వీణవంక మండలంలోని విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని ఎస్సై ఆవుల తిరుపతి సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్-26) సందర్భంగా, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వీణవంక మండలంలోని చల్లూర్ ప్రభుత్వ పాఠశాల, ఘన్ముక్ల మోడల్ పాఠశాలల్లో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాల గురించి వివరించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, విక్రయాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
వీణవంక మండలంలోని విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని ఎస్సై ఆవుల తిరుపతి సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్-26) సందర్భంగా, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వీణవంక మండలంలోని చల్లూర్ ప్రభుత్వ పాఠశాల, ఘన్ముక్ల మోడల్ పాఠశాలల్లో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాల గురించి వివరించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, విక్రయాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
- కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 87వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సోమవారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని, కరీంనగర్ కార్పొరేషన్ 27వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ బోట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్ లతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇదే సందర్భంగా సుభాష్ నగర్‌లోని ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ, బలమైన, ఐక్యమైన, స్వయం సమృద్ధమైన భారతదేశాన్ని నిర్మించాలనే ఆశయంతో క్రాంతి వీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన 'ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్' 87 వసంతాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమన్నారు. గడిచిన 87 ఏళ్లుగా AIFB పార్టీ జాతీయవాదం, సామాజిక న్యాయం, లౌకికవాదం, సామాన్య ప్రజల సాధికారత, వారి హక్కుల కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాడుతోందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు, స్ఫూర్తితో సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. "నన్ను రక్తాన్ని అడగండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను!" అన్న నేతాజీ గర్జన నేటి యువతలో ప్రవహించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్య ఫలాలు సమాజంలో చివరి వరుసలో ఉన్న పేదవాడికి అందినప్పుడే నేతాజీ కలలుగన్న నిజమైన భారతదేశం సాకారమవుతుందని స్పష్టం చేశారు. సమాజంలోని అసమానతలపై, అన్యాయాలపై ప్రశ్నించే తత్వమే నేతాజీ మార్గమని, కుల మత బేధాలకు అతీతంగా ప్రగతిశీల నవ భారత నిర్మాణం కోసం యువత అంతా ఏకమై భాగస్వాములు కావాలని కోరారు. చివరగా, "ఏకం అవ్వండి! పోరాడండి! నేతాజీ మార్గంలో భారతదేశాన్ని పునర్నిర్మించండి! జై హింద్!" అని నినాదాలు చేశారు. ఈ వేడుకల్లో 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సత్యారావు, బద్రినేత, AISB విద్యార్థి సంఘం నాయకులు అతికం రాజశేఖర్ గౌడ్, గూడా కిష్టయ్య, రాహుల్, సజ్జు, సాగర్ బాబాన్ సహా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.3
- కరీంనగర్‌లోని గాంధీ రోడ్డు ప్రాంతంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నల్లమచ సుగుణమ్మ (82) అనే వృద్ధురాలు తన ఇంట్లోని చేదబావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ విషయాన్ని కుటుంబీకులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఫైర్ రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే వృద్ధురాలు మృతిచెందడంతో, సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.1
- వరంగల్‌లో అజం జాహీ మిల్స్ మాడిఫైడ్ వాలంటరీ రిటైర్డ్-2002 కార్మికుల అసోసియేషన్ (MVRS) ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. జూన్ 25న జరగనున్న అజం జాహీ మిల్స్ భూముల వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా కార్మికులు తీవ్రంగా డిమాండ్ చేశారు. తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు సూచించిన లక్ష్మీపురం, ఖిలా వరంగల్ పరిధిలోని నిర్దేశిత సర్వే నంబర్లలోనే తమకు ప్లాట్లు కేటాయించాలని వారు కోరారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అనంతరం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీకి అందజేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం ఆదవిపదిర గ్రామస్తులు తమ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. వీర్నపల్లి మండల కేంద్రం నుండి ఆదవిపదిరకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద తాత్కాలికంగా వేసిన డైవర్షన్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. వర్షాలు పడితే ఆ రోడ్డు కొట్టుకుపోయి, మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రానికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన చెందారు. కావున, అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేశారు.4
- జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.3
- హరీష్ రావు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన పగబడుతారని ఆరోపించారు. ప్రభుత్వం ఎస్బీఐకి కేటాయించిన భూమిని విక్రయించిన తర్వాత, ఇప్పుడు ప్రశ్నించినందుకు ఎస్బీఐని నిషేధిస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), వరల్డ్ బ్యాంక్ కూడా రేవంత్ రెడ్డి మాట వినకపోతే వాటిని కూడా నిషేధిస్తాడంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. చివరగా, రేవంత్ రెడ్డి వీటన్నింటినీ నిషేధించి కొత్తగా 'కొండల్ రెడ్డి బ్యాంక్' పెడతారేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.1
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. పుట్ట మధుకు సంబంధించిన దాదాపు రూ.900 కోట్ల ఆస్తుల చిట్టా తమ వద్ద సిద్ధంగా ఉందని కరీంనగర్ నగరంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ మూడు వేల కోట్లు దోచుకుంటే, పుట్ట మధుకు తొమ్మిది వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని గజ్జల కాంతం నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్‌లు లక్షల కోట్లు సంపాదిస్తే, గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లు వెనకేశారని ఆరోపించారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ కాకముందు పుట్ట మధు ఆస్తులు ఎంత, ప్రస్తుతం ఎంత అనే విషయాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేయడంతో పాటు, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. కేవలం ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి వేల కోట్ల ఆస్తులు ఎలా సాధ్యమని గజ్జల కాంతం ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఇసుక దందా, గంజాయి వ్యాపారాలు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో దళిత వ్యక్తిపై దాడులు చేయించడమే కాకుండా, సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతుల హత్య ఉదంతం వెనుక ఉన్నది పుట్ట మధు కాదా అని నేరుగా ప్రశ్నించారు. గతంలో మంథని మధును చంపి కాలువలో పడేసింది కూడా పుట్ట మధు అనుచరులేనని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాద రావు పెట్టిన రాజకీయ బిక్షతోనే పుట్ట మధు ఈ స్థాయికి వచ్చారని గుర్తు చేస్తూ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇంటి గేటు వద్ద నిలబడి, ఆయన దయతో జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం వచ్చిందన్న పాత చరిత్రను గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మంత్రి శ్రీధర్‌బాబు గురించి మాట్లాడే నైతిక అర్హత పుట్ట మధుకు లేదని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. తాను గనుక నోరు తెరిస్తే పుట్ట మధు తట్టుకోలేక ఊరేసుకునే పరిస్థితి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టి ప్రజాధనాన్ని దోచుకుందని గజ్జల కాంతం ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల పాల్జేసిందని, అందులో రూ.3 లక్షల కోట్లను దోచుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రూ.1.50 లక్షల కోట్ల వ్యయంలో లక్ష కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వేల కోట్ల విలువైన సుమారు 30 వేల ఎకరాల భూములను కూడా ఆక్రమించారని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బొంద పెడతారని, అది బీజేపీలో విలీనం కావడం ఖాయమని ఆయన రాజకీయ జోస్యం చెప్పారు. పదేళ్ల పాటు దొర కుటుంబాన్ని నమ్మి మోసపోయిన ప్రజలు ఇకపై ఆ పార్టీని మరో పదేళ్లయినా నమ్మే పరిస్థితి లేదని గజ్జల కాంతం స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సముద్రాల అజయ్, కేశవేని రవీందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.4
- వరంగల్‌లో నిర్మాణం పూర్తయిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరితగతిన ప్రారంభించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలు, ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి, ఆసుపత్రిని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఆసుపత్రి సేవలు ప్రారంభమైతే, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు తదితర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. ప్రస్తుతం ప్రత్యేక వైద్యం కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోందని, ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే స్థానికంగానే నాణ్యమైన చికిత్స పొందే అవకాశం కలుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ ఆసుపత్రిని త్వరగా ప్రారంభించి ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మాణం పూర్తయినా సేవలు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆవేదనతో ఎదురుచూస్తున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో, మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా వరుణ దేవుడు కరుణించకపోవడంతో, గ్రామ ప్రజలు కప్పతల్లి ఆట ఆడి గ్రామంలోని దేవాలయాల్లోని దేవతామూర్తులకు జలాభిషేకాలు చేశారు. అనంతరం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం కష్టాలు తొలగి, పంటలు బాగా పండాలని, చెరువులు, కుంటలు నిండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని దేవుళ్లను ప్రార్థించినట్లు తెలిపారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1