logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలు, ఏటీసీ కళాశాలల స్థల సమీకరణ, అనుమతుల పురోగతిపై సమీక్ష – జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లాలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలు మరియు ఏటీసీ కళాశాలల నిర్మాణానికి సంబంధించి స్థల సమీకరణ, అవసరమైన అనుమతుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులతో ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ విద్యాసంస్థల ఏర్పాటుకు సంబంధించిన స్థల సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. విద్యా రంగ అభివృద్ధికి ఈ సంస్థలు ఎంతో కీలకమని అన్నారు . అనుమతుల జారీ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు లేకుండా శాఖల మధ్య సమన్వయం పెంపొందించాలని, ప్రతి దశలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కరించి పనులను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. సంబంధిత భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేకుండా సమగ్ర పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు . ఈ సమావేశంలో ఇల్లందు తాసిల్దార్ రవికుమార్, అశ్వరావుపేట తాసిల్దార్ రామకృష్ణ , ఈ సెక్షన్ సూపర్డెంట్ స్వర్ణలత, రామవరం ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

19 hrs ago
user_VANAMA SRINIVAS RAO
VANAMA SRINIVAS RAO
జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
19 hrs ago
44ea3312-16ff-448e-813b-94afc3612caf

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలు, ఏటీసీ కళాశాలల స్థల సమీకరణ, అనుమతుల పురోగతిపై సమీక్ష – జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లాలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలు మరియు ఏటీసీ కళాశాలల నిర్మాణానికి సంబంధించి స్థల సమీకరణ, అవసరమైన అనుమతుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల

aa3606dd-1f76-4921-916c-ddb98bf20f44

అధికారులతో ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ విద్యాసంస్థల ఏర్పాటుకు సంబంధించిన స్థల సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. విద్యా రంగ అభివృద్ధికి ఈ

24abe27c-657a-4a24-88b7-e454b6bcc161

సంస్థలు ఎంతో కీలకమని అన్నారు . అనుమతుల జారీ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు లేకుండా శాఖల మధ్య సమన్వయం పెంపొందించాలని, ప్రతి దశలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కరించి పనులను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. సంబంధిత భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేకుండా సమగ్ర

1978a4ca-5210-45d7-ae83-801d790d2172

పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు . ఈ సమావేశంలో ఇల్లందు తాసిల్దార్ రవికుమార్, అశ్వరావుపేట తాసిల్దార్ రామకృష్ణ , ఈ సెక్షన్ సూపర్డెంట్ స్వర్ణలత, రామవరం ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల వలన దేశంలో రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడటానికి వ్యవసాయాన్ని రక్షించడానికి ఉద్యమాలను రూపకల్పన చేయటానికి కొత్తగూడెం కేంద్రంలో ఏప్రిల్ 23 24 25 తేదీలలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మంచిగంటి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడుతూ దేశంలో 50 శాతం మందికి పైగా వ్యవసాయం పైన ఆధారపడుతున్నారని అటువంటి ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేసిందని ఆయన అన్నారు ఇటీవల బడ్జెట్ లో 53 లక్షల కోట్లతో ప్రవేశపెడితే 50 శాతం మంది గా ఉన్న వ్యవసాయానికి కేవలం లక్ష అరవై వేల కోట్లు కేటాయించడం వ్యవసాయాన్ని దెబ్బ తీయడం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయటం కోసం విద్యుత్ సవర్ణ చట్టం ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడం యూరియాని రైతులుకి అందుబాటులో లేకుండా చేయడం రైతులు బీమా సౌకర్యం లేకుండా చేయటం వంటివి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దానివల్ల రైతాంగం దివాలా దేశ పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులకి అర్థం కాని అందుబాటులో లేని యాప్లు తీసుకొచ్చి వాటి ద్వారా ఎరువులు కి కొనుగోలు అమ్మకాలు జరిగేటట్లు తీసుకురావడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ నామాకరణ పేరుతో మా ప్రభుత్వం పని చేస్తుందని చెప్తున్నప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం అరకొరగా కేటాయింపులు జరపటం రైతులు మోసం చేయడం తప్ప మరొకటి కాదని ఆయన చెప్పారు సంవత్సరానికి రెండు విడతల్లో రైతు భరోసా ఆరు దఫాలుగా ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం రెండు దఫాలు ఇచ్చి చేతులు దొరుకుతుందని రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 50% మాత్రమే అమలు చేసి పూర్తిగా అమలు చేసిన అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం రైతాంగాన్ని దెబ్బతీయటం తప్ప ఇంకోటి కాదని ఆయన పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా సాగవుతున్న పామాయిల్ పంటకి తగ్గట్లు పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలని అందుకు అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ 30 టన్నుల నుంచి 60 టన్నుల సామర్థ్యానికి పెంచాలని అప్పారావుపేట ఫ్యాక్టరీ 60 టన్నుల నుంచి ఆధునిక టెక్నాలజీతో ఆధునికరించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక్కడ శుద్ధి చేసిన ముడి ఆయిల్ని సిద్దిపేటకు తీసుకుపోకుండా ఇక్కడే రిఫైనరీ సెంటర్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు పట్టా అక్కులేని వాడు సాగుదారులకి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు జిల్లాలో ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లా వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని అందుకు ఒకే దఫాలో నిర్మాణం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు లింకు కెనాల్సు బ్రాంచ్ కెనాల్సు, కొరకు పూసేకరణ చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఎదురవుతున్న సవాళ్లపైన మూడవ రాష్ట్ర మహాసభల్లో కూలంకషంగా చర్చించి రైతాంగ ఉద్యమాల్ని బలోపేతం చేయడానికి కార్యచరణ రూపొందించడానికి అందుకు కావలసిన తీర్మానాలు రూపకల్పనకు ఈ మహాసభలను వేదిక ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు అటువంటి ముఖ్యమైన మహాసభల జయప్రదానికి జిల్లాలో ఉన్న రైతాంగం సహకరించి జయప్రదం చేయాలని ఆయన రైతు సోదరులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జలసూత్రం శివరాం ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నవరపు కనకయ్య తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎలమంచి వంశీకృష్ణ అన్నవరపు సత్యనారాయణ రాష్ట్ర నాయకులు కున్సోత్ ధర్మ కొండ బోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
    1
    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల వలన దేశంలో రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడటానికి వ్యవసాయాన్ని రక్షించడానికి ఉద్యమాలను రూపకల్పన చేయటానికి కొత్తగూడెం కేంద్రంలో ఏప్రిల్ 23 24 25 తేదీలలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన పిలుపునిచ్చారు. 
గురువారం స్థానిక మంచిగంటి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడుతూ దేశంలో 50 శాతం మందికి పైగా వ్యవసాయం పైన ఆధారపడుతున్నారని అటువంటి ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేసిందని ఆయన అన్నారు ఇటీవల బడ్జెట్ లో 53 లక్షల కోట్లతో ప్రవేశపెడితే 50 శాతం మంది గా ఉన్న వ్యవసాయానికి కేవలం లక్ష అరవై వేల కోట్లు కేటాయించడం వ్యవసాయాన్ని దెబ్బ తీయడం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయటం కోసం విద్యుత్ సవర్ణ చట్టం ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడం యూరియాని రైతులుకి అందుబాటులో లేకుండా చేయడం రైతులు బీమా సౌకర్యం లేకుండా చేయటం వంటివి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దానివల్ల రైతాంగం దివాలా దేశ పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులకి అర్థం కాని అందుబాటులో లేని యాప్లు తీసుకొచ్చి వాటి ద్వారా ఎరువులు కి కొనుగోలు అమ్మకాలు జరిగేటట్లు తీసుకురావడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ నామాకరణ పేరుతో మా ప్రభుత్వం పని చేస్తుందని చెప్తున్నప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం అరకొరగా కేటాయింపులు జరపటం రైతులు మోసం చేయడం తప్ప మరొకటి కాదని ఆయన చెప్పారు సంవత్సరానికి రెండు విడతల్లో రైతు భరోసా ఆరు దఫాలుగా ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం రెండు దఫాలు ఇచ్చి చేతులు దొరుకుతుందని రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 50% మాత్రమే అమలు చేసి పూర్తిగా అమలు చేసిన అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం రైతాంగాన్ని దెబ్బతీయటం తప్ప ఇంకోటి కాదని ఆయన పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా సాగవుతున్న పామాయిల్ పంటకి తగ్గట్లు పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలని అందుకు అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ 30 టన్నుల నుంచి 60 టన్నుల సామర్థ్యానికి పెంచాలని అప్పారావుపేట ఫ్యాక్టరీ 60 టన్నుల నుంచి ఆధునిక టెక్నాలజీతో ఆధునికరించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక్కడ శుద్ధి చేసిన ముడి ఆయిల్ని సిద్దిపేటకు తీసుకుపోకుండా ఇక్కడే రిఫైనరీ సెంటర్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు పట్టా అక్కులేని వాడు సాగుదారులకి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు జిల్లాలో ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లా వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని అందుకు ఒకే దఫాలో నిర్మాణం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు లింకు కెనాల్సు బ్రాంచ్ కెనాల్సు, కొరకు పూసేకరణ చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన తెలిపారు 
తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఎదురవుతున్న సవాళ్లపైన మూడవ రాష్ట్ర మహాసభల్లో కూలంకషంగా చర్చించి రైతాంగ ఉద్యమాల్ని బలోపేతం చేయడానికి కార్యచరణ రూపొందించడానికి అందుకు కావలసిన తీర్మానాలు రూపకల్పనకు ఈ మహాసభలను వేదిక ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు అటువంటి ముఖ్యమైన మహాసభల జయప్రదానికి జిల్లాలో ఉన్న రైతాంగం సహకరించి జయప్రదం చేయాలని ఆయన రైతు సోదరులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జలసూత్రం శివరాం ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నవరపు కనకయ్య తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎలమంచి వంశీకృష్ణ అన్నవరపు సత్యనారాయణ రాష్ట్ర నాయకులు కున్సోత్ ధర్మ కొండ బోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    15 min ago
  • Post by V Ramarao
    4
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వేన్నారం గ్రామ పరిధిలోని రామకుంట తండాలో సంచలన దొంగతనం చోటుచేసుకుంది. తేజావత్ హర్యా ఇంటిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు, బీరువాలు పగులగొట్టి సుమారు రూ.2 లక్షల 20 వేల నగదును అపహరించారు. ఈ ఘటన తండా ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. బుధవారం రోజు హర్యా కుటుంబ సభ్యులు తమ కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం నిమిత్తం సమీప గ్రామానికి వెళ్లారు. ఇంటిని ఖాళీగా ఉంచిన అవకాశాన్ని దొంగలు వినియోగించుకుని రాత్రి సమయంలో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు తాళాలు పగులగొట్టబడి ఉండటం, బీరువాలు చెల్లాచెదురుగా ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ వంశీధర్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరిస్తూ, క్లూస్ టీం సహాయంతో నిందితుల వేలిముద్రలను సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై విచారణ కొనసాగుతోంది. ఈ దొంగతనం ఘటనతో రామకుంట తండా సహా పరిసర గ్రామాల్లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
    1
    మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వేన్నారం గ్రామ పరిధిలోని రామకుంట తండాలో సంచలన దొంగతనం చోటుచేసుకుంది. తేజావత్ హర్యా ఇంటిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు, బీరువాలు పగులగొట్టి సుమారు రూ.2 లక్షల 20 వేల నగదును అపహరించారు. ఈ ఘటన తండా ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది.
బుధవారం రోజు హర్యా కుటుంబ సభ్యులు తమ కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం నిమిత్తం సమీప గ్రామానికి వెళ్లారు. ఇంటిని ఖాళీగా ఉంచిన అవకాశాన్ని దొంగలు వినియోగించుకుని రాత్రి సమయంలో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు తాళాలు పగులగొట్టబడి ఉండటం, బీరువాలు చెల్లాచెదురుగా ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ వంశీధర్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరిస్తూ, క్లూస్ టీం సహాయంతో నిందితుల వేలిముద్రలను సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై విచారణ కొనసాగుతోంది.
ఈ దొంగతనం ఘటనతో రామకుంట తండా సహా పరిసర గ్రామాల్లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట 2వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ కాంపెల్లి వీణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రజలు వివరించారు. అనంతరం మాట్లాడిన కౌన్సిలర్ కాంపెల్లి వీణ, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ వార్డు సభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
    2
    వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట 2వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ కాంపెల్లి వీణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రజలు వివరించారు.
అనంతరం మాట్లాడిన కౌన్సిలర్ కాంపెల్లి వీణ, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ వార్డు సభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Motam Rajesh
    2
    Post by Motam Rajesh
    user_Motam Rajesh
    Motam Rajesh
    Grain Importer వెంకటాపురం, ములుగు, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Sode Prasad
    1
    Post by Sode Prasad
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • వరంగల్ జిల్లా:మొక్కజొన్న రైతులను దళారులు దోచుకుంటున్నారని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్నలను దళారులు మద్దతు ధర కంటే క్వింటాకు రూ.600 నుంచి రూ.700 తక్కువగా కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. పర్వతగిరి మండలం పెద్ద తండాలో రైతుల కల్లాలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన, మార్కెట్లో దళారుల ఆధిపత్యం కొనసాగుతోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే మార్క్‌పెడ్, నాఫెడ్ వంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    వరంగల్ జిల్లా:మొక్కజొన్న రైతులను దళారులు దోచుకుంటున్నారని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్నలను దళారులు మద్దతు ధర కంటే క్వింటాకు రూ.600 నుంచి రూ.700 తక్కువగా కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. పర్వతగిరి మండలం పెద్ద తండాలో రైతుల కల్లాలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన, మార్కెట్లో దళారుల ఆధిపత్యం కొనసాగుతోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే మార్క్‌పెడ్, నాఫెడ్ వంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    53 min ago
  • మ99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలలో భాగంగా అనంతరం గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు, అనంతరం గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు చాలా మంది చనిపోవటం కూడా జరిగిందని గ్రామస్తులు గ్రామసభలో ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగ ఏమిటి ఈ సమస్య అని జూలూరుపాడు వైద్యాధికారిని అడగగా అనంతరం హెల్త్ క్యాంపు పెట్టి అన్ని టెస్టులు చేసాము అంత పాజిటివ్ గానే రిపోట్స్ వచ్చాయని అన్నారు. చుట్టుపక్కల మండలలల్లో ఎక్కడ లేని విదంగా ముఖ్యంగా జూలూరుపాడు లో ఆర్ఎంపీలు విచ్చలవిడిగా యాంటీబయటీక్ ,స్టీరైడ్స్ ఎక్కువుగా వాడటం వల్లన అనంతరంలో ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయని ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నారని ఎమ్మెల్యే రామదాసు నాయక్ కు తెలిపారు, ఫోన్ లో స్వయంగా ఎమ్మెల్యే డి ఎం హెచ్ ఓ తో మాట్లాడిన్నారు సమస్య వివరించారు అదేవిధంగా స్పెషల్ డాక్టర్లుతో అనంతరం గ్రామంలో హెల్త్ క్యాంపు పెట్టి సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు...
    2
    మ99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలలో భాగంగా అనంతరం గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు, అనంతరం గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు చాలా మంది చనిపోవటం కూడా జరిగిందని గ్రామస్తులు గ్రామసభలో ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగ ఏమిటి ఈ సమస్య అని జూలూరుపాడు వైద్యాధికారిని అడగగా అనంతరం హెల్త్ క్యాంపు పెట్టి అన్ని టెస్టులు చేసాము అంత పాజిటివ్ గానే రిపోట్స్ వచ్చాయని అన్నారు. చుట్టుపక్కల మండలలల్లో ఎక్కడ లేని విదంగా ముఖ్యంగా జూలూరుపాడు లో ఆర్ఎంపీలు విచ్చలవిడిగా యాంటీబయటీక్ ,స్టీరైడ్స్ ఎక్కువుగా వాడటం వల్లన అనంతరంలో ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయని ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నారని ఎమ్మెల్యే రామదాసు నాయక్ కు తెలిపారు, ఫోన్ లో స్వయంగా ఎమ్మెల్యే డి ఎం హెచ్ ఓ తో మాట్లాడిన్నారు సమస్య వివరించారు అదేవిధంగా స్పెషల్ డాక్టర్లుతో అనంతరం గ్రామంలో హెల్త్ క్యాంపు పెట్టి సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు...
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.