logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వేములవాడ రాజన్న క్షేత్రంలో వైభవంగా రెండో రోజు గణపతి నవరాత్రులు * ఏకాంతంగా మూలవిరాట్‌కు పూజలు.. భీమేశ్వర ఆలయంలో భక్తులకు సిద్ధిబుద్ధి వినాయకుడి దర్శనం * ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రసాద వితరణ చేసిన ఆలయ ఈవో రమాదేవి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అనుబంధ ఆలయాలలో గణేశ నవరాత్రి మహోత్సవాలు రెండో రోజు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని ఆలయ పీఆర్వో పెరిక శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో మూలవిరాట్ ఆంతరంగిక ఆలయంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల దర్శనార్థం అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయ మండపంలో మట్టితో రూపొందించిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడిని ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. ఉదయం ఆంతరంగిక ఆలయంలో మూలవిరాట్ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎనిమిది మంది ఉత్తమ బ్రాహ్మణుల చేత లక్ష్మీ గణపతికి గణేశ ఉపనిషత్ పారాయణంతో విశేష అభిషేకాలు, పార్వతీ రాజరాజేశ్వరి దేవికి ఉపచార పూజలు ఘనంగా జరిగాయి. అలాగే భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన మట్టి గణపతికి ఉదయం ప్రాతఃకాల పూజలు, సాయంత్రం వేళల్లో షోడశోపచార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి అంతరాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు ఏకాంతంగా కొనసాగుతాయని తెలిపారు. భీమేశ్వర ఆలయంలోని మట్టి వినాయకుడికి రోజూ షోడశోపచార పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు మంత్ర అనుష్ఠానాలతో విశేష హోమం, ద్వాదశి నాడు పూర్ణాహుతి నిర్వహించి స్వామివారి నిమజ్జనం జరుపుతామని వెల్లడించారు. భక్తులు భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన సిద్ధిబుద్ధి వినాయకుడిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి బొబ్బర్లు, శీరా నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వయంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక బృందం, వేద పండితులు మరియు భక్తులు పాల్గొన్నారు. — పెరిక శ్రీనివాస్, ఆలయ పీఆర్వో, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ.

1 day ago
user_Gampa mahesh
Gampa mahesh
వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
1 day ago
6f409465-2b85-4ee3-a5b7-8ff38452886a

వేములవాడ రాజన్న క్షేత్రంలో వైభవంగా రెండో రోజు గణపతి నవరాత్రులు * ఏకాంతంగా మూలవిరాట్‌కు పూజలు.. భీమేశ్వర ఆలయంలో భక్తులకు సిద్ధిబుద్ధి వినాయకుడి దర్శనం * ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రసాద వితరణ చేసిన ఆలయ ఈవో రమాదేవి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అనుబంధ ఆలయాలలో గణేశ నవరాత్రి మహోత్సవాలు రెండో రోజు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని ఆలయ పీఆర్వో పెరిక శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ అభివృద్ధి

310a96ad-7271-410c-86b4-9f0111e17b82

పనుల నేపథ్యంలో మూలవిరాట్ ఆంతరంగిక ఆలయంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల దర్శనార్థం అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయ మండపంలో మట్టితో రూపొందించిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడిని ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. ఉదయం ఆంతరంగిక ఆలయంలో మూలవిరాట్ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎనిమిది మంది ఉత్తమ బ్రాహ్మణుల చేత లక్ష్మీ గణపతికి గణేశ ఉపనిషత్ పారాయణంతో విశేష అభిషేకాలు, పార్వతీ రాజరాజేశ్వరి దేవికి ఉపచార పూజలు ఘనంగా జరిగాయి. అలాగే భీమేశ్వర ఆలయంలో

99668880-9442-47a2-8fd2-e86191e82a8d

కొలువుదీరిన మట్టి గణపతికి ఉదయం ప్రాతఃకాల పూజలు, సాయంత్రం వేళల్లో షోడశోపచార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి అంతరాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు ఏకాంతంగా కొనసాగుతాయని తెలిపారు. భీమేశ్వర ఆలయంలోని మట్టి వినాయకుడికి రోజూ షోడశోపచార పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు మంత్ర అనుష్ఠానాలతో విశేష హోమం, ద్వాదశి నాడు పూర్ణాహుతి నిర్వహించి స్వామివారి

98b1205b-7ebe-4c51-bf5f-7828e7bdd59c

నిమజ్జనం జరుపుతామని వెల్లడించారు. భక్తులు భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన సిద్ధిబుద్ధి వినాయకుడిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి బొబ్బర్లు, శీరా నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వయంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక బృందం, వేద పండితులు మరియు భక్తులు పాల్గొన్నారు. — పెరిక శ్రీనివాస్, ఆలయ పీఆర్వో, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ.

More news from తెలంగాణ and nearby areas
  • సిరిసిల్లలో పెట్రోల్‌లో నీరు వచ్చిందంటూ వాహనదారుడి ఆందోళన. సిరిసిల్ల: పెట్రోల్‌లో నీరు కలిసిందని ఆరోపిస్తూ ఓ వాహనదారుడు ఆందోళనకు దిగాడు. పాత బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించిన అనంతరం తన వాహనం మొరాయించిందని జిల్లెల్లకు చెందిన కృష్ణ తెలిపారు. పరిశీలించగా పెట్రోల్‌లో నీరు ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై బంక్ సిబ్బందిని ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కృష్ణ కోరారు.
    1
    సిరిసిల్లలో  పెట్రోల్‌లో నీరు వచ్చిందంటూ వాహనదారుడి ఆందోళన.

సిరిసిల్ల: పెట్రోల్‌లో నీరు కలిసిందని ఆరోపిస్తూ ఓ వాహనదారుడు ఆందోళనకు దిగాడు. పాత బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించిన అనంతరం తన వాహనం మొరాయించిందని జిల్లెల్లకు చెందిన కృష్ణ తెలిపారు. పరిశీలించగా పెట్రోల్‌లో నీరు ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై బంక్ సిబ్బందిని ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కృష్ణ కోరారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ ఇన్ గేట్ నుంచి అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. పోరాటంతో సంబంధం లేని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ, మతపరమైన కోణంలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజాం నిరంకుశ పాలన, జాగీర్దారీ వ్యవస్థ, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగం పోరాడిందని తెలిపారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన ఈ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు పాల్గొన్నారని పేర్కొన్నారు. పోరాట ఫలితంగా వేలాది గ్రామాలకు విముక్తి లభించిందని, లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, డి.నరేష్ పటేల్ తదితర నాయకులు పాల్గొన్నారు.
    4
    రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది
సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ ఇన్ గేట్ నుంచి అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. పోరాటంతో సంబంధం లేని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ, మతపరమైన కోణంలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
నిజాం నిరంకుశ పాలన, జాగీర్దారీ వ్యవస్థ, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగం పోరాడిందని తెలిపారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన ఈ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు పాల్గొన్నారని పేర్కొన్నారు.
పోరాట ఫలితంగా వేలాది గ్రామాలకు విముక్తి లభించిందని, లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, డి.నరేష్ పటేల్ తదితర నాయకులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • చరిత్ర పురుషుడు అంబేద్కర్ ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అంబేద్కర్ చదివిన చదువులు ఆ కాలంలో ఆసియా ఖండంలోనే మొదటి వ్యక్తిగా చరిత్ర చెబుతుందని, మనువాద సిద్ధాంతాలతో కోట్ల మందిని బానిసత్వంలోకి నెట్టిన వ్యవస్థ ను మార్చిన చరిత్ర పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. బుధవారం ప్రజామిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడితులకు , తాడితులకు, మహిళలకు అన్ని రంగాలలో హక్కుల కోసం పోరాడి సాధించినటువంటి మహా పురుషుడు బి ఆర్ అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా అతనికి వస్తున్నటువంటి కీర్తిని చూసి ఓర్వలేక ఈ దేశంలో ఉన్న మనువాద శక్తులు ఆడిస్తున్న నాటకమే ఆవారా ప్రసాద్ అంబేద్కర్ పై రచిస్తున్న పుస్తకం. చరిత్ర సృష్టించిన ఇప్పటికీ ఇంకా చరిత్ర సృష్టిస్తున్న భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వాస్తవం. రామాయణం, రాముడు ఒక కాల్పనికం అని అన్నారు. చరిత్ర ఏదో, వాస్తవం ఏదో చరిత్ర వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తే దళిత బహుజనులు, అంబేద్కర్ వాదులు మొత్తం సాయుధ పోరాటానికి సిద్ధమవుతారన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఆవారా ప్రసాద్ ను అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో గజ్జల ఆనందరావు,సిగిరి శ్రీధర్, కొంపల్లి రవీందర్, శ్రీరాముల కిషన్ లు పాల్గొన్నారు
    1
    చరిత్ర పురుషుడు అంబేద్కర్ 
 ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్
అంబేద్కర్ చదివిన చదువులు ఆ కాలంలో  ఆసియా ఖండంలోనే మొదటి వ్యక్తిగా చరిత్ర చెబుతుందని, మనువాద సిద్ధాంతాలతో కోట్ల మందిని బానిసత్వంలోకి నెట్టిన వ్యవస్థ ను మార్చిన చరిత్ర పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు.
బుధవారం ప్రజామిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడితులకు , తాడితులకు, మహిళలకు అన్ని రంగాలలో హక్కుల కోసం పోరాడి సాధించినటువంటి మహా పురుషుడు బి ఆర్ అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా అతనికి వస్తున్నటువంటి కీర్తిని చూసి ఓర్వలేక ఈ దేశంలో ఉన్న మనువాద శక్తులు ఆడిస్తున్న నాటకమే ఆవారా ప్రసాద్ అంబేద్కర్ పై రచిస్తున్న  పుస్తకం.
చరిత్ర సృష్టించిన ఇప్పటికీ ఇంకా చరిత్ర సృష్టిస్తున్న భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వాస్తవం. రామాయణం, రాముడు ఒక కాల్పనికం  అని అన్నారు.
చరిత్ర ఏదో, వాస్తవం ఏదో చరిత్ర వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తే దళిత బహుజనులు, అంబేద్కర్ వాదులు మొత్తం సాయుధ పోరాటానికి సిద్ధమవుతారన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఆవారా ప్రసాద్ ను అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో గజ్జల ఆనందరావు,సిగిరి శ్రీధర్, కొంపల్లి రవీందర్, శ్రీరాముల కిషన్  లు పాల్గొన్నారు
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • బీఆర్ఎస్ భూములపై బీజేపీ దండయాత్ర...ఆ భూముల్లో కాషాయ జెండాలు ఎగరేసి పేదలకు పంచి పెడతాం-కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండ యాత్ర చేస్తామని కరీంనగర్ లో ప్రకటించారు. ఆ భూముల్లో కాషాయ జెండా ఎగరేసి పేదలకు పంచి పెడతామని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని సీఎం ప్రస్తావించడం వెనుక పెద్ద మతలబు ఉందన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని ప్రస్తావించి ఆ పార్టీతో బేరసారాలకు సిద్ధమయ్యారని చెప్పారు. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తోందని, బీఆర్ఎస్ కు సంబంధించి 8గురు ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడటానికి గంట సమయం పట్టిందని మరి 90 మంది ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలని ప్రశ్నించారు.‌ తెలంగాణలో 60 శాతం మంది ప్రజలకు భూముల్లేవని, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడాని గజం జాగా కూడా లేదు...కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాల భూములను దోచుకున్నారని ఆరోపించారు. పాదయాత్రలో బీఆర్ఎస్ భూదోపిడీ గురించి మాట్లాడితే కేసీఆర్ నా తలను 6 ముక్కలు చేస్తా అన్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పడానికి వెయ్యి రోజులు పట్టిందా..? సీఎంకు బీఆర్ఎస్ నేతలతో డీల్ కుదరలేదా? అని ప్రశ్నించారు. ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకు అసెంబ్లీ వేదికగా వివరాలు బయటపెట్టి డీల్ కోసం బీఆర్ఎస్ నేతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.
    1
    బీఆర్ఎస్ భూములపై బీజేపీ దండయాత్ర...ఆ భూముల్లో కాషాయ జెండాలు ఎగరేసి పేదలకు పంచి పెడతాం-కేంద్ర మంత్రి బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండ యాత్ర చేస్తామని కరీంనగర్ లో ప్రకటించారు. ఆ భూముల్లో కాషాయ జెండా ఎగరేసి పేదలకు పంచి పెడతామని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని సీఎం ప్రస్తావించడం వెనుక పెద్ద మతలబు ఉందన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని ప్రస్తావించి ఆ పార్టీతో బేరసారాలకు సిద్ధమయ్యారని చెప్పారు. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తోందని, బీఆర్ఎస్ కు సంబంధించి 8గురు ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడటానికి గంట సమయం పట్టిందని మరి 90 మంది ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలని ప్రశ్నించారు.‌ తెలంగాణలో 60 శాతం మంది ప్రజలకు భూముల్లేవని, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడాని గజం జాగా కూడా లేదు...కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాల భూములను దోచుకున్నారని ఆరోపించారు.
పాదయాత్రలో బీఆర్ఎస్ భూదోపిడీ గురించి మాట్లాడితే కేసీఆర్ నా తలను 6 ముక్కలు చేస్తా అన్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పడానికి వెయ్యి రోజులు పట్టిందా..? సీఎంకు బీఆర్ఎస్ నేతలతో డీల్ కుదరలేదా? అని ప్రశ్నించారు. ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకు అసెంబ్లీ వేదికగా వివరాలు బయటపెట్టి డీల్ కోసం బీఆర్ఎస్ నేతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష • వివిధ సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ • నిమజ్జన మార్గంలో ట్రాఫిక్, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్ల పరిశీలన - అధికారులకు సూచనలు • నిమజ్జన ప్రదేశాల్లో గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు • గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకు సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా • డీజేలకు స్వస్తి – సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు: జిల్లా ఎస్పీ కామారెడ్డి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, , జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర, బుధవారం పరిశీలించారు. తొలుత ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించారు. కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ – ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ముఖ్య ప్రాంతాల గుండా బాంబే క్లాత్, పాన్ చౌరస్తా, బడా మసీద్, రైల్వే ఫ్లైఓవర్, నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదిగా నిమజ్జన మార్గాన్ని పరిశీలిస్తూ, నిమజ్జన ముగింపు ప్రదేశమైన టేకిర్యాల్ చెరువు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వరకు రూట్‌లోని అన్నీ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా నిమజ్జన రూట్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, రహదారుల పరిస్థితి, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, బారికేడ్లు, అత్యవసర మార్గాలు, విగ్రహాల తరలింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూట్‌లో గుర్తించిన సమస్యలను నిమజ్జన కార్యక్రమానికి ముందే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్, మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి తదితర అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన మార్గంలో భక్తులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ మరియు రహదారి సంబంధిత పనుల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, భక్తులు మరియు ప్రజల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు మరియు వైద్య సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రెస్క్యూ వ్యవస్థను అందుబాటులో ఉంచాలని సూచించారు. నిమజ్జన రూట్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు మరియు డ్రోన్ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధిక శబ్దంతో కూడిన డీజేల కారణంగా చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అమలులో ఉన్న నిబంధనలు, ఆదేశాల మేరకు డీజేల వినియోగంపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయ పద్ధతుల్లో, శాంతియుతంగా మరియు ఆనందోత్సాహాలతో నిర్వహించాలని, నిమజ్జన సమయంలో పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సూచించే భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ కోరారు. నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, కామారెడ్డి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
•	గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష
కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
•	గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష
•	వివిధ సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ  
•	నిమజ్జన మార్గంలో ట్రాఫిక్, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్ల పరిశీలన - అధికారులకు సూచనలు
•	నిమజ్జన ప్రదేశాల్లో గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు
•	గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకు సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా
•	డీజేలకు స్వస్తి – సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు: జిల్లా ఎస్పీ
కామారెడ్డి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్, , జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర,  బుధవారం పరిశీలించారు.
తొలుత ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించారు. కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ – ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ముఖ్య ప్రాంతాల గుండా బాంబే క్లాత్, పాన్ చౌరస్తా, బడా మసీద్, రైల్వే ఫ్లైఓవర్, నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదిగా నిమజ్జన మార్గాన్ని పరిశీలిస్తూ, నిమజ్జన ముగింపు ప్రదేశమైన టేకిర్యాల్ చెరువు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వరకు రూట్‌లోని అన్నీ ప్రాంతాలను సందర్శించారు.
ఈ సందర్భంగా నిమజ్జన రూట్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, రహదారుల పరిస్థితి, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, బారికేడ్లు, అత్యవసర మార్గాలు, విగ్రహాల తరలింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూట్‌లో గుర్తించిన సమస్యలను నిమజ్జన కార్యక్రమానికి ముందే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ  సూచించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్,  మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి తదితర అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన మార్గంలో భక్తులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ మరియు రహదారి సంబంధిత పనుల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు  చేస్తున్నామని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, భక్తులు మరియు ప్రజల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు మరియు వైద్య సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రెస్క్యూ వ్యవస్థను అందుబాటులో ఉంచాలని సూచించారు. నిమజ్జన రూట్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు మరియు డ్రోన్ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధిక శబ్దంతో కూడిన డీజేల కారణంగా చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అమలులో ఉన్న నిబంధనలు, ఆదేశాల మేరకు డీజేల వినియోగంపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశారు.
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయ పద్ధతుల్లో, శాంతియుతంగా మరియు ఆనందోత్సాహాలతో నిర్వహించాలని, నిమజ్జన సమయంలో పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సూచించే భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ కోరారు. నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, కామారెడ్డి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లు పాల్గొన్నారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • కాచాపూర్ లో కరెంటు కోతలపై బిఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో కరెంటు కోతలపై బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యవసాయానికి 18 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతల వల్ల రైతుల సాగు చేసిన పంటలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని హెచ్చరించారు.
    1
    కాచాపూర్ లో కరెంటు కోతలపై బిఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం
బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో కరెంటు కోతలపై బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యవసాయానికి 18 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతల వల్ల రైతుల సాగు చేసిన పంటలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని హెచ్చరించారు.
    user_Bala prakash.Jangam
    Bala prakash.Jangam
    భిక్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
    11 hrs ago
  • బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు నినాదాలతో ధర్నా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని నినాదాలు చేశారు. యూనివర్సిటీలో విలీనం చేస్తే ఫీజుల భారం పెరిగి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు నినాదాలతో ధర్నా 
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని నినాదాలు చేశారు. యూనివర్సిటీలో విలీనం చేస్తే ఫీజుల భారం పెరిగి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్‌లో దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి, దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లోని తోటలో ఉన్న ఆయన ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, మాజీ ఎమ్మెల్యేలు నాగుల సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్తో పాటు పలువురు ముఖ్య నేతలు పొన్నం సత్తయ్య ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య అందించిన సేవలను నాయకులు, కుటుంబ సభ్యులు స్మరించుకున్నారు. ఆయన ప్రజా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
    4
    కరీంనగర్‌లో దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు 
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి, దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లోని తోటలో ఉన్న ఆయన ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, మాజీ ఎమ్మెల్యేలు నాగుల సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్తో పాటు పలువురు ముఖ్య నేతలు పొన్నం సత్తయ్య ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య అందించిన సేవలను నాయకులు, కుటుంబ సభ్యులు స్మరించుకున్నారు. ఆయన ప్రజా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.