ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలి (ఇన్చార్జి) అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పీడీ పురుషోత్తం ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని పురుషోత్తం అన్నారు అవగాహన సదస్సుకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సి ఎఫ్ సి ఎం .వేణు షరీఫ్ లు పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి అంగోత్ లక్ష్మణ్ ఆగస్టు 25: మహబూబాబాద్ జిల్లా రైతుల పంట రుణాలు విద్యా రుణాలు ఎస్‌హెచ్‌జీ రుణాలు ఇతర అంశాలపై కలెక్టర్ మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ఐసి హాలులో ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంక ర్లతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిం చారు ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు దానికి సంబంధించిన పురోగతి తదితర అంశాలను లీడ్ బ్యాంకు మేనేజర్ వివరించారు అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక వివిధ రంగాలకు సంబంధించి రూ 5816.90 కోట్ల లక్ష్యంగా నిర్ణయించగా జూన్ 2026 నాటికి ( 1586.20 కోట్లు) 27.27 శాతం వివిధ రుణసహాయం అందించినట్లు తెలిపారు రైతులకు రుణ లక్ష్యాలు చేరుకోవ డంలో మరింత పురోగతి సాధించాల్సి ఉంద న్నారు నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఆర్థికంగా తోడ్పాటునిచ్చే ప్రణాలికలు ఉంటే వాటిని పరిశీలించాలని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు బ్యాంకర్లు ఆర్ధిక తోడ్పాటు అందించాలన్నారు అదేవిధంగా ముద్ర లోన్లపై ప్రత్యెక దృష్టి సారించాలని ఆసక్తి ఉన్న వారికి సోలార్ ప్లాంట్ నిర్మాణా నికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొరకు సబ్సీడీ పొందే విధంగా లోన్లు అందించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ తదితర పథకాల ద్వారా ప్రయోజనం కోసం కృషి చేయాలని కోరారు అనంతరం గ్రామీణ ప్రాంతాలలో ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత ఆర్థిక అవగాహన పెంపొందించడం కోసం జిల్లాలో అవగాహన సదస్సుకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సి ఎఫ్ సి ఎం .వేణు షరీఫ్ లు పాల్గొన్నారు ఈ సమావేశంలో RBI LDO U. యశ్వంత్ సాయి యూబీఐ డీజీఎం జి.కమలాకర్ ఎల్‌డీఎం K .యాదగిరి డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు డీఈవో విజయ్ చంద్ర, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, DIC శ్రీమన్నారాయణ రెడ్డి జిల్లా పశువైద్యా ధికారి డాక్టర్ కిరణ్ కుమార్ డి.హెచ్.ఎస్.ఓ మరియన్న మెప్మా పీడీ విజయ DAO వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలి (ఇన్చార్జి) అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పీడీ పురుషోత్తం ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని పురుషోత్తం అన్నారు అవగాహన సదస్సుకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సి ఎఫ్ సి ఎం .వేణు షరీఫ్ లు పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి అంగోత్ లక్ష్మణ్ ఆగస్టు 25: మహబూబాబాద్ జిల్లా రైతుల పంట రుణాలు విద్యా రుణాలు ఎస్‌హెచ్‌జీ రుణాలు ఇతర అంశాలపై కలెక్టర్ మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ఐసి హాలులో ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంక ర్లతో
జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిం చారు ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు దానికి సంబంధించిన పురోగతి తదితర అంశాలను లీడ్ బ్యాంకు మేనేజర్ వివరించారు అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక వివిధ రంగాలకు సంబంధించి రూ 5816.90 కోట్ల లక్ష్యంగా నిర్ణయించగా జూన్ 2026 నాటికి ( 1586.20 కోట్లు) 27.27 శాతం వివిధ రుణసహాయం అందించినట్లు తెలిపారు రైతులకు రుణ లక్ష్యాలు చేరుకోవ డంలో మరింత పురోగతి సాధించాల్సి ఉంద న్నారు నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఆర్థికంగా తోడ్పాటునిచ్చే
ప్రణాలికలు ఉంటే వాటిని పరిశీలించాలని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు బ్యాంకర్లు ఆర్ధిక తోడ్పాటు అందించాలన్నారు అదేవిధంగా ముద్ర లోన్లపై ప్రత్యెక దృష్టి సారించాలని ఆసక్తి ఉన్న వారికి సోలార్ ప్లాంట్ నిర్మాణా నికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొరకు సబ్సీడీ పొందే విధంగా లోన్లు అందించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ తదితర పథకాల ద్వారా ప్రయోజనం కోసం కృషి చేయాలని కోరారు అనంతరం గ్రామీణ ప్రాంతాలలో ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత ఆర్థిక అవగాహన పెంపొందించడం కోసం జిల్లాలో అవగాహన సదస్సుకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సి ఎఫ్ సి ఎం .వేణు షరీఫ్ లు పాల్గొన్నారు ఈ సమావేశంలో RBI LDO U. యశ్వంత్ సాయి యూబీఐ డీజీఎం జి.కమలాకర్ ఎల్‌డీఎం K .యాదగిరి డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు డీఈవో విజయ్ చంద్ర, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, DIC శ్రీమన్నారాయణ రెడ్డి జిల్లా పశువైద్యా ధికారి డాక్టర్ కిరణ్ కుమార్ డి.హెచ్.ఎస్.ఓ మరియన్న మెప్మా పీడీ విజయ DAO వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.
- పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనెలు తయారీ. ముదిగొండ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పశువుల కొవ్వులతో వంట నూనె తయారు చేస్తున్న వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయిస్తుంటారు.మిగిలిన పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నూనె డబ్బాలను పశువుల మాంసాన్ని ఛీ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు గత కొంతకాలంగా పశువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్నంతో దుర్వాసన వస్తుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- సారు.. పింఛను ఇప్పించండి..?* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* *సెంటర్:- అశ్వారావుపేట* *స్లగ్: సారు.. పింఛను ఇప్పించండి..?* *యాంకర్ వాయిస్:* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. కూలి పనులు చేసుకుంటూ ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి.. తండ్రి చిన్నతనంలోనే మృతి.. సదరం సర్టిఫికెట్ లేక పదేళ్లుగా పింఛన్‌కు దూరం.. కనీసం ఉండేందుకు సురక్షితమైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. *వాయిస్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారిగూడెం గ్రామానికి చెందిన ఊకె నందిని.. వయసు 14 ఏళ్లు. పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో జన్మించింది. నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై.. నిత్యం ఇతరులపై ఆధారపడుతూ జీవనం సాగిస్తోంది. నందిని తండ్రి ఊకె బాలరాజు చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి ఊకె లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడమే కాకుండా.. అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన కుమార్తెకు సపర్యలు చేస్తోంది. *వాయిస్* నందినికి సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో ఇప్పటివరకు వికలాంగ పింఛన్ అందడం లేదు. నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా సదరం కోసం దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో దాదాపు పదేళ్లుగా ప్రభుత్వ పింఛన్‌కు ఈ కుటుంబం దూరమైంది.. కుమార్తె తోపాటు తల్లి లక్ష్మీ కూడా 10ఏళ్లుగా భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రభుత్వం నుండి అందుకోవాల్సిన వితంతు పింఛను పొందటం లేదంటే వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందే ఇట్టే తెలిసిపోతుంది..ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులంతా పింఛను ఇప్పిస్తాం అని చెప్పే మాటలు గుడ్డిగా నమ్మటమే తప్ప గొంతెత్తి నాకు పింఛను ఇప్పించని అడగలేని పేదరికం ఆమెది. ఇటీవల సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు నందినికి ప్రతినెలా అవసరమయ్యే మందుల ఖర్చు కూడా తల్లికి అదనపు భారంగా మారింది. *వాయిస్* కుటుంబం ఉంటున్న ఇల్లు పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటి స్లాబ్ నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నా.. ఇప్పటివరకు ఆ కుటుంబానికి సొంతంగా సురక్షితమైన ఇల్లు దక్కలేదు. *వాయిస్* నందిని పరిస్థితి కారణంగా ఆమెను 24 గంటలూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సిందే. దీంతో నాయనమ్మ లక్ష్మి కూడా చిన్నారికి తోడుగా నిరంతరం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కూలి పనులు.. మరోవైపు చిన్నారి సంరక్షణ.. మందుల ఖర్చులు.. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఇల్లు.. ఇలా అన్ని విధాలుగా ఈ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోంది. *వాయిస్ ఓవర్* నందిని పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే సదరం సర్టిఫికెట్, వికలాంగ పింఛన్ అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే సురక్షితమైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి.. వైద్యం, మందుల విషయంలోనూ సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఈ 14 ఏళ్ల చిన్నారి దీనస్థితిపై ప్రభుత్వ అధికారులు, ఐటీడీఏ పీఓ, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పందించి.. నందినికి అండగా నిలుస్తారా? పింఛన్, ఇల్లు, వైద్య సహాయం అందించి ఆ కుటుంబంలో వెలుగులు నింపుతారా? అనేది వేచి చూడాలి..1
- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- మహాదేవపూర్ బీఆర్‌ఎస్ మాజీ ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్ మృతి.. కన్నీటి వీడ్కోలు పలికిన నాయకులు, అభిమానులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మాజీ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు సల్మాన్ ఖాన్ మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, స్థానిక నాయకుల్లో విషాదం నెలకొంది. మంథని నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్ట మధుకర్ సల్మాన్ ఖాన్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. సల్మాన్ ఖాన్ మృతి పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటని పుట్ట మధుకర్ పేర్కొన్నారు. అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం పాదయాత్రకు భారీ సంఘీభావం | కారేపల్లిలో ప్రజా సంఘాల మద్దతు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్రకు కారేపల్లిలో అడుగడుగునా సంఘీభావం లభించింది. గాంధీ విగ్రహానికి పూలమాలవేసి పాదయాత్రను మొదలుపెట్టారు.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం చేపట్టిన ఈ పాదయాత్రకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. సీపీఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, మాస్‌లైన్, అంబేద్కర్ యువజన సంఘం, ఆటో యూనియన్ తదితర సంఘాల నాయకులు పాదయాత్రలో పాల్గొని జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అదిగో ఇస్తాం.. ఇదిగో చేస్తాం అంటూ హామీలు ఇవ్వడమే తప్ప, ఇప్పటివరకు ఆ హామీలను అమలు చేసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తున్న జర్నలిస్టుల కనీస అవసరమైన సొంత ఇంటి స్థలం సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కొనసాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు... పెరిగిన పత్తి ధర ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,975, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,300గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.25, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 తగ్గగా, పత్తి మాత్రం రూ.200 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.1
- విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తహశీల్దార్ రాంప్రసాద్ ఆకాంక్షించారు విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తహశీల్దార్ రాంప్రసాద్ ఆకాంక్షించారు. నేలకొండపల్లిలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టల్ను సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్ఐ మధు తదితరులు పాల్గొన్నారు.1
- నర్సంపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు... తొలి బహుజన యోధుడు, గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి వేడుకలను నర్సంపేట పట్టణంలోని పాపన్న గౌడ్ విగ్రహం వద్ద వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహం కమిటీ అధ్యక్షులు సోల్తి సారయ్య గౌడ్ తో పాటు కమిటీ సభ్యులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ 15వేల మంది బహుజన సైన్యంతో నాటి పాలకులపై ఎదురొడ్డి గోల్కొండ ఖిలాను ఏలిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నకే దక్కిందని పేర్కొన్నారు.విగ్రహం కమిటీ ప్రధాన కార్యదర్శి, గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయస్ఫూర్తితో గౌడుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గౌడ సామాజిక వర్గం ఆర్థిక స్వావలంబన, సామాజిక అభ్యున్నతి, సముచిత రాజకీయ ప్రాధాన్యం కోసం ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విగ్రహం కమిటీ కోశాధికారి ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు,కమిటీ సభ్యులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, కొయ్యేడి కొమురయ్య గౌడ్, గిరాగాని చంద్రమౌళి గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్, నాతి సదానందం గౌడ్, గిరాగాని కిరణ్ గౌడ్, మొలగాని సురేష్ గౌడ్, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, మద్దెల రవి గౌడ్, నాగేలి ప్రమోద్ గౌడ్, వేముల కృష్ణ గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, తాళ్లపెల్లి చంద్రమౌళి గౌడ్, గండు స్వామి గౌడ్, మోకు దెబ్బ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కందుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గొపగాని వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల దేవేందర్ గౌడ్, దుడ్డే కుమారస్వామి గౌడ్, పోశాల సతీష్ గౌడ్, మచ్చిక రాజు గౌడ్, సోల్తి సాంబయ్య గౌడ్, సోల్తి సునీల్ గౌడ్, సొల్తి మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.1