logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌ను రాప్తాడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆమె వాహనాన్ని సీ ఫారం మీద పెనుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పెనుకొండ పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. ఉషశ్రీ చరణ్‌ను ప్రస్తుతం పెనుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

21 hrs ago
user_Sadda venkatasiva
Sadda venkatasiva
Handloom Weaver గొరంట్ల, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
21 hrs ago

వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌ను రాప్తాడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆమె వాహనాన్ని సీ ఫారం మీద పెనుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పెనుకొండ పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. ఉషశ్రీ చరణ్‌ను ప్రస్తుతం పెనుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌ను రాప్తాడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆమె వాహనాన్ని సీ ఫారం మీద పెనుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పెనుకొండ పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. ఉషశ్రీ చరణ్‌ను ప్రస్తుతం పెనుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
    1
    వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌ను రాప్తాడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆమె వాహనాన్ని సీ ఫారం మీద పెనుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

శాంతిభద్రతల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పెనుకొండ పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. ఉషశ్రీ చరణ్‌ను ప్రస్తుతం పెనుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
    user_Sadda venkatasiva
    Sadda venkatasiva
    Handloom Weaver గొరంట్ల, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • పుట్టపర్తి, జూలై 09న కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ బాబు, జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణ పథకం అమలులో శ్రీ సత్యసాయి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ముఖ్యంగా ప్రజల్లో సానుకూలత విషయంలో మొదటి ర్యాంకు సాధించిందని ఈ సందర్భంగా హౌసింగ్ ఎండీ అరుణ్ బాబు వెల్లడించారు. జూన్ నెలలో ప్రజల సానుకూలత 93.56%కి పెరిగిందని, మే నెలతో పోలిస్తే ఇది 23.59% స్పష్టమైన ప్రగతి అని ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఇదే ఉత్సాహంతో పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎండీ అరుణ్ బాబు మాట్లాడుతూ, పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 57,889 ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటివరకు 28,639 గృహాల నిర్మాణాలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 29,250 ఇళ్ల పనులు వివిధ దశల్లో వేగంగా జరుగుతున్నాయని, ఇందుకోసం జిల్లాలో ఇప్పటివరకు రూ. 700.07 కోట్ల నిధులు ఖర్చు చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా 7వ విడత వరకు మంజూరైన 3,051 ఇళ్లకు గానూ, రికార్డు స్థాయిలో 2,474 (81.09%) ఇళ్ల గ్రౌండింగ్ పనులను పూర్తి చేసి శ్రీ సత్యసాయి జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. ధర్మవరం అర్బన్, హిందూపూర్ అర్బన్, కదిరి అర్బన్ మరియు పుట్టపర్తి అర్బన్ పరిధిలోని మిగిలిన ఇళ్లను కూడా త్వరితగతిన జియో-ట్యాగింగ్ చేయాలని సూచించారు. ఆర్థిక సంవత్సరం 2026-27 లక్ష్యాలలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 7,884 ఇళ్లు పూర్తి కాగా, గడిచిన వారంలోనే 18 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, అలాగే ఆప్షన్ 1 & 2 కింద జిల్లాలో 3,739 మంది లబ్ధిదారులకు రూ. 7.96 కోట్ల అదనపు నిధులు ఎఫ్‌టిఓల ద్వారా విడుదల చేశారని, దీని ద్వారా 1,347 ఇళ్లు పూర్తి కాగా, 160 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం సకాలంలో అందేలా ఎప్పటికప్పుడు FTO లు జనరేట్ చేస్తున్నామని తెలిపారు. హౌసింగ్ అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాను గృహ నిర్మాణంలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న లేఅవుట్లు, ఇళ్ల నిర్మాణాలను ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి, లబ్ధిదారులను ప్రోత్సహించి పనులు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పిడి వెంకట నారాయణ, హౌసింగ్ విభాగపు ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
    1
    పుట్టపర్తి, జూలై 09న కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ బాబు, జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణ పథకం అమలులో శ్రీ సత్యసాయి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ముఖ్యంగా ప్రజల్లో సానుకూలత విషయంలో మొదటి ర్యాంకు సాధించిందని ఈ సందర్భంగా హౌసింగ్ ఎండీ అరుణ్ బాబు వెల్లడించారు. జూన్ నెలలో ప్రజల సానుకూలత 93.56%కి పెరిగిందని, మే నెలతో పోలిస్తే ఇది 23.59% స్పష్టమైన ప్రగతి అని ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఇదే ఉత్సాహంతో పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎండీ అరుణ్ బాబు మాట్లాడుతూ, పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 57,889 ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటివరకు 28,639 గృహాల నిర్మాణాలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 29,250 ఇళ్ల పనులు వివిధ దశల్లో వేగంగా జరుగుతున్నాయని, ఇందుకోసం జిల్లాలో ఇప్పటివరకు రూ. 700.07 కోట్ల నిధులు ఖర్చు చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా 7వ విడత వరకు మంజూరైన 3,051 ఇళ్లకు గానూ, రికార్డు స్థాయిలో 2,474 (81.09%) ఇళ్ల గ్రౌండింగ్ పనులను పూర్తి చేసి శ్రీ సత్యసాయి జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. ధర్మవరం అర్బన్, హిందూపూర్ అర్బన్, కదిరి అర్బన్ మరియు పుట్టపర్తి అర్బన్ పరిధిలోని మిగిలిన ఇళ్లను కూడా త్వరితగతిన జియో-ట్యాగింగ్ చేయాలని సూచించారు. ఆర్థిక సంవత్సరం 2026-27 లక్ష్యాలలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 7,884 ఇళ్లు పూర్తి కాగా, గడిచిన వారంలోనే 18 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, అలాగే ఆప్షన్ 1 & 2 కింద జిల్లాలో 3,739 మంది లబ్ధిదారులకు రూ. 7.96 కోట్ల అదనపు నిధులు ఎఫ్‌టిఓల ద్వారా విడుదల చేశారని, దీని ద్వారా 1,347 ఇళ్లు పూర్తి కాగా, 160 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు.

జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం సకాలంలో అందేలా ఎప్పటికప్పుడు FTO లు జనరేట్ చేస్తున్నామని తెలిపారు. హౌసింగ్ అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాను గృహ నిర్మాణంలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న లేఅవుట్లు, ఇళ్ల నిర్మాణాలను ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి, లబ్ధిదారులను ప్రోత్సహించి పనులు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో హౌసింగ్ పిడి వెంకట నారాయణ, హౌసింగ్ విభాగపు ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు చౌడేపల్లి మండలం కాగితీ గ్రామ పంచాయతీకి చెందిన బాబు సాహెబ్ అనే పేద కుటుంబం తమ భూమిని కృష్ణప్ప అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకొని, తనపై మార్చుకొని బెదిరింపులకు పాల్పడుతున్నాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. పంఛర్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బాబు సాహెబ్ కుటుంబానికి గత 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం దిగువపల్లె రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 469/2ఏ లో 3.34 సెంట్లు, సర్వే నంబర్ 466 లో 2 ఎకరాల 35 సెంట్ల భూమిని మంజూరు చేసింది. అలాగే, ఆయన భార్య షేక్ హసీనా పేరు మీద సర్వే నంబర్ 183/19 లో ఒక ఎకరం భూమి ఉంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, తమ కుమార్తె వివాహ ఖర్చుల నిమిత్తం బాబు సాహెబ్ కృష్ణప్పకు 3 లక్షల రూపాయలు అడుమానం (తాకట్టు) పెట్టినట్లు తెలిపారు. అయితే, డబ్బులు తిరిగి ఇచ్చినా కృష్ణప్ప వాటిని తీసుకోకుండా కాలయాపన చేశాడని, ఆపై డిసెంబర్ 2023లో తమ భూమికి సంబంధించిన 'వన్ బీ' రికార్డులను తన పేరు మీద మార్చుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు కృష్ణప్ప ఆ భూమి పూర్తిగా తనదే అని తమపై తిరగబడుతున్నాడని, అంతేకాకుండా ఆ భూమిని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో తాకట్టు కూడా పెట్టాడని బాబు సాహెబ్ కుటుంబం వెల్లడించింది. ఈ భూ వివాదంపై బాధితులు మదనపల్లి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు తన పేరు మార్చుకున్నాడని ఎమ్మార్వోకి, వీఆర్వోకి ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వారు వాపోయారు. తాజాగా, నిన్న తమ భూమిలో కృష్ణప్ప అక్రమంగా మొక్కలు నాటుతుండగా అడగడానికి వెళ్లిన తమ కుటుంబ సభ్యులపై దాడి చేశాడని బాబు సాహెబ్ కుటుంబం ఆవేదనతో తెలిపింది. ఈ ఘటనలపై అధికారులు మరియు కూటమి ప్రభుత్వం స్పందించి, పేద కుటుంబమైన తమకు న్యాయం చేసి తమ భూమిని తిరిగి ఇప్పించాలని బాబు సాహెబ్ కుటుంబం కోరుతోంది. భూమి రికార్డులలో పేరు మార్చుకుని బెదిరింపులకు పాల్పడుతున్న కబ్జాదారుడి చర్యలను నిలిపివేయాలని వారు అభ్యర్థిస్తున్నారు.
    2
    అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు చౌడేపల్లి మండలం కాగితీ గ్రామ పంచాయతీకి చెందిన బాబు సాహెబ్ అనే పేద కుటుంబం తమ భూమిని కృష్ణప్ప అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకొని, తనపై మార్చుకొని బెదిరింపులకు పాల్పడుతున్నాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. పంఛర్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బాబు సాహెబ్ కుటుంబానికి గత 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం దిగువపల్లె రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 469/2ఏ లో 3.34 సెంట్లు, సర్వే నంబర్ 466 లో 2 ఎకరాల 35 సెంట్ల భూమిని మంజూరు చేసింది. అలాగే, ఆయన భార్య షేక్ హసీనా పేరు మీద సర్వే నంబర్ 183/19 లో ఒక ఎకరం భూమి ఉంది.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, తమ కుమార్తె వివాహ ఖర్చుల నిమిత్తం బాబు సాహెబ్ కృష్ణప్పకు 3 లక్షల రూపాయలు అడుమానం (తాకట్టు) పెట్టినట్లు తెలిపారు. అయితే, డబ్బులు తిరిగి ఇచ్చినా కృష్ణప్ప వాటిని తీసుకోకుండా కాలయాపన చేశాడని, ఆపై డిసెంబర్ 2023లో తమ భూమికి సంబంధించిన 'వన్ బీ' రికార్డులను తన పేరు మీద మార్చుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు కృష్ణప్ప ఆ భూమి పూర్తిగా తనదే అని తమపై తిరగబడుతున్నాడని, అంతేకాకుండా ఆ భూమిని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో తాకట్టు కూడా పెట్టాడని బాబు సాహెబ్ కుటుంబం వెల్లడించింది.

ఈ భూ వివాదంపై బాధితులు మదనపల్లి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు తన పేరు మార్చుకున్నాడని ఎమ్మార్వోకి, వీఆర్వోకి ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వారు వాపోయారు. తాజాగా, నిన్న తమ భూమిలో కృష్ణప్ప అక్రమంగా మొక్కలు నాటుతుండగా అడగడానికి వెళ్లిన తమ కుటుంబ సభ్యులపై దాడి చేశాడని బాబు సాహెబ్ కుటుంబం ఆవేదనతో తెలిపింది.

ఈ ఘటనలపై అధికారులు మరియు కూటమి ప్రభుత్వం స్పందించి, పేద కుటుంబమైన తమకు న్యాయం చేసి తమ భూమిని తిరిగి ఇప్పించాలని బాబు సాహెబ్ కుటుంబం కోరుతోంది. భూమి రికార్డులలో పేరు మార్చుకుని బెదిరింపులకు పాల్పడుతున్న కబ్జాదారుడి చర్యలను నిలిపివేయాలని వారు అభ్యర్థిస్తున్నారు.
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Punganur, Chittoor•
    18 hrs ago
  • అనంతపురం జిల్లా రాయదుర్గం - బళ్లారి రోడ్డులోని చదం గేటు సమీపంలో కొండ పక్కన సుమారు 60 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా డంప్ చేశారు. ఈ ఇసుకను రాత్రికి రాత్రే టిప్పర్ల ద్వారా కర్నాటకకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని స్థానికులు వెల్లడించారు. ప్రకృతి సంపదను దోచేస్తున్న ఈ ముఠాపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇసుక డంప్‌ను స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుకను అందిస్తామని చెబుతుంటే, క్షేత్రస్థాయిలో కొందరు దీనిని కాసుల పంటగా మార్చుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సొంత అవసరాల కోసం ఉచితంగా ఇసుక ఇస్తామని ప్రకటించినా, రాయదుర్గంలో ఇసుకాసురులు రెచ్చిపోతూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    1
    అనంతపురం జిల్లా రాయదుర్గం - బళ్లారి రోడ్డులోని చదం గేటు సమీపంలో కొండ పక్కన సుమారు 60 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా డంప్ చేశారు. ఈ ఇసుకను రాత్రికి రాత్రే టిప్పర్ల ద్వారా కర్నాటకకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని స్థానికులు వెల్లడించారు. ప్రకృతి సంపదను దోచేస్తున్న ఈ ముఠాపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇసుక డంప్‌ను స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం ఉచిత ఇసుకను అందిస్తామని చెబుతుంటే, క్షేత్రస్థాయిలో కొందరు దీనిని కాసుల పంటగా మార్చుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సొంత అవసరాల కోసం ఉచితంగా ఇసుక ఇస్తామని ప్రకటించినా, రాయదుర్గంలో ఇసుకాసురులు రెచ్చిపోతూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    33 min ago
  • సిద్ధవటం మండలంలోని శాఖరాజుపల్లి రెవెన్యూ పరిధిలో గల ఉప్పరపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథస్వామి ఆలయానికి చెందిన దేవుని మాన్యం భూములు అన్యాక్రాంతం కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. తరతరాలుగా ఆలయ నిర్వహణ మరియు స్వామివారి కైంకర్యాల కోసం కేటాయించిన ఈ విలువైన భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చోటుచేసుకున్న ఈ పరిణామాలపై భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ మరియు దేవాదాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, ఆలయ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆక్రమణలను తొలగించి, స్వామివారి ఆస్తులను కాపాడటంతో పాటు అక్రమార్కులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
    1
    సిద్ధవటం మండలంలోని శాఖరాజుపల్లి రెవెన్యూ పరిధిలో గల ఉప్పరపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథస్వామి ఆలయానికి చెందిన దేవుని మాన్యం భూములు అన్యాక్రాంతం కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. తరతరాలుగా ఆలయ నిర్వహణ మరియు స్వామివారి కైంకర్యాల కోసం కేటాయించిన ఈ విలువైన భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం చోటుచేసుకున్న ఈ పరిణామాలపై భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ మరియు దేవాదాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, ఆలయ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆక్రమణలను తొలగించి, స్వామివారి ఆస్తులను కాపాడటంతో పాటు అక్రమార్కులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    51 min ago
  • వై.ఎస్.ఆర్ జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్తులూరు గ్రామంలో చీని తోటలో పేకాట ఆడుతున్న ఐదుగురు జూదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుకు దూరంగా తోటలో చీని చెట్ల కింద రహస్యంగా పేకాట స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న నిందితులపై పోలీసులు డ్రోన్ ద్వారా నిఘా ఉంచి పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 8,990 నగదుతో పాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వేంపల్లి సి.ఐ నరసింహులు తెలిపారు. జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు, పులివెందుల డి.ఎస్.పీ శ్రీ బి.మురళి పర్యవేక్షణలో ఈ దాడి జరిగింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సి.ఐ నరసింహులు హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌లో సి.ఐ నరసింహులుతో పాటు ఎస్.ఐలు తయ్యార్ హుస్సేన్, తిరుపాల్ నాయక్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    వై.ఎస్.ఆర్ జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్తులూరు గ్రామంలో చీని తోటలో పేకాట ఆడుతున్న ఐదుగురు జూదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుకు దూరంగా తోటలో చీని చెట్ల కింద రహస్యంగా పేకాట స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న నిందితులపై పోలీసులు డ్రోన్ ద్వారా నిఘా ఉంచి పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 8,990 నగదుతో పాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వేంపల్లి సి.ఐ నరసింహులు తెలిపారు.

జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు, పులివెందుల డి.ఎస్.పీ శ్రీ బి.మురళి పర్యవేక్షణలో ఈ దాడి జరిగింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సి.ఐ నరసింహులు హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌లో సి.ఐ నరసింహులుతో పాటు ఎస్.ఐలు తయ్యార్ హుస్సేన్, తిరుపాల్ నాయక్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.