Shuru
Apke Nagar Ki App…
నిండిన కడెం ప్రాజెక్టు, హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతాంగం ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరదతో కడెం ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టులో నీటిమట్టం 69.55 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 7768 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ నుండి దిగువకు 88 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శనివారం నాటికి కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిగా నిండడంపై ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానకాలం వ్యవసాయ సీజన్ పనులను ముమ్మరం చేయవచ్చని వారు తెలిపారు.
P.G. Murthy
నిండిన కడెం ప్రాజెక్టు, హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతాంగం ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరదతో కడెం ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టులో నీటిమట్టం 69.55 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 7768 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ నుండి దిగువకు 88 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శనివారం నాటికి కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిగా నిండడంపై ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానకాలం వ్యవసాయ సీజన్ పనులను ముమ్మరం చేయవచ్చని వారు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- అత్యవసరమైనా... నిత్యావసరమైనా వాగు దాటాల్సిందే! అనార్పల్లి–లక్మాపూర్ వాగులపై వంతెనల కోసం స్థానికుల ఆవేదన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని అనార్పల్లి, లక్మాపూర్ గ్రామాల ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే వాగు దాటడమే పెద్ద సవాలుగా మారుతోంది. శుక్రవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గ్రామస్తులు ఒకరికి ఒకరు సహకరిస్తూ ప్రాణాలను పణంగా పెట్టి వాగును దాటారు. నిత్యావసర సరుకులు తీసుకురావాలన్నా, అత్యవసర వైద్య సేవలు పొందాలన్నా ఇదే మార్గం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకరంగా వాగు దాటాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. భారీ వర్షాల సమయంలో వాగులు ఉప్పొంగితే గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని, విద్యార్థులు, రైతులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గం లేక నిస్సహాయంగా వాగు దాటుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, ఇకనైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి అనార్పల్లి, లక్మాపూర్ వాగులపై శాశ్వత వంతెనలు నిర్మించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.1
- సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."1
- బంబారాలో కుల దూషణల ఆరోపణలు.. దళితుల నిరసన........... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో కుల దూషణలు జరిగాయంటూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు పొన్నాల నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, చిన్నారులతో కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి డప్పులతో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.2
- korutla pattanam lo thrishakthimatha devalayam lo varahi navarathrulu varahi navarathri lo bhakti shradhala tho kalakaladuthunna korutla thrishakthi devalayam4
- స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.1
- రోడ్డుపై మురికి నీటి ప్రవాహం ఇబ్బందులు పడుతున్న వాహనదారులు జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణం అంతా జలమయం అయింది. స్థానిక రామాలయం నుండి సాయిబాబా దేవాలయం వరకు ఉన్న ప్రధాన రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. జన్నారంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.1