logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో బాధితులు ధర్నా నిర్వహించి, అర్హులైన నిరుపేదలకు తక్షణమే డబుల్ బెడ్ రూములు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిర్మించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూములను పూర్తి చేసి, వాటిని నిరుపేదలకు అందించాలని కూడా వారు కోరారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూలి చేసుకునే నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని, అలాంటి వారికి డబుల్ బెడ్ రూములు అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డబుల్ బెడ్ రూమ్లను పంపిణీ చేయకుంటే, అర్హత కలిగిన నిరుపేదలను వెంటబెట్టుకొని వెళ్లి డబుల్ బెడ్ రూమ్ ల గృహప్రవేశం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా వాగ్దానాలను నిలుపుకోదని, కాబట్టి నిలుపుకోని వాగ్దానాలకు రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం వచ్చే విధంగా డబుల్ బెడ్ రూముల పంపిణీకి పూనుకుంటామని సిపిఐ నాయకులు తెలిపారు.

1 hr ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
1 hr ago

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో బాధితులు ధర్నా నిర్వహించి, అర్హులైన నిరుపేదలకు తక్షణమే డబుల్ బెడ్ రూములు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిర్మించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూములను పూర్తి చేసి, వాటిని నిరుపేదలకు అందించాలని కూడా వారు కోరారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూలి చేసుకునే నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని, అలాంటి

వారికి డబుల్ బెడ్ రూములు అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డబుల్ బెడ్ రూమ్లను పంపిణీ చేయకుంటే, అర్హత కలిగిన నిరుపేదలను వెంటబెట్టుకొని వెళ్లి డబుల్ బెడ్ రూమ్ ల గృహప్రవేశం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా వాగ్దానాలను నిలుపుకోదని, కాబట్టి నిలుపుకోని వాగ్దానాలకు రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం వచ్చే విధంగా డబుల్ బెడ్ రూముల పంపిణీకి పూనుకుంటామని సిపిఐ నాయకులు తెలిపారు.

More news from Telangana and nearby areas
  • కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకుడు గజ్జల శ్రీకాంత్ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫాంలు అందించాలని, ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఒక శాఖా మంత్రిని కూడా నియమించాలని కోరారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ పాఠశాలల్లో సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం, సమస్యలను గాలికొదిలేసిందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఎస్ఎఫ్ఐ హెచ్చరించింది. లేకపోతే, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని గజ్జల శ్రీకాంత్ స్పష్టం చేశారు.
    2
    కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకుడు గజ్జల శ్రీకాంత్ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫాంలు అందించాలని, ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఒక శాఖా మంత్రిని కూడా నియమించాలని కోరారు.

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ పాఠశాలల్లో సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం, సమస్యలను గాలికొదిలేసిందని తీవ్రంగా విమర్శించారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఎస్ఎఫ్ఐ హెచ్చరించింది. లేకపోతే, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని గజ్జల శ్రీకాంత్ స్పష్టం చేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    24 min ago
  • కరీంనగర్‌లోని గాంధీ రోడ్డు ప్రాంతంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నల్లమచ సుగుణమ్మ (82) అనే వృద్ధురాలు తన ఇంట్లోని చేదబావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ విషయాన్ని కుటుంబీకులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఫైర్ రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే వృద్ధురాలు మృతిచెందడంతో, సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
    1
    కరీంనగర్‌లోని గాంధీ రోడ్డు ప్రాంతంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నల్లమచ సుగుణమ్మ (82) అనే వృద్ధురాలు తన ఇంట్లోని చేదబావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ విషయాన్ని కుటుంబీకులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఫైర్ రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే వృద్ధురాలు మృతిచెందడంతో, సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై గతంలో వెల్లువెత్తిన ప్రశ్నలు నేడు నిజమయ్యాయి, భారీ కుంభకోణం బట్టబయలైంది. ఈ కుంభకోణంలో కేవలం కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం సరికాదని, దీని వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద అధికారులు, రైస్ మిల్లర్లు, సెంటర్ ఇంచార్జిల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దొరికిన దొంగలు కొంతమందేనని, ఇంకా దొరకాల్సిన 'తిమింగలాలు' చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై గతంలో వెల్లువెత్తిన ప్రశ్నలు నేడు నిజమయ్యాయి, భారీ కుంభకోణం బట్టబయలైంది. ఈ కుంభకోణంలో కేవలం కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం సరికాదని, దీని వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

పెద్ద అధికారులు, రైస్ మిల్లర్లు, సెంటర్ ఇంచార్జిల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దొరికిన దొంగలు కొంతమందేనని, ఇంకా దొరకాల్సిన 'తిమింగలాలు' చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    5 hrs ago
  • మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండలంలోని 76 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తొలి విడతలో మండలానికి మంజూరైన 526 ఇళ్లలో 76 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంతో, వారి స్థానంలో కొత్త అర్హులను ఎంపిక చేసి ఈ పత్రాలను అందజేసినట్లు తెలిపారు. అర్హులందరికీ గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించి, మండలవ్యాప్తంగా మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల' పేరుతో కాలయాపన జరిగిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
    4
    మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండలంలోని 76 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తొలి విడతలో మండలానికి మంజూరైన 526 ఇళ్లలో 76 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంతో, వారి స్థానంలో కొత్త అర్హులను ఎంపిక చేసి ఈ పత్రాలను అందజేసినట్లు తెలిపారు.

అర్హులందరికీ గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించి, మండలవ్యాప్తంగా మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల' పేరుతో కాలయాపన జరిగిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • జగిత్యాల జిల్లాలో ఓ విద్యార్థిని కేవలం మూడు నిముషాల ఆలస్యం కారణంగా నీట్ పరీక్ష రాయలేకపోయింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉన్నప్పటికీ, విద్యార్థిని కొండగట్టు జేఎన్టీయూ నీట్ పరీక్షా కేంద్రానికి ఒంటి గంట 33 నిముషాలకు చేరుకుంది. అప్పటికే గేట్లు మూసివేసిన అధికారులు ఆమెను లోపలికి అనుమతించలేదు. పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని విద్యార్థిని తల్లి సెక్యూరిటీ సిబ్బంది కాళ్లపై పడి వేడుకున్నా, నిబంధనల ప్రకారం ప్రవేశం కల్పించలేమని అధికారులు స్పష్టం చేశారు. గొల్లపల్లి మండలం రాపల్లి నుంచి ఆటోలో రావడం వల్ల ఆలస్యమైందని విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల కారణంగా కన్నీటి పర్యంతమై వారు వెనుతిరిగారు. ఈ నిముషం ఆలస్యం నిబంధనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, విద్యార్థిని భావోద్వేగ పరిస్థితిని చూసిన స్థానికులు, తోటి విద్యార్థులు సైతం విచారం వ్యక్తం చేశారు.
    4
    జగిత్యాల జిల్లాలో ఓ విద్యార్థిని కేవలం మూడు నిముషాల ఆలస్యం కారణంగా నీట్ పరీక్ష రాయలేకపోయింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉన్నప్పటికీ, విద్యార్థిని కొండగట్టు జేఎన్టీయూ నీట్ పరీక్షా కేంద్రానికి ఒంటి గంట 33 నిముషాలకు చేరుకుంది. అప్పటికే గేట్లు మూసివేసిన అధికారులు ఆమెను లోపలికి అనుమతించలేదు.

పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని విద్యార్థిని తల్లి సెక్యూరిటీ సిబ్బంది కాళ్లపై పడి వేడుకున్నా, నిబంధనల ప్రకారం ప్రవేశం కల్పించలేమని అధికారులు స్పష్టం చేశారు. గొల్లపల్లి మండలం రాపల్లి నుంచి ఆటోలో రావడం వల్ల ఆలస్యమైందని విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల కారణంగా కన్నీటి పర్యంతమై వారు వెనుతిరిగారు. ఈ నిముషం ఆలస్యం నిబంధనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, విద్యార్థిని భావోద్వేగ పరిస్థితిని చూసిన స్థానికులు, తోటి విద్యార్థులు సైతం విచారం వ్యక్తం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
  • వేములవాడ పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మోచీ సంఘం అధ్యక్షుడు కొండ్లెపు ముత్యం, తనను కులం పేరుతో దూషించి, దుకాణంలోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆయన ఈ ఫిర్యాదులో కోరారు. ముత్యం తెలిపిన వివరాల ప్రకారం, వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న తన కొబ్బరికాయల దుకాణాన్ని తొలగించాలని గత నెల రోజులుగా దేవస్థాన అధికారుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ క్రమంలో జూన్ 18న రాత్రి సుమారు 8 గంటల సమయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఆదేశాల మేరకు సుమారు 30 మంది దేవస్థాన సిబ్బంది తన దుకాణం వద్దకు వచ్చి తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తనను కులం పేరుతో దూషించడంతో పాటు అవమానకరంగా మాట్లాడారని, తన అనుమతి లేకుండా దుకాణంలోకి ప్రవేశించి పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారని ముత్యం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో దేవస్థానం ఈవో రమాదేవి, ఏఈవో శ్రావణ్, సూపరింటెండెంట్ నూగూరి నరేందర్, రాంకిషన్‌రావు, భగవంతరావు, జయకుమారి, రాజేందర్, భరత్, గంగిశెట్టి సాయి తదితరులపై చర్యలు తీసుకోవాలని ముత్యం కోరారు. సంఘటన జరిగిన సమయంలో రేగుల శ్రీకాంత్, వంగళ శ్రీనివాస్, మైలారపు శ్రీనివాస్, బోనాల శివ, మామిండ్ల లక్ష్మిరాజం తదితరులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై జూన్ 19న వేములవాడ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు. అందువల్ల, సంబంధిత అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలని కొండ్లెపు ముత్యం జాతీయ ఎస్సీ కమిషన్‌ను కోరారు.
    4
    వేములవాడ పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మోచీ సంఘం అధ్యక్షుడు కొండ్లెపు ముత్యం, తనను కులం పేరుతో దూషించి, దుకాణంలోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆయన ఈ ఫిర్యాదులో కోరారు.

ముత్యం తెలిపిన వివరాల ప్రకారం, వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న తన కొబ్బరికాయల దుకాణాన్ని తొలగించాలని గత నెల రోజులుగా దేవస్థాన అధికారుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ క్రమంలో జూన్ 18న రాత్రి సుమారు 8 గంటల సమయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఆదేశాల మేరకు సుమారు 30 మంది దేవస్థాన సిబ్బంది తన దుకాణం వద్దకు వచ్చి తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తనను కులం పేరుతో దూషించడంతో పాటు అవమానకరంగా మాట్లాడారని, తన అనుమతి లేకుండా దుకాణంలోకి ప్రవేశించి పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారని ముత్యం తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనలో దేవస్థానం ఈవో రమాదేవి, ఏఈవో శ్రావణ్, సూపరింటెండెంట్ నూగూరి నరేందర్, రాంకిషన్‌రావు, భగవంతరావు, జయకుమారి, రాజేందర్, భరత్, గంగిశెట్టి సాయి తదితరులపై చర్యలు తీసుకోవాలని ముత్యం కోరారు. సంఘటన జరిగిన సమయంలో రేగుల శ్రీకాంత్, వంగళ శ్రీనివాస్, మైలారపు శ్రీనివాస్, బోనాల శివ, మామిండ్ల లక్ష్మిరాజం తదితరులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై జూన్ 19న వేములవాడ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు.

అందువల్ల, సంబంధిత అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలని కొండ్లెపు ముత్యం జాతీయ ఎస్సీ కమిషన్‌ను కోరారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
  • ఆదివారం వీర్నపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ అనుబంధ రంగాల కార్మికుల విస్తృత స్థాయి సమావేశం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని భవన నిర్మాణం, హమాలీ, గ్రామపంచాయతీ, ఆశా, బీడీ, విద్యుత్ మరియు అన్ని రంగాల కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా 15 మంది సభ్యులతో కూడిన నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, కేంద్ర బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం కార్మిక చట్టాలను రద్దుచేసి, తమ కష్టంతో దేశానికే సంపదను సృష్టిస్తున్న కార్మికుల హక్కులను హరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రంగాల కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ నాయకులు వీర్నపల్లి మండలంలోని అన్ని రంగాల కార్మికులు, కష్టజీవులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమ పోరాటాలు నిర్వహించి వారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నూతన వీర్నపల్లి మండల కమిటీకి గుంటుకు నరేందర్ మండల కన్వీనర్​గా, ఈసంపేల్లి రాజెల్లయ్య, అన్నారం రాజేశం కో కన్వీనర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజెల్లయ్య, అంజయ్య, చంద్రయ్య, లింగయ్య, రాజు, కత్తిలాల్, శ్రీహరి, నర్సయ్య, మనోహర్, నవత, అనిత, లావణ్యలు మండల కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, వివిధ రంగాల యూనియన్ల నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు.
    3
    ఆదివారం వీర్నపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ అనుబంధ రంగాల కార్మికుల విస్తృత స్థాయి సమావేశం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని భవన నిర్మాణం, హమాలీ, గ్రామపంచాయతీ, ఆశా, బీడీ, విద్యుత్ మరియు అన్ని రంగాల కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా 15 మంది సభ్యులతో కూడిన నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సమావేశంలో మాట్లాడిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, కేంద్ర బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం కార్మిక చట్టాలను రద్దుచేసి, తమ కష్టంతో దేశానికే సంపదను సృష్టిస్తున్న కార్మికుల హక్కులను హరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రంగాల కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు.

నూతనంగా ఎన్నికైన మండల కమిటీ నాయకులు వీర్నపల్లి మండలంలోని అన్ని రంగాల కార్మికులు, కష్టజీవులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమ పోరాటాలు నిర్వహించి వారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నూతన వీర్నపల్లి మండల కమిటీకి గుంటుకు నరేందర్ మండల కన్వీనర్​గా, ఈసంపేల్లి రాజెల్లయ్య, అన్నారం రాజేశం కో కన్వీనర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజెల్లయ్య, అంజయ్య, చంద్రయ్య, లింగయ్య, రాజు, కత్తిలాల్, శ్రీహరి, నర్సయ్య, మనోహర్, నవత, అనిత, లావణ్యలు మండల కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, వివిధ రంగాల యూనియన్ల నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
  • కరీంనగర్‌లోని సుభాష్‌ నగర్‌లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 87వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సోమవారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని, కరీంనగర్ కార్పొరేషన్ 27వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ బోట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్ లతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇదే సందర్భంగా సుభాష్ నగర్‌లోని ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ, బలమైన, ఐక్యమైన, స్వయం సమృద్ధమైన భారతదేశాన్ని నిర్మించాలనే ఆశయంతో క్రాంతి వీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన 'ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్' 87 వసంతాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమన్నారు. గడిచిన 87 ఏళ్లుగా AIFB పార్టీ జాతీయవాదం, సామాజిక న్యాయం, లౌకికవాదం, సామాన్య ప్రజల సాధికారత, వారి హక్కుల కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాడుతోందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు, స్ఫూర్తితో సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. "నన్ను రక్తాన్ని అడగండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను!" అన్న నేతాజీ గర్జన నేటి యువతలో ప్రవహించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్య ఫలాలు సమాజంలో చివరి వరుసలో ఉన్న పేదవాడికి అందినప్పుడే నేతాజీ కలలుగన్న నిజమైన భారతదేశం సాకారమవుతుందని స్పష్టం చేశారు. సమాజంలోని అసమానతలపై, అన్యాయాలపై ప్రశ్నించే తత్వమే నేతాజీ మార్గమని, కుల మత బేధాలకు అతీతంగా ప్రగతిశీల నవ భారత నిర్మాణం కోసం యువత అంతా ఏకమై భాగస్వాములు కావాలని కోరారు. చివరగా, "ఏకం అవ్వండి! పోరాడండి! నేతాజీ మార్గంలో భారతదేశాన్ని పునర్నిర్మించండి! జై హింద్!" అని నినాదాలు చేశారు. ఈ వేడుకల్లో 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సత్యారావు, బద్రినేత, AISB విద్యార్థి సంఘం నాయకులు అతికం రాజశేఖర్ గౌడ్, గూడా కిష్టయ్య, రాహుల్, సజ్జు, సాగర్ బాబాన్ సహా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    3
    కరీంనగర్‌లోని సుభాష్‌ నగర్‌లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 87వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సోమవారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని, కరీంనగర్ కార్పొరేషన్ 27వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ బోట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్ లతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇదే సందర్భంగా సుభాష్ నగర్‌లోని ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ, బలమైన, ఐక్యమైన, స్వయం సమృద్ధమైన భారతదేశాన్ని నిర్మించాలనే ఆశయంతో క్రాంతి వీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన 'ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్' 87 వసంతాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమన్నారు. గడిచిన 87 ఏళ్లుగా AIFB పార్టీ జాతీయవాదం, సామాజిక న్యాయం, లౌకికవాదం, సామాన్య ప్రజల సాధికారత, వారి హక్కుల కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాడుతోందని గుర్తు చేశారు.

రాబోయే రోజుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు, స్ఫూర్తితో సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. "నన్ను రక్తాన్ని అడగండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను!" అన్న నేతాజీ గర్జన నేటి యువతలో ప్రవహించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్య ఫలాలు సమాజంలో చివరి వరుసలో ఉన్న పేదవాడికి అందినప్పుడే నేతాజీ కలలుగన్న నిజమైన భారతదేశం సాకారమవుతుందని స్పష్టం చేశారు. సమాజంలోని అసమానతలపై, అన్యాయాలపై ప్రశ్నించే తత్వమే నేతాజీ మార్గమని, కుల మత బేధాలకు అతీతంగా ప్రగతిశీల నవ భారత నిర్మాణం కోసం యువత అంతా ఏకమై భాగస్వాములు కావాలని కోరారు. చివరగా, "ఏకం అవ్వండి! పోరాడండి! నేతాజీ మార్గంలో భారతదేశాన్ని పునర్నిర్మించండి! జై హింద్!" అని నినాదాలు చేశారు.

ఈ వేడుకల్లో 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సత్యారావు, బద్రినేత, AISB విద్యార్థి సంఘం నాయకులు అతికం రాజశేఖర్ గౌడ్, గూడా కిష్టయ్య, రాహుల్, సజ్జు, సాగర్ బాబాన్ సహా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    41 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.