Shuru
Apke Nagar Ki App…
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన పవర్ ట్రిల్లర్ వ్యవసాయ పరికరాలను ఎమ్మెల్యే అందచేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతులు పంటల మార్పిడి విధానాన్ని అనుసరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
P.G. Murthy
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన పవర్ ట్రిల్లర్ వ్యవసాయ పరికరాలను ఎమ్మెల్యే అందచేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతులు పంటల మార్పిడి విధానాన్ని అనుసరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తాలూకా పరిధిలోని దండేపల్లి, జన్నారం మండలాల్లో బుధవారం మ.3 గంటలకు 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే లక్షెట్టిపేటలో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. అన్ని మండలాల్లో ఒకవైపు మబ్బు వాతావరణం ఉంటున్న ఎండ తీవ్రత కొనసాగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.1
- కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. కాగజ్‌నగర్ పెద్ద వాగు నుంచి రెబ్బెన మండలం రాంపూర్ గ్రామానికి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. అనంతరం ఆసిఫాబాద్ పరిధిలో తనిఖీల్లో మరో నాలుగు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ హరిత ఆదేశాల మేరకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా సహజ వనరులను దోపిడీ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ప్రజలు కూడా సమాచారం అందించాలని సూచించారు.1
- *पिता से लड़ाई… ऑटो ड्राइवर ने बच्चे से लिया बदला* महाराष्ट्र के पालघर शहर में एक दिल दहला देने वाली घटना सामने आई है। एक ऑटो ड्राइवर अपने गुस्से पर काबू नहीं रख पाया और उसने चार साल के मासूम बच्चे पर बेरहमी से हमला कर दिया, जिससे समाज में कोहराम मच गया है। इस घटना की वजह आरोपी और बच्चे के पिता के बीच हुई बहस थी। यह लड़ाई, जो छोटी सी बात पर शुरू हुई थी, गंभीर हो गई, जिससे ड्राइवर का गुस्सा भड़क गया। हालांकि, यह बात कि उसने अपना गुस्सा पिता पर नहीं, बल्कि मासूम बच्चे पर निकाला, उसकी बेरहमी का सबूत बन गई। हमले के दौरान, आरोपी ने चार साल की बच्ची को पकड़कर ज़मीन पर गिरा दिया और उसे बुरी तरह पीटा। वहीं रुके बिना, उसने उस पर बुरी तरह हमला किया और लोहे की रॉड से उसके सिर पर वार किया। इस बेरहमी से हुई घटना में बच्ची गंभीर रूप से घायल हो गई। स्थानीय लोगों ने तुरंत मदद की और घायल बच्ची को अस्पताल पहुंचाया। डॉक्टरों ने कहा कि उसकी हालत अभी बहुत नाजुक है। जानलेवा हालत में इलाज चल रहा है। घटना की जानकारी मिलने पर पुलिस ने तुरंत कार्रवाई करते हुए आरोपी को गिरफ्तार कर लिया। केस दर्ज कर लिया गया है और जांच चल रही है। इस घटना से स्थानीय लोगों में गहरा गुस्सा है।1
- *సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్,వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి* కోరుట్ల మార్చి 31 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్ ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్‌తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్‌పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు4
- బెల్లంపల్లి భుచియపల్లి 100 రోజుల పని daggara thabelu kanabadindi chudandi frinds endrikaya varsanikichani poyindi adavilo chanipoyindi endrikichha thabelu brathike vundi water lo ledu in..............................1
- నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామానికి చెందిన ఆడే రమేష్ (టీచర్) పదవి విరమణ సందర్భంగా ఆయన నివాసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ హాజరై టీచర్ రమేష్ ని శాలువాతో సన్మానించి వారి సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.1
- *కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి* *బొజ్జ ఆశన్న సీఐటీయూ జిల్లా అధ్యక్షులు* ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉట్నూర్ మండల కేంద్రంలో ITDA కార్యాలయం ముందర బ్లాక్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో *సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ.....* కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ఈ నాలుగు లేబర్ కోడ్స్ అమలు అయితే కార్మికులు తమకు అందే హక్కులన్నీ కోల్పోతారు కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు *బ్లాక్ డే* సందర్భంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్మికులు కోరేటివి గొంతమ్మ కోరికలు కావు కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలి.పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ,ఉద్యోగ భద్రత కలిపించాలి, కార్మికుల ఇతర డిమాండ్స్ అన్నిటినీ పరిష్కారం చేయాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లు 2022 ను ఉపసంహరించుకోవాలని కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కారం చేయలేని ఎడల రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తామని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి రత్నమాల అంగన్వాడి యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ముక్త,స్వర్ణలత మండల నాయకులు పార్వతి,,రేణుక,లక్ష్మి,సురేఖ,పద్మ, కళావతి, జయ, గ్రామపంచాయతీ యూనియన్ ఉట్నూర్ మండల కార్యదర్శి ఆత్రం సుందర్, మండల నాయకులు పూర్కా ప్రభు,భారత్ తదితరులు పాల్గొన్నారు.2
- రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన పవర్ ట్రిల్లర్ వ్యవసాయ పరికరాలను ఎమ్మెల్యే అందచేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతులు పంటల మార్పిడి విధానాన్ని అనుసరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.2