గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు నకిరేకల్ :- నకిరేకల్ పట్టణంలో పశువైద్య & పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ విడత ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశుసంపద రైతుల ఆర్థికాభివృద్ధికి పశువుల ఆరోగ్యం అత్యంత కీలకమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రతి పశుపోషకుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువులకు టీకాలు వేయించడం ద్వారా వ్యాధులను ముందుగానే నివారించి, పశుసంపదను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పశుపోషక రైతులు పాల్గొన్నారు. ఈ కార్యమం పట్ల రైతు లు హర్షం వ్యక్తం చేశారు.
గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు నకిరేకల్ :- నకిరేకల్ పట్టణంలో పశువైద్య & పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ విడత ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశుసంపద రైతుల ఆర్థికాభివృద్ధికి పశువుల ఆరోగ్యం అత్యంత కీలకమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రతి పశుపోషకుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువులకు టీకాలు వేయించడం ద్వారా వ్యాధులను ముందుగానే నివారించి, పశుసంపదను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పశుపోషక రైతులు పాల్గొన్నారు. ఈ కార్యమం పట్ల రైతు లు హర్షం వ్యక్తం చేశారు.
- నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.1
- నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్.. 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్.. చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు.. పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం.. వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు. నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.1
- తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...* *ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...* *నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...* సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!* పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!! ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*1
- వరంగల్ జిల్లా కాజీపేట పరిధిలోని మడికొండ చౌరస్తాలో చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనలో పాల్గొన్న పండుగ రాజ్‌కుమార్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు, దీక్షలో పాల్గొన్నవారు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకున్నారు. పరిస్థితి విషమించకుండా వెంటనే అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మడికొండ చౌరస్తా సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ కారణంగా గత 15 ఏళ్లుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుండి వచ్చే దుర్వాసన, కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని చాలా కాలంగా ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.1
- *హైదరాబాద్‌లో మున్సిపల్ నిర్లక్ష్యం – చెత్త తగలబెట్టడంతో చెట్లకు, విద్యుత్ వైర్లకు మంటలు* హైదరాబాద్: జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్‌లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చెత్తను సక్రమంగా తరలించకుండా అక్కడికక్కడే తగలబెట్టడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మీర్పేట్ ప్రధాన రహదారిపై, మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది స్థానికుల సమాచారం ప్రకారం, మున్సిపల్ సిబ్బంది తగలబెట్టిన చెత్త మంటలు సమీపంలోని చెట్లకు అంటుకున్నాయి. అక్కడి నుంచి మంటలు పైగా వెళ్లే విద్యుత్ వైర్ల వరకు వ్యాపించడంతో కొంతసేపు ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. బడంగ్పేట్ సర్కిల్ కమిషనర్ సరస్వతి సంఘటనపై ఫోన్లు చేసిన స్పందించలేదని స్థానిక మాజీ కార్పొరేటర్ బిక్షపతి చారి తెలిపారు ఫైర్స్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు చెత్తను బహిరంగంగా తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు3
- యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. వర్ధన్నపేట అవగాహన సదస్సులో ఏసీపీ పిలుపు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కదలాలి, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన.: ఏసీపీ నర్సయ్య. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు పిల్లల భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, నేటి యువత దేశానికి వెన్నెముక అని, అలవాటుగా మారే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, తహసిల్దార్ విజయసాగర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ హైదరాబాద్ రోడ్డులోని అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం... అతివేగంతో దూసుకొచ్చిన కారు... ప్రమాదంలో ఓ మహిళా, ఓ యువకుడు ప్రాణాపాయస్థితిలో... ద్విచక్ర వాహనం, రోడ్డుపై సఫాయి చేస్తున్న మున్సిపల్ కార్మికురాలిపై దూసుకెళ్లిన కారు... మున్సిపల్ మహిళా కార్మికురాలి రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం.. స్కూటీపై వెళ్తున్న యువకుడికి తలకు తీవ్ర గాయం.. యువకుడి పరిస్థితి ప్రాణాపాయంగా ఉన్నట్లు సమాచారం.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలింపు.. ద్విచక్ర వాహనదారుడికి సీరియస్ కావడంతో ఐకాన్ హాస్పిటల్‌కు తరలింపు.. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపణ.. కారు డ్రైవర్ని అదుపులో తీసుకొని విచారిస్తున్న టూ టౌన్ పోలీసులు... *ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.*3