ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026. 9వ జాతీయ పోషణ మాసం 2026 ఆత్మకూరు:నంద్యాల జిల్లా. ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21 నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి, P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.
ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026. 9వ జాతీయ పోషణ మాసం 2026 ఆత్మకూరు:నంద్యాల జిల్లా. ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21 నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి, P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.
- కుటుంబానికి 200 రోజుల ఉపాధి కల్పించాలి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నందికొట్కూరు (M) కొణిదెలలో ఉపాధి హామీ పనులను బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటేశ్వర్లు పరిశీలించారు. వర్షాభావంతో వ్యవసాయ పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కుటుంబానికి 200 రోజుల ఉపాధి పనులు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పొదుపు మహిళల రుణాల రద్దు, పేదలకు ఉచిత నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు.1
- చర్మ డప్పు కళాకారుల పెన్షన్ గడువు పెంచాలి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కే భాస్కర్, డిమాండ్ సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగించాలి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కే భాస్కర్, డిమాండ్ ఎమ్మిగనూరు: చర్మకారులు, డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేయనున్న పెన్షన్ దరఖాస్తుల గడువును మరింత పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కళాకారుడికి పెన్షన్ అందేలా నిబంధనలను సరళీకరించి, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల, మూడు నెలల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో, చర్మకారులు, డప్పు కళాకారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెన్షన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడం అభినందనీయమని ఆంటోనీ పేర్కొన్నారు. పెన్షన్ కోసం చర్మకారులు, డప్పు కళాకారులు గతంలో పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడంతో పాటు ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టారని గుర్తుచేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పెన్షన్ ప్రక్రియను ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో ఉన్న కొన్ని నిబంధనలు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న పేద చర్మకారులు, డప్పు కళాకారులకు ఇబ్బందికరంగా మారాయని ఆంటోనీ తెలిపారు. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ (Self Declaration) విధానం వల్ల అర్హులైన పలువురు కళాకారులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే అద్దె ఇళ్లలో నివసిస్తున్న కళాకారుల వద్ద ఇంటి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు తదితర పత్రాలు లేకపోవడం వల్ల వారు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తరతరాలుగా సంప్రదాయ చర్మకార వృత్తిని, డప్పు కళను నమ్ముకుని జీవిస్తున్న పేద కళాకారులకు ఇటువంటి నిబంధనలు అడ్డంకిగా మారకూడదని ఆయన అన్నారు. ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు అవకాశం కల్పించాలి ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా అర్హతను నిర్ధారించే విధంగా ఆన్‌లైన్ ప్రక్రియను కొనసాగించాలని ఆంటోనీ కోరారు. కుటుంబ వివరాలు, చిరునామా, వృత్తి తదితర అంశాలను రేషన్ కార్డు ఆధారంగా పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అద్దె ఇళ్లలో నివసించే కళాకారులకు కరెంట్ బిల్లు, హౌస్ ట్యాక్స్ వంటి పత్రాల నిబంధనలను సడలించాలని, వారి సంప్రదాయ వృత్తిని ప్రామాణికంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో సంబంధిత అధికారులు విచారణ నిర్వహించి అర్హతను నిర్ధారించే అవకాశం కల్పించాలని సూచించారు. గడువు పొడిగించి ప్రతి అర్హుడికి అవకాశం ఇవ్వాలి ప్రస్తుతం ఉన్న పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరింత పొడిగించాలని ఆంటోనీ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చర్మకారులు, డప్పు కళాకారులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో పాటు అవసరమైన పత్రాలు సమకూర్చుకోవడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా మరికొంత సమయం కేటాయించి, గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క కళాకారుడు కూడా కేవలం నిబంధనల కారణంగా పెన్షన్‌కు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్మకారులు, డప్పు కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సరళీకరించి, ఆధార్–రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశం కల్పించడంతో పాటు పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంటోనీ ప్రభుత్వాన్ని మరోసారి కోరారు.1
- రాజంపల్లి లో వెలిసిన ఆంజనేయస్వామికి భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. పరిసర ప్రాంతంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆకు పూజ చేశారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.1
- రైతులకు శుభవార్త తెలంగాణలో సెప్టెంబర్ 19న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది1
- అమృతం కోసం దేవతలు రాక్షసుల క్షీరసాగర మథనంలో ఘననాధుడు శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం (పద్మశాలి) ఆధ్వర్యంలో గద్వాల వినాయక మండపాలను 53 ఏళ్లుగా వినూత్న అలంకరణల్లో పురాణ ఘాతల్లో ఘననాతుని దర్శనం. పురాణ ఘట్టాలతో ఆకట్టుకుంటున్న ఘననాధుడు. జోగులాంబ గద్వాల పట్టణం వేదనగర్ లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం(పద్మశాలి) ఆధ్వర్యంలో 53 ఏళ్లుగా వినాయక చవితి నవరాత్రి బ్రహ్మోస్థవాలు వినూత్న రీతిలో వినాయక మండపాలను అలంకరిస్తున్నారు. 1971లో గద్వాల మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గద్వాలపట్టణంలో తొలిసారిగా వినాయక చవితి వేడుకలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1973 నుంచి శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న రీతులలో పురాణ ఘట్టాలను వివిధ ఆకృతులలో అలంకరణలు చేస్తూ భక్తులకు పురాణాల్లోని ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు మండపాల్లో మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస, ఘాతలను పలురకాలుగా కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తూ చిన్నారులకు , యువతకు , ప్రజలకు పురాణాల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా అలంకరణలు చేస్తున్నారు. ఈ సన్నివేశాలను చూసే వారికి అప్పటి పురాణ కథలు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఈ సంవత్సరం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ ఆధ్వర్యంలో అమృత భాండం కోసం దేవతలు–దానవులు క్షీరసాగర మథనం ఘట్టాన్ని వినూత్నంగా రూపొందించారు. ఈ అలంకరణను గద్వాల పట్టణ ప్రజలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను స్వకులశాలి సమాజం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వకులసాలి యువజన సంఘం ఉపాధ్యక్షుడు దేవుజి రాఘవేందర్, కార్యదర్శి సాక్రె శ్రీనివాస్, దోత్రే సురేంద్రబాబు, కార్యవర్గ సభ్యులు గణప నరేందర్, కాంబ్లే ప్రవీణ్, గచ్చి వీరన్న, దోత్రే ప్రమోద్, సఫారీ అజయ్, సఫారీ సురేష్, జిందే కార్తీక్ తదితరులు కుల బాంధవులు మాజీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.2
- పుల్లలచెరువులో వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఆకట్టుకున్న మహిళల కోలాట ప్రదర్శన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారి దేవాలయం వద్ద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట ప్రదర్శన అలరించింది.మహిళలు, చిన్నారులు సంయుక్తంగా చేసిన ఈ కోలాటాన్ని తిలకించేందుకు ప్రజలు ఆసక్తిగా పాల్గొన్నారు. మాస్టర్ కోటయ్య ఆధ్వర్యంలో కోలాటం చేశారు.ఈ సందర్బంగా కోలాటమాడిన మహిళలకు కమిటీ సభ్యులు చీరలను బహుమతిగా అందజేశారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.1
- సిరివెళ్ల మండలంలో వినాయకుడి నిమజ్జనానికి నీటి కొరత... ఇబ్బందులు పడుతున్న నిర్వాహకులు సిరివెళ్ల మండలంలో గణేశ్ నిమజ్జనానికి నీటి కొరతపై ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమావేశాల్లో అధికారులు హామీలు ఇచ్చినా, కేసీ కెనాల్‌లో కేవలం 3 అడుగుల నీరే ఉందని తెలిపారు. సుమారు 9 అడుగుల ఎత్తున్న విగ్రహాలను ఎలా నిమజ్జనం చేయాలని ప్రశ్నించారు. వెంటనే తగినంత నీటిని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.1
- తర్లుపాడు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఘనంగా గణేష్ ఉత్సవాలు మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని బీసీ కాలనీలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా మంగళవారం స్వామివారికి వివిధ నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఉభయ దాత ఈర్ల వెంకటయ్య కుటుంబ సభ్యులు 50 కేజీల లడ్డును ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. తొమ్మిది రోజులపాటు పూజ నిర్వహించి అనంతరం ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు1
- సాసనూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ గారు గణపతి పండగ అంటే ఏమిటి గణనాథుని విశిష్టత పిల్లలకు వివరించారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి మాటల్లోనే విందాం విషయం సాసనూల్ గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా పిల్లలకు అన్ని విషయాలు తెలియాలని పిల్లలను దగ్గరుండి గణపతి విగ్రహాన్ని వివరిస్తూ చూపించారు4