logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహబూబాబాద్ జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్‌కు పిలుపు మహబూబాబాద్ జిల్లాలో చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు యూసుఫ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్ లేయర్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను బంద్ చేయనున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగా చికెన్ సెంటర్లకు మార్జిన్ పేపర్ రేటుపై తగ్గించి ఇచ్చిన ధరకు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యాపారులకు న్యాయమైన ధరలు కల్పించకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

5 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
5 hrs ago

మహబూబాబాద్ జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్‌కు పిలుపు మహబూబాబాద్ జిల్లాలో చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు యూసుఫ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్ లేయర్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను బంద్ చేయనున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగా చికెన్ సెంటర్లకు మార్జిన్ పేపర్ రేటుపై తగ్గించి ఇచ్చిన ధరకు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యాపారులకు న్యాయమైన ధరలు కల్పించకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • నల్లబెల్లి, మార్చి 30: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రామప్ప–రంగయ్య చెరువు–పాకాల ప్రాజెక్ట్‌లో భాగమైన కాలువల నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తమ హయాంలో గోదావరి జలాలను రంగయ్య చెరువుకు తరలించే పనులు పూర్తి చేసి, 32,500 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టును రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం సుమారు 87 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను రెండు సంవత్సరాలుగా పూర్తి చేయకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. కాలువల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.40 కోట్లు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించి, మిగిలిన పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నెలరోజుల గడువు విధిస్తున్నామని, ఆలోపు పనులు పూర్తి చేయకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే నర్సంపేట కలెక్టరేట్ ముట్టడిస్తామని తెలిపారు. ఈ నిరసనలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు భారీగా పాల్గొన్నారు.
    3
    నల్లబెల్లి, మార్చి 30: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రామప్ప–రంగయ్య చెరువు–పాకాల ప్రాజెక్ట్‌లో భాగమైన కాలువల నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తమ హయాంలో గోదావరి జలాలను రంగయ్య చెరువుకు తరలించే పనులు పూర్తి చేసి, 32,500 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టును రూపొందించామని తెలిపారు.
ప్రస్తుతం సుమారు 87 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను రెండు సంవత్సరాలుగా పూర్తి చేయకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. కాలువల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.40 కోట్లు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదన్నారు.
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించి, మిగిలిన పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి నెలరోజుల గడువు విధిస్తున్నామని, ఆలోపు పనులు పూర్తి చేయకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే నర్సంపేట కలెక్టరేట్ ముట్టడిస్తామని తెలిపారు.
ఈ నిరసనలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు భారీగా పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    22 hrs ago
  • తెలంగాణ వ్యాప్తంగా రిటైర్డ్ ఎంప్లాయిస్ తమకు రావలసిన బకాయిల కోసం కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ నిరసన ఆందోళనకు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరి శంకర్ తెలంగాణ జాగృతి జిల్లా అద్యక్షులు హరిప్రసాద్ సంఘీభావం తెలిపారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని , జిపిఎఫ్ డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు బకాయి ఉన్న డీఏ ఏక మొత్తంగా చెల్లించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులు ప్రజలకు ఎంతో సేవ చేసి ఉన్నారని ఉద్యోగ సమయంలో వారు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 25 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని.. వారు రిటైర్డ్ అనంతరం పిల్లల వివాహానికి కావచ్చు ఇల్లు నిర్మించుకోవడం కోసం కావచ్చు.. ఇలా భవిష్యత్తు కొరకు ఉద్యోగం చేస్తున్న సమయంలో దాచుకున్న డబ్బును రిటైర్డ్ అయిన తర్వాత వస్తుందని ఎదురు చూసే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిందన్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక రెండున్నరెండ్లుగా సుమారు 50మంది వరకు మానసికక్షోభకు గురై మరణించడం చాలా బాధాకరమన్నారు. కాంట్రాక్ట్ లలో కమిషన్ల కోసం ప్రభుత్వం సుమారు 63 వేల కోట్లను విడుదల చేసిందని ఆరోపించారు.
    2
    తెలంగాణ వ్యాప్తంగా రిటైర్డ్ ఎంప్లాయిస్ తమకు రావలసిన బకాయిల కోసం కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ నిరసన ఆందోళనకు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరి శంకర్ తెలంగాణ జాగృతి జిల్లా అద్యక్షులు హరిప్రసాద్ సంఘీభావం తెలిపారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని , జిపిఎఫ్ డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు బకాయి ఉన్న డీఏ ఏక మొత్తంగా చెల్లించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులు ప్రజలకు ఎంతో సేవ చేసి ఉన్నారని ఉద్యోగ సమయంలో వారు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 25 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని..
వారు రిటైర్డ్ అనంతరం పిల్లల వివాహానికి కావచ్చు ఇల్లు నిర్మించుకోవడం కోసం కావచ్చు.. ఇలా భవిష్యత్తు కొరకు  ఉద్యోగం చేస్తున్న సమయంలో దాచుకున్న డబ్బును రిటైర్డ్ అయిన తర్వాత వస్తుందని ఎదురు చూసే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిందన్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక  రెండున్నరెండ్లుగా సుమారు 50మంది వరకు   మానసికక్షోభకు గురై మరణించడం చాలా బాధాకరమన్నారు. కాంట్రాక్ట్ లలో కమిషన్ల కోసం ప్రభుత్వం సుమారు 63 వేల కోట్లను విడుదల చేసిందని ఆరోపించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి వద్ద ముత్యాలమ్మ చెరువు కట్ట ఇరువైపుల చెట్లతో మూసుకుపోయి రక్షణ గోడలు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి కొత్తపల్లి మీదుగా అనంతారం, ఏమిరెడ్డి గూడెం తదితర ప్రాంతాలకు విద్యార్థులు, రైతులు, ప్రజలు నిత్యం దీనిపై ప్రయాణిస్తూ ఉంటారు. వాహనాలు అదుపు తప్పితే పంట పొలాలు, చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కట్ట వెడల్పు పెంచడంతోపాటు రక్షణ గోడలు నిర్మించి, చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి వద్ద ముత్యాలమ్మ చెరువు కట్ట ఇరువైపుల చెట్లతో మూసుకుపోయి రక్షణ గోడలు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి కొత్తపల్లి మీదుగా అనంతారం, ఏమిరెడ్డి గూడెం తదితర ప్రాంతాలకు విద్యార్థులు, రైతులు, ప్రజలు నిత్యం దీనిపై ప్రయాణిస్తూ ఉంటారు. వాహనాలు అదుపు తప్పితే పంట పొలాలు, చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కట్ట వెడల్పు పెంచడంతోపాటు రక్షణ గోడలు నిర్మించి, చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    4 hrs ago
  • జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో అమానుష ఘటన చీపురుతో విద్యార్థులను చితకబాదిన హాస్టల్‌లో కూరగాయలు కోసే వ్యక్తి శ్రీనివాస్ నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న శ్రీనివాస్ నాలుగు నెలలుగా విద్యార్థులను వేధిస్తున్న శ్రీనివాస్ విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని హాస్టల్ నిర్వాహకులు చిన్నారులని చూడకుండా చీపురుతో చితకబాదిన వైనం
    1
    జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో అమానుష ఘటన 
చీపురుతో విద్యార్థులను చితకబాదిన హాస్టల్‌లో కూరగాయలు కోసే వ్యక్తి శ్రీనివాస్
నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న శ్రీనివాస్
నాలుగు నెలలుగా విద్యార్థులను వేధిస్తున్న శ్రీనివాస్
విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని హాస్టల్ నిర్వాహకులు
చిన్నారులని చూడకుండా చీపురుతో చితకబాదిన వైనం
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 31 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం గజ్వేల్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి లక్ష్మీ నరసమ్మ దంపతులు వారి కుమారుడు సిద్ది నవీన్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, హనుమాన్ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు పెద్దలు సిద్ధి బిక్షపతి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ చేయడం జరిగిందని వారికి వారి కుటుంబానికి దేవదేవతల అనుగ్రహం ఉంటుందని ఆకాంక్షించారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య, సిద్ది రామచంద్రం,సిద్ది నవీన్,నేతి శ్రీనివాస్, కైలాస ప్రశాంత్,గందే యాదగిరి,సిరిపురం సత్యనారాయణ,కాశీనాథ్,శ్రీహరి,రమేష్ , గందే సంతోష్,తదితరులు పాల్గొన్నారు
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 31 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా గజ్వేల్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం గజ్వేల్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి లక్ష్మీ నరసమ్మ దంపతులు వారి కుమారుడు సిద్ది నవీన్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, హనుమాన్ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు పెద్దలు సిద్ధి బిక్షపతి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ చేయడం జరిగిందని వారికి వారి కుటుంబానికి దేవదేవతల అనుగ్రహం ఉంటుందని ఆకాంక్షించారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య, సిద్ది రామచంద్రం,సిద్ది నవీన్,నేతి శ్రీనివాస్, కైలాస ప్రశాంత్,గందే యాదగిరి,సిరిపురం సత్యనారాయణ,కాశీనాథ్,శ్రీహరి,రమేష్ , గందే సంతోష్,తదితరులు పాల్గొన్నారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ రైతు కార్యదర్శి జంగం అంజయ్య విద్యుత్ షాక్ తో మృతి. వెంకట్రాయుని చెరువు సమీపంలో పంట పొలం వద్ద ఘటన.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ రైతు కార్యదర్శి జంగం అంజయ్య విద్యుత్ షాక్ తో మృతి. వెంకట్రాయుని చెరువు సమీపంలో పంట పొలం వద్ద ఘటన.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    21 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో మంగళవారం గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, వర్షం కారణంగా పలువురు రైతులకు చెందిన సుమారు 100 ఎకరాల మొక్కజొన్న పంట నేలకొరిగింది. పంట నష్టంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో మంగళవారం గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, వర్షం కారణంగా పలువురు రైతులకు చెందిన సుమారు 100 ఎకరాల మొక్కజొన్న పంట నేలకొరిగింది.
పంట నష్టంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తోపాటు 16 మందికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. వీణవంక మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన గొడవ విషయంలో కరీంనగర్ సిపి పై తీవ్ర వ్యాఖ్యలు ఎమ్మెల్యే చేశారు. జాతరలో జరిగిన గొడవ విషయంలో జనవరి 29న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తోపాటు 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆ కేసును సిబిఐకి ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వ ఆదేశంతో విచారణను చేపట్టిన సిఐడి అధికారులు దూకుడు పెంచారు. ఎమ్మెల్యే తో పాటు 16 మందికి నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 2న హైదారాబాద్ సిఐడి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే అనుచరులు ఆందోళన చెందుతున్నారు. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేను ఆయన అనుచరులను ఇబ్బందులకు గురి చేయాలని అధికారులు ప్రభుత్వం చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
    4
    కరీంనగర్ జిల్లా హుజూరాబాద్  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తోపాటు 16 మందికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. వీణవంక మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన గొడవ విషయంలో కరీంనగర్ సిపి పై తీవ్ర వ్యాఖ్యలు ఎమ్మెల్యే చేశారు. జాతరలో జరిగిన గొడవ విషయంలో జనవరి 29న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తోపాటు 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆ కేసును సిబిఐకి ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వ ఆదేశంతో
విచారణను చేపట్టిన  సిఐడి అధికారులు దూకుడు పెంచారు.  ఎమ్మెల్యే తో పాటు 16 మందికి నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 2న హైదారాబాద్ సిఐడి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే అనుచరులు ఆందోళన చెందుతున్నారు. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేను ఆయన అనుచరులను ఇబ్బందులకు గురి చేయాలని  అధికారులు ప్రభుత్వం  చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • విద్యార్థులకు మెనూ కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన భోజనం ఇవ్వాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) విద్యాలయంలో కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, స్టోర్ రూమ్ లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు, తరగతి, వసతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవు తుండగా, కలెక్టర్ వారితో మాట్లాడి.. పలు సూచనలు చేశారు. విద్యార్థులందరూ చదువు పై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
    1
    విద్యార్థులకు మెనూ కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన భోజనం ఇవ్వాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) విద్యాలయంలో కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, స్టోర్ రూమ్ లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు, తరగతి, వసతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవు తుండగా, కలెక్టర్ వారితో మాట్లాడి.. పలు సూచనలు చేశారు. విద్యార్థులందరూ చదువు పై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని   కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.