ధర్మపురి నియోజకవర్గంలో పనులు ప్రారంభించిన మంత్రి *అక్కపల్లి లిఫ్ట్ తో పాటు రోళ్లవాగు మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..* *నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..* *చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడం లక్ష్యం..* *మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..* *ధర్మపురి:* ధర్మపురి నియోజకవర్గంలో రోళ్లవాగు, అక్కెపెల్లి ఎత్తిపోతల పథకంతో పాటు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించే బాధ్యత తాను తీసుకుంటానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి అక్కెపెళ్లి ఎత్తిపోతల పథకాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో 90 శాతం మంది వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని రైతులకు సాగునీటిని అందించడానికి రోళ్ళవాగుతో పాటు అక్కెపల్లి ఎత్తిపోతల పథకం, వెల్గటూర్ చెరువు, స్తంభంపల్లి, రంగదామంపల్లి, యశ్వంతరావుపేట చెరువు కూడికతీత పనులు పూర్తి చేసి నియోజకవర్గంలో ని ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రైతుల ప్రయోజనమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైందని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించి అంచనాలు పెంచి మధ్యలోనే నిలిపివేశారని మంత్రి ఆరోపించారు. నియోజకవర్గంలోని రైతులకు సాగునీటిని అందించే రోళ్ల వాగు ప్రాజెక్ట్ భూ సేకరణ చేయకుండానే పనులు ప్రారంభించారని మంత్రి అన్నారు. రోళ్లవాగు ప్రాజెక్ట్ విషయంలో ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ రూ. 60 కోట్ల అంచనాలతో 2016లో ప్రారంభించి రూ. 140 కోట్లకు పెంచారని మంత్రి ఆరోపించారు. అంచనాలు పెంచిన ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదో మాజీ మంత్రి కొప్పుల సమాధానం చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ అనుమతి లేకుండానే రోళ్లవాగు ప్రాజెక్టు ప్రారంభించారని మంత్రి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రోళ్ళవాగు ప్రాజెక్టు రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులు తీసుకువచ్చి ఇందుకు సంబంధించి ఆడవిశాఖకు రూ.31 లక్షలు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. నోరు ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. అక్కపెల్లిఎత్తిపోతలకు సంబంధించి కనీసం డ్రాయింగ్ పనులు చేయించలేని కొప్పుల ఈశ్వర్ తనపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మంత్రి అన్నారు. వారం రోజుల క్రితం అక్క పెళ్లి ఎత్తిపోతలకు సంబంధించి డ్రాయింగ్ పనులు పూర్తి అయ్యాయని మంత్రి తెలిపారు. త్వరలోనే అక్కపెల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. పత్తిపాక రిజర్వాయర్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రాజెక్టుగా నామకరణం చేసి పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయి అని మంత్రి ప్రశ్నించారు. ధర్మపురి నియోజకవర్గంలో మేడారం రిజర్వాయర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ పేస్ -2లో భాగంగా వందల ఎకరాల భూములు సేకరించి స్థానిక రైతులకు చుక్కనీరు ని ఇవ్వలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుంటే తాను ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో చేసిన పనులకు బిల్లులు ఇప్పించి పనులు కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటున్నానని మంత్రి తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో చర్చించి నియోజకవర్గంలోని పెండింగ్ పనులు పూర్తిచేసి రైతులకు అండగా నిలుస్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు రైతులు ఉన్నారు.
ధర్మపురి నియోజకవర్గంలో పనులు ప్రారంభించిన మంత్రి *అక్కపల్లి లిఫ్ట్ తో పాటు రోళ్లవాగు మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..* *నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..* *చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడం లక్ష్యం..* *మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..* *ధర్మపురి:* ధర్మపురి నియోజకవర్గంలో రోళ్లవాగు, అక్కెపెల్లి ఎత్తిపోతల పథకంతో పాటు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించే బాధ్యత తాను తీసుకుంటానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి అక్కెపెళ్లి ఎత్తిపోతల పథకాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో 90 శాతం మంది వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని రైతులకు సాగునీటిని అందించడానికి రోళ్ళవాగుతో పాటు అక్కెపల్లి ఎత్తిపోతల పథకం, వెల్గటూర్ చెరువు, స్తంభంపల్లి, రంగదామంపల్లి, యశ్వంతరావుపేట చెరువు కూడికతీత పనులు పూర్తి చేసి నియోజకవర్గంలో ని ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రైతుల ప్రయోజనమే ధ్యేయంగా
రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైందని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించి అంచనాలు పెంచి మధ్యలోనే నిలిపివేశారని మంత్రి ఆరోపించారు. నియోజకవర్గంలోని రైతులకు సాగునీటిని అందించే రోళ్ల వాగు ప్రాజెక్ట్ భూ సేకరణ చేయకుండానే పనులు ప్రారంభించారని మంత్రి అన్నారు. రోళ్లవాగు ప్రాజెక్ట్ విషయంలో ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ రూ. 60 కోట్ల అంచనాలతో 2016లో ప్రారంభించి రూ. 140 కోట్లకు పెంచారని మంత్రి ఆరోపించారు. అంచనాలు పెంచిన ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదో మాజీ మంత్రి కొప్పుల సమాధానం చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ అనుమతి లేకుండానే రోళ్లవాగు ప్రాజెక్టు ప్రారంభించారని మంత్రి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రోళ్ళవాగు ప్రాజెక్టు రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులు తీసుకువచ్చి ఇందుకు సంబంధించి ఆడవిశాఖకు రూ.31 లక్షలు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. నోరు ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. అక్కపెల్లిఎత్తిపోతలకు సంబంధించి కనీసం డ్రాయింగ్ పనులు చేయించలేని కొప్పుల ఈశ్వర్
తనపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మంత్రి అన్నారు. వారం రోజుల క్రితం అక్క పెళ్లి ఎత్తిపోతలకు సంబంధించి డ్రాయింగ్ పనులు పూర్తి అయ్యాయని మంత్రి తెలిపారు. త్వరలోనే అక్కపెల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. పత్తిపాక రిజర్వాయర్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రాజెక్టుగా నామకరణం చేసి పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయి అని మంత్రి ప్రశ్నించారు. ధర్మపురి నియోజకవర్గంలో మేడారం రిజర్వాయర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ పేస్ -2లో భాగంగా వందల ఎకరాల భూములు సేకరించి స్థానిక రైతులకు చుక్కనీరు ని ఇవ్వలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుంటే తాను ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో చేసిన పనులకు బిల్లులు ఇప్పించి పనులు కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటున్నానని మంత్రి తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో చర్చించి నియోజకవర్గంలోని పెండింగ్ పనులు పూర్తిచేసి రైతులకు అండగా నిలుస్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు రైతులు ఉన్నారు.
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి): మండలంలోని గోవిందపూర్‌లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. చన్కపూర్ గౌరుబాయి ఇల్లు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయి భారీ నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు అయిన సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పారాయణాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు నాలుగు రోజులపాటు జరుగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించగా, రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఆలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు మరియు ఇతర విశిష్ట ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం “శంకర విజయము”పై ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించనున్నారు. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.1
- గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 15 నుండి 15 రోజులపాటు హిందూ సమ్మేళనం కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హిందూ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి, తెలంగాణ ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100కు పైగా, తెలంగాణ వ్యాప్తంగా రెండువేలపైగా, భారత దేశవ్యాప్తంగా 25వేల హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి హిందువు తమ విద్యుక్త ధర్మం కోసం పాటుపడాలని, గడప లోపల కులమని, గడప దాటితే హిందువులమన్న భావన ప్రతి ఒక్క హిందువులో కలిగి ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూధర్మం లో ఉన్న విలువలు మరే దేశానికి లేవని, విదేశీయులు సైతం హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి మాట్లాడుతూ, భారతదేశంలో హిందువును దేశ భద్రతకు, సమాజ శ్రేయస్సుకు తయారు చేసే శక్తి కేవలం మాతృమూర్తికే ఉందని, యువకులను దేశ సమగ్రత కాపాడడానికి ప్రతీకలుగా తయారు చేయాలన్నారు. హిందూ సమ్మేళనంలో దాదాపు 5వేలకు మందిపైగా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.2
- నెరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామంలో నూతనంగా గొల్ల నారాయణ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృప్రవేశానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అర్హులందరికీ రెండవ విడతలో ఇల్లు అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇండ్లను త్వరతరగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- పత్రికా ప్రకటన ఏప్రిల్ 20, 2026-ఆదిలాబాద్: ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభకు గాను ప్రధాన మంత్రి అవార్డు లభించింది. ఇది గర్వకారణమైన ఘనత మాత్రమే కాకుండా, నార్నూర్‌కు కొత్త మార్పు ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఈ గుర్తింపుతో నార్నూర్ నీటిని కేంద్రంగా చేసుకొని సమగ్ర అభివృద్ధి వ్యూహాన్ని చేపట్టింది. ఏప్రిల్ తర్వాత వెంటనే చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించబడ్డాయి. మొత్తం 10 సాగునీటి చెరువులు పునరుద్ధరించబడి, 79,300 ఘన మీటర్ల మట్టిని తొలగించి, నీటి నిల్వ సామర్థ్యం 30 లక్షల ఘన మీటర్లకు పైగా పెంచబడింది. జల్ శక్తి అభియాన్ కింద పెర్కొలేషన్ ట్యాంకులు, చెక్ డ్యామ్‌లు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు తాడిహత్నూర్, సోనాపూర్, నాగల్కొండ, జాండా, గుంజాల వంటి గ్రామాలలో చేపట్టబడ్డాయి. ఇవి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడి వ్యవసాయానికి బలాన్నిచ్చాయి. “మన బడి – మన నీరు” కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో వర్షపు నీటి సంగ్రహణ గుంతలు నిర్మించబడ్డాయి. నీటి లభ్యత మెరుగుపడడంతో తాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. నాందీ వాటర్స్ సహకారంతో నార్నూర్, ఖంపూర్, నాగల్కొండలో RO ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. CHC నార్నూర్‌లో కూడా RO ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య కేంద్రాల్లో సురక్షిత నీటి అందుబాటు పెరిగింది. ఆర్థికాభివృద్ధి దిశగా మహువా లడ్డూ యూనిట్, బాంబూ ప్రాసెసింగ్ యూనిట్, దాల్ మిల్ వంటి ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. మార్కెట్ లింకేజ్లు, రివాల్వింగ్ ఫండ్ మద్దతు ద్వారా రైతులకు మంచి ధరలు లభించాయి. 3700 చెట్లపై లాక్ సాగు చేపట్టి 370 గిరిజన కుటుంబాలకు స్థిర ఆదాయం కల్పించబడింది. వ్యవసాయంలో వాడి మూడు స్థాయిల సాగు విధానం, డ్రిప్ ఇరిగేషన్, సేంద్రీయ వ్యవసాయం, తేనెటీగల పెంపకం, ఆయిల్ పామ్ సాగు వంటి పద్ధతులు అమలు చేయబడ్డాయి. సాయిల్ హెల్త్ కార్డులతో శాస్త్రీయ వ్యవసాయం ప్రోత్సహించబడింది. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద గృహ నిర్మాణం (హౌసింగ్), PM JANMAN ద్వారా గిరిజన అభివృద్ధి చేపట్టబడింది. ఆరోగ్యరంగంలో టెలీమెడిసిన్ సేవలు, ధర్మ సేవ వెల్నెస్ ప్రోగ్రామ్, మెన్స్ట్రుయల్ అవేర్‌నెస్ కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేయబడి, పోషణ మేళాలు నిర్వహించబడ్డాయి. రెండు సబ్‌సెంటర్లు NQAS సర్టిఫికేషన్ పొందాయి. విద్యలో డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ ద్వారా 48.6% మెరుగుదల నమోదైంది. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం AI ఆధారిత బోధన పద్ధతులు ప్రవేశపెట్టబడ్డాయి. గిరిజన సంస్కృతిని పరిరక్షించేందుకు ట్రైబల్ మ్యూజియం స్థాపించబడింది. యువతలో నాయకత్వాన్ని పెంపొందించేందుకు యంగ్ లీడర్స్ క్లబ్బులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సమగ్ర చర్యల ఫలితంగా నార్నూర్ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించబడింది. దీని ఫలితంగా 2025 సెప్టెంబర్ క్వార్టర్‌లో దక్షిణ ప్రాంతంలో డెల్టా ర్యాంకింగ్‌లో 1వ స్థానం సాధించబడింది. NITI Aayog స్టేట్ యూజ్ కేస్ ఛాలెంజ్‌లో విద్య విభాగంలో 3వ స్థానం కూడా లభించింది. నార్నూర్ ప్రయాణం నీటి ఆధారిత, సమగ్ర అభివృద్ధి మోడల్‌గా నిలిచింది. ప్రధాన మంత్రి అవార్డు ద్వారా ప్రారంభమైన ఈ మార్పు, ఇప్పుడు స్థిరమైన అభివృద్ధి దిశగా కొనసాగుతోంది.1
- మానవత్వ వాదిగా,హేతు వాదిగా,అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప వ్యక్తి మలయశ్రీ. సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సాహిత్య రంగంలో అనేక స్వీయ అనుభవం,కవితా,రచనలపై ఆయనకున్న పట్టుదల ఎంతో శ్లాఘనీయమైనదని,సాహిత్య రంగంలో డాక్టర్ మలయశ్రీ పాత్ర మరువలేనిదని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రేకుర్తి వాస్తవ్యులు ప్రముఖ కవి, రచయిత డాక్టర్ మలయశ్రీ ఇటీవల మృతి చెందడంతో సోమవారం కరీంనగర్ లోని ఆయన నివాసానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మలయశ్రీ చిత్రపటానికి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ వామపక్ష,అభ్యుదయ వాదిగా,కవితా రచనల పట్ల ఆసక్తితో అందులో అనేక మెళకువలు నేర్చుకొని,మానవాలి ఎదుర్కొంటున్న సమస్యలు,సవాళ్లును అవగాహన చేసుకొని,వాటిని అధ్యయనం చేసి ఎన్నో రచనలు చేసి పుస్తకాల రూపంలో ప్రజలకు అందించిన రచయిత అని,కులాల,మతాల,మానవత్వానికి సంబంధించిన అంతర్లీన అంశాలపై ఎన్నో ,ఎన్నెన్నో కవితలు,సామెతలు వ్రాసారని,మానవతా వాదిగా దోపిడీ రహిత పరిపాలన కొనసాగాలని,అంతరాలు లేని సమాజం కావాలని కోరుకునే వారని, 30 ఏళ్ల క్రితం తాను చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షులుగా, సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో మలయశ్రీ రచించిన సామెతలు - హేతువాదం అనే పుస్తకాన్ని నాకు అంకితం చేయడం అత్యంత గొప్ప అవకాశంగా భావిస్తున్నానని,డాక్టర్ మలయశ్రీ కవిగా,రచయితగా,హేతువాదిగా,వామపక్ష అభ్యుదయ వాదిగా నీతి,నిజాయితీగా ఎంతో ఉన్నతమైన విలువలతో కూడా జీవితాన్ని గడిపారని, సాహిత్య రంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేందుకు నావంతుగా కృషి చేస్తానని, ఎల్ ఎం డి లో కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మేధో వికలాంగుల పాఠశాలలో మలయశ్రీ రచనలపై ఓ కార్యక్రమం నిర్వహిస్తామని,అలాంటి మహనీయుని జీవిత లక్ష్యాలను నెరవేర్చేందుకు నేటి తరం వారు ముందుకు రావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.2
- జగిత్యాల వేదికగా జరిగిన కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ పై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ జైత్రయాత్ర సభ కాదు, జీవన్ రెడ్డి చేరిక మాత్రమేనని స్పష్టం చేశారు. ఆయన బిఆర్ఎస్ లో చేరినంత మాత్రాన కాంగ్రెస్ కు నష్టం ఉండదు.. బిఆర్ఎస్ కు లాభం జరగదన్నారు. జగిత్యాల లో మీడియాతో మాట్లాడిన ఆయన, జీవన్ రెడ్డి చేరికతో బిఆర్ఎస్ లో ముసలం పుట్టినట్లు తెలుస్తుందన్నారు.అందుకే హరీష్ రావు జగిత్యాల సభకు హాజరుకాలేదని ప్రచారం జరుగుతుందన్నారు. హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి బిజేపి టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తుందని, ఇప్పటికే కవిత వెళ్ళిపోయారని...మీరు వెళ్ళొద్దని హరీష్ రావు ను కోరుతున్నట్లు తెలుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసిఆర్ హరీష్ రావును ఉరితీయాలని జీవన్ రెడ్డి కోరారని అలాంటి వ్యక్తిని బిఆర్ఎస్ లో చేర్చుకోవడం హాస్యాస్పదమన్నారు. జీవన్ రెడ్డి చేరికతో బిఆర్ఎస్ చీలిక పుడుతుందని చెప్పారు. హరీష్ రావు తోపాటు పలువురు ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తనను ఏ బ్రీడ్ ఎమ్మెల్యే అంటున్న కేటీఆర్, గతంలో కాంగ్రెస్ తో పెట్టుకున్న మీరు రాజకీయంగా ఏ బ్రీడ్ అని ప్రశ్నించారు. అభివృద్ధిని కాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాని మా తాతలు నుంచే మా కుటుంబ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.4