కాంగ్రెస్ పాలనలో ఎండిపోయిన గోదావరి.. * కన్నెపల్లి పంప్‌హౌస్, ఎల్లంపల్లి నీటిని వెంటనే విడుదల చేయాలని చందర్ డిమాండ్ గోదావరిఖని గోదావరి బ్రిడ్జ్ వద్ద రామగుండం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే నేడు గోదావరి నది పూర్తిగా ఎండిపోయిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నదిని ఏడాది పొడవునా సముద్రాన్ని తలపించేలా నిండుకుండలా ఉంచారని కొనియాడారు. అపర భగీరథుడిలా కేసీఆర్ నీటిని అందించి మత్స్యకారులందరికీ జీవనోపాధి కల్పించారని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వినాయక నిమజ్జనోత్సవాలు జరుగుతున్న వేళ, గోదావరిలో నీళ్లు లేకపోవడంతో విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎల్లంపల్లిలో నిల్వ ఉన్న నీటిని వెంటనే గోదావరిలోకి విడుదల చేయాలని మరియు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించాలని కోరారు.
కాంగ్రెస్ పాలనలో ఎండిపోయిన గోదావరి.. * కన్నెపల్లి పంప్‌హౌస్, ఎల్లంపల్లి నీటిని వెంటనే విడుదల చేయాలని చందర్ డిమాండ్ గోదావరిఖని గోదావరి బ్రిడ్జ్ వద్ద రామగుండం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే నేడు గోదావరి నది పూర్తిగా ఎండిపోయిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నదిని ఏడాది పొడవునా సముద్రాన్ని తలపించేలా నిండుకుండలా ఉంచారని కొనియాడారు. అపర భగీరథుడిలా కేసీఆర్ నీటిని అందించి మత్స్యకారులందరికీ జీవనోపాధి కల్పించారని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వినాయక నిమజ్జనోత్సవాలు జరుగుతున్న వేళ, గోదావరిలో నీళ్లు లేకపోవడంతో విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎల్లంపల్లిలో నిల్వ ఉన్న నీటిని వెంటనే గోదావరిలోకి విడుదల చేయాలని మరియు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించాలని కోరారు.
- కాంగ్రెస్ పాలనలో ఎండిపోయిన గోదావరి.. * కన్నెపల్లి పంప్‌హౌస్, ఎల్లంపల్లి నీటిని వెంటనే విడుదల చేయాలని చందర్ డిమాండ్ గోదావరిఖని గోదావరి బ్రిడ్జ్ వద్ద రామగుండం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే నేడు గోదావరి నది పూర్తిగా ఎండిపోయిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నదిని ఏడాది పొడవునా సముద్రాన్ని తలపించేలా నిండుకుండలా ఉంచారని కొనియాడారు. అపర భగీరథుడిలా కేసీఆర్ నీటిని అందించి మత్స్యకారులందరికీ జీవనోపాధి కల్పించారని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వినాయక నిమజ్జనోత్సవాలు జరుగుతున్న వేళ, గోదావరిలో నీళ్లు లేకపోవడంతో విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎల్లంపల్లిలో నిల్వ ఉన్న నీటిని వెంటనే గోదావరిలోకి విడుదల చేయాలని మరియు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించాలని కోరారు.1
- టెక్నాలజీ అభివృద్ధి – మన భవిష్యత్తుకు కొత్త దారి" టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!"1
- వెల్గటూర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతికి దీపోత్సవ పూజ వినాయక నవరాత్రి ఉఏత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు స్వామి వారికి ఘనంగా దీపోత్సవ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- భక్తి... ఆనందం... ఉత్సాహంతో భవానీనగర్ రోడ్ నంబర్–3లో పండుగ వాతావరణం నెలకొంది. కట్టారాంపూర్ భవాని నగర్ రోడ్ నెంబర్: 3 లో ఘనంగా గణపతి పూజా వేడుకలు కరీంనగర్ కట్టారాంపూర్ భవానీనగర్ రోడ్ నంబర్–3లో గణపతి పూజా వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి... భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు. ఈ సందర్భంగా దీపాలంకరణలతో గణపతి మండపాన్ని సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చారు.3
- భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించిన కరీంనగర్ పోలీసులు కరీంనగర్‌లో భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించారు. **Shreya Infra and Marketing Private Limited** పేరుతో పెట్టుబడి పథకాలు నిర్వహిస్తూ, తక్కువ కాలంలో పెట్టుబడులను రెండింతలు, మూడింతలు చేస్తామని నమ్మించి కోట్లాది రూపాయలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ రాయ్‌తో పాటు రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను లక్నోలో అరెస్ట్ చేశారు. 2024 మే నుంచి పెట్టుబడిదారులకు చెల్లింపులు నిలిపివేసినట్లు విచారణలో వెల్లడైంది. CCS ఇన్‌స్పెక్టర్ ఆర్. ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితులను అదుపులోకి తీసుకుని, ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించింది. బాధితులు సమీప పోలీస్ స్టేషన్ లేదా CCS కరీంనగర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.3
- లక్ష్మీకాంతపూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం, అంతట పండగ వాతావరణం దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతపూర్ గ్రామంలో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వినాయక చవితి పురస్కరించుకొని గ్రామంలో నిర్వాహకులు వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. మంగళవారం రాత్రి గ్రామంలో నెలకొల్పిన రెండు వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామ విధుల గుండా ఊరేగింపు నిర్వహించి సమీప గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.1
- సింగరేణిలో మెటీరియల్ కొరతతో కార్మికుల భద్రతను పణంగా పెట్టొద్దు., * కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జి.ఎం. కార్యాలయాలను ముట్టడిస్తాం.. ఏఐటీయూసీ సింగరేణిలో కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, వారికి అవసరమైన కీలక మెటీరియల్స్‌ను సకాలంలో అందించడంలో యాజమాన్యం విఫలమవుతోందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే-1 ఇంక్లైన్, జీడీకే-2వ ఇంక్లైన్ మరియు జీడీకే-11వ ఇంక్లైన్ లలో జరిగిన వినతి పత్రాల కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో మెటీరియల్ కొరత పేరుతో కార్మికుల భద్రతతో చెలగాటమాడితే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. గనుల్లో పని చేయడానికి అవసరమైన ప్రాథమిక మెటీరియల్స్ కూడా సకాలంలో అందకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. డ్రిల్ రాడ్లు, డ్రిల్ బిట్లు గత కొన్ని నెలలుగా సకాలంలో అందకపోవడంతో గనుల్లో ఉత్పత్తి పనులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో రీకండిషన్ డ్రిల్ బిట్లను ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. సపోర్ట్ మెన్‌కు అత్యవసరంగా అవసరమైన రెజిన్ క్యాప్సిల్స్ ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రూఫ్ బోల్టింగ్‌కు అవసరమైన రెజిన్ క్యాప్సిల్స్ కొరత ఏర్పడితే గని భద్రతా చర్యలపై ప్రత్యక్ష ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. లైన్‌మెన్‌కు అవసరమైన కీళ్లు తదితర సామగ్రిని వెంటనే సరఫరా చేయాలని, ట్రాక్ లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగితే టబ్బులు పట్టాలు తప్పడం, కిందపడటం వంటి ప్రమాదాలకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్మికులకు జూన్, జూలై నెలల్లో అందాల్సిన సేఫ్టీ షూస్ సెప్టెంబర్ వచ్చినా ఇంకా అందకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని యాజమాన్యంపై మండిపడ్డారు. గ్లౌజెస్ నుంచి ఎస్.డి.ఎల్ ఆయిల్ వరకు అన్నింటిలో కొరతేనా? అని ప్రశ్నించారు. కార్మికులకు అవసరమైన నాణ్యమైన గ్లౌజెస్, ఎస్.డి.ఎల్ లకు అవసరమైన నాణ్యమైన ఆయిల్, గిరిమీట్లు తదితర మెటీరియల్స్‌ను, అలాగే నూతన రంగుతో కూడిన ఒకే రకం యూనిఫామ్‌ను అన్ని గనుల్లో వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. “ఉత్పత్తి లక్ష్యాలు గుర్తుంటే, కార్మికుల భద్రత ఎందుకు గుర్తుండదు? కార్మికుల నుంచి పని ఆశిస్తే.. పని చేయడానికి అవసరమైన మెటీరియల్స్ ఎందుకు ఇవ్వరు?” అని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కార్మికుల ప్రాణాలు, ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఏఐటీయూసీ సహించబోదని, ఆర్జీ-1 ఏరియాలోని అన్ని గనుల్లో కార్మికులకు అవసరమైన డ్రిల్ రాడ్లు, డ్రిల్ బిట్లు, రెజిన్ క్యాప్సిల్స్, సేఫ్టీ షూస్, గ్లౌజెస్, ఎస్.డి.ఎల్ ఆయిల్, గిరిమీట్లు, ట్రాక్ మెటీరియల్స్, యూనిఫామ్ తదితర అవసరమైన సామగ్రిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ కార్యాలయాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కార్మికుల హక్కులు, భద్రత, గౌరవప్రదమైన పని పరిస్థితుల విషయంలో ఏఐటీయూసీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో పై సమస్యల సాధన కోసం అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆఫీస్ బేరర్స్ *సంకె అశోక్, మాదన మహేష్, బోగ సతీష్ బాబు, ఎస్. వెంకట్ రెడ్డి, గండి ప్రసాద్, సుధాకర్*, అన్ని గనుల పిట్ సెక్రటరీలు *మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, నాయిని శంకర్, బలుసు రవి, బండి మల్లేష్, దాసరి శ్రీనివాస్*, నాయకులు *గొడిశెల నరేశ్, పి. రవి, సాన జలపతి, చంద తిరుపతి, బి. సమ్మయ్య*, మైన్స్, సేఫ్టీ కమిటీ సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ప్రమాదంలో మరో చిన్నారి మృతి బ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ప్రమాదంలో మరో చిన్నారి మృతి దీంతో రెండుకు చేరిన మృతుల సంఖ్య చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో ప్రమాదం ఆందోళనకరంగా మరో 23 మంది చిన్నారుల పరిస్థితి1