Shuru
Apke Nagar Ki App…
బిక్కనూర్: 'కెమికల్ పరిశ్రమ నిర్మాణ పనులు నిలిపివేయాలి, ఎమ్మార్వో కు వినతి పత్రం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల పరిధిలో నిర్మిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీ పనులను తక్షణమే నిలిపివేయాలని పెద్ద మల్లారెడ్డి గ్రామ సర్పంచ్ కోడూరి సాయ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన తహసీల్దార్ సునీతను కలిసి వినతిపత్రం అందజేశారు. కెమికల్ పరిశ్రమ వల్ల గ్రామానికి, చుట్టుపక్కల పొలాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి నిర్మాణ పనులను అడ్డుకోవాలని కోరారు.
Narmala Swapna
బిక్కనూర్: 'కెమికల్ పరిశ్రమ నిర్మాణ పనులు నిలిపివేయాలి, ఎమ్మార్వో కు వినతి పత్రం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల పరిధిలో నిర్మిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీ పనులను తక్షణమే నిలిపివేయాలని పెద్ద మల్లారెడ్డి గ్రామ సర్పంచ్ కోడూరి సాయ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన తహసీల్దార్ సునీతను కలిసి వినతిపత్రం అందజేశారు. కెమికల్ పరిశ్రమ వల్ల గ్రామానికి, చుట్టుపక్కల పొలాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి నిర్మాణ పనులను అడ్డుకోవాలని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు.1
- కన్నుల పండుగగా రథోత్సవం వైభవంగా నిర్వహణ ఏడుపాయల వన దుర్గ మాత జాతర మహోత్సవ చివరి రోజైన రథోత్సవం భక్తుల సందడి మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఆలయ దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. ప్రత్యేక పూజలు, హారతులు, వేదమంత్రోచ్చారణల నడుమ ఉత్సవం ఘనంగా సాగింది. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవుని ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి, ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి, పూలతో స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో రథాన్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో జాగ్రత్తగా ఉండండి హిందువులారా1
- నిర్మల్ లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదేవ్ కేక్ కట్టు చేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు ఫలాలు పంపిణీ చేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ టీచర్ గా మారారు. పిల్లల ప్రతిభకు పరీక్ష పెట్టి పాఠాలు చెప్పారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. సీబీఎస్ఈ విధానంలో పదో తరగతి మ్యాథ్స్ పరీక్షలు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా లైబ్రరీ పరిశీలించారు. స్కిల్ ఇండియా లో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద విద్యాలయంలో రిటైల్ ల్యాబ్ లో విద్యార్థులు శిక్షణ పొందుతుండగా, ఇంచార్జి కలెక్టర్ వారితో మాట్లాడారు. వ్యాపారంలో మెలకువలు, వివిధ అంశాల్లో విద్యార్థులు పొందిన అనుభవాన్ని వివరించారు. అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులకు సంబందించిన సెలబస్ పూర్తి అయిందా అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల పాఠాలు మరోసారి చదివి వార్షిక పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు. ఈ తరగతిలోని అంశాలు పై తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటాయని తెలిపారు. ఇప్పుడే ప్రతి సబ్జెక్టు, పాఠాలపై మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో చదివేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ వృత్తులు, ఆర్మీ, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఇంచార్జి కలెక్టర్ ఆకాంక్షించారు.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ రైతు వేదికలో ఫార్మర్ ఐడీ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. అదే విధంగా పంట సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు వ్యవసాయ విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్పై రైతులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోనాపూర్ సర్పంచ్ కిష్టవ్వ దిల్ రాజ్, పులిగుండు సర్పంచ్ రామారావు, రైతులు పాల్గొన్నారు.1