logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఏదుల మండల కేంద్రం శివారులోని బోడబండ లింగమయ్య ఆలయంలో ఆదివారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది మే చివరి వారంలో లింగమయ్య పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగలో గ్రామానికి చెందిన యాదవులు, ముదిరాజులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలు జరుపుకుంటారని గ్రామ సర్పంచ్ పరుశురాం తెలిపారు. బోడబండ లింగమయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించడం, గొర్రె పోటీలు ఏర్పాటు చేసి మేకపోతులతో స్వామివారికి నైవేద్యం సమర్పించడం పూర్వకాలం నుంచి ఆచారంగా వస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, ఆలయానికి రిజర్వాయర్ వెంట ఉన్న రహదారిని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా, ఆలయానికి అవసరమైన సీసీ రహదారిని వచ్చే సంవత్సరం నాటికి నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏదుల మండల అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు పర్వతాలు, కేశంపేట సర్పంచ్ సురేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_RK JOURNALIST
RK JOURNALIST
వీపనగండ్ల, వనపర్తి, తెలంగాణ•
3 hrs ago
b69e8f32-05ef-4df2-9bcb-800db603df04

ఏదుల మండల కేంద్రం శివారులోని బోడబండ లింగమయ్య ఆలయంలో ఆదివారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది మే చివరి వారంలో లింగమయ్య పండుగను నిర్వహిస్తారు. ఈ

d9556239-fcbb-43ac-827b-43c63139806f

పండుగలో గ్రామానికి చెందిన యాదవులు, ముదిరాజులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలు జరుపుకుంటారని గ్రామ సర్పంచ్ పరుశురాం తెలిపారు. బోడబండ లింగమయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించడం, గొర్రె పోటీలు ఏర్పాటు చేసి మేకపోతులతో స్వామివారికి నైవేద్యం

ee742bbf-5eff-4f98-84c1-c34f0a1ccbd2

సమర్పించడం పూర్వకాలం నుంచి ఆచారంగా వస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, ఆలయానికి రిజర్వాయర్ వెంట ఉన్న రహదారిని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా, ఆలయానికి అవసరమైన సీసీ రహదారిని

d71eafb9-dda2-47a3-9fea-8bce9c520284

వచ్చే సంవత్సరం నాటికి నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏదుల మండల అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు పర్వతాలు, కేశంపేట సర్పంచ్ సురేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అధిక జ్యేష్ట మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఎనిమిది మంది దంపతులు పాల్గొన్న ఈ వ్రతాలు శాస్త్రోక్తంగా, వేద మంత్ర చరణల మధ్య జరిగాయని రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ మాట్లాడుతూ, సూక్ష్మంలో మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రతి హిందూ కుటుంబం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని సూచించారు. స్వామివారి కృపా కటాక్షాలను పొందడానికి ఉన్నంతలో వ్రతాలు చేయాలని భక్తులకు తెలియజేశారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తుని గోత్రనామాలతో సంకల్పం చెప్పినట్లు ఆయన వివరించారు. వ్రతానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయం అన్నప్రసాద కమిటీ వారిచే భక్తులందరికీ సామూహిక అన్నప్రసాదాన్ని పంపిణీ చేయబడింది. రామాలయ కమిటీ సభ్యులు అర్థం రవీందర్, టి. మల్లేష్, ఓ. శ్రీను, టి. యాదగిరి, నందకిశోర్, గొల్ల రాములు, ప్రదీప్, శిరీష, రమాదేవి యాదమ్మ, భాగ్యమ్మతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
    1
    నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అధిక జ్యేష్ట మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఎనిమిది మంది దంపతులు పాల్గొన్న ఈ వ్రతాలు శాస్త్రోక్తంగా, వేద మంత్ర చరణల మధ్య జరిగాయని రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ మాట్లాడుతూ, సూక్ష్మంలో మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రతి హిందూ కుటుంబం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని సూచించారు. స్వామివారి కృపా కటాక్షాలను పొందడానికి ఉన్నంతలో వ్రతాలు చేయాలని భక్తులకు తెలియజేశారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తుని గోత్రనామాలతో సంకల్పం చెప్పినట్లు ఆయన వివరించారు. వ్రతానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రామాలయం అన్నప్రసాద కమిటీ వారిచే భక్తులందరికీ సామూహిక అన్నప్రసాదాన్ని పంపిణీ చేయబడింది. రామాలయ కమిటీ సభ్యులు అర్థం రవీందర్, టి. మల్లేష్, ఓ. శ్రీను, టి. యాదగిరి, నందకిశోర్, గొల్ల రాములు, ప్రదీప్, శిరీష, రమాదేవి యాదమ్మ, భాగ్యమ్మతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
    user_NAVADEEP T
    NAVADEEP T
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    8 hrs ago
  • జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఈ రోజు భారతదేశపు 3వ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా బాధ్యతలు స్వీకరించారు, ఇది సైనిక నాయకత్వం మరియు పరివర్తనలో ఒక కొత్త దశకు నాంది పలికింది. దేశ వీరులకు గౌరవ సూచకంగా, ఆయన మొదట జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత, న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్‌లో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. దేశంలో అత్యున్నత సైనిక పదవిని చేపట్టిన సీడీఎస్, ప్రధానమంత్రి జై (JAI) దార్శనికతకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. జై అంటే జాయింట్‌నెస్, ఆత్మనిర్భరత, మరియు ఇన్నోవేషన్ (సమైక్యత, ఆత్మనిర్భరత, మరియు ఆవిష్కరణ). స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, లోతైన ఏకీకరణ, సేవల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మరియు కీలకమైన సంస్థాగత సంస్కరణల ద్వారా సాయుధ దళాల పరివర్తనను ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
    1
    జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఈ రోజు భారతదేశపు 3వ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా బాధ్యతలు స్వీకరించారు, ఇది సైనిక నాయకత్వం మరియు పరివర్తనలో ఒక కొత్త దశకు నాంది పలికింది. దేశ వీరులకు గౌరవ సూచకంగా, ఆయన మొదట జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత, న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్‌లో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

దేశంలో అత్యున్నత సైనిక పదవిని చేపట్టిన సీడీఎస్, ప్రధానమంత్రి జై (JAI) దార్శనికతకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. జై అంటే జాయింట్‌నెస్, ఆత్మనిర్భరత, మరియు ఇన్నోవేషన్ (సమైక్యత, ఆత్మనిర్భరత, మరియు ఆవిష్కరణ). స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, లోతైన ఏకీకరణ, సేవల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మరియు కీలకమైన సంస్థాగత సంస్కరణల ద్వారా సాయుధ దళాల పరివర్తనను ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కర్నూలు జిల్లాలోని మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగిన ఏబీఏం చర్చి ప్రతిష్ట కార్యక్రమం నేటితో ఘనంగా ముగిసింది. గ్రామస్తులు ఈ ప్రతిష్ట వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడంతో, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా ముగించారు. చర్చి ముగింపు వేడుకల్లో కడుమూరు ఏబీఏం చర్చి సంఘ పెద్దలు, పాస్టర్లు, సంఘ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.
    1
    కర్నూలు జిల్లాలోని మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగిన ఏబీఏం చర్చి ప్రతిష్ట కార్యక్రమం నేటితో ఘనంగా ముగిసింది. గ్రామస్తులు ఈ ప్రతిష్ట వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడంతో, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా ముగించారు. చర్చి ముగింపు వేడుకల్లో కడుమూరు ఏబీఏం చర్చి సంఘ పెద్దలు, పాస్టర్లు, సంఘ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.
    user_MK news telugu
    MK news telugu
    Media company Midthur, Nandyal•
    12 hrs ago
  • కొత్తపల్లి మండలంలోని పాత మాడుగుల-సంగమేశ్వరం రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ మొక్కలు రోడ్డుపైకి విస్తరించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించిన పలు గ్రామాల ప్రజలు, వాహనదారులు, అధికారులు వెంటనే చర్యలు చేపట్టి రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు.
    1
    కొత్తపల్లి మండలంలోని పాత మాడుగుల-సంగమేశ్వరం రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ మొక్కలు రోడ్డుపైకి విస్తరించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించిన పలు గ్రామాల ప్రజలు, వాహనదారులు, అధికారులు వెంటనే చర్యలు చేపట్టి రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ఈ రోజు ఉదయం నుంచే ఫలక్నుమా కాళీ మాత మందిరానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ కోరికలను నెరవేర్చుకోవాలనే ఆకాంక్షతో భక్తులు ముడుపులు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆలయ యాజమాన్యం పటిష్టమైన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, క్యూలైన్ నిర్వహణ వంటి అవసరమైన సదుపాయాలను కల్పించడంతో, పూజలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగాయి.
    1
    ఈ రోజు ఉదయం నుంచే ఫలక్నుమా కాళీ మాత మందిరానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ కోరికలను నెరవేర్చుకోవాలనే ఆకాంక్షతో భక్తులు ముడుపులు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆలయ యాజమాన్యం పటిష్టమైన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, క్యూలైన్ నిర్వహణ వంటి అవసరమైన సదుపాయాలను కల్పించడంతో, పూజలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగాయి.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    10 hrs ago
  • కర్నూలు జిల్లా ఆదోనిలో మహేశ్ (40) అనే వ్యక్తిని అతడి భార్య ఈరమ్మ హత్య చేసిందని సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2013లో మహేశ్, ఈరమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహేతర సంబంధంపై అనుమానంతో మహేశ్ తరచుగా తన భార్యతో గొడవ పడేవాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మహేశ్ తో మరోసారి గొడవ జరిగింది. వివాహేతర బంధానికి భర్త అడ్డుగా మారాడనే కారణంతోనే ఈరమ్మ అతడిని ఇంటి పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో తేలిందని సీఐ చంద్రశేఖర్ శనివారం వెల్లడించారు.
    1
    కర్నూలు జిల్లా ఆదోనిలో మహేశ్ (40) అనే వ్యక్తిని అతడి భార్య ఈరమ్మ హత్య చేసిందని సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2013లో మహేశ్, ఈరమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహేతర సంబంధంపై అనుమానంతో మహేశ్ తరచుగా తన భార్యతో గొడవ పడేవాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మహేశ్ తో మరోసారి గొడవ జరిగింది. వివాహేతర బంధానికి భర్త అడ్డుగా మారాడనే కారణంతోనే ఈరమ్మ అతడిని ఇంటి పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో తేలిందని సీఐ చంద్రశేఖర్ శనివారం వెల్లడించారు.
    user_K Thasleema  MA JOURNALISM
    K Thasleema MA JOURNALISM
    Adoni, Kurnool•
    19 hrs ago
  • హైదరాబాద్‌లోని లక్ష్మీనగర్‌లో, గోల్నాక అంబర్ బిస్కెట్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న కటింగ్ షాప్ గల్లీలో ఒక గజ్జి కుక్క తిరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కుక్క వల్ల చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని, దీనిపై మున్సిపాలిటీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కుక్కను తమ కాలనీ నుండి తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    హైదరాబాద్‌లోని లక్ష్మీనగర్‌లో, గోల్నాక అంబర్ బిస్కెట్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న కటింగ్ షాప్ గల్లీలో ఒక గజ్జి కుక్క తిరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కుక్క వల్ల చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని, దీనిపై మున్సిపాలిటీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కుక్కను తమ కాలనీ నుండి తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_KESHAV ADVOCATE ALL LEGAL ACTIONS.
    KESHAV ADVOCATE ALL LEGAL ACTIONS.
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో బహుజన్ ముక్తి పార్టీ (బీఎంపీ) ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. పెరిగిన ధరలను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు తోపుడు బండ్లతో తమ ఆందోళనను తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాల్లోని 625 జిల్లాల్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు. సామాన్యులు ఇంధనం కొనలేక వాహనాలను తోసుకునే దయనీయ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌ను రూ.400లకే అందించాలని, అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లను తక్షణమే తొలగించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
    1
    నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో బహుజన్ ముక్తి పార్టీ (బీఎంపీ) ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. పెరిగిన ధరలను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు తోపుడు బండ్లతో తమ ఆందోళనను తెలియజేశారు.

ఈ సందర్భంగా పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాల్లోని 625 జిల్లాల్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు. సామాన్యులు ఇంధనం కొనలేక వాహనాలను తోసుకునే దయనీయ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌ను రూ.400లకే అందించాలని, అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లను తక్షణమే తొలగించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
    user_NAVADEEP T
    NAVADEEP T
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.