logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సెప్టెంబర్ 17 పోరాట చరిత్రపై బీజేపీకి మాట్లాడే అర్హత లేదు-సిపిఎం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే హక్కు బీజేపీకి లేదని సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ అన్నారు.సోమవారం రంగరాయగూడెం, కోమటిగూడెం గ్రామాల్లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనతో పాటు దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన పోరాటంలో కమ్యూనిస్టులు ప్రజలను సంఘటితం చేసి ముందుండి నడిపించారని తెలిపారు.ప్రజలు వెట్టిచాకిరీ, దోపిడీ, చిత్రహింసలకు గురవుతున్న సమయంలో ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొనలేదని విమర్శించారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ–ముస్లిం ఘర్షణ కాదని, దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పేదలు, రైతులు, కూలీలు సాగించిన ప్రజా పోరాటమని స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల పాత్రను చరిత్ర నుంచి చెరిపివేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు అంగీకరించరని అన్నారు.భూమి, భుక్తి, విముక్తి కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన పోరాటంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆయన అభివర్ణించారు.పోరాట ఫలితంగా 10 లక్షల ఎకరాల భూమి పంచబడిందని, సుమారు 3 వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయని, 4 వేల మంది అమరులయ్యారని గుర్తుచేశారు. ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ సీపీఎం నేటికీ ప్రజా సమస్యలపై పోరాడుతోందన్నారు. చరిత్రను వక్రీకరించి మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ఈ నెల 17న జనగామ జిల్లా కేంద్రంలోని కామాక్షి ఫంక్షన్ హాల్‌లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని చెప్పారు.రైతులు, కూలీలు, కార్మికులు, యువత, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కత్తుల రాజు, రంగరాయిగూడెం ఉపసర్పంచ్ మునిగెల నరసింహులు, కోమటిగూడెం శాఖ కార్యదర్శి ఈదునూరి యాకయ్య, బోయినిగూడెం శాఖ కార్యదర్శి బోయిని రాజు, పార్టీ నాయకులు నెలమంచ వెంకటరెడ్డి, మారబోయిన మల్లయ్య, బోయిని రాజయ్య, మంద ఇలిషన్, జిల్లాపెళ్లి కొమురయ్య, రాడపాక యాదగిరి, మల్లారెడ్డి, బోయిని మ్యాకల కుమార్, పల్లెపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

1 day ago
user_Saleem
Saleem
ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, తెలంగాణ•
1 day ago
f778f62e-1fd0-412f-91cd-b7027ab283c4

సెప్టెంబర్ 17 పోరాట చరిత్రపై బీజేపీకి మాట్లాడే అర్హత లేదు-సిపిఎం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే హక్కు బీజేపీకి లేదని సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ అన్నారు.సోమవారం రంగరాయగూడెం, కోమటిగూడెం గ్రామాల్లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనతో పాటు దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన పోరాటంలో కమ్యూనిస్టులు ప్రజలను సంఘటితం చేసి ముందుండి నడిపించారని తెలిపారు.ప్రజలు వెట్టిచాకిరీ, దోపిడీ, చిత్రహింసలకు గురవుతున్న సమయంలో ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొనలేదని విమర్శించారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ–ముస్లిం ఘర్షణ కాదని, దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పేదలు, రైతులు, కూలీలు సాగించిన ప్రజా పోరాటమని స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల పాత్రను చరిత్ర నుంచి చెరిపివేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు అంగీకరించరని అన్నారు.భూమి, భుక్తి, విముక్తి కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన పోరాటంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆయన అభివర్ణించారు.పోరాట ఫలితంగా 10 లక్షల ఎకరాల భూమి పంచబడిందని, సుమారు 3 వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయని, 4 వేల మంది అమరులయ్యారని గుర్తుచేశారు. ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ సీపీఎం నేటికీ ప్రజా సమస్యలపై పోరాడుతోందన్నారు. చరిత్రను వక్రీకరించి మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ఈ నెల 17న జనగామ జిల్లా కేంద్రంలోని కామాక్షి ఫంక్షన్ హాల్‌లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని చెప్పారు.రైతులు, కూలీలు, కార్మికులు, యువత, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కత్తుల రాజు, రంగరాయిగూడెం ఉపసర్పంచ్ మునిగెల నరసింహులు, కోమటిగూడెం శాఖ కార్యదర్శి ఈదునూరి యాకయ్య, బోయినిగూడెం శాఖ కార్యదర్శి బోయిని రాజు, పార్టీ నాయకులు నెలమంచ వెంకటరెడ్డి, మారబోయిన మల్లయ్య, బోయిని రాజయ్య, మంద ఇలిషన్, జిల్లాపెళ్లి కొమురయ్య, రాడపాక యాదగిరి, మల్లారెడ్డి, బోయిని మ్యాకల కుమార్, పల్లెపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

More news from Jangoan and nearby areas
  • రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see
    1
    రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Ghanpur (Station), Jangoan•
    10 hrs ago
  • ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    1
    ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన
ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు.
ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    10 hrs ago
  • ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్‌ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్‌ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    1
    ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్‌ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్‌ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ జనగామ: క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ​ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.
    1
    క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్
జనగామ:
క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు.
​ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు.
​ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.
    user_Parushuram goud
    Parushuram goud
    Singer జనగాం, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • కవులు కళాకారుల ఐక్యవేదిక, జనగామ ఆధ్యర్యంలో అభినందన సభ శ్రీ బేతి వీరారెడ్డి గారికి తెలంగాణ శాసనసభ సహాయ కార్యదర్శిగా విధి నిర్వహణలో ఉంటూ, తమ ఉన్నతమైన నైపుణ్యాల అధ్యయనంలో భాగంగా విదేశాల్లో పర్యలోంచి విజయవంతంగా స్వదేశానికి విచ్చేసిన వేదిక: పెంబత్తి గ్రామం గ్రామ పంచాయతి దగ్గర శ్రీ. నెల్లుట్ల రవీందర్ రావు గారికి నిరంతర సామాజిక సేవా వికాసమే ధ్యేయం నెల్లుట్ల ఫౌండేషన్ ద్వారా కళా, సాహిత్య, సామాజక సేవారంగాల్లో తమ నిరప,మాన సేవ గానూ ఇదేవల జాతీయ స్థాయిలో ప్రతిష్టాత పురస్కారాలు అందుకున్న 3໖: 20-09-2026 ఆదివారం సమయం: ৯ :6:00 e గ్రామ సర్పంచ్ శ్రీమతి చిన్నబోయిన రేఖరాజు గారి సహకారంతో అందరు ఆహ్వానితులే... ACCవర్కింగ్ కమిటీ జి. కృష్ట (జ.వై.గిరి ఫౌండేషన్) పెట్లోజు సోమేశ్వరాచారి (కవి హ్యధయం సాహిత్య వేదిక) అయిలా సోమనర్సింహాచా (అభినందన కల్వరల్ సొసైటీ- పెఁ లగిశెట్టి సభాకర్ చిలుమోజు సాయికిరణ్ గడం మనోజ్ కుమార్ గౌ
    3
    కవులు కళాకారుల ఐక్యవేదిక,
జనగామ
ఆధ్యర్యంలో
అభినందన సభ
శ్రీ బేతి వీరారెడ్డి గారికి
తెలంగాణ శాసనసభ సహాయ కార్యదర్శిగా విధి నిర్వహణలో ఉంటూ, తమ ఉన్నతమైన నైపుణ్యాల అధ్యయనంలో భాగంగా విదేశాల్లో పర్యలోంచి విజయవంతంగా స్వదేశానికి విచ్చేసిన
వేదిక:
పెంబత్తి గ్రామం గ్రామ పంచాయతి దగ్గర
శ్రీ. నెల్లుట్ల రవీందర్ రావు గారికి
నిరంతర సామాజిక సేవా వికాసమే ధ్యేయం నెల్లుట్ల ఫౌండేషన్ ద్వారా కళా, సాహిత్య, సామాజక సేవారంగాల్లో తమ నిరప,మాన సేవ గానూ ఇదేవల జాతీయ స్థాయిలో ప్రతిష్టాత పురస్కారాలు అందుకున్న
3໖:
20-09-2026 ఆదివారం
సమయం:
৯ :6:00 e
గ్రామ సర్పంచ్ శ్రీమతి చిన్నబోయిన రేఖరాజు గారి సహకారంతో
అందరు ఆహ్వానితులే...
ACCవర్కింగ్ కమిటీ
జి. కృష్ట
(జ.వై.గిరి ఫౌండేషన్)
పెట్లోజు సోమేశ్వరాచారి (కవి హ్యధయం సాహిత్య వేదిక)
అయిలా సోమనర్సింహాచా (అభినందన కల్వరల్ సొసైటీ- పెఁ
లగిశెట్టి సభాకర్
చిలుమోజు సాయికిరణ్
గడం మనోజ్ కుమార్ గౌ
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ* రైతాంగాన్ని సమీకరించి, రైతుల సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్ష కారుదర్శులు కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ లు పిలుపునిచ్చారు. మహాసభల జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఆలేరులో ఏ.ఐ.కె.ఎం.ఎస్. ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ మాట్లాడుతూ.. దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రైతుల హక్కుల కోసం జరిగే పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, అప్పుల భారం వంటి సమస్యలు రైతాంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసి పోరాటాలను నిర్మించడమే లక్ష్యంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్. పనిచేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో జరగనున్న జాతీయ మహాసభలు భవిష్యత్ రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా నిలుస్తాయని అన్నారు. జాతీయ మహాసభల పిలుపును గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు ఆలేరు ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు మహాసభల సందేశాన్ని చేరవేయడంతో పాటు, పోస్టర్లను ఆవిష్కరించి మహాసభల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, యువత, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో జాతీయ మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు చిరబోయిన రాజయ్య, ఇక్కిరి సహదేవ్, సహాయ కార్యదర్శి మామిడాల బాలమల్లేష్, తమ్మడి అంజయ్య, పాకాల సరిత, రాఘవ రెడ్డి, గోపాల్ రెడ్డి, మేకల వెంకటేష్, మార్కొండయ్య , పాకాల నరేష్, బాల్ రెడ్డి,ఇక్కిరి శ్రీనివాస్, గడ్డం మంకన్న, మురళి, కుమార్, అంజిరెడ్డి, భూష శ్రీశైలం, బాలయ్య, రామ చంద్రయ్య, మశయ్య, ఆర్.ఉదయ్, పాల్గొన్నారు.
    2
    *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి*
*ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ
*జాతీయ మహాసభలను జయప్రదం చేయండి*
*ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ*
రైతాంగాన్ని సమీకరించి, రైతుల సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్ష కారుదర్శులు కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ లు పిలుపునిచ్చారు. 
మహాసభల జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఆలేరులో ఏ.ఐ.కె.ఎం.ఎస్. ఆధ్వర్యంలో  బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ మాట్లాడుతూ.. దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రైతుల హక్కుల కోసం జరిగే పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, అప్పుల భారం వంటి సమస్యలు రైతాంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసి పోరాటాలను నిర్మించడమే లక్ష్యంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్. పనిచేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో జరగనున్న జాతీయ మహాసభలు భవిష్యత్ రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా నిలుస్తాయని అన్నారు. జాతీయ మహాసభల పిలుపును గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు ఆలేరు ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు మహాసభల సందేశాన్ని చేరవేయడంతో పాటు, పోస్టర్లను ఆవిష్కరించి మహాసభల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, యువత, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో జాతీయ మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు చిరబోయిన రాజయ్య, ఇక్కిరి సహదేవ్, సహాయ కార్యదర్శి మామిడాల బాలమల్లేష్, తమ్మడి అంజయ్య, పాకాల సరిత, రాఘవ రెడ్డి, గోపాల్ రెడ్డి, మేకల వెంకటేష్, మార్కొండయ్య , పాకాల నరేష్, బాల్ రెడ్డి,ఇక్కిరి శ్రీనివాస్, గడ్డం మంకన్న, మురళి, కుమార్, అంజిరెడ్డి, భూష శ్రీశైలం, బాలయ్య, రామ చంద్రయ్య,  మశయ్య,  ఆర్.ఉదయ్,  పాల్గొన్నారు.
    user_Bhupathi Srinivas
    Bhupathi Srinivas
    రాజపేట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    8 hrs ago
  • నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై దేశ వ్యాప్తంగా నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు...కేంద్ర పథకాల లబ్దిదారులంతా భాగస్వాములుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘‘ఆశీర్వాద దీపం’’ పేరిట దేశవ్యాప్తంగా అందరం దీపాన్ని వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరలించాలని ప్రార్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటామని తెలిపారు.‌ కేంద్రం నుండి లబ్ది పొందిన వాళ్లంతా ‘‘ఆశీర్వాద దీపం’’ పాల్గొనాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యంశాలుగా పొందుపరుస్తామని తెలిపారు.
    1
    నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై దేశ వ్యాప్తంగా నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు...కేంద్ర పథకాల లబ్దిదారులంతా భాగస్వాములుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన
గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ  సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘‘ఆశీర్వాద దీపం’’ పేరిట దేశవ్యాప్తంగా అందరం దీపాన్ని వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరలించాలని ప్రార్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటామని తెలిపారు.‌ కేంద్రం నుండి లబ్ది పొందిన వాళ్లంతా ‘‘ఆశీర్వాద దీపం’’ పాల్గొనాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యంశాలుగా పొందుపరుస్తామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    1
    ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ 
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.