మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో మంగళవారం ప్రమాదం జరిగింది. మదనపల్లి పట్టణం ఎస్టేట్లో గల కరెంట్ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నట్లు సమాచారం. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, వైసిపి మదనపల్లి మండల పార్టీ పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనం కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో మంగళవారం ప్రమాదం జరిగింది. మదనపల్లి పట్టణం ఎస్టేట్లో గల కరెంట్ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నట్లు సమాచారం. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, వైసిపి మదనపల్లి మండల పార్టీ పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనం కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో మంగళవారం ప్రమాదం జరిగింది. మదనపల్లి పట్టణం ఎస్టేట్లో గల కరెంట్ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నట్లు సమాచారం. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, వైసిపి మదనపల్లి మండల పార్టీ పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనం కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో మంగళవారం ప్రమాదం జరిగింది. మదనపల్లి పట్టణం ఎస్టేట్లో గల కరెంట్ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నట్లు సమాచారం. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, వైసిపి మదనపల్లి మండల పార్టీ పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనం కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.
- గాండ్లపెంట కటారుపల్లి గ్రామంలో జరిగిన వేమన బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగ ళవారం ఉట్ల తిరుణాల జరిగింది. మద్ది వారిగొంది గ్రామానికి చెందిన సాయికుమార్ నాయుడు టీం సభ్యులు సాధించుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా వేమన ఉట్ల తిరుణాల ఆ గ్రామానికి చెందిన వారే సాధించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వేమన భక్తులు యువతకు ప్రశంసించారు. వేమన ఆలయ పీఠాధిపతులు నందవేమారెడ్డి మరి కొంతమంది అర్చకులు యువత పాల్గొన్నారు.1
- ఒంటిమిట్ట శ్రీకోదండ_రామాలయం. పూర్తి వివరణ: ఏకశిలానగరి.. విశేషాల కోదండ రామయ్య ఆలయం ప్రత్యేకతలకు నిలయం. చారిత్రక , రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం. ఒకే శిలపై కొలువైన సీతారామలక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం.. ఓ అద్భుతం. ఎత్తయిన గోపురాలు.. విశాలమైన ఆలయ రంగమంటపం.. శిల్పకళా వైభవం.. మహాద్భుతం. రామ , లక్ష్మణ తీర్థాలు జలసిరికి నిదర్శనం. హనుమ లేని రాముడి కోవెల.. పండువెన్నెల్లో సీతారాముల కల్యాణం.. విదేశీయులు మెచ్చిన దేవాలయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్య క్షేత్రంలో ప్రతీదీ అపురూపమే.. రామతీర్థం.. నేటికీ పదిలం రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరెట్టని సీతమ్మ ప్రశ్నించింది. సీతాదేవికి దప్పిక ఉన్నట్లు దాశరథి భావించాడు.. తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు. పుడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగసిపడింది. జాంబవంతుడి ప్రతిష్ట, ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తప్పస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. రామయ్య నడయాడిన నేల శ్రీరామచంద్రుడు తండ్రిమాట కోసం అరణ్యవాసం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య వెంట ధర్మ పత్ని సీతమ్మ , సోదరుడు లక్ష్మణుడు కదలి వచ్చారు. వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీ రాముడు పర్యటించాడు. ఆ దివ్య స్వరూపుడు పాద స్పర్శతో ఆధ్యాత్మిక క్షేత్రం పునీతమైంది. మృకుండ మహాముని ఆశ్రయంలో యజ్ఞాలు , యాగాలు జరిగేవి. రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. ఆ రాక్షస బాధల నుంచి రామయ్య విముక్తి కల్పించినట్లు పురాణగాథ వాడుకలో ఉంది. హనుమ లేని రాముడి కోవెల హనుమంతుడు ఆగమనానికి మునుపే ఈ ప్రాంతంలో శ్రీ రామచంద్రమూర్తి సంచరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయస్వామి రామయ్య చెంత కనిపించలేదు.. వెన్నెల్లో కల్యాణం:-శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి..ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం.పురాణ వేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో రాముడితోపాటు లక్ష్మణ , భరత , శత్రఘ్నల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి.చరిత్ర ప్రకారం బుక్కరాయులు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహించాలి.రామాయణంలో శ్రీరామచంద్రుని కళ్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కళ్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కళ్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి పూట వచ్చింది. లగ్నశుద్ది చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతుండడం విశేషం.రాత్రి వేళ కల్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది.. బుక్కరాయలు చంద్రవంశానికి చెందిన వారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కళ్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు. ఒంటిమిట్ట ప్రాంతం 1340లో అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం మృకుండాశ్రమం మాత్రమే ఉండేది. ఆ ప్రాంత బోయ నాయకులైన ఒంటడు - మిట్టడు అక్కడికి వచ్చిన కంపరాయులుకు అక్కడి రామతీర్థంలోని నీటిని ఇచ్చి దాహం తీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమై ఉన్న గుడిని చూపి అభివృద్ధి చేయాలని వారు రాజును కోరారు. కంపరాయలు అంగీకరించి గుడి నిర్మాణంతోపాటు ఊరికి , ప్రజలకు ఆదరువుగా ఉంటుందని భావించి సమీపంలో చెరువు నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణ బాధ్యతలను ఒంటడు , మిట్టడులకు అప్పగించారు.గుడి అర్చకుల సౌకర్యం కోసం గుడిలోని ఇతర పెద్ద , చిన్న ఉద్యోగుల కోసం గ్రామంలోని 72 రకాల సేవలు అందించే ప్రజల కోసం ఆయన చెరువును పంచారు. చెరువు సహకారంతో పొలాల ద్వారా వచ్చే ఫలసాయాన్ని అనుభవిస్తూ ఆలయంలో రామునికి సేవలు అందిస్తూ అభివృద్ధి చేయాలని శాసనం చేశారు.కమనీయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తరువాత పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో జానకి రాముల పరిణయ ఘట్టాని అట్టహాసంగా నిర్వహించడం తరతరాలుగా ఆనవాయతీగా వస్తోంది.పెళ్లికి మునుపు సద్గుణ సంపన్నుడైన కళ్యాణరాముడు , లోకోత్తమ సౌందర్యవతి సీతమ్మను అందంగా ముస్తాబు చేస్తారు. కోదండ రామాలయంలో రెండు చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మంటపాలని పిలుస్తారు.కళ్యాణం రోజు ఈ రెండు మంటపాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపున్న మండపంలో రామయ్య , తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువుదీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఆ తరువాత కళ్యాణ వేదికపై కళ్యాణం నిర్వహిస్తారు. .రామయ్య రథం కథ ఇదీ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది.ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. కడప కైఫీయత్తుల్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి.1605–1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు. బ్రహ్మోత్సవాలలో ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. దీన్ని అత్యంత సుందరంగా ఉండేటట్లు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథ శిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవముండేది. రథోత్సవ సమయంలో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రథంపై రథ శిల్పులు కూడా ఉండే అవకాశం లభించింది.ఆలయంలో తూర్పు ఎదుర్కోలు మండపం వద్ద గల తూర్పు మహా ప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కైఫీయత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది.రామ మందిరం.. సాహితీ సౌరభం ఒంటిమిట్ట రామయ్య సేవలో ఎందరో కవులు తరించారు. అయ్యల రాజు తిప్పయ్య సా.శ. 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకీనాయక మకుటంతో ఆయన వెలువడించిన శతకం లభ్యమైంది. అయ్యల రాజు రామభద్రుడు ఒంటిమిట్టలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రామాభ్యుదయం కావ్యం ఆయన కలం నుంచి జాలువారింది. బమ్మెర పోతనామాత్యుడు మహాకవి. భోగని దండకం రచించారు. ఆ తరువాత భక్తితో భాగవతం రచన చేసి జగదభిరాముడికి అంకితం చేశారు. ఇంకా పలు గ్రంథాలను రాశారు. వావిలి కొలను సుబ్బారావు(వాసుదాసు) వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. కోదండ రామస్వామిని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. వర కవి నల్లకాలువ అయ్యప్ప , ఉప్పు గొండూరు వెంకట కవి , మాల ఓబన్న తదితర కవులు రాముడిని ఆరాధించి సాహితీ కృషి చేశారు. రాచరికం.. రాజసం సా.శ. 1356–77 వరకు విజయనగర సామ్రాజ్య పాలకుడు బుక్కరాయల సా.శ. 1600–1648 మధ్య కాలంలో సిద్దవటాన్ని పాలించిన మట్లిరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మట్లి అనంతరాజు పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి విశేష స్థాయిలో జరిగింది. అద్భుత శిల్పకళా చాతుర్యం ఆ నాటి శిల్పుల ప్రావీణ్యానికి అద్దం పడుతోంది. ఆ తర్వాత మట్లి కుమార అనంతరాజు పర్యవేక్షణలో కల్యాణ మండపం , ఎదుర్కోలు మండపాలు , ప్రసాద శాల నిర్మాణానికి చొరవ తీసుకున్నారు.2
- అభివృద్ధి, సంక్షేమాలే కూటమి ప్రభుత్వ అజెండా - రేగడిచెలిక గ్రామంలో 55 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. - చేనేతలకు నేటి నుంచి అమలు కానున్న ఉచిత విద్యుత్ పధకం. - ఇఫ్కో కోసాన్ సెజ్ లో 10 వేల 705 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు రాబోతున్నాయి. - సిఎం చంద్రబాబు నాయుడు చొరవతోనే గమేషా కంపెనీ స్థాపన. - ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ. - రైతులు పండించిన ప్రతి వడ్ల గింజ ప్రభుత్వం తీసుకుంటుంది. - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొడవలూరు మండలం రేగడిచెలిక గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రైన్లతో పాటు 15 లక్షలతో నిర్మించిన పంచాయితీ కార్యాలయ ప్రహారి గోడ ప్రారంభోత్సవ కార్యకారక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమ అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభత్వం అధికారంలోనికి వచ్చిన 21 నెలల్లో కొడవలూరు మండల వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం గిట్టుబాటు ధరకు సేకరిస్తుందన్నారు. గత 30 ఏళ్లుగా నిర్లక్షానికి గురైన ఇఫ్కో కిసాన్ సెజ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. మరో ఏడాదిలో ఇఫ్కో కోసాన్ సెజ్ లో 10 వేల 705 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షలు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఐటి మంత్రి లోకేష్ హామీ కార్యరూపం దాల్చనుందన్నారు.ఏప్రియల్ ఒకటి నుంచి చేనేత వర్గాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తు పధకాన్ని అమలులోకి తీసుకురానుందన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగావినియోగించవచ్చన్నారు. ఈ పధకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 531 మంది చేనేతలకు లబ్ది చేకూరనుందనాన్రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడాతూ సిఎం చంద్రబాబు నాయుడు చొరవ కారణంగానే 2016 లో విండ్ పవర్ ఫ్యాన్లు తయారు చేసే గమేషా కంపెనీ కంపెనీ స్థాపన జరిగిందన్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టబద్ధమైన హామీ యివ్వాలని శాసనసభలో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కిసాన్ సెజ్ లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు సంబంధించి శిక్షణ యిచ్చి కిసాన్ సెజ్ లో ఏర్పాటు చేసే పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మేం చేసిన అభివృద్ధి పనులు మీరు ఎలా ప్రారంభోత్సవం చేస్తారనే వైసిపి నేతలకు శంఖుస్థానాలు చేసాక పని పూర్తి చేయాలని టెంకాయ కొట్టేసి మేం చెప్పుకుంటే కుదరదని సూటిగా సమాధానం చెప్పారు. కూటమి ప్రభుత్వ 21 నెలల కాలంలో రేగడిచెలిక గ్రామాభివృద్ధి కోసం 1 కోటి 6 లక్షల 5 వేల579 రూపాయలు వెచ్చించిన అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు వివరించారు. సర్పంచుల పదవీ కాలం రేపటితో ముగియనుందన్నారు. స్థానిక సంస్థల నిధులను గత ప్రభుత్వం పక్క దారి పట్టించడంతో అభివృద్ధి చేయలేక అసంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నారనని స్థానిక సంస్థల బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభత్వ చొరవను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల ముఖ్య నాయకులు మరియు టిడిపి కూటమి పార్టీల స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.4
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ, వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్యకు సోమవారం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలివచ్చి రంగయ్యపై పూల వర్షం కురిపించారు. వైసీపీ నేతలతో పాటు ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఎ రెన్యువల్ కావడానికి రంగయ్య కారణమంటూ జనాలు నినాదాలు చేశారు. జై జగన్, జై తలారి రంగయ్య అంటూ నినాదాలు చేశారు.1
- రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్ గ్రామ సమీపంలో జరిగిన దారి దోపిడీ రేసును పోలీసులు వేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో బొమ్మనహాళ్ ఇంచార్జ్ ఎస్పై గురు ప్రసాద్ రెడ్డి, కనేకల్ ఎస్పై నాగ మధు బృందం ఆదివారం కనేకల్ మండలం ఎర్రగుంట వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, నేపుకల్ గ్రామానికి చెందిన రైతు బోయ గోవిందు 2026 జనవరి 11న గొర్రెల విక్రయించి రూ.1.50 లక్షల నగదుతో ద్విచక్ర వాహనంలో గ్రామానికి వెళ్తుండగా ముగ్గురు నిందితులు బ్లాక్ స్కార్పియో వాహనంలో వచ్చి కత్తితో బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరెస్టు చేసిన నిందితుల్లో గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన బెస్త ఓబులేసు ఇలియాన్ మనోహర రెడ్డి, మహేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చక్కెర రెడ్డి, పామిడి పట్టణం నెహ్రు నగర్కు చెందిన పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, నార్పల మండలం కర్ణపుడి గ్రామానికి చెందిన బెస్త మహేంద్ర ఉన్నారు. ప్రధాన నిందితుడు ఓబులేసు గత జనవరిలో బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో హోల్సేల్ చక్కెర, ఐటీసీ సిగరెట్లు ఏజెంటుగా వ్యాపారం ప్రారంభించి స్థానికుల నమ్మకాన్ని పొందినట్లు పోలీసులు తెలిపారు.1
- ఆలూరు లో మంగళవారం మధ్యాహ్నం వర్షం పడింది ఉదయం నుండి విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆకాశం నల్లబడి పెద్ద పెద్దగా గాలులు వేస్తూ వర్షం కురిసింది. వేరుశనగ, మొక్కజొన్న, పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రావడంతో పంట నష్టపోయి ప్రమాదం ఉందని పలువురు రైతులు తెలిపారు.1
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు మూడవరోజు వైభవంగా నిర్వహించారు. మంగళవారం మెట్ల తిరుణాల వైభవంగా నిర్వహించారు. ఉట్ల తిరుణాలకు భారీ ఎత్తున పలు ప్రదేశాల నుంచి తిలకించడానికి తరలివచ్చారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీసులు భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. పీఠాధిపతి నంద వేమారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.1
- బద్వేలు:శ్రీ వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి వారిని కుంకుమపువ్వు సీరియల్ హీరోయిన్ ప్రిన్సి బి, కృష్ణన్ దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న కుంకుమపువ్వు సీరియల్ హీరోయిన్ ప్రిన్సీ బి.కృష్ణన్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకున్న సీరియల్ హీరోయిన్ ప్రిన్సి బి. కృష్ణన్ కు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాల శాలువాతా సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేయడం జరిగింది. మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయాంజనేయ స్వామి వారిని ఈ మంగళవారం దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతం. వేద పండితులు వీరేశ చార్యులు ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొనడం ఎంతో భక్తిని, ప్రశాంతతను ఇచ్చిందన్నారు,ఆలయ నిర్వాహకులు వల్లంకొండు వెంకటరమణ శాలువాతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలు అందజేయడం చాలా సంతోషంగా అనిపించిందని.ఈ పుణ్యక్షేత్ర దర్శనం నాకు మరువలేని అనుభూతిని అందించిందని అన్నారు, ఈ కార్యక్రమంలో పోకల సుబ్బారెడ్డి వారి సతీమణి సుజాత పోకల నాగేశ్వర్ రెడ్డి మరియు పలువురు పాల్గొన్నారు.1
- పార్లపల్లిలో విపిఆర్ ఫౌండేషన్ 'అమృత ధార' వాటర్ ప్లాంట్ ప్రారంభం - విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీరు. - కోవూరు నియోజకవర్గంలో ఇది 26 వ వాటర్ ప్లాంట్. - పార్లపల్లిలో గ్రామంలో 20 నెలల్లో 1 కోటి 2 లక్షలతో అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము ప్రజా సేవకులమని పదవుల కోసం కాకుండా ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అమృత ధార' ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పవిత్ర సంకల్పంతో 2016లో ఉదయగిరిలో ప్రారంభమైన అమృత ధార ప్రస్థానం నేడు జిల్లా అంతటా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్ అని, దీని నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. విడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రులు డాక్టర్లు ఉండడం లేదని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లా వైద్యాధికారి తో ఫోన్లో మాట్లాడి హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ లో డాక్టర్లను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పార్లపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ జల్ జీవన్ మిషన్ ద్వారా 36 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్, 11 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణం, 3 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేసిన విషయాన్ని ఆమె తెలిపారు. ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ మరియు పంచాయతీ నిధులతో కలిపి మొత్తం 9 సి.సి. రోడ్ల నిర్మాణం చేసామన్నారు.ఆరగాణి కాలువపై 10 లక్షలతో కల్వర్టు, CSR నిధులతో స్మశాన వాటికల్లో షెల్టర్ల నిర్మాణం గురించి చెబుతూ గడిచిన 20 నెలల పార్లపల్లి గ్రామంలో 1 కోటి 2 లక్షలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్మశాన వాటిక భూమి సమస్య పరిష్కారానికి తన వంతుగా రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ముగ్గురు అనారోగ్య బాధితులకు CMRF ద్వారా రూ. 2 లక్షల 76 వేల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. 1 కోటి 70లక్షల రూపాయలతో పార్లపల్లి నుండి చవటపాలెం వరకు కనెక్టింగ్ రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే ఈ పనులను మంజూరు చేయించి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈసందర్భంగా హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.4