Shuru
Apke Nagar Ki App…
సిరివెళ్ల మండలంలో వినాయకుడి నిమజ్జనానికి నీటి కొరత... ఇబ్బందులు పడుతున్న నిర్వాహకులు సిరివెళ్ల మండలంలో గణేశ్ నిమజ్జనానికి నీటి కొరతపై ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమావేశాల్లో అధికారులు హామీలు ఇచ్చినా, కేసీ కెనాల్‌లో కేవలం 3 అడుగుల నీరే ఉందని తెలిపారు. సుమారు 9 అడుగుల ఎత్తున్న విగ్రహాలను ఎలా నిమజ్జనం చేయాలని ప్రశ్నించారు. వెంటనే తగినంత నీటిని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
Why not dinesh... yashaswi
సిరివెళ్ల మండలంలో వినాయకుడి నిమజ్జనానికి నీటి కొరత... ఇబ్బందులు పడుతున్న నిర్వాహకులు సిరివెళ్ల మండలంలో గణేశ్ నిమజ్జనానికి నీటి కొరతపై ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమావేశాల్లో అధికారులు హామీలు ఇచ్చినా, కేసీ కెనాల్‌లో కేవలం 3 అడుగుల నీరే ఉందని తెలిపారు. సుమారు 9 అడుగుల ఎత్తున్న విగ్రహాలను ఎలా నిమజ్జనం చేయాలని ప్రశ్నించారు. వెంటనే తగినంత నీటిని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను సందర్శించిన నందికొట్కూరు ఎమ్మెల్యే జూపాడుబంగ్లా(M) పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌లో 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోయి గేటు నీటిలో పడిన ఘటనపై ఎమ్మెల్యే జయసూర్య స్పందించారు. మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా.. రూ.3 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టి పూర్తి చేశారు. పనుల పురోగతిని ఎమ్మెల్యే బుధవారం పరిశీలించి, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా గేట్ల నిర్వహణ మరమత్తులను పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.1
- వినాయక నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. డిజెలకు అనుమతి లేదు గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మహానంది ఎస్ఐఎన్ రామ్మోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం అర్ధరాత్రి మహానంది మండలంలోని మండపాల నిర్వాహకులతో పలు సూచనలు చేశారు. నిమజ్జనాల సమయంలో డీజే లకు అనుమతి లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని అన్నారు.1
- బనగానపల్లె : పలుకూరు గ్రామంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. విశ్వకర్మ పేరు ఒక యూనివర్సిటీ కి పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు విశ్వకర్మ జయంతి ఉత్సవాల పురస్కరించుకొని శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ విశిష్టత భక్తి విశిష్టతపై సదస్సు నిర్వహించారు. మొదట విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మానంద చారి మాట్లాడుతూ ఈ సృష్టికి మూలకర్త విశ్వకర్మని దేవతలకు దేవలోకాన్ని పాండవులకు ఇంద్రస్తూ పురాని రావణాసునికి లంక నగరాన్ని నిర్మించడమే కాకుండా అనేక వస్తువులను కూడా సృష్టించిన సృష్టికర్త విశ్వకర్మన్నారు ఆయన పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక యూనివర్సిటీ గానీ ఒక రాష్ట్రానికి గాని ఒక జిల్లాకు గాని ప్రభుత్వ పథకాల కూడా ఆయన పేరు పెట్టాలని ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఆయన పేరు మీద విద్యార్థులకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బ్రహ్మానందచారిజ్ఞప్తి చేశారు. తమ విలువైన సమయంలో ఒక గంట అయినా తమ విష్టాదైవానికి కేటాయించాలని మంచి మార్గానికి దగ్గర ద్వారా భక్తిని బ్రహ్మానంద చారి అన్నారు ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి కేఈ వెంకటసుబ్బయ్య గౌడు రాముడు మరియు భక్త బృందం పాల్గొన్నారు.2
- ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026. 9వ జాతీయ పోషణ మాసం 2026 ఆత్మకూరు:నంద్యాల జిల్లా. ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21 నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి, P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.1
- ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం BSP అభ్యర్థులు. అట్టలైనీ ఆనందం 🔥 ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం! 🔥 రాజస్థాన్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి 19 మంది అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది కేవలం 19 మంది గెలుపు మాత్రమే కాదు… ఆత్మగౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం నిలబడిన ప్రజల నమ్మకానికి ప్రతీక! అధికార రాజకీయాలకు లొంగకుండా, తమ సిద్ధాంతాలను నమ్ముకుని పోరాడి విజయం సాధించిన ప్రతి BSP అభ్యర్థికి, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. 💙 బహుజనుల స్వాభిమానం చిరస్థాయిగా నిలవాలి… సామాజిక న్యాయం కోసం పోరాటం మరింత బలపడాలి! ✊ జై భీమ్ | జై బహుజన్ | జై BSP 💙1
- జీఎన్ఆర్ హాస్పిటల్‌లో ఘనంగా అన్నదాన వితరణ వినాయక చవితి వేడుకల్లో భాగంగా మూడవ రోజు ప్రత్యేక పూజలు రైతన్నలు బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థన హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో 200 మందికి భోజన సదుపాయం కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద గల జీఎన్ఆర్ హాస్పిటల్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. నాగేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మంది రోగులు, వారి సహాయకులు, స్థానికులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మూడవ రోజున ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజానికి వెన్నెముక అయిన రైతన్న బాగుంటేనే దేశం, సమస్త రంగాలు బాగుంటాయని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నేశ్వరుడు కరుణించి, వరుణ దేవుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, రైతుల కష్టాలు తీరి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ ఛారిటబుల్ సొసైటీ చైర్‌పర్సన్ లక్ష్మీదేవి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె. కళా సౌందర్య, మేనేజర్ శివ, ఇన్‌ఛార్జ్ కుమార్, సిబ్బంది టి. నరసింహ, బాషా, రాము, సతీష్, రేణుకతో పాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.4
- కుల దూషణ ఘటనకు టిడిపికి ఎలాంటి సంబంధం లేదు : మండల టిడిపి నాయకులు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడులో జరిగిన కుల దూషణ ఘటనకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని దోర్నాల టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఈ ఘటనను టీడీపీకి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.1
- కుటుంబానికి 200 రోజుల ఉపాధి కల్పించాలి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నందికొట్కూరు (M) కొణిదెలలో ఉపాధి హామీ పనులను బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటేశ్వర్లు పరిశీలించారు. వర్షాభావంతో వ్యవసాయ పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కుటుంబానికి 200 రోజుల ఉపాధి పనులు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పొదుపు మహిళల రుణాల రద్దు, పేదలకు ఉచిత నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు.1