logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వైఎస్సార్ విగ్రహం ధ్వంసం హేయమైన చర్య: జడ్పీటీసీ లోవరాజు పిఠాపురం, మార్చి 9: గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఎడమచేయిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడ్డాయి. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వంగా గీత ఆదేశాల మేరకు జడ్పీటీసీ ఉలవకాయల నాగ లోవరాజు ఆధ్వర్యంలో సోమవారం నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా లోవరాజు మాట్లాడుతూ.. విగ్రహాల ధ్వంసం సరికాదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంపల రాంబాబు, కె.సోమరాజు, అద్దాల రాజా తదితరులు పాల్గొన్నారు.

16 hrs ago
user_MANIKANTA SUVARNAM
MANIKANTA SUVARNAM
Local News Reporter పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
16 hrs ago
9e5d9146-1f51-46a8-9e69-e6fdc578ab24

వైఎస్సార్ విగ్రహం ధ్వంసం హేయమైన చర్య: జడ్పీటీసీ లోవరాజు పిఠాపురం, మార్చి 9: గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఎడమచేయిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడ్డాయి. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వంగా గీత ఆదేశాల మేరకు జడ్పీటీసీ ఉలవకాయల నాగ లోవరాజు ఆధ్వర్యంలో సోమవారం నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా లోవరాజు మాట్లాడుతూ.. విగ్రహాల ధ్వంసం సరికాదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంపల రాంబాబు, కె.సోమరాజు, అద్దాల రాజా తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మృతి చెందిన జర్నలిస్టు డేగల చినబాబు కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్కు అందజేత ఇటీవల మృతి చెందిన ఏబీఎన్ అన్నవరం రిపోర్టర్ డేగల చినబాబు కుటుంబానికి జర్నలిస్టుల ఫెడరేషన్ అండగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో చినబాబు కుటుంబ సభ్యులకు సోమవారం ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు చినబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చినబాబు మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్టకాలంలో జర్నలిస్టుల ఫెడరేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అధికార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చినబాబు జర్నలిజం రంగంలో ఎంతో అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఆయన ఎప్పుడూ ముందుండేవారని గుర్తుచేశారు. నిజాయితీ, నిబద్ధతతో వార్తలను అందించడంలో ఆయన చూపిన కృషి ఇతర జర్నలిస్టులకు ఆదర్శమని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని, జర్నలిస్టులు లేదా వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చినబాబు కుటుంబానికి సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నిరంతరం పని ఒత్తిడితో జర్నలిజం వృత్తిని చేస్తున్న పలువురు అకస్మాత్తుగా మరణిస్తుండడంతో వారి కుటుంబాలు వీధిని పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ సందర్భంగా చినబాబు కుటుంబ సభ్యులు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సమయంలో జర్నలిస్టుల సంఘం అండగా నిలవడం తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పుర్రె త్రినాథ్, కే.వి.సత్యనారాయణ, శ్రీధర్, ఎస్ కే ఇమ్రాన్, దుర్గా శ్రీనివాస్, స్థానిక జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు రమణ, వెంకట్, ప్రసాద్, హరగోపాల్, ప్రవీణ్, లోవరాజు పడాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
    6
    జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఏపీడబ్ల్యూజేఎఫ్ 
మృతి చెందిన జర్నలిస్టు డేగల చినబాబు కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్కు అందజేత
ఇటీవల మృతి చెందిన ఏబీఎన్ అన్నవరం రిపోర్టర్ డేగల చినబాబు కుటుంబానికి జర్నలిస్టుల ఫెడరేషన్ అండగా నిలిచింది. 
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో చినబాబు కుటుంబ సభ్యులకు సోమవారం ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు చినబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చినబాబు మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్టకాలంలో జర్నలిస్టుల ఫెడరేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అధికార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చినబాబు జర్నలిజం రంగంలో ఎంతో అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఆయన ఎప్పుడూ ముందుండేవారని గుర్తుచేశారు. నిజాయితీ, నిబద్ధతతో వార్తలను అందించడంలో ఆయన చూపిన కృషి ఇతర జర్నలిస్టులకు ఆదర్శమని తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని, జర్నలిస్టులు లేదా వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చినబాబు కుటుంబానికి సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నిరంతరం పని ఒత్తిడితో జర్నలిజం వృత్తిని చేస్తున్న పలువురు అకస్మాత్తుగా మరణిస్తుండడంతో వారి కుటుంబాలు వీధిని పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ సందర్భంగా చినబాబు కుటుంబ సభ్యులు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సమయంలో జర్నలిస్టుల సంఘం అండగా నిలవడం తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పుర్రె త్రినాథ్, కే.వి.సత్యనారాయణ, శ్రీధర్, ఎస్ కే ఇమ్రాన్, దుర్గా శ్రీనివాస్, స్థానిక జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు రమణ, వెంకట్, ప్రసాద్, హరగోపాల్, ప్రవీణ్, లోవరాజు పడాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
    user_AP NEWS
    AP NEWS
    జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • నల్లజర్ల మండలం చీపురుగూడెంలో సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం పరిశీలించారు. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు కోరగా, తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    1
    నల్లజర్ల మండలం చీపురుగూడెంలో సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం పరిశీలించారు. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు కోరగా, తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • चीन ने हांगकांग-झुहाई-मकाऊ (HZMB) ब्रिज के रूप में दुनिया का सबसे लंबा समुद्री पुल बनाया है, जो 55 किमी लंबा है। अक्टूबर 2018 में खुला यह पुल 3 शहरों को जोड़ता है और इसका एक महत्वपूर्ण 6.7 किमी हिस्सा समुद्र के नीचे एक टनल के रूप में बना है, जिससे यात्रा का समय 4 घंटे से घटकर 30 मिनट हो गया है।
    1
    चीन ने हांगकांग-झुहाई-मकाऊ (HZMB) ब्रिज के रूप में दुनिया का सबसे लंबा समुद्री पुल बनाया है, जो 55 किमी लंबा है। अक्टूबर 2018 में खुला यह पुल 3 शहरों को जोड़ता है और इसका एक महत्वपूर्ण 6.7 किमी हिस्सा समुद्र के नीचे एक टनल के रूप में बना है, जिससे यात्रा का समय 4 घंटे से घटकर 30 मिनट हो गया है।
    user_रागिनी शर्मा
    रागिनी शर्मा
    Student Atchutapuram, Anakapalli•
    20 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం సూరన్న గొంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యేలకాలం నుండి శిధిలమైన పాఠశాలలోనే పిల్లల చదువులు కొనసాగుతున్న దీన పరిస్థితి అధికారులు వచ్చిన చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లడం తప్ప గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించని అధికారులు గిరిజన అభివృద్ధి సంస్థ ఎంతో దూరం కాదు కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే పిల్లలు వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి అయినా సరే టర్పాన్స్ వేసో ఎలాగో అలాగా పాఠశాల ఉపాధ్యాయులు సొర్వతీసుకొని పాఠశాలను నడిపించడం జరుగుతుంది దీనమైన పాఠశాలను ప్రజాప్రతినిధులు ఆసక్తి సూపి తక్షణమే నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకోవడం జరుగుతుంది.
    2
    ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం సూరన్న గొంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యేలకాలం నుండి శిధిలమైన పాఠశాలలోనే పిల్లల చదువులు కొనసాగుతున్న దీన పరిస్థితి అధికారులు వచ్చిన చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లడం తప్ప గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించని అధికారులు గిరిజన అభివృద్ధి సంస్థ ఎంతో దూరం కాదు కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే పిల్లలు వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి అయినా సరే టర్పాన్స్ వేసో ఎలాగో అలాగా పాఠశాల ఉపాధ్యాయులు సొర్వతీసుకొని పాఠశాలను నడిపించడం జరుగుతుంది దీనమైన పాఠశాలను ప్రజాప్రతినిధులు ఆసక్తి సూపి తక్షణమే నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకోవడం జరుగుతుంది.
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో పట్టాదారు భూమిపై వివాదం చెలరేగింది. గ్రామానికి చెందిన డేగల అప్పారావు పేరుమీద ఉన్న సర్వే నెంబర్ 28-2లో ఎకరం 20 సెంట్ల సొంత పట్టా భూమిని రెవెన్యూ అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామకంఠం భూమిగా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామకంఠానికి సంబంధించి సర్వే నెంబర్ 28-1లో ఇప్పటికే భూమి ఉండగా, అప్పారావు పట్టా భూమిని బలవంతంగా గ్రామకంఠంగా చూపించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివెనుక ప్రభావశీలులైన కొందరు పెద్దల రాజకీయ హస్తం ఉందేమో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సంబంధిత రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మరియు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో పట్టాదారు భూమిపై వివాదం చెలరేగింది. గ్రామానికి చెందిన డేగల అప్పారావు పేరుమీద ఉన్న సర్వే నెంబర్ 28-2లో ఎకరం 20 సెంట్ల సొంత పట్టా భూమిని రెవెన్యూ అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామకంఠం భూమిగా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామకంఠానికి సంబంధించి సర్వే నెంబర్ 28-1లో ఇప్పటికే భూమి ఉండగా, అప్పారావు పట్టా భూమిని బలవంతంగా గ్రామకంఠంగా చూపించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివెనుక ప్రభావశీలులైన కొందరు పెద్దల రాజకీయ హస్తం ఉందేమో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సంబంధిత రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మరియు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    23 hrs ago
  • డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, లైవ్ యాక్సిడెంట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఘటన క్షణాలు స్పష్టంగా రికార్డ్ కావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
    1
    డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, లైవ్ యాక్సిడెంట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఘటన క్షణాలు స్పష్టంగా రికార్డ్ కావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కాకినాడ జిల్లాలో పులి సంచారం కలకలం..! కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మర్రివీడు పంచాయతీ పరిధిలోని పరింతడక గ్రామంలో పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. గ్రామ సమీపంలోని పామాయిలు తోటలో రాత్రి వేళలో పొలంలో కట్టివున్న గేదెపై పులి దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపింది. ఉదయం రైతులు పొలాలకు వెళ్లగా గేదె కళేబరం కనిపించడంతో పులి సంచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమీప గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని గ్రామ పెద్దలు సూచిస్తున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రాంతాన్ని పరిశీలించి, పులి సంచారం పై గమనిస్తున్నారు. గ్రామ పరిసరాల్లో రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా పులి ఆనవాళ్లు గమనిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
    1
    కాకినాడ జిల్లాలో పులి సంచారం కలకలం..!
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మర్రివీడు పంచాయతీ పరిధిలోని పరింతడక గ్రామంలో పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.
గ్రామ సమీపంలోని పామాయిలు తోటలో రాత్రి వేళలో పొలంలో కట్టివున్న గేదెపై పులి దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపింది. ఉదయం రైతులు పొలాలకు వెళ్లగా గేదె కళేబరం కనిపించడంతో పులి సంచారం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమీప గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని గ్రామ పెద్దలు సూచిస్తున్నారు.
అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రాంతాన్ని పరిశీలించి, పులి సంచారం పై గమనిస్తున్నారు. గ్రామ పరిసరాల్లో రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా పులి ఆనవాళ్లు గమనిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
    user_AP NEWS
    AP NEWS
    జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.