logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైతు ఉద్యమ నేత, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సారంపల్లి మల్లారెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న సిపిఎం జనగామ జిల్లా నాయకత్వం జనగామ : రైతు ఉద్యమ నాయకుడు, సిపిఎం పార్టీ రాష్ట్ర నేత ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ఉద్యమ నిర్మాత సారంపల్లి మల్లారెడ్డి అంతిమయాత్ర మంగళవారం హైదరాబాదులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి ఎంజీఎం హాస్పిటల్ వరకు జరిగిన అంతిమ యాత్రలో సిపిఎం పార్టీ జనగామ జిల్లా నాయకత్వం పాల్గొని అభిమాన నాయకునికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి మాట్లాడుతూ రైతు ఉద్యమ నేతగా జనగామ ప్రాంతానికి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు తాగుందించాలని జరిగిన పోరాటానికి దిశా నిర్దేశం చేసేదానిలో ముఖ్యమైన పాత్ర పోషించిన నాయకుడు సారంపల్లి అన్నారు. నేడు జనగామకు వచ్చిన దేవాదుల ప్రాజెక్టులో సారంపల్లి మల్లారెడ్డి కృషి ఉందన్నారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దాంట్లో మల్లారెడ్డి సేవలు అమోఘమైనవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలు చేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వా లకు సూచనలు చేస్తూ వ్యవసాయ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించడం జరిగిందన్నారు. వ్యవసాయ విద్యాలయానికి, వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సూచనలు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా నీటిపారుదల రంగంపై సమగ్ర అవగాహన కలిగి ఉండి వాటి అమలు కోసం ఉద్యమాలు నడుపుతూ ప్రభుత్వాలు దృష్టికి తీసుకుపోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగిందన్నారు. భూ సమస్యలపై సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తి సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. బహుళ జాతి కంపెనీల ద్వారా బీటీ పత్తి విత్తనాల రేట్లు పెంచి కంపెనీలు రైతులను దోచుకుంటున్న క్రమంలో సుప్రీంకోర్టులో కేసు వేసి పత్తి విత్తనాలు రేట్లు పెంచకుండా రైతులకు అండగా ఉన్నారన్నారు. అనేక పుస్తకాలు వ్యాసాలు రాసి రైతులకు ప్రజలకు మేధావులకు అవగాహన కల్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారన్నారు. చనిపోయేంత వరకు నిస్వార్ధంగా రైతు ఉద్యమాలకు కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవ డానికి కృషి చేస్తామని మోకు కనకారెడ్డి అన్నారు. అంతిమయాత్ర అనంతరం మల్లారెడ్డి పార్థివ దేహాన్ని గాంధీ ఆసుపత్రికి పరిశోధనల కోసం కుటుంబం, పార్టీ అప్పజెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేష్, రాపర్తి సోమయ్య, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాష్ , ఉపేందర్, బి.నరేందర్, ఎం.రమేష్, బి.వెంకటేష్, బి.చందు నాయక్, ఎండి.షబానా, ఎండి.అజారుద్దీన్, నాయకులు ఎం.సారయ్య, మహేందర్, బి.సూరి, పి.కళ్యాణ్, పి.లలిత, ఎం.భవాని, ఆర్ మీట్యా నాయక్, వి.సోమయ్య, ఏ.రాజు, ఎం.ఎల్లయ్య, మల్లేష్, రాజ్ తదితరులు పాల్గొన్నారు.

9 hrs ago
user_P Jithender, Sr Reportar
P Jithender, Sr Reportar
Local News Reporter జనగాం, తెలంగాణ•
9 hrs ago
f021fd37-d3c4-4354-9848-549850d69113

రైతు ఉద్యమ నేత, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సారంపల్లి మల్లారెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న సిపిఎం జనగామ జిల్లా నాయకత్వం జనగామ : రైతు ఉద్యమ నాయకుడు, సిపిఎం పార్టీ రాష్ట్ర నేత ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ఉద్యమ నిర్మాత సారంపల్లి మల్లారెడ్డి అంతిమయాత్ర మంగళవారం హైదరాబాదులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి ఎంజీఎం హాస్పిటల్ వరకు జరిగిన అంతిమ యాత్రలో సిపిఎం పార్టీ జనగామ జిల్లా నాయకత్వం పాల్గొని అభిమాన నాయకునికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి మాట్లాడుతూ రైతు ఉద్యమ నేతగా జనగామ ప్రాంతానికి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు తాగుందించాలని జరిగిన పోరాటానికి దిశా నిర్దేశం చేసేదానిలో ముఖ్యమైన పాత్ర పోషించిన నాయకుడు సారంపల్లి అన్నారు. నేడు జనగామకు వచ్చిన దేవాదుల ప్రాజెక్టులో సారంపల్లి మల్లారెడ్డి కృషి ఉందన్నారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దాంట్లో మల్లారెడ్డి సేవలు అమోఘమైనవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలు చేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వా లకు సూచనలు చేస్తూ వ్యవసాయ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించడం జరిగిందన్నారు. వ్యవసాయ విద్యాలయానికి, వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సూచనలు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా నీటిపారుదల రంగంపై సమగ్ర అవగాహన కలిగి ఉండి వాటి

76863020-ac66-42f8-afe7-13c17c663642

అమలు కోసం ఉద్యమాలు నడుపుతూ ప్రభుత్వాలు దృష్టికి తీసుకుపోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగిందన్నారు. భూ సమస్యలపై సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తి సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. బహుళ జాతి కంపెనీల ద్వారా బీటీ పత్తి విత్తనాల రేట్లు పెంచి కంపెనీలు రైతులను దోచుకుంటున్న క్రమంలో సుప్రీంకోర్టులో కేసు వేసి పత్తి విత్తనాలు రేట్లు పెంచకుండా రైతులకు అండగా ఉన్నారన్నారు. అనేక పుస్తకాలు వ్యాసాలు రాసి రైతులకు ప్రజలకు మేధావులకు అవగాహన కల్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారన్నారు. చనిపోయేంత వరకు నిస్వార్ధంగా రైతు ఉద్యమాలకు కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవ డానికి కృషి చేస్తామని మోకు కనకారెడ్డి అన్నారు. అంతిమయాత్ర అనంతరం మల్లారెడ్డి పార్థివ దేహాన్ని గాంధీ ఆసుపత్రికి పరిశోధనల కోసం కుటుంబం, పార్టీ అప్పజెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేష్, రాపర్తి సోమయ్య, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాష్ , ఉపేందర్, బి.నరేందర్, ఎం.రమేష్, బి.వెంకటేష్, బి.చందు నాయక్, ఎండి.షబానా, ఎండి.అజారుద్దీన్, నాయకులు ఎం.సారయ్య, మహేందర్, బి.సూరి, పి.కళ్యాణ్, పి.లలిత, ఎం.భవాని, ఆర్ మీట్యా నాయక్, వి.సోమయ్య, ఏ.రాజు, ఎం.ఎల్లయ్య, మల్లేష్, రాజ్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జనగామ స్టేషన్ మీదుగా జేసీబీ లను రవాణా చేస్తున్న క్యారియర్ రైలు జేసీబీ వాహనాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెద్ద ఎత్తున రవాణా చేయడానికి ఉపయోగించే ప్రత్యేక రైలు ఆటోమొబైల్ క్యారియర్ రైలు(న్యూ మాడిఫైడ్ గూడ్స్) కాజీపేట జంక్షన్ మీదుగా వస్తూ జిల్లా కేంద్రమైన జనగామ రైల్వే స్టేషన్ లో ఆగడంతో వివిధ రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రజా రవాణా రైళ్ల కోసం జనగామ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఇవ్వడంతో ఈ గూడ్స్ ను నిలిపివేసినట్లు రైల్వే సిబ్బంది వివరించారు.ఆటోమొబైల్ కొరియర్ ట్రైన్ గా పిలువబడే ఈ గూడ్స్ రైలు కు 33 రేక్స్ ఉండగా ఒక రేక్స్ లో మూడు జెసిబి వాహనాలతో మొత్తంగా దాదాపు ఒక వంద జేసీబీ వాహనాలను సరఫరా చేసే ఈ రైలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మౌలాలి స్టేషన్ వరకు తీసుకువెళ్ళి అన్ లోడ్ చేయనున్నట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు.
    1
    జనగామ స్టేషన్ మీదుగా జేసీబీ లను రవాణా చేస్తున్న క్యారియర్ రైలు
జేసీబీ వాహనాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెద్ద ఎత్తున రవాణా చేయడానికి ఉపయోగించే ప్రత్యేక రైలు ఆటోమొబైల్ క్యారియర్ రైలు(న్యూ మాడిఫైడ్ గూడ్స్) కాజీపేట జంక్షన్ మీదుగా వస్తూ జిల్లా కేంద్రమైన జనగామ రైల్వే స్టేషన్ లో ఆగడంతో వివిధ రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రజా రవాణా రైళ్ల కోసం జనగామ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఇవ్వడంతో ఈ గూడ్స్ ను నిలిపివేసినట్లు రైల్వే సిబ్బంది వివరించారు.ఆటోమొబైల్ కొరియర్ ట్రైన్ గా పిలువబడే ఈ గూడ్స్ రైలు కు 33 రేక్స్ ఉండగా ఒక రేక్స్ లో మూడు జెసిబి వాహనాలతో మొత్తంగా దాదాపు ఒక వంద జేసీబీ వాహనాలను సరఫరా చేసే ఈ రైలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మౌలాలి స్టేషన్ వరకు తీసుకువెళ్ళి అన్ లోడ్ చేయనున్నట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు ఎందుకు.. ఏందీ గలీజ్ యవ్వారం? ఎన్నడన్నా చూసామా రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు వేయడం? రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు ఎందుకు.. ఏందీ గలీజ్ యవ్వారం? ఎన్నడన్నా చూసామా రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు వేయడం? రేపు రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్ల మీద అతని ఫొటోలు వేస్తారా? మొత్తం ఖమ్మం మంత్రుల అందరి ఫోటోలు వెయ్యకపోయారా – నిలదీసిన ఖమ్మం మహిళ
    1
    రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు ఎందుకు.. ఏందీ గలీజ్ యవ్వారం?

ఎన్నడన్నా చూసామా రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు వేయడం? 

రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు ఎందుకు.. ఏందీ గలీజ్ యవ్వారం?
ఎన్నడన్నా చూసామా రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు వేయడం? 
రేపు రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్ల మీద అతని ఫొటోలు వేస్తారా? 
మొత్తం ఖమ్మం మంత్రుల అందరి ఫోటోలు వెయ్యకపోయారా
– నిలదీసిన ఖమ్మం మహిళ
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    5 hrs ago
  • గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.
    1
    గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్
జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు.
గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు.
రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    22 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి
వారి నిత్య ఆదాయ వివరాలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం
వచ్చిందన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    23 hrs ago
  • జనగామ జిల్లా బస్టాండ్లో దొంగల చేతివాటం, పోలీసుల తనిఖీలు జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద రూ.20,600 నగదు అపహరణకు గురైంది. లింగాలఘణపురం మండలం కుందారానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
    1
    జనగామ జిల్లా బస్టాండ్లో దొంగల చేతివాటం, పోలీసుల తనిఖీలు
జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద రూ.20,600 నగదు అపహరణకు గురైంది. లింగాలఘణపురం మండలం కుందారానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    8 hrs ago
  • కమలాపూర్‌లో కొండచిలువ కలకలం.. సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. పొలంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు జాగ్రత్తగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను జూ పార్క్‌కు తరలించారు. వ్యవసాయ పొలాల్లో కొండచిలువ కనిపించడంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ప్రమాదం జరగలేదు.
    2
    కమలాపూర్‌లో కొండచిలువ కలకలం.. సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. పొలంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు జాగ్రత్తగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను జూ పార్క్‌కు తరలించారు.
వ్యవసాయ పొలాల్లో కొండచిలువ కనిపించడంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ప్రమాదం జరగలేదు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • జనగామ బస్టాండ్లో దొంగల హల్చల్ : ప్రయాణికుడి డబ్బు మాయం జిల్లా కేంద్రమైన జనగామ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద 20 వేల 6 వందల నగదు అపహరణకు గురైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసిన ఫలితం లేకపోవడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    జనగామ బస్టాండ్లో దొంగల హల్చల్ : ప్రయాణికుడి డబ్బు మాయం
జిల్లా కేంద్రమైన జనగామ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద 20 వేల 6 వందల నగదు అపహరణకు గురైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసిన ఫలితం లేకపోవడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    1
    మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం

సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం

రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు

గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి

గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం

దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్

తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.