logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ నిధులను అడ్డగోలుగా కాజేసిన దొంగకు ప్రత్తిపాటి పుల్లారావు గారిని విమర్శించే నైతిక అర్హత లేదు -తెదేపా మైనారిటీ నేతలు *స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ నిధులను అడ్డగోలుగా కాజేసిన దొంగకు ప్రత్తిపాటి పుల్లారావు గారిని విమర్శించే నైతిక అర్హత లేదు -తెదేపా మైనారిటీ నేతలు* గత ప్రభుత్వ హయాంలో కొందరు అవినీతి ఉన్నతాధికారులను అడ్డు పెట్టుకుని స్వచ్చ ఆంధ్ర నిధులను అడ్డగోలుగా కాజేసి, పాప ప్రక్షాళన కోసం ఒక 10 మందికి సాయం చేసిన అవినీతిపరుడు షేక్ జాన్ సైదా అని, అటువంటి వ్యక్తికి మాజీ మంత్రి వర్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని విమర్శించే నైతిక అర్హత లేదని తెలుగుదేశం పార్టీ మైనారిటీ నేతలు విమర్శించారు. ఆదివారం మురికిపూడి గ్రామంలో జరిగిన తిరునాళ్ళ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు గారిని ఉద్దేశించి పలు విమర్శలు చేయడం పై మైనారిటీ నేతలు పత్రికా సమావేశంలో మండిపడ్డారు.స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ముసుగులో నువ్వు ఈ రాష్ట్రంలో ఎన్ని వందల కోట్ల అవినీతి చేసావో, ఈ నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరికీ తెలుసునని తెలిపారు.పెద్ద, పెద్ద అవినీతి అధికారులకు బినామీగా ఉండి,వాళ్లు విసిరేసిన చిల్లర సంపాదించుకున్న నువ్వు చిల్లర మాటలు మాట్లాడితే జరిగే పరిణామలకు నువ్వే బాధ్యత వహించవలసి వస్తుందని నేతలు తెలిపారు.మూడు దశాబ్దాలుగా పేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అహరహరం శ్రమించిన నాయకుడి పై అవాకులు, చావాకులు పేలితే నాయకుడివి అయిపోవని, అధినాయకుడి అప్పాయింట్మెంట్ కూడా దొరకని నీ లాంటి వాళ్లు గుర్తింపు కోసం ఇలా చౌక బారు వ్యాఖ్యలు చేస్తే, మరింత దిగజారిపోవడం తప్పా, సాధించేది ఏదీ ఉండదని, ముందు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన నెల్లూరు, బీహార్ కు చెందిన వ్యాపారస్తులకు డబ్బులు చెల్లించి, ఆ తరువాత ఏదైనా మాట్లాడాలని తెలిపారు. మరోమారు ప్రత్తిపాటి గురించి మాట్లాడితే తగిన బుద్ది చెప్పడం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు.ప్రత్తిపాటి పుల్లారావు గారిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు.

2 hrs ago
user_మీడియా ఇన్చార్జి
మీడియా ఇన్చార్జి
Animal Protection Organisation చిలకలూరిపేట హెచ్.ఓ. పురుషోత్తపట్నం, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
21869835-5a7d-4305-937b-aad45758584c

స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ నిధులను అడ్డగోలుగా కాజేసిన దొంగకు ప్రత్తిపాటి పుల్లారావు గారిని విమర్శించే నైతిక అర్హత లేదు -తెదేపా మైనారిటీ నేతలు *స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ నిధులను అడ్డగోలుగా కాజేసిన దొంగకు ప్రత్తిపాటి పుల్లారావు గారిని విమర్శించే నైతిక అర్హత లేదు -తెదేపా మైనారిటీ నేతలు* గత ప్రభుత్వ హయాంలో కొందరు అవినీతి ఉన్నతాధికారులను అడ్డు పెట్టుకుని స్వచ్చ ఆంధ్ర నిధులను అడ్డగోలుగా కాజేసి, పాప ప్రక్షాళన కోసం ఒక 10 మందికి సాయం చేసిన అవినీతిపరుడు షేక్ జాన్ సైదా అని, అటువంటి వ్యక్తికి మాజీ మంత్రి వర్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని విమర్శించే నైతిక అర్హత లేదని తెలుగుదేశం పార్టీ మైనారిటీ నేతలు విమర్శించారు. ఆదివారం మురికిపూడి గ్రామంలో జరిగిన తిరునాళ్ళ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు గారిని ఉద్దేశించి పలు విమర్శలు చేయడం పై మైనారిటీ నేతలు పత్రికా సమావేశంలో మండిపడ్డారు.స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ముసుగులో నువ్వు ఈ రాష్ట్రంలో ఎన్ని వందల కోట్ల అవినీతి చేసావో, ఈ నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరికీ తెలుసునని తెలిపారు.పెద్ద, పెద్ద అవినీతి అధికారులకు బినామీగా ఉండి,వాళ్లు విసిరేసిన చిల్లర సంపాదించుకున్న నువ్వు చిల్లర మాటలు మాట్లాడితే జరిగే పరిణామలకు నువ్వే బాధ్యత వహించవలసి వస్తుందని నేతలు తెలిపారు.మూడు దశాబ్దాలుగా పేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అహరహరం శ్రమించిన నాయకుడి పై అవాకులు, చావాకులు పేలితే నాయకుడివి అయిపోవని, అధినాయకుడి అప్పాయింట్మెంట్ కూడా దొరకని నీ లాంటి వాళ్లు గుర్తింపు కోసం ఇలా చౌక బారు వ్యాఖ్యలు చేస్తే, మరింత దిగజారిపోవడం తప్పా, సాధించేది ఏదీ ఉండదని, ముందు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన నెల్లూరు, బీహార్ కు చెందిన వ్యాపారస్తులకు డబ్బులు చెల్లించి, ఆ తరువాత ఏదైనా మాట్లాడాలని తెలిపారు. మరోమారు ప్రత్తిపాటి గురించి మాట్లాడితే తగిన బుద్ది చెప్పడం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు.ప్రత్తిపాటి పుల్లారావు గారిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • దారుణం.. కుటుంబమంతా ఆత్మహత్య నరసరావుపేటలో ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భోపాల్ ఎయిమ్స్ లో వైద్యుడిగా పనిచేస్తున్న సాతులూరుకు చెందిన గోపి, తన కుటుంబంతో సహా నరసరావుపేటలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి 3 ఏళ్ల చిన్నారి బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లీకూతుళ్లు నిన్న మృతి చెందగా, గోపి నేడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
    1
    దారుణం.. కుటుంబమంతా ఆత్మహత్య
నరసరావుపేటలో ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భోపాల్ ఎయిమ్స్ లో వైద్యుడిగా పనిచేస్తున్న సాతులూరుకు చెందిన గోపి, తన కుటుంబంతో సహా నరసరావుపేటలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి 3 ఏళ్ల చిన్నారి బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లీకూతుళ్లు నిన్న మృతి చెందగా, గోపి నేడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    15 hrs ago
  • . సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యే, సత్తుపల్లి.
    1
    .  సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. 
మట్టా రాగమయి దయానంద్ 
ఎమ్మెల్యే, సత్తుపల్లి.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    3
    నకిరేకల్ నియోజకవర్గo:-
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు.
ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • నల్గొండ: నల్గొండ ఆర్టీసీ బస్టాండు నుంచి పెద్ద గడియారం వెళ్లే మార్గంలో సుభాష్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతల మయంగా మారింది. ముఖ్యంగా మూలమలుపు వద్ద గుంతలు పెద్దగా ఉండటంతో, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ ఆర్టీసీ బస్టాండు నుంచి పెద్ద గడియారం వెళ్లే మార్గంలో సుభాష్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతల మయంగా మారింది. ముఖ్యంగా మూలమలుపు వద్ద గుంతలు పెద్దగా ఉండటంతో, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    9 hrs ago
  • సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.
    2
    సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా  మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు.. అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    1
    వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు..
అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    user_Shaik
    Shaik
    ఉదయగిరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.