గ్రామాలకు తరలి వెళ్తున్న ఎన్నికల సిబ్బంది లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, జన్నారం, దండేపల్లి మండలాల్లోని అన్ని గ్రామాలలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల విధులను నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాలకు తరలి వెళ్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు వారికి అధికారులు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ఎన్నికల సామాగ్రితో అధికారులు సిబ్బంది ఎన్నికల సామాగ్రిని తీసుకొని వారి కోసం సిద్ధంగా ఉంచిన ప్రత్యేక బస్సులలో నిర్దేశిత గ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. గురువారం ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మధ్యాహ్నం నుండి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపే సర్పంచ్, ఉప సర్పంచ్ ఫలితాలు వెల్లడి కానున్నాయని అధికారులు తెలిపారు. ఓటర్లు కూడా తమ గ్రామానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు. చాలాచోట్ల బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

- పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిసిపి లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట పోలింగ్ కేంద్రాన్ని మంచిర్యాల డిసిపి భాస్కర్ తనిఖీ చేశారు. స్థానిక ఎన్నికల సందర్భంగా గురువారం వెంకటరావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మంచిర్యాల డిసిపి భాస్కర్ స్థానిక పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.1
- జై గోమాత గోమాతను రక్షించండి జై శ్రీ కృష్ణ1
- విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్‌కు ఎదురుగా ఉన్న ప్రాంతంలో గల రాధ బీచ్ రెసిడెన్సీ అనే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఆరవ అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను నియంత్రించి, వాటిని ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.అగ్నిప్రమాదం జరిగిన ఫ్లాట్‌లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా రక్షించేందుకు పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగ ఆవరించి ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. ఈ భారీ అగ్నిప్రమాదం ఎలా సంభవించింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరో అంతస్తులోని ఆ ఫ్లాట్‌లో ఉన్నవారి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడానికి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగిందా, లేదా వంటగదిలోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల జరిగిందా అనే అంశాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు.1
- Post by KLakshmi Devi1
- Post by Neelakanta Gandham1
- Post by Omnamashivaya S1
- నరసన్నపేట వుటంకి.. జిల్లాకే ప్రసిద్ధి.. ఎవరైనా తినవలసిందే నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధి చెందిన వంటకంగా పేరుగాంచింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు దీనిని కొనుగోలు చేయడానికి వస్తుంటారు. కోరాడ లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, బియ్యం పిండి, పంచదార, పాలు వంటి పదార్థాలతో తయారుచేసే ఈ వంటకాన్ని ఎవరైనా తినవచ్చు. ఈ వంటకాన్ని ఒక చేతి వృత్తిగా కొనసాగిస్తూ ఐదు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.1
- ప్రశాంతంగా ఓటింగ్ ప్రారంభం జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల నేపథ్యంలో జన్నారంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి గురువారం ఉదయమే ఓటర్లు భారీగా తరలివచ్చారు. అనంతరం ఓటర్లు వారికి కేటాయించిన గదులలో ఓట్లు వేస్తున్నారు. అలాగే మండలంలోని కలమడుగు, మురిమడుగు, కిష్టాపూర్, చింతగుడా తపాలాపూర్ గ్రామాలలో కూడా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.1