలో భక్తులు తరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేలకు పైగా గణేష్ మంట పాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలతో గణనాధున్ని కొలుస్తున్నారు. కరీంనగర్లో 3500 విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రతి మంటపం వద్ద గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లోని తిరుమలనగర్ వాసవి అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన శ్రీ గోపాలకృష్ణావతార గణనాథుడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. గోపాల కృష్ణావతార గణనాథుని వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో వాసవి అపార్ట్మెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ కార్యదర్శి విజేందర్ రెడ్డి, కోశాధికారి సురేష్, సభ్యులు భాస్కర్, శివ, సాయితేజ, లాకేష్, నరేందర్ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. నగరంలో పలుచోట్ల విభిన్న ఆకృతుల్లో ఉన్న వినాయకులను భక్తులను ఆసక్తిగా తిలకిస్తూ దర్శనం చేసుకుంటున్నారు. 1