నిర్మల్ కొయ్య బొమ్మల సంరక్షణకు ప్రత్యేక చర్యలు పొనికి చెట్ల పెంపకానికి ప్రోత్సాహం.. పుష్కరాల్లో విక్రయాలు, ప్రదర్శనకు స్టాళ్లు:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్మల్ కొయ్య బొమ్మల కళను పరిరక్షిస్తూ, కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని కొయ్య బొమ్మల ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల చరిత్ర, తయారీ విధానం, మార్కెటింగ్, కళాకారుల పరిస్థితి, పొనికి కర్ర లభ్యత తదితర అంశాలపై నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్మల్ కొయ్య బొమ్మలకు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కళ ద్వారా నిర్మల్ జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని, తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బొమ్మల తయారీకి ప్రధానంగా ఉపయోగించే పొనికి చెట్ల పెంపకానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలను నిర్మల్ కొయ్య బొమ్మల మార్కెటింగ్‌కు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బాసరలో రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా కొయ్య బొమ్మల ప్రదర్శన, విక్రయాల కోసం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొయ్య బొమ్మల కళ అభివృద్ధి, కళాకారులకు మరింత ప్రోత్సాహం, మార్కెటింగ్ అవకాశాల పెంపు తదితర అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పరిశీలనలో డీపీవో శ్రీనివాస్, డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, తహసీల్దార్ రాజు, అధికారులు, నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్ కొయ్య బొమ్మల సంరక్షణకు ప్రత్యేక చర్యలు పొనికి చెట్ల పెంపకానికి ప్రోత్సాహం.. పుష్కరాల్లో విక్రయాలు, ప్రదర్శనకు స్టాళ్లు:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్మల్ కొయ్య బొమ్మల కళను పరిరక్షిస్తూ, కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని కొయ్య బొమ్మల ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల చరిత్ర, తయారీ విధానం, మార్కెటింగ్, కళాకారుల పరిస్థితి, పొనికి కర్ర లభ్యత తదితర అంశాలపై నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్మల్ కొయ్య బొమ్మలకు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కళ ద్వారా నిర్మల్ జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని, తరతరాలుగా
కొనసాగుతున్న ఈ కళను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బొమ్మల తయారీకి ప్రధానంగా ఉపయోగించే పొనికి చెట్ల పెంపకానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలను నిర్మల్ కొయ్య బొమ్మల మార్కెటింగ్‌కు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బాసరలో రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా కొయ్య బొమ్మల ప్రదర్శన, విక్రయాల కోసం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొయ్య బొమ్మల కళ అభివృద్ధి, కళాకారులకు మరింత ప్రోత్సాహం, మార్కెటింగ్ అవకాశాల పెంపు తదితర అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పరిశీలనలో డీపీవో శ్రీనివాస్, డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, తహసీల్దార్ రాజు, అధికారులు, నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.
- శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.1
- నిర్మల్ జిల్ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ముధోల్ కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లా: *విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ముధోల్ కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బందికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు అన్ని పూటల మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని తరగతులకు సంబంధించిన సిలబస్ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం వారిని సిద్ధం చేయాలన్నారు. పదవ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ఇప్పటివరకు పూర్తయిన సిలబస్, రోజువారిగా అందిస్తున్న భోజనం, వసతి, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గణితం సబ్జెక్టుకు సంబంధించి పలు లెక్కలను బోర్డుపై విద్యార్థులతో చేయించి, లెక్కలు చేసిన విద్యార్థులను అభినందించి, పెన్నులను బహుమతులుగా ఇచ్చారు. బోర్డు పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. ఏ సబ్జెక్టులో అయినా ఎటువంటి సందేహాలు ఉన్న వెంటనే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమీపంలో నిర్మాణం చివరి దశకు చేరుకున్న పాఠశాల భవంతిని కలెక్టర్ పరిశీలించారు. మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి భవనాన్ని వినియోగానికి తేవాలని తెలిపారు. ఈ తనిఖీలో డీఈవో భోజన్న, తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీవో లవ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.2
- భైంసా : ఘనంగా ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయకుల నిమజ్జనం... నిర్మల్ జిల్లా భైంసాలో సోమవారం ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు.తమ ఇళ్లలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించుకున్న భక్తులు మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో రోజు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భైంసాలోని స్థానిక గడ్డెన్న వాగు ప్రాజెక్టులో భక్తులు తమ తమ ఇంట్లో నుండి వినాయక ప్రతిమలను తీసుకోని గణపతి బప్పా మోరియా అంటూ జలాశయం వద్దకు తీసుకవెళ్లి అక్కడ ఆ గణేశునికి హారతులు నిర్వహించి నిమజ్జనం చేశారు.దీంతో గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వద్ద సందడి నెలకొంది.1
- నవరాత్రి ఉత్సవాల్లో పటిష్ట బందోబస్త్ : ఎస్ హెచ్ ఓ దీపక్.... బాసర మండలం లోని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏ ఎస్పీ సాయికిరణ్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని బాసర ఎస్ హెచ్ ఓ దీపక్ అన్నారు. కిర్గుల్ (బి), ఓని, కౌట, సాలాపుర్, బీదరెల్లి లోని వినాయక మండపాలను పోలీస్ సిబ్బంది తో కలసి సందర్శించి మండపాల నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. 24 గంటలు మండపాల వద్ద సభ్యుల నిఘా ఉండాలని, హారతి సమయం లో మండపాల వద్ద మహిళలు, చిన్నారుల పట్ల జాగ్రత్త గా ఉండాలని అన్నారు.1
- బోధన్ రకాసిపేట్‌లోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్లో షష్మాహీ పరీక్షల ఫలితాలు.. విద్యార్థులకు ఘనంగా బహుమతుల ప్రదానం బోధన్: బోధన్ రకాసిపేట్ ప్రాంతంలోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్లో షష్మాహీ పరీక్షల ఫలితాల సందర్భంగా ఘనంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటు ఇతర ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మదర్సా నిర్వాహకులు మాట్లాడుతూ.. విద్యతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు, ధార్మిక విద్య, క్రమశిక్షణ కూడా అందించడం ఎంతో అవసరమని తెలిపారు. సమాజంలో జ్ఞానం, నైతికత, మానవత్వం కోసం మదర్సాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రెసెంట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మీర్ జావేద్ అలీ మాట్లాడుతూ.. దైవిక విద్యను అభ్యసించడం గొప్ప అదృష్టమని, విద్యార్థులు దైవిక విద్యతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఆధునిక విద్యను కూడా అభ్యసించాలని సూచించారు. వివిధ భాషల విద్యను అందించే ఉపాధ్యాయుల ఏర్పాటుకు తన వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. మదర్సా అధ్యక్షుడు సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ మాట్లాడుతూ.. విద్యార్థులు ధార్మిక విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో హాఫిజ్‌లు, ఆలిమ్‌లుగా ఎదగాలని ఆకాంక్షించారు. దైవిక విద్యతో పాటు ఆధునిక విద్య, కంప్యూటర్ విద్య కూడా అవసరమని, విద్యార్థుల కోసం కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. మదర్సా ప్రధాన నిర్వాహకులు హాజీ సుల్తాన్ ఖాద్రీ పర్యవేక్షణలో విద్యార్థులకు ధార్మిక విద్యతో పాటు విద్యా రంగంలో కూడా ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నారు. హాఫిజ్ అబ్దుల్ మతీన్ విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యార్థుల వసతి, భోజన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జీ టుడే న్యూస్ చానల్ చీఫ్ ఎడిటర్ నాసిర్ మిర్జా పాల్గొని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వయంగా బహుమతులు అందజేసి వారిని అభినందించారు. కార్యక్రమంలో సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ, జనరల్ సెక్రటరీ అక్బర్ ఖాన్ ఖాద్రీ, గౌస్ ఖాద్రీ, లతీఫ్ అహ్మద్ ఖాద్రీ, కౌన్సిలర్ రఫీ, కౌన్సిలర్ జావేద్, మీర్ జావేద్ అలీ, సనా పటేల్, హాఫిజ్ అబ్దుల్ మతీన్, ప్రధాన నిర్వాహకులు సుల్తాన్ ఖాద్రీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.1
- *నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన * *దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలో అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రేస్ ప్రభుత్వాలు* *విఫలమయ్యాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు* క్యాంపు కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మనంద్, పలువురు నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అణచివేత, బానిసత్వం, అస్తిత్వ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో ఎంతో మంది అమరులయ్యారన్నారు. తెలంగాణ రాష్త్రంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామి ఇచ్చిన బీఆర్ఎస్, కాంగ్రేస్లు... కేవలం ఓ వర్గం ఓట్ల కోసం, వారి మెప్పు కోసం చరిత్రను వక్రీకరిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. 17న ఉదయం ప్రతి బూత్ స్తాయిలో పార్టీ ఆద్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించాలని, *నరేంద్ర మోది 28 యేళ్ల* *సుదీర్ఘ ప్రజా సేవను* *దీవించేలా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా* *సాయంత్రం 7 గంటలకు* *ప్రతి ఇంటి ముందు* *ఆశీర్వాద దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు* కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద రాష్ట్ర నాయకులు అశోక్. జిల్లా అధికార ప్రతినిధి. gv రమణ. సుభాష్ శైలేందర్ . రమేష్ అంకత్. శేఖవత్. వెంకటస్వామి. దేవన్న. రాకేష్ తదితరులు పాల్గొన్నారు3
- టైగర్ లేకున్నా టైగర్ జోన్ అమలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అభయారణ్యంలో టైగర్ లేకుండా టైగర్ జోన్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం మండలానికి చెందిన బద్రి నాయక్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్నారు. జన్నారంలో అమలు చేస్తున్న ఎకో జోన్ తో ఇసుక రాక ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని వాపోయారు. అధికారులు స్పందిస్తూ ఎకో జోన్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.1
- వాడవాడలా కొలువు తీరిన గణనాథులు.. భక్తుల ప్రత్యేక పూజలు.. నిర్మల్ పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. వాడవాడలా చిన్న పెద్ద అంతా కలిసి భారీ గణనాథులను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మండపాలను విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. అనంతరం భక్తులు వినాయకునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రజలందరూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.1