. **ఏటి పల్లి ఆదివాసి ప్రజల గతి ఏంటో తేల్చండి* **నాన్ ట్రైబల్స్ కి కొమ్ము కాస్తున్న ఎమ్మార్వో పై చర్యలు తీసుకోవాలి* బుధవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ను గంగవరం మండలం చిన్న ఎట్టిపల్లి గ్రామం ప్రజలు కలిసి పలు సమస్యలు తెలియజేయడం జరిగింది. ప్రజలు తెలిపిన సమస్యలు గురించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగవరం మండలం చిన్న ఏటి పల్లి గ్రామంలో ఆదివాసుల భూములను నాన్ ట్రైబల్స్ కబ్జా చేసుకుని పంట పల సాయాలను దండుకుంటున్నారని, పూర్వం నుండి పొడు కోట్టుకున్న ఆదివాసులు తమ భూముల మీదకు వెళితే స్థానికంగా ఉన్న తాసిల్దార్ నాన్ ట్రైబల్స్ కి వత్తాసు పలుకుతూ ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. రోడ్డు వైండింగ్లో ఇల్లు కోల్పోయిన ఆదివాసి ప్రజలకు గతంలో ఉన్న కలెక్టర్ వారు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఉన్నారని హామీ ప్రకారం వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆయన ప్రస్తుత జిల్లా కలెక్టర్ వారిని పత్రిక ముఖంగా కోరారు. 5 షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టాలకు వ్యతిరేకంగా ఏజెన్సీలో నాన్ ట్రైబల్ కి డి పట్టా జారీ చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టం అమల్లో ఉన్నప్పుడు ఏజెన్సీ భూములు నాన్ ట్రైబల్స్ కి ఎలా పట్టాలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన నాన్ ట్రైబల్స్ NGO లకు ఏజెన్సీలో నిర్వహించటానికి ప్రభుత్వ స్థలాలు కేటాయించడానికి స్థానిక రవిని అధికారులు ఎన్ఓసీలు జారీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి చర్యలు ఉంటే తక్షణ వెనక తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రభుత్వ భూమిలో ట్రైబల్స్ గుడిసెలు వేసుకుంటే గతంలో నాన్ ట్రైబల్స్ కాల్చివేశారని ఇది అత్యంత దారుణమైన విషయమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏటిపల్లి గ్రామ ఆదివాసులకు జరుగుతున్న అన్యాయంపై, మరియు గంగవరం ఎమ్మార్వో ఆదివాసులకు చేస్తున్న అన్యాయంపై జాతీయ షెడ్యూల్ తెగల కమీషన్ కి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఏటి పల్లి గ్రామంలో జరుగుతున్న భూదందాలపై గౌరవ కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి ఆదివాసుల భూములు ఆదివాసులకు పంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ ని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే దశలవారు ఉద్యమాన్ని కొనసాగిస్తామని. గ్రామ ప్రజలకు ఆదివాసి సంక్షేమ పరిషత్ అందగా ఉంటుందని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించి ఏజెన్సీ భూములు ఆక్రమిస్తున్న వారిని వదిలిపెట్టబోమని, అదేవిధంగా అక్రమ దారులకు కొమ్ముకాస్తున్న అధికారులకు తగిన విధంగా చర్యలు తీసుకునే వరకు పై అధికారులకు ఫిర్యాదులు చేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో పండ కుమారి, కారం రమణ, పండ వెంకటేష్, కొండ గంగన్న దొర తదితరులు పాల్గొన్నారు.

- Post by Sode Prasad1
- పోలవరం జిల్లా... పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో బెంబేలెత్తుతున్న గిరిజనులు దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రాంతంలో ఒక కొండ పై గేదెను చంపి నిన్నటి వరకు తిష్ట వేసిన పెద్దపులి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకోడానికి నానా తంటాలు పడుతున్న తిరుపతి,శ్రీశైలానికి చెందిన NSTR బృందం. పులిని మత్తు ఇంజక్షన్ గన్లతో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్ ఎస్ టి ఆర్ టీం సభ్యులు డ్రోన్ కెమెరా నిఘాతో పులి కదలికలను గుర్తించి దానిని సురక్షితంగా బంధించేందుకు రంపచోడవరం డిఎఫ్ఓ శివ కుమార్ పర్యవేక్షిస్తున్నారు...4
- కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు నూతన లేబర్ కోడ్ లను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లాక్ డే పిలుపులో భాగంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, టియుసిఐ నాయకులు పి సతీష్ లు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పరిపాలన సాగుతున్నదని విమర్శించారు.ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చివేసి పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా, విదేశీ బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడులను 2019 నుంచి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ పోరాడుతూ వస్తున్నప్పటికీ ఈ రోజు నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.ఈ నాలుగు లేబర్ కోడ్ లు వల్ల పని గంటలు పెరుగుతాయని,ఉద్యోగ భద్రత ఉండదని, వేతనాల చెల్లింపుకు గ్యారెంటీ ఉండదని అన్నారు. కార్మిక సంఘాలను, సమస్యల పరిష్కారానికి పోరాడే హక్కులను పరిమితం చేయడమే ఈ లేబర్ కోడల ఉద్దేశమని అన్నారు.ఈ నేపథ్యంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా పోరాడే తమ హక్కులను కాపాడుకోవడమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.1
- Post by Ramprasad islavath1
- Post by Shyam1
- జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీలక్ష్మి దీక్షను ప్రారంభించి సూపర్-6 డిమాండ్స్‌ను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ ఛైర్మన్ నియామకం, బకాయిల చెల్లింపు, ఓపీఎస్ అమలు వంటి అంశాలను ప్రస్తావించారు. అనంతరం నాయకులు జిల్లా రెవిన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.1
- కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్ర గాయాలు హనుమాన్ విజయోత్సవ దినం కోసం తరలివచ్చిన భక్తులు నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తుల ఆగ్రహం1
- Post by Ramprasad islavath1