logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ పట్టణంలో గల సిర్పూర్ పేపర్ మిల్లు ప్రధాన గేటు వద్ద కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 27వ రోజుకు చేరుకున్నాయి. జేకే యజమాన్యం కావాలనే స్థానిక కార్మికులకు అన్యాయం చేస్తోందని, ఉపాధి అవకాశాలు కల్పించకుండా మరియు పూర్తిస్థాయిలో పర్మినెంట్ కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా కాలయాపన చేస్తోందని కార్మిక సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఎస్పీఎం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలకు సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 కార్యనిర్వాహక అధ్యక్షులు గోలెం వెంకటేశం సంఘీభావం తెలిపారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగే రిలే నిరాహార దీక్షలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన ప్రకటించారు. దీక్ష 27వ రోజున జిల్లా రాగులయ్య, చిలుముల వెంకటేష్, డి. సత్యనారాయణ, ముద్దాం లక్ష్మణ్ లు పాల్గొన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు అనే అంశం వచ్చినప్పుడల్లా జేకే యజమాన్యం కోర్టులను ఆశ్రయించి జాప్యం చేస్తోందని గోలెం వెంకటేశం విమర్శించారు. యజమాన్యానికి కొమ్ముకాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు 27 రోజులుగా గేటు ముందు దీక్షలు చేస్తున్నా, కనీసం పట్టించుకోని స్థానిక నాయకులు రేపటి రోజున కార్మికుల కుటుంబాలను ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు స్థానికులకు ఉపాధి కల్పిస్తామని, ఇతర రాష్ట్రాల కార్మికులను బయటికి పంపిస్తామని, కార్మిక హక్కులు పరిరక్షిస్తామని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ బాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదని గోలెం వెంకటేశం నిలదీశారు. స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తక్షణమే ప్రభుత్వంతో మాట్లాడి గుర్తింపు సంఘం ఎన్నికలు త్వరగా నిర్వహించేలా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్పీఎం గేటు ముందు జరిగే తీవ్రతరమైన ఆందోళన కార్యక్రమాలకు వారే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ దీక్షలకు సంఘీభావం తెలిపిన వారిలో సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 అధ్యక్షులు కొంగ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు శీలం రాజమౌళి, గోగర్ల శ్యామ్ రావు, కొత్తకొండ రాజేష్, కార్యనిర్వాహక కార్యదర్శి జంగాలపల్లి వెంకటేష్, సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 1028 అధ్యక్షులు కలికోట రమణయ్య, ప్రధాన కార్యదర్శి బింగి రమేష్, సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 966 ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు, పెంటపర్తి శ్రీనివాస్, గాదెబోయిన శంకర్, పెంటపర్తి శ్రీనివాస్, తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2735 కార్యనిర్వాహక అధ్యక్షులు గొగుర్ల రాములు, ఉపాధ్యక్షులు చిత్తవేణి రాజేష్ యాదవ్, కోశాధికారి బండి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జాడి అశోక్, డి.ఎం.ఎస్. రిజిస్ట్రేషన్ నెంబర్ 53 కార్యనిర్వాహక అధ్యక్షులు నానాజీ, బీఆర్ఎస్ పట్టణ ఇన్‌చార్జి తన్నీరు పోషం, దేవేందర్ సింగ్, సిర్పూర్ పేపర్ మిల్స్ మజ్దూర్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2510 ఉపాధ్యక్షులు ముంజం శ్రీనివాస్, కార్మిక నాయకులు తాటి వెంకటేశం తదితరులు ఉన్నారు. కార్మికులకు న్యాయం జరగాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

3 hrs ago
user_Golem Venkatesham Patel
Golem Venkatesham Patel
Engineer Kagaznagar, Kumuram Bheem Asifabad•
3 hrs ago

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ పట్టణంలో గల సిర్పూర్ పేపర్ మిల్లు ప్రధాన గేటు వద్ద కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 27వ రోజుకు చేరుకున్నాయి. జేకే యజమాన్యం కావాలనే స్థానిక కార్మికులకు అన్యాయం చేస్తోందని, ఉపాధి అవకాశాలు కల్పించకుండా మరియు పూర్తిస్థాయిలో పర్మినెంట్ కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా కాలయాపన చేస్తోందని కార్మిక సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఎస్పీఎం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలకు సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 కార్యనిర్వాహక అధ్యక్షులు గోలెం వెంకటేశం సంఘీభావం తెలిపారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగే రిలే నిరాహార దీక్షలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన ప్రకటించారు. దీక్ష 27వ రోజున జిల్లా రాగులయ్య, చిలుముల వెంకటేష్, డి. సత్యనారాయణ, ముద్దాం లక్ష్మణ్ లు పాల్గొన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు అనే అంశం వచ్చినప్పుడల్లా జేకే యజమాన్యం కోర్టులను ఆశ్రయించి జాప్యం చేస్తోందని గోలెం వెంకటేశం విమర్శించారు. యజమాన్యానికి కొమ్ముకాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు 27 రోజులుగా గేటు ముందు దీక్షలు చేస్తున్నా, కనీసం పట్టించుకోని స్థానిక నాయకులు రేపటి రోజున కార్మికుల కుటుంబాలను ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు స్థానికులకు ఉపాధి కల్పిస్తామని, ఇతర రాష్ట్రాల కార్మికులను బయటికి పంపిస్తామని, కార్మిక హక్కులు పరిరక్షిస్తామని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ బాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదని గోలెం వెంకటేశం నిలదీశారు. స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తక్షణమే ప్రభుత్వంతో మాట్లాడి గుర్తింపు సంఘం ఎన్నికలు త్వరగా నిర్వహించేలా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్పీఎం గేటు ముందు జరిగే తీవ్రతరమైన ఆందోళన కార్యక్రమాలకు వారే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ దీక్షలకు సంఘీభావం తెలిపిన వారిలో సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 అధ్యక్షులు కొంగ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు శీలం రాజమౌళి, గోగర్ల శ్యామ్ రావు, కొత్తకొండ రాజేష్, కార్యనిర్వాహక కార్యదర్శి జంగాలపల్లి వెంకటేష్, సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 1028 అధ్యక్షులు కలికోట రమణయ్య, ప్రధాన కార్యదర్శి బింగి రమేష్, సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 966 ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు, పెంటపర్తి శ్రీనివాస్, గాదెబోయిన శంకర్, పెంటపర్తి శ్రీనివాస్, తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2735 కార్యనిర్వాహక అధ్యక్షులు గొగుర్ల రాములు, ఉపాధ్యక్షులు చిత్తవేణి రాజేష్ యాదవ్, కోశాధికారి బండి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జాడి అశోక్, డి.ఎం.ఎస్. రిజిస్ట్రేషన్ నెంబర్ 53 కార్యనిర్వాహక అధ్యక్షులు నానాజీ, బీఆర్ఎస్ పట్టణ ఇన్‌చార్జి తన్నీరు పోషం, దేవేందర్ సింగ్, సిర్పూర్ పేపర్ మిల్స్ మజ్దూర్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2510 ఉపాధ్యక్షులు ముంజం శ్రీనివాస్, కార్మిక నాయకులు తాటి వెంకటేశం తదితరులు ఉన్నారు. కార్మికులకు న్యాయం జరగాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

  • user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Kagaznagar, Kumuram Bheem Asifabad
    SPM కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి
    1 hr ago
More news from Kumuram Bheem Asifabad and nearby areas
  • కౌటాలలోని ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభం నేపథ్యంలో సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను మంగళ హారతులు పట్టి, పూలు జల్లి సాదరంగా ఆహ్వానించారు.
    1
    కౌటాలలోని ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభం నేపథ్యంలో సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను మంగళ హారతులు పట్టి, పూలు జల్లి సాదరంగా ఆహ్వానించారు.
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Engineer Kagaznagar, Kumuram Bheem Asifabad•
    45 min ago
  • సిర్పూర్(టి) మండలం వేంపల్లి గ్రామంలో గ్రామస్థులు మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్(టి)-కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలో మద్యం విక్రయాలు, వినియోగం వల్ల కుటుంబ కలహాలు, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాస్తారోకో కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి, ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
    1
    సిర్పూర్(టి) మండలం వేంపల్లి గ్రామంలో గ్రామస్థులు మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్(టి)-కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలో మద్యం విక్రయాలు, వినియోగం వల్ల కుటుంబ కలహాలు, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ రాస్తారోకో కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి, ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత, తమ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుకగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా, సోమవారం రాత్రి ఆమె లక్షెట్టిపేట పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు పార్టీ నాయకులు కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మరోసారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సేన ప్రజల గొంతుకగా నిలబడుతుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత, తమ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుకగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా, సోమవారం రాత్రి ఆమె లక్షెట్టిపేట పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు పార్టీ నాయకులు కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మరోసారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సేన ప్రజల గొంతుకగా నిలబడుతుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • జైనూర్ మండలం, జంగావ్ గ్రామంలో మృగశిర కార్తె ప్రవేశించి వర్షాలు మొదలవడంతో రైతులు వానాకాలం ఖరీఫ్ పనులను ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ క్రమంలో, గ్రామానికి చెందిన కుమ్రా చందు అనే రైతు ఆదివాసీ సంస్కృతి ప్రకారం తన పొలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విత్తనాలు నాటారు. వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా పంటలను సాగు చేస్తూ, ఇతర రైతులు కూడా తమ పొలాలను దున్ని సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం, జంగావ్ గ్రామ రైతులు విత్తనాలు నాటే ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమై ఖరీఫ్ సాగు పనులతో బిజీ బిజీగా ఉన్నారు.
    1
    జైనూర్ మండలం, జంగావ్ గ్రామంలో మృగశిర కార్తె ప్రవేశించి వర్షాలు మొదలవడంతో రైతులు వానాకాలం ఖరీఫ్ పనులను ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ క్రమంలో, గ్రామానికి చెందిన కుమ్రా చందు అనే రైతు ఆదివాసీ సంస్కృతి ప్రకారం తన పొలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విత్తనాలు నాటారు.

వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా పంటలను సాగు చేస్తూ, ఇతర రైతులు కూడా తమ పొలాలను దున్ని సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం, జంగావ్ గ్రామ రైతులు విత్తనాలు నాటే ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమై ఖరీఫ్ సాగు పనులతో బిజీ బిజీగా ఉన్నారు.
    user_Uyka maruthi
    Uyka maruthi
    సిర్పూర్ యు, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • జైపూర్‌ మండలం ఇందారం గ్రామంలో సర్పంచ్‌ మహమ్మద్‌ ఫయాజుద్దీన్‌ మరియు ఉపసర్పంచ్‌ ఎలకటూరి శివ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అద్భుత స్పందన లభించింది. రెనే హాస్పిటల్‌ కరీంనగర్‌ మరియు సింగరేణి రెనే కార్డియాక్‌ సెంటర్‌ గోదావరిఖని సంయుక్త ఆధ్వర్యంలో ఇందారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ శిబిరం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో గుండె వ్యాధుల పట్ల అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఈ జబ్బులకు గురవుతున్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్‌, ఈసీజీ వంటి అవసరమైన పరీక్షలు నిర్వహించి, హాజరైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గోదావరిఖని కార్డియాక్‌ సెంటర్‌కు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. తులసి రామ్‌, డాక్టర్‌ ధర్మతేజ, క్రిటికల్‌ కేర్‌ వైద్యులు డా. సంతానం, వైద్యులు డా. క్రాంతి కుమార్‌, డా. తేజస్విని పాల్గొని సుమారు 410 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి నేతృత్వం వహించిన సింగరేణి రెనే కార్డియాక్‌ సెంటర్‌ హెడ్‌ రామకృష్ణ మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో ఫుల్‌ టైం కార్డియాలజిస్ట్‌ కలిగిన ఏకైక హాస్పిటల్‌ సింగరేణి కార్డియాక్‌ సెంటర్‌ అని, దీనివల్ల సింగరేణి కార్మిక ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రతి గ్రామంలో నిర్వహిస్తూ ప్రజలకు గుండె వ్యాధుల పట్ల మరియు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచే విధంగా మార్పు తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు గుండె వ్యాధుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, అత్యాధునిక పరికరాలతో, అనుభవజ్ఞులైన డాక్టర్లతో కూడిన మంచి కార్డియాక్‌ సెంటర్‌ గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్‌లో ఏర్పాటు చేశారని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తమ చైర్మన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బంగారు స్వామి గారి 'సామాన్యునికి అందుబాటులో అసమాన వైద్యం' అనే ఆశయాలకు అనుగుణంగా తాము పనిచేస్తామని, గ్రామీణ ప్రాంతాలకు కూడా అత్యాధునిక వైద్య సౌకర్యాలు విస్తరించాలనే సంకల్పానికి తాము తోడుంటామని రామకృష్ణ స్పష్టం చేశారు. క్యాంపు నిర్వహణకు సర్పంచ్‌ మహమ్మద్‌ ఫయాజుద్దీన్‌ మరియు ఉపసర్పంచ్‌ శివ అందించిన సహకారం మరువలేనిదని, గ్రామ ప్రజల ఆరోగ్యం పట్ల వారు తీసుకున్న శ్రద్ధ అభినందనీయమని ఆయన అన్నారు. ఈ మంచి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు సర్పంచ్‌ మరియు ఉపసర్పంచ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులతో పాటు రెనే హాస్పిటల్‌ కరీంనగర్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ అభిలాష్‌ రెడ్డి, గోదావరిఖని సింగరేణి కార్డియాక్‌ సెంటర్‌ హెడ్‌ రామకృష్ణ, మేనేజర్లు అవినాష్‌, గౌతమ్‌లతో పాటు హాస్పిటల్‌ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    జైపూర్‌ మండలం ఇందారం గ్రామంలో సర్పంచ్‌ మహమ్మద్‌ ఫయాజుద్దీన్‌ మరియు ఉపసర్పంచ్‌ ఎలకటూరి శివ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అద్భుత స్పందన లభించింది. రెనే హాస్పిటల్‌ కరీంనగర్‌ మరియు సింగరేణి రెనే కార్డియాక్‌ సెంటర్‌ గోదావరిఖని సంయుక్త ఆధ్వర్యంలో ఇందారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ శిబిరం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో గుండె వ్యాధుల పట్ల అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఈ జబ్బులకు గురవుతున్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్‌, ఈసీజీ వంటి అవసరమైన పరీక్షలు నిర్వహించి, హాజరైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గోదావరిఖని కార్డియాక్‌ సెంటర్‌కు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. తులసి రామ్‌, డాక్టర్‌ ధర్మతేజ, క్రిటికల్‌ కేర్‌ వైద్యులు డా. సంతానం, వైద్యులు డా. క్రాంతి కుమార్‌, డా. తేజస్విని పాల్గొని సుమారు 410 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ వైద్య శిబిరానికి నేతృత్వం వహించిన సింగరేణి రెనే కార్డియాక్‌ సెంటర్‌ హెడ్‌ రామకృష్ణ మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో ఫుల్‌ టైం కార్డియాలజిస్ట్‌ కలిగిన ఏకైక హాస్పిటల్‌ సింగరేణి కార్డియాక్‌ సెంటర్‌ అని, దీనివల్ల సింగరేణి కార్మిక ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రతి గ్రామంలో నిర్వహిస్తూ ప్రజలకు గుండె వ్యాధుల పట్ల మరియు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచే విధంగా మార్పు తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు గుండె వ్యాధుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, అత్యాధునిక పరికరాలతో, అనుభవజ్ఞులైన డాక్టర్లతో కూడిన మంచి కార్డియాక్‌ సెంటర్‌ గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్‌లో ఏర్పాటు చేశారని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తమ చైర్మన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బంగారు స్వామి గారి 'సామాన్యునికి అందుబాటులో అసమాన వైద్యం' అనే ఆశయాలకు అనుగుణంగా తాము పనిచేస్తామని, గ్రామీణ ప్రాంతాలకు కూడా అత్యాధునిక వైద్య సౌకర్యాలు విస్తరించాలనే సంకల్పానికి తాము తోడుంటామని రామకృష్ణ స్పష్టం చేశారు.

క్యాంపు నిర్వహణకు సర్పంచ్‌ మహమ్మద్‌ ఫయాజుద్దీన్‌ మరియు ఉపసర్పంచ్‌ శివ అందించిన సహకారం మరువలేనిదని, గ్రామ ప్రజల ఆరోగ్యం పట్ల వారు తీసుకున్న శ్రద్ధ అభినందనీయమని ఆయన అన్నారు. ఈ మంచి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు సర్పంచ్‌ మరియు ఉపసర్పంచ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులతో పాటు రెనే హాస్పిటల్‌ కరీంనగర్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ అభిలాష్‌ రెడ్డి, గోదావరిఖని సింగరేణి కార్డియాక్‌ సెంటర్‌ హెడ్‌ రామకృష్ణ, మేనేజర్లు అవినాష్‌, గౌతమ్‌లతో పాటు హాస్పిటల్‌ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    1 day ago
  • ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలంలో సోమవారం పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కుటుంబాలను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఎంపీ నగేష్ మాట్లాడుతూ, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం నుండి వచ్చే నిధులన్నీ అభివృద్ధి కోసమేనని, బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు భిక్కు రాథోడ్, మోతిరాజన్న, ధమ్మరక్షక్, రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలంలో సోమవారం పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కుటుంబాలను పరామర్శించి, వారిని ఓదార్చారు.

ఎంపీ నగేష్ మాట్లాడుతూ, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం నుండి వచ్చే నిధులన్నీ అభివృద్ధి కోసమేనని, బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు భిక్కు రాథోడ్, మోతిరాజన్న, ధమ్మరక్షక్, రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.
    user_Maithreya
    Maithreya
    నార్నూర్, ఆదిలాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు ప్రధాన గేటు వద్ద కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 27వ రోజుకు చేరుకున్నాయి. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం స్థానిక MLA, స్థానిక MLC నోరు మెదపడం లేదని కార్మిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. SPM కార్మికులపై నిజంగా ప్రేమ ఉంటే, స్థానిక MLA మరియు స్థానిక MLC ఈ రిలే నిరాహార దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 అధ్యక్షులు కొంగ సత్యనారాయణ గారు మాట్లాడుతూ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో కార్మికులు దీక్షా శిబిరంలో అలసిపోయి పడుకుంటుంటే, స్థానిక నాయకులు ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. పట్టింపు లేని మెమొరాండములు, కాగితాలు ఇస్తే ఎన్నికల ప్రక్రియ మొదలు కాదని, ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ రిలే నిరాహార దీక్షా వేదిక వద్దకు వచ్చి దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్‌.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగే రిలే నిరాహార దీక్షలకు పూర్తిగా సహకరిస్తామని కొంగ సత్యనారాయణ తెలిపారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల గోడు వినిపించుకోని బీజేపీ స్థానిక ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈరోజు దీక్షలో కూర్చున్న వారిలో జిల్లా రాగులయ్య, చిలుముల వెంకటేష్, డి. సత్యనారాయణ, ముద్దాం లక్ష్మణ్ గార్లు ఉన్నారు. ఎస్పీఎం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 27వ రోజుకు చేరిన ఈ నిరాహార దీక్షకు పలు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. సంఘీభావం తెలిపిన వారిలో సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 కార్యనిర్వాహక అధ్యక్షులు గోలేం వెంకటేశం, ఉపాధ్యక్షులు శీలం రాజమౌళి, గోగర్ల శ్యామ్ రావు, కొత్తకొండ రాజేష్, కార్యనిర్వాక కార్యదర్శి జంగాలపల్లి వెంకటేష్; సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 1028 అధ్యక్షులు కలికోట రమణయ్య, ప్రధాన కార్యదర్శి బింగి రమేష్; సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 966 ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు, పెంటపర్తి శ్రీనివాస్, గాదెబోయిన శంకర్; తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2735 కార్యనిర్వాహక అధ్యక్షులు గొగుర్ల రాములు, ఉపాధ్యక్షులు చిత్తవేణి రాజేష్ యాదవ్, కోశాధికారి బండి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జాడి అశోక్; డి.ఎం.ఎస్. రిజిస్ట్రేషన్ నెంబర్ 53 కార్యనిర్వాహక అధ్యక్షులు నానాజీ, బీఆర్ఎస్ పట్టణ ఇంచార్జి తన్నీరు పోషం, దేవేందర్ సింగ్; సిర్పూర్ పేపర్ మిల్స్ మజ్దూర్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2510 ఉపాధ్యక్షులు ముంజం శ్రీనివాస్; కార్మిక నాయకులు తాటి వెంకటేశం మరియు ఇతర కార్మికులు, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.
    1
    కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు ప్రధాన గేటు వద్ద కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 27వ రోజుకు చేరుకున్నాయి. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం స్థానిక MLA, స్థానిక MLC నోరు మెదపడం లేదని కార్మిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. SPM కార్మికులపై నిజంగా ప్రేమ ఉంటే, స్థానిక MLA మరియు స్థానిక MLC ఈ రిలే నిరాహార దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు.

సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 అధ్యక్షులు కొంగ సత్యనారాయణ గారు మాట్లాడుతూ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో కార్మికులు దీక్షా శిబిరంలో అలసిపోయి పడుకుంటుంటే, స్థానిక నాయకులు ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. పట్టింపు లేని మెమొరాండములు, కాగితాలు ఇస్తే ఎన్నికల ప్రక్రియ మొదలు కాదని, ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ రిలే నిరాహార దీక్షా వేదిక వద్దకు వచ్చి దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్‌.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగే రిలే నిరాహార దీక్షలకు పూర్తిగా సహకరిస్తామని కొంగ సత్యనారాయణ తెలిపారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల గోడు వినిపించుకోని బీజేపీ స్థానిక ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈరోజు దీక్షలో కూర్చున్న వారిలో జిల్లా రాగులయ్య, చిలుముల వెంకటేష్, డి. సత్యనారాయణ, ముద్దాం లక్ష్మణ్ గార్లు ఉన్నారు. ఎస్పీఎం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 27వ రోజుకు చేరిన ఈ నిరాహార దీక్షకు పలు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. సంఘీభావం తెలిపిన వారిలో సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 కార్యనిర్వాహక అధ్యక్షులు గోలేం వెంకటేశం, ఉపాధ్యక్షులు శీలం రాజమౌళి, గోగర్ల శ్యామ్ రావు, కొత్తకొండ రాజేష్, కార్యనిర్వాక కార్యదర్శి జంగాలపల్లి వెంకటేష్; సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 1028 అధ్యక్షులు కలికోట రమణయ్య, ప్రధాన కార్యదర్శి బింగి రమేష్; సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 966 ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు, పెంటపర్తి శ్రీనివాస్, గాదెబోయిన శంకర్; తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2735 కార్యనిర్వాహక అధ్యక్షులు గొగుర్ల రాములు, ఉపాధ్యక్షులు చిత్తవేణి రాజేష్ యాదవ్, కోశాధికారి బండి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జాడి అశోక్; డి.ఎం.ఎస్. రిజిస్ట్రేషన్ నెంబర్ 53 కార్యనిర్వాహక అధ్యక్షులు నానాజీ, బీఆర్ఎస్ పట్టణ ఇంచార్జి తన్నీరు పోషం, దేవేందర్ సింగ్; సిర్పూర్ పేపర్ మిల్స్ మజ్దూర్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2510 ఉపాధ్యక్షులు ముంజం శ్రీనివాస్; కార్మిక నాయకులు తాటి వెంకటేశం మరియు ఇతర కార్మికులు, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Engineer Kagaznagar, Kumuram Bheem Asifabad•
    1 hr ago
  • కాగజ్‌నగర్‌లో ఇంటి సామాను తరలిస్తామని నమ్మబలికి మోసానికి పాల్పడిన ఒక ముఠాను బాధితులు చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆన్‌లైన్ యాప్ ద్వారా వాహనాన్ని బుక్ చేసుకున్న బాధితులు, తమ ఇంటి సామాను తరలించేందుకు ఈ ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, ఈ ముఠా సభ్యులు బాధితుల సామానును తీసుకుని గమ్యస్థానానికి చేర్చకుండానే పరారయ్యారు. తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితులు, అదే ముఠాకు మరోసారి బుకింగ్ ఇచ్చి వారిని తిరిగి కాగజ్‌నగర్‌కు రప్పించారు. ముఠా సభ్యులు అక్కడికి చేరుకోగానే, బాధితులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    1
    కాగజ్‌నగర్‌లో ఇంటి సామాను తరలిస్తామని నమ్మబలికి మోసానికి పాల్పడిన ఒక ముఠాను బాధితులు చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆన్‌లైన్ యాప్ ద్వారా వాహనాన్ని బుక్ చేసుకున్న బాధితులు, తమ ఇంటి సామాను తరలించేందుకు ఈ ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, ఈ ముఠా సభ్యులు బాధితుల సామానును తీసుకుని గమ్యస్థానానికి చేర్చకుండానే పరారయ్యారు.

తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితులు, అదే ముఠాకు మరోసారి బుకింగ్ ఇచ్చి వారిని తిరిగి కాగజ్‌నగర్‌కు రప్పించారు. ముఠా సభ్యులు అక్కడికి చేరుకోగానే, బాధితులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_Shiva
    Shiva
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.