Shuru
Apke Nagar Ki App…
విద్యార్థులు కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది విద్యార్థులు కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి చెప్పారు. మంగళవారం కామారెడ్డి మండలంలోని దేవుని పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని చెప్పారు. అనుభవం గల అధ్యాపకులతో ఉత్తమ విద్యా బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. నాణ్యమైన విద్యా బోధనతో పాటు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా కిషన్ ఉపాధ్యాయులు ఉన్నారు.
Bala prakash.Jangam
విద్యార్థులు కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది విద్యార్థులు కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి చెప్పారు. మంగళవారం కామారెడ్డి మండలంలోని దేవుని పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని చెప్పారు. అనుభవం గల అధ్యాపకులతో ఉత్తమ విద్యా బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. నాణ్యమైన విద్యా బోధనతో పాటు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా కిషన్ ఉపాధ్యాయులు ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జుక్కల్ రైతుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గళం జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని ఉద్యానవన రైతుల సమస్యలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అసెంబ్లీలో ప్రస్తావించారు. నియోజకవర్గంలో బొప్పాయితో పాటు వివిధ రకాల ఉద్యానవన పంటలను రైతులు విస్తారంగా సాగు చేస్తున్న నేపథ్యంలో, రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల పంటలకు మెరుగైన ధరలు లభించేలా అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, గ్రేడింగ్–ప్యాకింగ్ కేంద్రాలు, మార్కెట్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గానికి కీలకమైన లెండి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని అసెంబ్లీ వేదికగా కోరారు.1
- ఆవాస్ యోజన ఇండ్లపై ప్రధాని మోడీ పేరు ఉండాలి : ఎంపీ రఘునందన్ రావు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను కేటాయించిందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.2 లక్షల చొప్పున నిధులు అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ఇళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో ఉన్న ఆవాస్ యోజన పథకం చిహ్నాన్ని తప్పనిసరిగా ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం అందిస్తున్న నిధుల వివరాలను ప్రజలకు తెలిసేలా పథకం గుర్తును ఇళ్లపై ఏర్పాటు చేయాలని కోరారు.1
- మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే *బైపాస్ రోడ్డు ప్రయాణంలో ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో ప్రయాణికులకు ప్రజలకు తెలుసు* .. *మా ఎమ్మెల్యే ఆరాటం HMDA నాన్స్ ప్రకారం బైపాస్ రోడ్డు విస్తీరణ ఉండాలి* ... *కూల్చాడు గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడితే విడ్డూరంగా ఉంది...* *50 ఫీట్ల రోడ్డుతో ఎవ్వరికి ఉపయోగం...* *మాటలు నరకడం ఆపి రోడ్డు గుంతలను పూడ్చాలి...* *మీ ప్రయోజనాలకోసం ప్రజలను ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు* .. *ముగ్గురు సీఎం లు మారిన రాజీవ్ పార్క్ ఎందుకు బాగు చేయలేదు... ?* సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంలా కనిపిస్తున్నాయి అని మాజీ సిడిసి చైర్మన్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి అన్నారు. బైపాస్ రోడ్డు విషయంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి, రామప్ప, కౌన్సిలర్ లు పొన్న రాజేందర్ రెడ్డి, శ్రీకాంత్ మీడియా తో మాట్లాడారు.. వ్యక్తిగత విమర్శలు, అనవసర ఆరోపణలు కాకుండా సంగారెడ్డి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడితే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సంగారెడ్డి బైపాస్ రోడ్డుపై ప్రతిరోజూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాజీ ఎమ్మెల్యేకు తెలియవా? గుంతలు, ట్రాఫిక్ సమస్యలు, నెమ్మదిగా సాగుతున్న పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైపాస్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలన్నదే ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్. 50 అడుగుల రోడ్డుతో సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందా? లేక భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల ఉన్న చోట 80. అడుగులు 60 అడుగులు ఉన్న చోట 60 అడుగుల రోడ్డును నిర్మించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలా? అనేది ప్రజలే ఆలోచించాలి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టంగా చెబుతున్నది ఒక్కటే ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు నిర్మాణం జరగాలి. భవిష్యత్‌లో మళ్లీ రోడ్డు విస్తరణ అవసరం రాకుండా ఇప్పుడే సరైన ప్రణాళికతో పని పూర్తి చేయాలి. ఇక రోడ్డు పనుల నాణ్యతపై, పనులు ఎందుకు నెమ్మదిగా జరుగుతున్నాయి? గడువులోగా ఎందుకు పూర్తి చేయడం లేదు? ప్రజలకు వివరించాలి... మొన్న సీఎం వచ్చినపుడు ఐబీ ఆవరణలో రోడ్డు పనుల కోసం గోడలు కూల్చినప్పుడు, ఆగమేఘాల మీద పనులు చేపట్టినప్పుడు ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించలేదా? ఇప్పుడు అభివృద్ధి పనుల విషయంలో మాత్రమే విమర్శలు చేయడం ఎందుకు? అభివృద్ధి కోసం అవసరమైన చోట రోడ్డు విస్తరణ, ప్రభుత్వ ఆస్తుల మార్పులు, నిర్మాణ పనులు చేపట్టాల్సి వస్తే వాటిని నిబంధనల ప్రకారం పూర్తి చేయడం ముఖ్యం. ఎన్నికల సమయంలో సంగారెడ్డి పట్టణంలోని ప్రతి వార్డుకు 8.కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఇస్తామని ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి? ఇటీవల ముఖ్యమంత్రి సంగారెడ్డికి వచ్చిన సమయంలో పట్టణానికి కొత్తగా ఎంత నిధులు మంజూరు చేశారు? ప్రజలకు ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాజీవ్ పార్క్ అభివృద్ధి విషయంలో కూడా సంవత్సరాలుగా ముగ్గురు సీఎం లు మారిన ఒక పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇంత కాలం ఎందుకు పడుతోంది? గతంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కృషితో పట్టణ అభివృద్ధికి 50కోట్ల నిధులు తీసుకువచ్చి పార్టీలకు అతీతంగా వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. సంగారెడ్డి ప్రజలకు కావాల్సింది రాజకీయ విమర్శలు కాదు — అభివృద్ధి. మాటలు కాదు — పనులు. హామీలు కాదు — నిధులు. ప్రచారం కాదు — నాణ్యమైన రోడ్లు. రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలి. నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ప్రస్తుతం ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలి. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల రోడ్డు ఉన్న చోట 80 అడుగులు 60 అడుగులు ఉన్న చోట 60 అడుగుల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు కాదు… ప్రజలకు ఉపయోగపడే పనులపై చర్చ జరగాలి. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పై అనవసర ఆరోపణలు చేయడం మానుకుని, ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టాలి. సంగారెడ్డి ప్రజలు అమాయకులు కాదు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి హయాంలో ఏ పని జరిగింది అన్నది ప్రజలకు తెలుసు. కార్యక్రమంలో మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కౌన్సిలర్ లు ,లాడే మల్లేశం, నవీన్, సురేష్, కసిని శ్రీకాంత్, విఠల్, వజిత్ తదితరులు ఉన్నారు.4
- తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. త్యాగం చేసిన వారి గొప్పతనం ప్రతి విద్యార్థి, యువకుని గుండెల్లో ఉండాలి. అందుకే ఆ త్యాగాల చరిత్ర ఎగ్జిబిషన్ ని ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో దత్తాత్రేయ చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నామని తెలిపారు. దేశమంతా మూడు రంగుల మువ్వన్నెల జెండాను ఆగస్టు 15 సెప్టెంబర్ 1947 న ఎగరవేస్తే.. తెలంగాణలో మాత్రం ఆ జెండా కోసం అనేకమంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత 17 సెప్టెంబర్ 1948 రోజున ఎగురవేసుకున్నాము. - ఈరోజు మనము అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే వచ్చింది కాదు. - అది కేవలం జెండా మాత్రమే కాదు, లక్షలాదిమంది భరతమాత ముద్దుబిడ్డలు ప్రాణ త్యాగాలు, కోట్లాదిమంది ప్రజల కష్టం. భరతమాత దాస్యశృంఖలాలు తెంచడానికి ఎంతోమంది నేలకొరిగారు. - భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా కొట్లాడారు. - - నిజాం అరాచకాలపై దాశరథి గారి లాంటి వారు పాట రాసినా..యాదిగిరి లాంటివారు పాడినా.. పత్రికలో రాసినా జైల్లో పెట్టారు, హత్య చేసినట్టు చరిత్ర చెబుతుంది.1
- రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో మూడవరోజు స్వామి వారి దర్శనం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు పీత వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- 34 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో ఉన్న సీనియర్ మహిళా నేత లొంగుబాటు నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన సీపీఐ మావోయిస్టు పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు నిక్కా శశీల అలియాస్ రాజి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 57 ఏళ్ల నిక్కా శశీల 1992లో పీపుల్స్ వార్‌లో చేరి.. 34 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. డివిజన్ కమిటీ సభ్యురాలిగా పనిచేసిన ఆమె.. అనారోగ్య సమస్యల కారణంగా మావోయిస్టు పార్టీని వీడి సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన శశీలకు ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల చెక్‌తో పాటు 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మిగిలిన మావోయిస్టు కేడర్లు కూడా హింసా మార్గాన్ని వీడి లొంగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.1
- 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ మెదక్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అడహాక్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో వినతి -ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని కోరుతూ మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మెదక్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అడహాక్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో వినతిపత్రం1
- నయాబాది టీచర్స్ కాలనీలో చిన్నారులచే హనుమాన్ చాలీసా పారాయణం ఎల్లారెడ్డి: పట్టణంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం చిన్నారులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగా ఆంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో పెద్దలు పాల్గొని చిన్నారులకు సహకరించారు.1
- ఇస్లాంపూర్ తండాలో చిరుత కలకలం.. లేగ దూడ మృతి, చిరుతను పట్టుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన సర్పంచ్ తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ తండాలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మంగళవారం రాత్రి పొలం వద్ద కట్టేసిన లేగ దూడపై చిరుత దాడి చేసి చంపినట్లు సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి తెలిపారు. తండాకు చెందిన లంబాడి రాజు పొలం వద్ద పశువులను కట్టేసి ఉంచగా, సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత ఒక్కసారిగా దాడి చేసినట్లు చెప్పారు. ఈ ఘటనలో లేగ దూడ అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. దీంతో చుట్టుపక్కల పొలాల్లో పనిచేసే రైతులు, తండావాసులు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచారాన్ని గుర్తించి, దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సర్పంచ్ కోరారు.1