logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మంచన్పల్లి గ్రామం రాయి కంటి తిరుమలయ్య గారి కుమారుడు ఏసు రాజు స్వర్గస్తులయ్యారు అని తెలియజేయడానికి చింతిస్తున్నాము వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాన్ని దేవుడు ఓదార్పు ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము..

on 12 March
user_Akhil kumar
Akhil kumar
Farmer Pudur, Vikarabad•
on 12 March
f5fd0b25-3aa7-42f9-8d7b-958d7584ea59
aa044989-346d-4a5a-b4ba-13904adae177

మంచన్పల్లి గ్రామం రాయి కంటి తిరుమలయ్య గారి కుమారుడు ఏసు రాజు స్వర్గస్తులయ్యారు అని తెలియజేయడానికి చింతిస్తున్నాము వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాన్ని దేవుడు ఓదార్పు ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము..

More news from తెలంగాణ and nearby areas
  • మెదక్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం బజరంగ్దళ్ పరిషత్ ఆధ్వర్యంలో లవ్ జిహాద్ వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు మేల్కొనండి జిహాద్ వలలో పడకండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం గోరక్ష చేయాలని గోరక్ష చట్టాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమకు వినతిపదిక సమర్పించారు.
    1
    మెదక్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం బజరంగ్దళ్ పరిషత్ ఆధ్వర్యంలో లవ్ జిహాద్ వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు మేల్కొనండి జిహాద్ వలలో పడకండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం గోరక్ష చేయాలని గోరక్ష చట్టాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమకు వినతిపదిక సమర్పించారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
    4
    గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి 
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16,
గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    19 hrs ago
  • పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో ఒంటికోట బడులు కావడం ఆపై అధికంగా ఎండ ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని అధికారులు విడుదల చేయగా చిన్నారులు ఎంచక్కా కెనాల్ లో ఈత కొడుతూ ఎండ వేడిని సేద తీరుతున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత అతి ఎండ ఉండడం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు చిన్నారులకు ఇంటికి వెళితే అధికంగా వేడి ఉండడంతో ఉపశమనం కొరకు కెనాల్ కాలువలో చల్లని నీటిలో ఈత కొడుతూ సేద తీరుతున్నారు
    1
    పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో ఒంటికోట బడులు కావడం ఆపై అధికంగా ఎండ ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని అధికారులు విడుదల చేయగా చిన్నారులు ఎంచక్కా కెనాల్ లో ఈత కొడుతూ ఎండ వేడిని సేద తీరుతున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత అతి ఎండ ఉండడం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు చిన్నారులకు ఇంటికి వెళితే అధికంగా వేడి ఉండడంతో ఉపశమనం కొరకు కెనాల్ కాలువలో చల్లని నీటిలో ఈత కొడుతూ సేద తీరుతున్నారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    23 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది :16.04.2026
కామారెడ్డి జిల్లా 
గురువారం 
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. 
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు.
గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్,  ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు.
రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    20 hrs ago
  • కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో రెండువర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ఓ వర్గానికి చెందిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ను అధికారులు వేదిక పై పిలిచి సర్పంచును వేదిక పై పిలవకపోవడంతో అధికారులను సర్పంచ్ ప్రథమ పౌరుని అయిన మాకు ఎందుకు పిలవలేదనీ సర్పంచ్ ధర్మతేజ అధికారులను నిలదీశాడు.అంతలోనే ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ధర్మ తేజ,మండల సర్పంచ్ లు క్రింద నేల పై కూర్చుండి నిరసన తెలిపారు.వారిని పోలీసులు సముదాయించి కుర్చీల్లో కూర్చోపెట్టారు.
    1
    కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో రెండువర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ఓ వర్గానికి చెందిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ను అధికారులు వేదిక పై పిలిచి సర్పంచును వేదిక పై పిలవకపోవడంతో అధికారులను సర్పంచ్ ప్రథమ పౌరుని అయిన మాకు ఎందుకు పిలవలేదనీ సర్పంచ్ ధర్మతేజ అధికారులను నిలదీశాడు.అంతలోనే ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది.  ధర్మ తేజ,మండల సర్పంచ్ లు క్రింద నేల పై కూర్చుండి నిరసన తెలిపారు.వారిని పోలీసులు సముదాయించి కుర్చీల్లో కూర్చోపెట్టారు.
    user_Reporter Khaseem
    Reporter Khaseem
    బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
  • భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి ఈ క్రింది కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది: 1. డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ 2. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ 3. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిట్నెస్ మేనేజ్ మెంట్ 4. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్ట్రెంత్ అండ్ స్పోర్ట్స్ కండిషనింగ్ 5. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 6. మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 7. ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ సైన్స్) ৪. ఎం,ఏ ( యోగ) 9. ఎంఎసత ఎం 10. ఎం.ఏ. (క్రీడా జర్నలిజం) 11. ఫిట్నెస్ నిర్వహణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కావున ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హత, ఫీజు మరియు ఇతర పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను పరిశీలించాలని మరియు ఏవైనా ఇతర సందేహాలకు 0751,4000887 ఫోన్ నంబర్ ను సంప్రదించగలరని తెలిపారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనగలరని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి జి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
    1
    భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్వాలియర్  2026-27 విద్యా సంవత్సరానికి ఈ క్రింది కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది:
1. డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ 
2. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ 
3. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిట్నెస్ మేనేజ్ మెంట్ 
4. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్ట్రెంత్ అండ్ స్పోర్ట్స్ కండిషనింగ్ 
5. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 
6. మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 
7. ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ సైన్స్)
৪. ఎం,ఏ ( యోగ)
9. ఎంఎసత ఎం
10. ఎం.ఏ. (క్రీడా జర్నలిజం)
11. ఫిట్నెస్ నిర్వహణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా 
కావున ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హత, ఫీజు మరియు ఇతర పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను పరిశీలించాలని మరియు ఏవైనా ఇతర సందేహాలకు 0751,4000887 ఫోన్ నంబర్ ను సంప్రదించగలరని తెలిపారు.
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనగలరని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి జి.రమేష్  ఒక ప్రకటనలో  తెలిపారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    16 hrs ago
  • కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ....ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోrdo nv గిరి, drdo సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, dmho రవీందర్, తహసీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ నిర్వహించిన కార్యక్రమంలో  ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ....ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోrdo nv గిరి, drdo సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, dmho రవీందర్, తహసీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు  మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    20 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.