logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం ఈర్ణపాడు నుంచి ఓంకారం పుణ్యక్షేత్రానికి వెళ్లే రోడ్డు మార్గంలో చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా శుక్రవారం ఓంకారం పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులు సింగవరం మీదుగా ప్రయాణించాల్సి వస్తుందని ప్రయాణికులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, రహదారిపై పడిన చెట్లను తక్షణమే తొలగించి, రవాణాను పునరుద్ధరించాలని వాహనదారులు, భక్తులు సంబంధిత అధికారులను కోరారు.

16 hrs ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
16 hrs ago

నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం ఈర్ణపాడు నుంచి ఓంకారం పుణ్యక్షేత్రానికి వెళ్లే రోడ్డు మార్గంలో చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా శుక్రవారం ఓంకారం పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులు సింగవరం మీదుగా ప్రయాణించాల్సి వస్తుందని ప్రయాణికులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, రహదారిపై పడిన చెట్లను తక్షణమే తొలగించి, రవాణాను పునరుద్ధరించాలని వాహనదారులు, భక్తులు సంబంధిత అధికారులను కోరారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం ఈర్ణపాడు నుంచి ఓంకారం పుణ్యక్షేత్రానికి వెళ్లే రోడ్డు మార్గంలో చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా శుక్రవారం ఓంకారం పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులు సింగవరం మీదుగా ప్రయాణించాల్సి వస్తుందని ప్రయాణికులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, రహదారిపై పడిన చెట్లను తక్షణమే తొలగించి, రవాణాను పునరుద్ధరించాలని వాహనదారులు, భక్తులు సంబంధిత అధికారులను కోరారు.
    1
    నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం ఈర్ణపాడు నుంచి ఓంకారం పుణ్యక్షేత్రానికి వెళ్లే రోడ్డు మార్గంలో చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా శుక్రవారం ఓంకారం పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులు సింగవరం మీదుగా ప్రయాణించాల్సి వస్తుందని ప్రయాణికులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, రహదారిపై పడిన చెట్లను తక్షణమే తొలగించి, రవాణాను పునరుద్ధరించాలని వాహనదారులు, భక్తులు సంబంధిత అధికారులను కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • నాగలూటి నుండి నందికొట్కూరు వరకు తారు రోడ్డును నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన నాయకులతో కలిసి ఆ రహదారిని పరిశీలించారు. రోడ్డు అస్తవ్యస్తంగా తయారై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ తక్షణమే స్పందించి తారు రోడ్డును వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల శేఖర్ కూడా పాల్గొన్నారు.
    1
    నాగలూటి నుండి నందికొట్కూరు వరకు తారు రోడ్డును నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన నాయకులతో కలిసి ఆ రహదారిని పరిశీలించారు. రోడ్డు అస్తవ్యస్తంగా తయారై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ తక్షణమే స్పందించి తారు రోడ్డును వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల శేఖర్ కూడా పాల్గొన్నారు.
    user_Romanti Romeo
    Romanti Romeo
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో జూన్ 12న శిల్ప గర్జన చోటు చేసుకుంది.
    1
    నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో జూన్ 12న శిల్ప గర్జన చోటు చేసుకుంది.
    user_Sreenivasulu KM
    Sreenivasulu KM
    Local News Reporter ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి బిజినపల్లి మండలంలోని సల్కర్‌పేట గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో కూలీలతో మాట్లాడిన ఆయన, జాబ్ కార్డులు, వేతనాల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై ఆరా తీశారు. గ్రామీణ పేదలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ ప్రయోజనాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
    1
    నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి బిజినపల్లి మండలంలోని సల్కర్‌పేట గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో కూలీలతో మాట్లాడిన ఆయన, జాబ్ కార్డులు, వేతనాల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై ఆరా తీశారు. గ్రామీణ పేదలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ ప్రయోజనాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
    user_NAVADEEP
    NAVADEEP
    Nagarkurnool, Telangana•
    19 hrs ago
  • కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలుపుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జూన్ 12, శుక్రవారం బద్వేలులో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం బద్వేలు టౌన్ ఎన్జీవో కాలనీలోని సిద్ధవటం రోడ్డులో గల మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి మరియు నియోజకవర్గ యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి ఆధ్వర్యం వహించారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, రెండేళ్ల పాలన అభివృద్ధి కాదని, కేవలం వెన్నుపోటు మాత్రమేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు 'సూపర్ సిక్స్' పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని, ఆడబిడ్డ నిధి, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతులకు ఆర్థిక భరోసా, మహిళలకు సంక్షేమం వంటి హామీలు కేవలం ఎన్నికల మాయమాటలుగానే మిగిలిపోయాయని ఆయన మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమాన్ని అందించిన వైఎస్ జగన్ పాలనను ఆపేసి, పేద ప్రజల నోటికాడి ముద్దను లాక్కున్న ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమని ఆయన విమర్శించారు. అదేవిధంగా, ఎమ్మెల్యే డాక్టర్ సుధ మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారని, యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, మహిళలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ప్రచారాలకే పరిమితమైందని విమర్శించారు. ధరల పెరుగుదల, పన్నుల భారం, సంక్షేమ పథకాల కోతలతో సామాన్య ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవసాని ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ, 'మెగా డీఎస్సీ' పేరుతో లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసం చేశారని, ఉద్యోగాల పేరుతో యువత భవిష్యత్తుతో చెలగాటమాడారని విమర్శించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, వైసిపి నాయకులు బోడపాడు రామసుబ్బారెడ్డి, వైయస్సార్ కడప జిల్లా వైసిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు సింగమాల వెంకటేశ్వర్లు, బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు పుల్లయ్యతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
    3
    కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలుపుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జూన్ 12, శుక్రవారం బద్వేలులో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం బద్వేలు టౌన్ ఎన్జీవో కాలనీలోని సిద్ధవటం రోడ్డులో గల మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి మరియు నియోజకవర్గ యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి ఆధ్వర్యం వహించారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, రెండేళ్ల పాలన అభివృద్ధి కాదని, కేవలం వెన్నుపోటు మాత్రమేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు 'సూపర్ సిక్స్' పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని, ఆడబిడ్డ నిధి, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతులకు ఆర్థిక భరోసా, మహిళలకు సంక్షేమం వంటి హామీలు కేవలం ఎన్నికల మాయమాటలుగానే మిగిలిపోయాయని ఆయన మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమాన్ని అందించిన వైఎస్ జగన్ పాలనను ఆపేసి, పేద ప్రజల నోటికాడి ముద్దను లాక్కున్న ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమని ఆయన విమర్శించారు.

అదేవిధంగా, ఎమ్మెల్యే డాక్టర్ సుధ మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారని, యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, మహిళలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ప్రచారాలకే పరిమితమైందని విమర్శించారు. ధరల పెరుగుదల, పన్నుల భారం, సంక్షేమ పథకాల కోతలతో సామాన్య ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవసాని ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ, 'మెగా డీఎస్సీ' పేరుతో లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసం చేశారని, ఉద్యోగాల పేరుతో యువత భవిష్యత్తుతో చెలగాటమాడారని విమర్శించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, వైసిపి నాయకులు బోడపాడు రామసుబ్బారెడ్డి, వైయస్సార్ కడప జిల్లా వైసిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు సింగమాల వెంకటేశ్వర్లు, బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు పుల్లయ్యతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • వైసీపీ ఇన్‌ఛార్జ్ ధారా సుధీర్ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నందికొట్కూరులో వైసీపీ నిర్వహించిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. నందికొట్కూరులో టీడీపీ అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని ధారా సుధీర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
    1
    వైసీపీ ఇన్‌ఛార్జ్ ధారా సుధీర్ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నందికొట్కూరులో వైసీపీ నిర్వహించిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. నందికొట్కూరులో టీడీపీ అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు.

పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని ధారా సుధీర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
    user_Romanti Romeo
    Romanti Romeo
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • మహానందితో పాటు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మహానంది ఎస్ఐ ఎన్. రామ్మోహన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈనెల 9వ తేదీన మహానంది దేవస్థానం వెనుకవైపు గేట్ వద్ద నిలిపిన పల్సర్, హెచ్ఎఫ్ డీలక్స్ రెండు ద్విచక్రవాహనాలను మారుతాలతో స్టార్ట్ చేసి దొంగలించినట్లు ఆయన వెల్లడించారు. గుర్తించిన ముద్దాయిలు నంద్యాల పట్టణంలోని ఎంఎస్ నగర్ కు చెందిన పాలీ గోపీనాయక్, కర్నూలు పట్టణం షరీన్ నగర్ (ప్రస్తుతం ఎన్జీవో కాలనీకి చెందిన) మేనుగా రాజు, నంద్యాల పట్టణం దేవనగర్లోని నాగులకట్ట దగ్గర ఉన్న షేక్ సాబిర్ హుస్సేన్, డోన్ మండలం చిన్న మల్కాపురానికి చెందిన (ప్రస్తుతం గోస్పాడు మండలం యాళ్లూరులో నివసిస్తున్న) దొడ్డగాళ్ల ప్రకాష్ అని ఎస్ఐ పేర్కొన్నారు. వీరిని శుక్రవారం నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిలోని నందిపల్లెమెట్ట వద్ద బైక్ చోరీలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలను మరింత లోతుగా విచారించగా, నంద్యాల త్రీటౌన్ స్టేషన్ పరిధిలో ఒక మోటర్ సైకిల్ కేసు, ఆళ్లగడ్డ పట్టణం పరిధిలోని మరో కేసులో ఒక మోటర్ సైకిలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని ఎస్ఐ తెలిపారు. రికవరీ చేసిన నాలుగు ద్విచక్రవాహనాల విలువ రూ.2.70 లక్షలు ఉంటుందన్నారు. ఈ నలుగురు నిందితులు తాగుడుతోపాటు ఇతర వ్యవసనాలకు అలవాటుపడి తప్పుదారిలో నడుస్తూ దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు. త్వరితగతిన ద్విచక్ర వాహనాలను రికవరీ చేయడంతో జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్, నంద్యాల సబ్ డివిజన్ అధికారిని మంద జావలి ఆల్ఫోన్స్, పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారని ఎస్ఐ తెలిపారు. ఈ సమావేశంలో నంద్యాల రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
    1
    మహానందితో పాటు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మహానంది ఎస్ఐ ఎన్. రామ్మోహన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈనెల 9వ తేదీన మహానంది దేవస్థానం వెనుకవైపు గేట్ వద్ద నిలిపిన పల్సర్, హెచ్ఎఫ్ డీలక్స్ రెండు ద్విచక్రవాహనాలను మారుతాలతో స్టార్ట్ చేసి దొంగలించినట్లు ఆయన వెల్లడించారు.

గుర్తించిన ముద్దాయిలు నంద్యాల పట్టణంలోని ఎంఎస్ నగర్ కు చెందిన పాలీ గోపీనాయక్, కర్నూలు పట్టణం షరీన్ నగర్ (ప్రస్తుతం ఎన్జీవో కాలనీకి చెందిన) మేనుగా రాజు, నంద్యాల పట్టణం దేవనగర్లోని నాగులకట్ట దగ్గర ఉన్న షేక్ సాబిర్ హుస్సేన్, డోన్ మండలం చిన్న మల్కాపురానికి చెందిన (ప్రస్తుతం గోస్పాడు మండలం యాళ్లూరులో నివసిస్తున్న) దొడ్డగాళ్ల ప్రకాష్ అని ఎస్ఐ పేర్కొన్నారు. వీరిని శుక్రవారం నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిలోని నందిపల్లెమెట్ట వద్ద బైక్ చోరీలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలను మరింత లోతుగా విచారించగా, నంద్యాల త్రీటౌన్ స్టేషన్ పరిధిలో ఒక మోటర్ సైకిల్ కేసు, ఆళ్లగడ్డ పట్టణం పరిధిలోని మరో కేసులో ఒక మోటర్ సైకిలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని ఎస్ఐ తెలిపారు. రికవరీ చేసిన నాలుగు ద్విచక్రవాహనాల విలువ రూ.2.70 లక్షలు ఉంటుందన్నారు. ఈ నలుగురు నిందితులు తాగుడుతోపాటు ఇతర వ్యవసనాలకు అలవాటుపడి తప్పుదారిలో నడుస్తూ దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు.

త్వరితగతిన ద్విచక్ర వాహనాలను రికవరీ చేయడంతో జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్, నంద్యాల సబ్ డివిజన్ అధికారిని మంద జావలి ఆల్ఫోన్స్, పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారని ఎస్ఐ తెలిపారు. ఈ సమావేశంలో నంద్యాల రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.