logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా విత్తనాలు, ఎరువుల దుకాణాలను సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్లను పరిశీలించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దుకాణాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుపుకోవాలని డీలర్లకు సూచించిన కలెక్టర్, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వానాకాలం 2026 సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ సూచించిన ఎనిమిది రకాల వరి వంగడాలను మాత్రమే రైతులు సాగు చేయాల్సి ఉన్నందున, డీలర్లు వాటిని మాత్రమే విక్రయించాలని ఆయన స్పష్టం చేశారు. బిపిటి 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, డబ్ల్యూ జిఎల్ 962, డబ్ల్యూజిఎల్ 44, జేజిఎల్ 1798, జైశ్రీరామ్, హెచ్ఎంటి (సోనా) రకాలకు మాత్రమే ప్రభుత్వం ఈ ఏడాది బోనస్ చెల్లిస్తుందని తెలిపారు. రైతులు నానో యూరియాను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని, ప్రతి పెస్టిసైడ్, సీడ్స్ దుకాణాల వద్ద స్టాక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేసి అందులో సమగ్ర వివరాలను పొందుపరచాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఆయా రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు ఇచ్చే రసీదుల్లో డీలర్లు ఇష్టానుసారం సొంత నిబంధనలను ముద్రించడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సంబంధిత డీలర్లకు నోటీసులు జారీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. గడువు ముగిసిన, విడిగా ఉండే లేదా నకిలీ విత్తనాలను రైతులకు అంటగడితే సహించేది లేదని, అటువంటి డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పష్టంగా హెచ్చరించారు. ఈ పర్యటనలో భాగంగా, గద్వాల పట్టణంలోని ప్రధాన రహదారుల్లో, ముఖ్యమైన కూడళ్లలో ఇష్టానుసారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే ప్రకటనల బోర్డులను, ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్‌కు సూచించారు. ఈ తనిఖీలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప, మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ కుమార్, టెక్నికల్ ఏవోలు చంద్రశేఖర్, భవాని తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_Elluru Varaprasad
Elluru Varaprasad
Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
3 hrs ago

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా విత్తనాలు, ఎరువుల దుకాణాలను సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్లను పరిశీలించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దుకాణాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుపుకోవాలని డీలర్లకు సూచించిన కలెక్టర్, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వానాకాలం 2026 సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ సూచించిన ఎనిమిది రకాల వరి వంగడాలను మాత్రమే రైతులు సాగు చేయాల్సి ఉన్నందున, డీలర్లు వాటిని మాత్రమే విక్రయించాలని ఆయన స్పష్టం చేశారు. బిపిటి 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, డబ్ల్యూ జిఎల్ 962, డబ్ల్యూజిఎల్ 44, జేజిఎల్ 1798, జైశ్రీరామ్, హెచ్ఎంటి (సోనా) రకాలకు మాత్రమే ప్రభుత్వం ఈ ఏడాది బోనస్ చెల్లిస్తుందని తెలిపారు. రైతులు నానో యూరియాను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని, ప్రతి పెస్టిసైడ్, సీడ్స్ దుకాణాల వద్ద స్టాక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేసి అందులో సమగ్ర వివరాలను పొందుపరచాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఆయా రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు ఇచ్చే రసీదుల్లో డీలర్లు ఇష్టానుసారం సొంత నిబంధనలను ముద్రించడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సంబంధిత డీలర్లకు నోటీసులు జారీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. గడువు ముగిసిన, విడిగా ఉండే లేదా నకిలీ విత్తనాలను రైతులకు అంటగడితే సహించేది లేదని, అటువంటి డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పష్టంగా హెచ్చరించారు. ఈ పర్యటనలో భాగంగా, గద్వాల పట్టణంలోని ప్రధాన రహదారుల్లో, ముఖ్యమైన కూడళ్లలో ఇష్టానుసారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే ప్రకటనల బోర్డులను, ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్‌కు సూచించారు. ఈ తనిఖీలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప, మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ కుమార్, టెక్నికల్ ఏవోలు చంద్రశేఖర్, భవాని తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా విత్తనాలు, ఎరువుల దుకాణాలను సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్లను పరిశీలించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దుకాణాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుపుకోవాలని డీలర్లకు సూచించిన కలెక్టర్, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వానాకాలం 2026 సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ సూచించిన ఎనిమిది రకాల వరి వంగడాలను మాత్రమే రైతులు సాగు చేయాల్సి ఉన్నందున, డీలర్లు వాటిని మాత్రమే విక్రయించాలని ఆయన స్పష్టం చేశారు. బిపిటి 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, డబ్ల్యూ జిఎల్ 962, డబ్ల్యూజిఎల్ 44, జేజిఎల్ 1798, జైశ్రీరామ్, హెచ్ఎంటి (సోనా) రకాలకు మాత్రమే ప్రభుత్వం ఈ ఏడాది బోనస్ చెల్లిస్తుందని తెలిపారు. రైతులు నానో యూరియాను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని, ప్రతి పెస్టిసైడ్, సీడ్స్ దుకాణాల వద్ద స్టాక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేసి అందులో సమగ్ర వివరాలను పొందుపరచాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఆయా రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు ఇచ్చే రసీదుల్లో డీలర్లు ఇష్టానుసారం సొంత నిబంధనలను ముద్రించడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సంబంధిత డీలర్లకు నోటీసులు జారీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. గడువు ముగిసిన, విడిగా ఉండే లేదా నకిలీ విత్తనాలను రైతులకు అంటగడితే సహించేది లేదని, అటువంటి డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పష్టంగా హెచ్చరించారు. ఈ పర్యటనలో భాగంగా, గద్వాల పట్టణంలోని ప్రధాన రహదారుల్లో, ముఖ్యమైన కూడళ్లలో ఇష్టానుసారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే ప్రకటనల బోర్డులను, ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్‌కు సూచించారు. ఈ తనిఖీలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప, మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ కుమార్, టెక్నికల్ ఏవోలు చంద్రశేఖర్, భవాని తదితరులు పాల్గొన్నారు.
    1
    జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా విత్తనాలు, ఎరువుల దుకాణాలను సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్లను పరిశీలించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దుకాణాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుపుకోవాలని డీలర్లకు సూచించిన కలెక్టర్, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వానాకాలం 2026 సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ సూచించిన ఎనిమిది రకాల వరి వంగడాలను మాత్రమే రైతులు సాగు చేయాల్సి ఉన్నందున, డీలర్లు వాటిని మాత్రమే విక్రయించాలని ఆయన స్పష్టం చేశారు. బిపిటి 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, డబ్ల్యూ జిఎల్ 962, డబ్ల్యూజిఎల్ 44, జేజిఎల్ 1798, జైశ్రీరామ్, హెచ్ఎంటి (సోనా) రకాలకు మాత్రమే ప్రభుత్వం ఈ ఏడాది బోనస్ చెల్లిస్తుందని తెలిపారు. రైతులు నానో యూరియాను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని, ప్రతి పెస్టిసైడ్, సీడ్స్ దుకాణాల వద్ద స్టాక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేసి అందులో సమగ్ర వివరాలను పొందుపరచాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఆయా రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

రైతులకు ఇచ్చే రసీదుల్లో డీలర్లు ఇష్టానుసారం సొంత నిబంధనలను ముద్రించడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సంబంధిత డీలర్లకు నోటీసులు జారీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. గడువు ముగిసిన, విడిగా ఉండే లేదా నకిలీ విత్తనాలను రైతులకు అంటగడితే సహించేది లేదని, అటువంటి డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పష్టంగా హెచ్చరించారు.

ఈ పర్యటనలో భాగంగా, గద్వాల పట్టణంలోని ప్రధాన రహదారుల్లో, ముఖ్యమైన కూడళ్లలో ఇష్టానుసారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే ప్రకటనల బోర్డులను, ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్‌కు సూచించారు. ఈ తనిఖీలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప, మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ కుమార్, టెక్నికల్ ఏవోలు చంద్రశేఖర్, భవాని తదితరులు పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    3 hrs ago
  • కేటీదొడ్డి మండలంలోని వెంకటపురం గ్రామంలో ఉన్న ఇండియన్ బ్యాంక్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బ్యాంకింగ్ సేవలు గంటల పాటు పూర్తిగా స్తంభించాయి, దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకులో జనరేటర్ సౌకర్యం లేకపోవడం వల్లే సాంకేతిక పరికరాలు పనిచేయకుండా పోయాయి. వెంకటపురం పరిసర గ్రామాలకు ఈ బ్యాంకు ప్రధాన కేంద్రంగా ఉంది. దీంతో రైతులు, గోల్డ్ లోన్ ఖాతాదారులు, పెన్షన్ లబ్ధిదారులు సహా అనేక మంది ప్రజలు అధిక సంఖ్యలో బ్యాంకుకు వచ్చారు. అయితే మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగదు లావాదేవీలు, ప్రింటింగ్, ఇతర బ్యాంకింగ్ సేవలు పూర్తిగా ఆగిపోయాయి. వ్యవసాయ పనుల కోసం, ఆర్థిక అవసరాల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడల్లా ఇదే పరిస్థితి ఎదురవుతోందని పేర్కొంటూ, బ్యాంకులో తక్షణమే జనరేటర్ లేదా ప్రత్యామ్నాయ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి, జనరేటర్ ఏర్పాటు చేసి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    కేటీదొడ్డి మండలంలోని వెంకటపురం గ్రామంలో ఉన్న ఇండియన్ బ్యాంక్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బ్యాంకింగ్ సేవలు గంటల పాటు పూర్తిగా స్తంభించాయి, దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకులో జనరేటర్ సౌకర్యం లేకపోవడం వల్లే సాంకేతిక పరికరాలు పనిచేయకుండా పోయాయి.

వెంకటపురం పరిసర గ్రామాలకు ఈ బ్యాంకు ప్రధాన కేంద్రంగా ఉంది. దీంతో రైతులు, గోల్డ్ లోన్ ఖాతాదారులు, పెన్షన్ లబ్ధిదారులు సహా అనేక మంది ప్రజలు అధిక సంఖ్యలో బ్యాంకుకు వచ్చారు. అయితే మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగదు లావాదేవీలు, ప్రింటింగ్, ఇతర బ్యాంకింగ్ సేవలు పూర్తిగా ఆగిపోయాయి. వ్యవసాయ పనుల కోసం, ఆర్థిక అవసరాల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతిసారి విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడల్లా ఇదే పరిస్థితి ఎదురవుతోందని పేర్కొంటూ, బ్యాంకులో తక్షణమే జనరేటర్ లేదా ప్రత్యామ్నాయ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి, జనరేటర్ ఏర్పాటు చేసి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    6 hrs ago
  • నిన్న కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కృష్ణా నది బోర్డు సభ్యుల సమావేశం జరిగిన నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి స్పందించారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధిని, అక్కడి కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ఆర్డీఎస్, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఆయన అన్నారు. ముఖ్యంగా తమ కర్నూలు జిల్లా ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకొని, ఒక్కసారి ఆలోచించి సహకరించాలని పాలకుర్తి తిక్కారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్డీఎస్, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు అడ్డుచెప్పవద్దని ఆయన పునరుద్ఘాటించారు.
    1
    నిన్న కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కృష్ణా నది బోర్డు సభ్యుల సమావేశం జరిగిన నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి స్పందించారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధిని, అక్కడి కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ఆర్డీఎస్, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఆయన అన్నారు. ముఖ్యంగా తమ కర్నూలు జిల్లా ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకొని, ఒక్కసారి ఆలోచించి సహకరించాలని పాలకుర్తి తిక్కారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్డీఎస్, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు అడ్డుచెప్పవద్దని ఆయన పునరుద్ఘాటించారు.
    user_P.VEERANNA
    P.VEERANNA
    మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ఎమ్మిగనూరులో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో రెండేళ్ల విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్డీఏ పక్షాలు ఈ సందర్భంగా భారీ మోటార్ బైక్ ర్యాలీతో పాటు భారీ ప్రదర్శన చేపట్టాయి.
    1
    ఎమ్మిగనూరులో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో రెండేళ్ల విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్డీఏ పక్షాలు ఈ సందర్భంగా భారీ మోటార్ బైక్ ర్యాలీతో పాటు భారీ ప్రదర్శన చేపట్టాయి.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • నాగర్‌కర్నూల్ హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం బీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపు మేరకు ఓటరు జాబితా సవరణ, పార్టీ సభ్యత్వ నమోదు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. మంగనూర్ గ్రామం నుండి భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేశారు.
    1
    నాగర్‌కర్నూల్ హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం బీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపు మేరకు ఓటరు జాబితా సవరణ, పార్టీ సభ్యత్వ నమోదు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.

మంగనూర్ గ్రామం నుండి భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేశారు.
    user_NAVADEEP
    NAVADEEP
    Nagarkurnool, Telangana•
    12 hrs ago
  • నంద్యాల జిల్లా, పాణ్యం మండలం బలపనూరులోని మహాత్మ జ్యోతిరావు ఫూలే, ఏపీ గురుకుల రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల నుండి ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 19 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించి ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఈరోజు విద్యార్థినులను అభినందించారు. మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారికి ఎమ్మెల్యే సూచించారు.
    1
    నంద్యాల జిల్లా, పాణ్యం మండలం బలపనూరులోని మహాత్మ జ్యోతిరావు ఫూలే, ఏపీ గురుకుల రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల నుండి ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 19 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించి ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఈరోజు విద్యార్థినులను అభినందించారు. మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారికి ఎమ్మెల్యే సూచించారు.
    user_Romanti Romeo
    Romanti Romeo
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • హైదరాబాద్‌లోని ఆఫ్జల్‌గంజ్ గురుద్వారా సాహిబ్‌లో 500 మందికి పైగా వ్యక్తులు సీపీఆర్ (CPR) మరియు బీఎల్ఎస్ (BLS) శిక్షణను పొందారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎస్‌సీ (HCSC), మెడికవర్ హాస్పిటల్, బీజేపీ మైనారిటీ మోర్చా వంటి సంస్థలు పాలుపంచుకోగా, సర్దార్ జగ్‌మోహన్ సింగ్ మరియు ఫర్నాజ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ శిక్షణతో పాటు, ప్రజలకు ట్రాఫిక్ అవగాహన సందేశం కూడా అందించబడింది.
    1
    హైదరాబాద్‌లోని ఆఫ్జల్‌గంజ్ గురుద్వారా సాహిబ్‌లో 500 మందికి పైగా వ్యక్తులు సీపీఆర్ (CPR) మరియు బీఎల్ఎస్ (BLS) శిక్షణను పొందారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎస్‌సీ (HCSC), మెడికవర్ హాస్పిటల్, బీజేపీ మైనారిటీ మోర్చా వంటి సంస్థలు పాలుపంచుకోగా, సర్దార్ జగ్‌మోహన్ సింగ్ మరియు ఫర్నాజ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ శిక్షణతో పాటు, ప్రజలకు ట్రాఫిక్ అవగాహన సందేశం కూడా అందించబడింది.
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • కర్నూలు జిల్లాలోని కౌతాళం మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో మధ్య దళారుల జోక్యాన్ని అరికట్టాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. రైతులు తమ వ్యవసాయ రుణాలను పునరుద్ధరించుకోవడానికి వెళ్ళినప్పుడు, మధ్య దళారులు రైతులతో కలిసి 'మీ అప్పు నేను కడతాను' అని చెప్పి, అప్పు చెల్లించడంతో వడ్డీ, దళారుల కమీషన్, ఇతర ఖర్చులు అన్నీ రైతులపైనే పడుతున్నాయని రైతు సంఘం ఆరోపించింది. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. మల్లయ్య బ్యాంక్ మేనేజర్‌కు ఒక మెమోరాండం అందజేశారు, బ్యాంకులో మధ్య దళారులను తొలగించి, వారిని బ్యాంకులోకి అనుమతించవద్దని కోరారు. కౌతాళం మండలంలో ఆరు బ్యాంకులు ఉన్నాయని, అయితే కెనరా బ్యాంకులో ఉన్నటువంటి దళారుల వ్యవస్థ ఇతర బ్యాంకుల్లో లేదని మల్లయ్య పేర్కొన్నారు. ఇతర బ్యాంకుల్లో రైతులు నేరుగా మేనేజర్‌తో మాట్లాడి, స్తోమత ఉన్నవారు అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తారని, స్తోమత లేనివారు కేవలం వడ్డీ చెల్లించి రుణాలను పునరుద్ధరించుకుంటారని ఆయన వివరించారు. అయితే కెనరా బ్యాంకులో ఈ పద్ధతి లేదని, అక్కడ దళారులకు, బ్యాంకు సిబ్బందికి, మేనేజర్‌కు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని లావాదేవీలు జరుగుతున్నాయని మల్లయ్య ఆరోపించారు. దళారులు రైతు అప్పు కడితే సంవత్సరానికి అప్పు పెరుగుతుందే తప్ప రైతుకు అప్పు సమస్య తీరదని ఆయన నొక్కిచెప్పారు. ఇప్పటి నుంచైనా బ్యాంకు సిబ్బంది, మేనేజర్ మేల్కొని బ్యాంకులో దళారుల వ్యవస్థను రద్దు చేయాలని, లేకపోతే రైతులను సమీకరించి బ్యాంకు ముందు ఆందోళన కార్యక్రమాలను చేపట్టగలమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బి. ఈరన్న, రైతు సంఘం నాయకులు సత్యప్ప, ఈరన్న, వెంకటేష్, నారాయణ, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
    2
    కర్నూలు జిల్లాలోని కౌతాళం మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో మధ్య దళారుల జోక్యాన్ని అరికట్టాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. రైతులు తమ వ్యవసాయ రుణాలను పునరుద్ధరించుకోవడానికి వెళ్ళినప్పుడు, మధ్య దళారులు రైతులతో కలిసి 'మీ అప్పు నేను కడతాను' అని చెప్పి, అప్పు చెల్లించడంతో వడ్డీ, దళారుల కమీషన్, ఇతర ఖర్చులు అన్నీ రైతులపైనే పడుతున్నాయని రైతు సంఘం ఆరోపించింది.

రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. మల్లయ్య బ్యాంక్ మేనేజర్‌కు ఒక మెమోరాండం అందజేశారు, బ్యాంకులో మధ్య దళారులను తొలగించి, వారిని బ్యాంకులోకి అనుమతించవద్దని కోరారు. కౌతాళం మండలంలో ఆరు బ్యాంకులు ఉన్నాయని, అయితే కెనరా బ్యాంకులో ఉన్నటువంటి దళారుల వ్యవస్థ ఇతర బ్యాంకుల్లో లేదని మల్లయ్య పేర్కొన్నారు. ఇతర బ్యాంకుల్లో రైతులు నేరుగా మేనేజర్‌తో మాట్లాడి, స్తోమత ఉన్నవారు అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తారని, స్తోమత లేనివారు కేవలం వడ్డీ చెల్లించి రుణాలను పునరుద్ధరించుకుంటారని ఆయన వివరించారు. అయితే కెనరా బ్యాంకులో ఈ పద్ధతి లేదని, అక్కడ దళారులకు, బ్యాంకు సిబ్బందికి, మేనేజర్‌కు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని లావాదేవీలు జరుగుతున్నాయని మల్లయ్య ఆరోపించారు.

దళారులు రైతు అప్పు కడితే సంవత్సరానికి అప్పు పెరుగుతుందే తప్ప రైతుకు అప్పు సమస్య తీరదని ఆయన నొక్కిచెప్పారు. ఇప్పటి నుంచైనా బ్యాంకు సిబ్బంది, మేనేజర్ మేల్కొని బ్యాంకులో దళారుల వ్యవస్థను రద్దు చేయాలని, లేకపోతే రైతులను సమీకరించి బ్యాంకు ముందు ఆందోళన కార్యక్రమాలను చేపట్టగలమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బి. ఈరన్న, రైతు సంఘం నాయకులు సత్యప్ప, ఈరన్న, వెంకటేష్, నారాయణ, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
    user_P.VEERANNA
    P.VEERANNA
    మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.