logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లక్షెట్టిపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం ఉరుములు మెరుపులతో అతి భారీ వర్షం నమోదు అయింది. దాదాపు నాలుగు రోజులుగా వర్షపాతం లేకపోవడంతో ఉక్క పోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

9 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
9 hrs ago

లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లక్షెట్టిపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం ఉరుములు మెరుపులతో అతి భారీ వర్షం నమోదు అయింది. దాదాపు నాలుగు రోజులుగా వర్షపాతం లేకపోవడంతో ఉక్క పోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • లక్ష్మీకాంతపూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం, అంతట పండగ వాతావరణం దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతపూర్ గ్రామంలో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వినాయక చవితి పురస్కరించుకొని గ్రామంలో నిర్వాహకులు వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. మంగళవారం రాత్రి గ్రామంలో నెలకొల్పిన రెండు వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామ విధుల గుండా ఊరేగింపు నిర్వహించి సమీప గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.
    1
    లక్ష్మీకాంతపూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం, అంతట పండగ వాతావరణం
దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతపూర్ గ్రామంలో వినాయక  నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వినాయక చవితి పురస్కరించుకొని గ్రామంలో నిర్వాహకులు వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. మంగళవారం రాత్రి గ్రామంలో నెలకొల్పిన రెండు వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామ విధుల గుండా ఊరేగింపు నిర్వహించి సమీప గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • రామగుండం: మల్యాలపల్లి వద్ద ఎల్‌హెచ్‌ఎస్‌ నిర్మాణం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. రామగుండం: మల్యాలపల్లి–భద్రిపల్లి ప్రజల రాకపోకల సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మల్యాలపల్లి వద్ద లెవెల్ క్రాసింగ్‌కు బదులుగా ఎల్‌హెచ్‌ఎస్‌ (అండర్‌పాస్) నిర్మించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిర్మాణానికి ఎన్టీపీసీ అధికారులు సానుకూలంగా స్పందించారని, అప్రోచ్‌ రోడ్డుతో పాటు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ వెల్లడించారు.
    1
    రామగుండం:  మల్యాలపల్లి వద్ద ఎల్‌హెచ్‌ఎస్‌ నిర్మాణం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.
రామగుండం: మల్యాలపల్లి–భద్రిపల్లి ప్రజల రాకపోకల సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మల్యాలపల్లి వద్ద లెవెల్ క్రాసింగ్‌కు బదులుగా ఎల్‌హెచ్‌ఎస్‌ (అండర్‌పాస్) నిర్మించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిర్మాణానికి ఎన్టీపీసీ అధికారులు సానుకూలంగా స్పందించారని, అప్రోచ్‌ రోడ్డుతో పాటు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ వెల్లడించారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • వెల్గటూర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతికి దీపోత్సవ పూజ వినాయక నవరాత్రి ఉఏత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు స్వామి వారికి ఘనంగా దీపోత్సవ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    వెల్గటూర్ ఆదర్శ యూత్  ఆధ్వర్యంలో ఘనంగా గణపతికి దీపోత్సవ పూజ 
వినాయక నవరాత్రి ఉఏత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు స్వామి వారికి ఘనంగా దీపోత్సవ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • కాంగ్రెస్ పాలనలో ఎండిపోయిన గోదావరి.. * కన్నెపల్లి పంప్‌హౌస్, ఎల్లంపల్లి నీటిని వెంటనే విడుదల చేయాలని చందర్ డిమాండ్ గోదావరిఖని గోదావరి బ్రిడ్జ్ వద్ద రామగుండం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే నేడు గోదావరి నది పూర్తిగా ఎండిపోయిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నదిని ఏడాది పొడవునా సముద్రాన్ని తలపించేలా నిండుకుండలా ఉంచారని కొనియాడారు. అపర భగీరథుడిలా కేసీఆర్ నీటిని అందించి మత్స్యకారులందరికీ జీవనోపాధి కల్పించారని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వినాయక నిమజ్జనోత్సవాలు జరుగుతున్న వేళ, గోదావరిలో నీళ్లు లేకపోవడంతో విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎల్లంపల్లిలో నిల్వ ఉన్న నీటిని వెంటనే గోదావరిలోకి విడుదల చేయాలని మరియు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించాలని కోరారు.
    1
    కాంగ్రెస్ పాలనలో ఎండిపోయిన గోదావరి..
* కన్నెపల్లి పంప్‌హౌస్, ఎల్లంపల్లి నీటిని వెంటనే విడుదల చేయాలని చందర్ డిమాండ్
గోదావరిఖని
గోదావరి బ్రిడ్జ్ వద్ద రామగుండం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే నేడు గోదావరి నది పూర్తిగా ఎండిపోయిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నదిని ఏడాది పొడవునా సముద్రాన్ని తలపించేలా నిండుకుండలా ఉంచారని కొనియాడారు. అపర భగీరథుడిలా కేసీఆర్ నీటిని అందించి మత్స్యకారులందరికీ జీవనోపాధి కల్పించారని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వినాయక నిమజ్జనోత్సవాలు జరుగుతున్న వేళ, గోదావరిలో నీళ్లు లేకపోవడంతో విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎల్లంపల్లిలో నిల్వ ఉన్న నీటిని వెంటనే గోదావరిలోకి విడుదల చేయాలని మరియు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించాలని కోరారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    5 hrs ago
  • భక్తులను ఆకట్టుకున్న పార్వతి తనయ బాల గణపయ్య విగ్రహం........ నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడ కాలనీలో చిన్నారులు ప్రతిష్టించిన శ్రీ సూర్యచంద్ర బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించిన అనంతరం వినాయకుని శోభాయాత్ర ప్రారంభించారు. తన తల్లి పార్వతి దేవి పై బాలగణపతిలా కూర్చున్న విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంది. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విగ్రహ దాత తాడురి సాయిబాబా, కళావతి దంపతులను నిర్వాహకులు శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవ సమితి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, కౌన్సిలర్ అడప విజయలక్ష్మి పోశెట్టి, మాజీ కౌన్సిలర్ గండ్రత్ రమణ, కందుల హరీష్, పోగుల హరీష్, మునిగెల మనీష్, శశాంక్, మండాజీ అభిలాష్, దీపక్,సాయి, తదితరులున్నారు.
    1
    భక్తులను ఆకట్టుకున్న పార్వతి తనయ బాల గణపయ్య విగ్రహం........

నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడ కాలనీలో చిన్నారులు ప్రతిష్టించిన శ్రీ సూర్యచంద్ర బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించిన అనంతరం వినాయకుని శోభాయాత్ర ప్రారంభించారు. తన తల్లి పార్వతి దేవి పై బాలగణపతిలా కూర్చున్న విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంది. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విగ్రహ దాత తాడురి సాయిబాబా, కళావతి దంపతులను నిర్వాహకులు శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవ సమితి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, కౌన్సిలర్ అడప విజయలక్ష్మి పోశెట్టి, మాజీ కౌన్సిలర్ గండ్రత్ రమణ, కందుల హరీష్, పోగుల హరీష్, మునిగెల మనీష్, శశాంక్, మండాజీ అభిలాష్, దీపక్,సాయి, తదితరులున్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    7 hrs ago
  • భక్తి... ఆనందం... ఉత్సాహంతో భవానీనగర్ రోడ్ నంబర్–3లో పండుగ వాతావరణం నెలకొంది. కట్టారాంపూర్ భవాని నగర్ రోడ్ నెంబర్: 3 లో ఘనంగా గణపతి పూజా వేడుకలు కరీంనగర్ కట్టారాంపూర్ భవానీనగర్ రోడ్ నంబర్–3లో గణపతి పూజా వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి... భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు. ఈ సందర్భంగా దీపాలంకరణలతో గణపతి మండపాన్ని సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చారు.
    3
    భక్తి... ఆనందం... ఉత్సాహంతో భవానీనగర్ రోడ్ నంబర్–3లో పండుగ వాతావరణం నెలకొంది.
కట్టారాంపూర్ భవాని నగర్ రోడ్ నెంబర్:  3 లో ఘనంగా గణపతి పూజా వేడుకలు
కరీంనగర్ కట్టారాంపూర్ భవానీనగర్ రోడ్ నంబర్–3లో గణపతి పూజా వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి... భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు.
ఈ సందర్భంగా  దీపాలంకరణలతో గణపతి మండపాన్ని సుందరంగా అలంకరించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించిన కరీంనగర్ పోలీసులు కరీంనగర్‌లో భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించారు. **Shreya Infra and Marketing Private Limited** పేరుతో పెట్టుబడి పథకాలు నిర్వహిస్తూ, తక్కువ కాలంలో పెట్టుబడులను రెండింతలు, మూడింతలు చేస్తామని నమ్మించి కోట్లాది రూపాయలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ రాయ్‌తో పాటు రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను లక్నోలో అరెస్ట్ చేశారు. 2024 మే నుంచి పెట్టుబడిదారులకు చెల్లింపులు నిలిపివేసినట్లు విచారణలో వెల్లడైంది. CCS ఇన్‌స్పెక్టర్ ఆర్. ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితులను అదుపులోకి తీసుకుని, ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించింది. బాధితులు సమీప పోలీస్ స్టేషన్ లేదా CCS కరీంనగర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
    3
    భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించిన కరీంనగర్ పోలీసులు
కరీంనగర్‌లో భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించారు. **Shreya Infra and Marketing Private Limited** పేరుతో పెట్టుబడి పథకాలు నిర్వహిస్తూ, తక్కువ కాలంలో పెట్టుబడులను రెండింతలు, మూడింతలు చేస్తామని నమ్మించి కోట్లాది రూపాయలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ రాయ్‌తో పాటు రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను లక్నోలో అరెస్ట్ చేశారు. 2024 మే నుంచి పెట్టుబడిదారులకు చెల్లింపులు నిలిపివేసినట్లు విచారణలో వెల్లడైంది. CCS ఇన్‌స్పెక్టర్ ఆర్. ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితులను అదుపులోకి తీసుకుని, ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించింది. బాధితులు సమీప పోలీస్ స్టేషన్ లేదా CCS కరీంనగర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • యువత చదువుపై దృష్టి పెట్టి మంచి మార్గంలో నడవాలి: సీఐ రమణమూర్తి యువత మంచి మార్గంలో నడవాలని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి సూచించారు. మంగళవారం రాత్రి జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్లో ఆయన ప్రజలు, యువకులతో మాట్లాడారు. చదువు అభివృద్ధికి మార్గమని తెలిపారు. యువత చదువుపై దృష్టి సారించి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. సైబర్ నేరాల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని శాంతియుతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
    1
    యువత చదువుపై దృష్టి పెట్టి మంచి మార్గంలో నడవాలి: సీఐ రమణమూర్తి
యువత మంచి మార్గంలో నడవాలని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి సూచించారు. మంగళవారం రాత్రి జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్లో ఆయన ప్రజలు, యువకులతో మాట్లాడారు. చదువు అభివృద్ధికి మార్గమని తెలిపారు. యువత చదువుపై దృష్టి సారించి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. సైబర్ నేరాల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని శాంతియుతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.