logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ ఎన్నికలు ఏకగ్రీవం. అధ్యక్షుడిగా భాషవేణి మల్లేశం యాదవ్ ఏకగ్రీవ ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి జలాలొద్దీన్ అక్బర్ కరీంనగర్: జిల్లాల పునర్విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్ ఎన్నికలు పూర్తయిన తొలి జిల్లాగా కరీంనగర్ నిలిచిందని, జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్‌కు అధ్యక్ష, ఉపాధ్యక్ష మరియు, డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల అధికారి జలాలొద్దీన్ అక్బర్ మాట్లాడుతూ, జిల్లా యూనియన్ అధ్యక్షుడిగా భాషవేణి మల్లేశం యాదవ్, ఉపాధ్యక్షుడిగా చిగుర్ల శ్రీనివాస్ కురుమ ఏకగ్రీవంగా ఎన్నికైనారని, డైరెక్టర్లుగా అగిత రవీందర్, కాల్వ సురేష్, చౌటపల్లి రంజిత్, జిల్లెల్ల పరశురాములు, దాడి ఆంజనేయులు, దాడి సదయ్య, దానే ఒదేలు, బండి మల్లయ్య, ముక్కేర సదానందం, సందవేణి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 14 సంవత్సరాల క్రితం గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించగా, ప్రస్తుతం జిల్లాల పునర్విభజన అనంతరం కరీంనగర్ జిల్లాలో, జిల్లా యూనియన్ ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. జూలై 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, జూలై 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగిందన్నారు. మొత్తం 21 నామినేషన్లు దాఖలు కాగా, 9 మంది నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మిగిలిన 12 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వివరించారు. అనంతరం వారితో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా యూనియన్ అధ్యక్షుడు భాషవేణి మల్లేశం యాదవ్ మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించిన జిల్లా ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల గ్రామ అధ్యక్షులకు, యాదవ, కురుమ సోదరులకు, కుల పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గొర్రెల పెంపకందారుల సంక్షేమం కోసం అందరి సహకారంతో కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వంశీకృష్ణ, సీనియర్ ఇన్‌స్పెక్టర్ సర్దార్ ప్రీత్‌పాల్ సింగ్ సహకార సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పశువైద్య & పశుసంవర్ధక అధికారి లింగా రెడ్డిని నూతన కమిటీ సభ్యులు, మరియు ఎన్నికల అధికారి మర్యాద పూర్వకంగా కలిసారు.

3 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
3 hrs ago
b889c894-bc7c-4c3a-b3da-cf62e63b8882

జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ ఎన్నికలు ఏకగ్రీవం. అధ్యక్షుడిగా భాషవేణి మల్లేశం యాదవ్ ఏకగ్రీవ ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి జలాలొద్దీన్ అక్బర్ కరీంనగర్: జిల్లాల పునర్విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్ ఎన్నికలు పూర్తయిన తొలి జిల్లాగా కరీంనగర్ నిలిచిందని, జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్‌కు అధ్యక్ష, ఉపాధ్యక్ష మరియు, డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల అధికారి జలాలొద్దీన్ అక్బర్ మాట్లాడుతూ, జిల్లా యూనియన్ అధ్యక్షుడిగా

5b5225a8-e730-4027-bfb5-9a317a98e292

భాషవేణి మల్లేశం యాదవ్, ఉపాధ్యక్షుడిగా చిగుర్ల శ్రీనివాస్ కురుమ ఏకగ్రీవంగా ఎన్నికైనారని, డైరెక్టర్లుగా అగిత రవీందర్, కాల్వ సురేష్, చౌటపల్లి రంజిత్, జిల్లెల్ల పరశురాములు, దాడి ఆంజనేయులు, దాడి సదయ్య, దానే ఒదేలు, బండి మల్లయ్య, ముక్కేర సదానందం, సందవేణి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 14 సంవత్సరాల క్రితం గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించగా, ప్రస్తుతం జిల్లాల పునర్విభజన అనంతరం కరీంనగర్ జిల్లాలో, జిల్లా యూనియన్ ఎన్నికలు

8f1d4d34-f98a-445e-a86f-2fbf774e5f1e

నిర్వహించినట్లు తెలిపారు. జూలై 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, జూలై 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగిందన్నారు. మొత్తం 21 నామినేషన్లు దాఖలు కాగా, 9 మంది నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మిగిలిన 12 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వివరించారు. అనంతరం వారితో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా యూనియన్ అధ్యక్షుడు భాషవేణి మల్లేశం యాదవ్ మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించిన జిల్లా ప్రాథమిక గొర్రెల పెంపకందారుల

939e4e3b-2ee1-41ae-8d7c-315c3b4a9a79

సహకార సంఘాల గ్రామ అధ్యక్షులకు, యాదవ, కురుమ సోదరులకు, కుల పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గొర్రెల పెంపకందారుల సంక్షేమం కోసం అందరి సహకారంతో కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వంశీకృష్ణ, సీనియర్ ఇన్‌స్పెక్టర్ సర్దార్ ప్రీత్‌పాల్ సింగ్ సహకార సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పశువైద్య & పశుసంవర్ధక అధికారి లింగా రెడ్డిని నూతన కమిటీ సభ్యులు, మరియు ఎన్నికల అధికారి మర్యాద పూర్వకంగా కలిసారు.

More news from Telangana and nearby areas
  • సివిల్ ఇంజనీరింగ్ రంగానికి భవిష్యత్తులో భారీ డిమాండ్: మాజీ మంత్రి గంగుల కమలాకర్ అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలు.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, నాణ్యతతో కూడిన తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా (ACCEI) కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'బిల్డ్ ఎక్స్‌పో' 6వ ఎడిషన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీర్లకు అపారమైన డిమాండ్ ఉంటుందని, విదేశాల్లో సివిల్ ఇంజనీర్ల లభ్యత కూడా కష్టంగా మారుతోందని తెలిపారు. హైదరాబాద్‌కు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, నగరాల సర్వతోముఖాభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కరీంనగర్ నగరం ఇప్పటికే స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంందని కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, త్వరలో మానేరు రివర్ ఫ్రంట్ కూడా అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ​ప్రస్తుతం నిర్మాణ రంగంలో రాపిడ్ ఫోర్స్ తరహాలో విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తాను కూడా ఒక సివిల్ ఇంజనీర్‌నేనని గుర్తుచేసుకుంటూ.. కరీంనగర్‌లో 'శ్వేతా హోటల్' నిర్మించే సమయంలో నగరంలో హోటల్ నడవదని ఎంతోమంది అన్నారని, కానీ నేడు ఆ హోటల్‌లో రూములు దొరకని పరిస్థితి ఉందంటూ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, తుల బాలయ్య, అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
    1
    సివిల్ ఇంజనీరింగ్ రంగానికి భవిష్యత్తులో భారీ డిమాండ్: మాజీ మంత్రి గంగుల కమలాకర్
అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలు..
అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, నాణ్యతతో కూడిన తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా (ACCEI) కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'బిల్డ్ ఎక్స్‌పో' 6వ ఎడిషన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీర్లకు అపారమైన డిమాండ్ ఉంటుందని, విదేశాల్లో సివిల్ ఇంజనీర్ల లభ్యత కూడా కష్టంగా మారుతోందని తెలిపారు. హైదరాబాద్‌కు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, నగరాల సర్వతోముఖాభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కరీంనగర్ నగరం ఇప్పటికే స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంందని కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, త్వరలో మానేరు రివర్ ఫ్రంట్ కూడా అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.
​ప్రస్తుతం నిర్మాణ రంగంలో రాపిడ్ ఫోర్స్ తరహాలో విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తాను కూడా ఒక సివిల్ ఇంజనీర్‌నేనని గుర్తుచేసుకుంటూ.. కరీంనగర్‌లో 'శ్వేతా హోటల్' నిర్మించే సమయంలో నగరంలో హోటల్ నడవదని ఎంతోమంది అన్నారని, కానీ నేడు ఆ హోటల్‌లో రూములు దొరకని పరిస్థితి ఉందంటూ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.
​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, తుల బాలయ్య, అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు. డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు సాంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు.
 
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని  వాణి నికేతన్  హై స్కూల్లో  పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన  విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు.
డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో  నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు  సాంప్రదాయాలు, ఆచారాలపై  అవగాహన  కల్పించాలని  లక్ష్యంతో  కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ,  స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    6 hrs ago
  • హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
    2
    హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.
    1
    జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు
బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు
జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని  ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎ.రాజేందర్ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం అవడం ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ MH-34 M 9927 గల టాటా సుమో గోల్డ్ వాహనం చెన్నూర్ వైపు నుంచి వస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించారు.ఈ క్రమంలో భీమారం మండలం పోలంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై బస్‌స్టాప్ సమీపంలో వాహనాన్ని రోడ్డుపక్కన వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.అనంతరం పంచుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభించింది. అందులో ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ 120 సీసాలు,రాయల్ స్టాగ్ విస్కీ 108 సీసాలు, హేవర్డ్స్ 5000 బీర్ 216 టిన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం మొత్తం విలువ రూ.2,15,100గా నిర్ధారించారు. అనంతరం మద్యం, టాటా సుమో వాహనాన్ని భీమారం పోలీస్ స్టేషన్‌కు తరలించి,తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 34(ఎ) కింద సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పరారీలో ఉన్న వాహన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎ.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
    1
    వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత

రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ

వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత
రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎ.రాజేందర్ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం అవడం ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ MH-34 M 9927 గల టాటా సుమో గోల్డ్ వాహనం చెన్నూర్ వైపు నుంచి వస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించారు.ఈ క్రమంలో భీమారం మండలం పోలంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై బస్‌స్టాప్ సమీపంలో వాహనాన్ని రోడ్డుపక్కన వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.అనంతరం పంచుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభించింది. అందులో ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ 120 సీసాలు,రాయల్ స్టాగ్ విస్కీ 108 సీసాలు, హేవర్డ్స్ 5000 బీర్ 216 టిన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం మొత్తం విలువ రూ.2,15,100గా నిర్ధారించారు. అనంతరం మద్యం, టాటా సుమో వాహనాన్ని భీమారం పోలీస్ స్టేషన్‌కు తరలించి,తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 34(ఎ) కింద సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పరారీలో ఉన్న వాహన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎ.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.
    1
    గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ నిందితుడు ఎంఏ హర్షద్ అరెస్ట్...ఆలయంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా ఛేజింగ్ చేసి పట్టుకున్న రామడుగు పోలీసులు కరీంనగర్ జిల్లాలో పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డ నిందితుడిని రామడుగు పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి మూడు వెండి కిరీటాలు, 4 వెండి జంజీరాలు, 1.5 గ్రాముల బంగారు పుస్తెలు, 9500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ రూరల్ ఏ సి పి కార్యాలయంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ ఏసీపీ విజయ్ కుమార్ సమక్షంలో అరెస్టు అయిన నిందితుడిని చూపించి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా పోలాస కు చెందిన ఎం.ఏ. అర్షద్ ఖాన్ కరీంనగర్లో ఉంటూ సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పగలంతా కూలి పని చేస్తూ రాత్రిపూట ఆలయాలు, తాళం వేసిన ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. వెదిర గ్రామంలోని ఆలయంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా పోలీసులు చేజింగ్ చేసి పట్టుకున్నారని తెలిపారు. ఏడాది కాలంలో నిందితుడు చొప్పదండి రామడుగు గంగాధర, తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాల్లో 12 ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు చెప్పారు. చోరీ చేసిన సొత్తును కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో విక్రయించేవాడని కరీంనగర్ లో మల్లికార్జున జువెలరీ షాపులో విక్రయించిన వెండి కిరీటం, వెండి చంద్రవంక, 2.5 గ్రాముల జత బంగారు పుస్తెలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన షాపు యాజమానులపై సైతం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ డిసిపి చెప్పారు. చాకచక్యంగా వరుస చోరీలకు పాల్పడే నిందితుడిని పట్టుకున్న రామడుగు పోలీసులను అభినందిస్తూ క్యాష్ అవార్డు అందజేశారు.
    4
    కరీంనగర్ జిల్లాలో ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ నిందితుడు ఎంఏ హర్షద్ అరెస్ట్...ఆలయంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా ఛేజింగ్ చేసి పట్టుకున్న రామడుగు పోలీసులు
కరీంనగర్ జిల్లాలో పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డ నిందితుడిని రామడుగు పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి మూడు వెండి కిరీటాలు, 4 వెండి జంజీరాలు, 1.5 గ్రాముల బంగారు పుస్తెలు, 9500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ రూరల్ ఏ సి పి కార్యాలయంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ ఏసీపీ విజయ్ కుమార్ సమక్షంలో అరెస్టు అయిన నిందితుడిని చూపించి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా పోలాస కు చెందిన ఎం.ఏ. అర్షద్ ఖాన్ కరీంనగర్లో ఉంటూ సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పగలంతా కూలి పని చేస్తూ రాత్రిపూట ఆలయాలు, తాళం వేసిన ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. వెదిర గ్రామంలోని ఆలయంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా పోలీసులు చేజింగ్ చేసి పట్టుకున్నారని తెలిపారు. ఏడాది కాలంలో నిందితుడు చొప్పదండి రామడుగు గంగాధర, తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాల్లో 12 ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు చెప్పారు. చోరీ చేసిన సొత్తును కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో విక్రయించేవాడని కరీంనగర్ లో మల్లికార్జున జువెలరీ షాపులో విక్రయించిన వెండి కిరీటం, వెండి చంద్రవంక, 2.5 గ్రాముల జత బంగారు పుస్తెలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన షాపు యాజమానులపై సైతం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ డిసిపి చెప్పారు. చాకచక్యంగా వరుస చోరీలకు పాల్పడే నిందితుడిని పట్టుకున్న రామడుగు పోలీసులను అభినందిస్తూ క్యాష్ అవార్డు అందజేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.