Shuru
Apke Nagar Ki App…
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలోని కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించి, వారికి అందుతున్న చికిత్స వివరాలను ఆరా తీశారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని ఉపముఖ్యమంత్రి వారికి భరోసా కల్పించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే శ్రీ చి. వంశీ యాదవ్ లు ఈ పరామర్శ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు.
పామర్తి రవి కుమార్
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలోని కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించి, వారికి అందుతున్న చికిత్స వివరాలను ఆరా తీశారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని ఉపముఖ్యమంత్రి వారికి భరోసా కల్పించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే శ్రీ చి. వంశీ యాదవ్ లు ఈ పరామర్శ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- పర్యాటకుల సందడితో కళకళలాడే గోవాలో ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్న ఒక పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో దేశాన్ని కలచివేసే మహా విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మందిని సురక్షితంగా రక్షించారు. మరో 64 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ తీవ్ర సముద్ర ప్రమాదం స్థానికులను, పర్యాటకులను, అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రాథమిక విచారణలో పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది. అధిక లాభాల కోసం పడవ యజమాని భద్రతా నిబంధనలను పక్కనపెట్టి ఎక్కువ మందిని ఎక్కించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం యజమాని నిర్లక్ష్యమే కాకుండా, ప్రజల మితిమీరిన ఉత్సాహం, వినోదం కోసం అధిక సంఖ్యలో ఒకే పడవలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపడం, భద్రతా సూచనలను పట్టించుకోకపోవడం వంటివి ప్రమాద తీవ్రతను మరింత పెంచాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఘటన జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్, నౌకాదళం, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను వేగవంతం చేశాయి. సముద్ర అలలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, గల్లంతైన వారిని గుర్తించేందుకు నిరంతర శోధన కొనసాగుతోంది. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి; తమ కుటుంబ సభ్యుల కోసం ఎదురుచూస్తున్న బంధువుల ఆందోళన వర్ణనాతీతంగా మారింది. ఈ విషాదం ధన వ్యామోహంతో భద్రతను నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదకరమో, అలాగే ప్రజలు కూడా ఉత్సాహంలో భద్రతా నియమాలను విస్మరించడం ఎంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో మరోసారి గుర్తు చేసింది. ప్రాణాల కంటే లాభాలు, వినోదం ముఖ్యమనే భావన చివరికి ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, పర్యాటక ప్రాంతాల్లో పడవల సామర్థ్యానికి అనుగుణంగా ప్రయాణికులను అనుమతించడం, ప్రతి ఒక్కరికీ లైఫ్ జాకెట్లు అందించడం, అత్యవసర పరిస్థితులపై అవగాహన కల్పించడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- 😭1
- ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యాయత్నం ఘటనపై తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆ కఠినాత్ముడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. తల్లంపాడు గ్రామానికి చెందిన రేగళ్ల రమేశ్ కుమార్తెపై జరిగిన ఈ ఘాతుకం తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఘటనపై నిందితుడిపై తక్షణమే కఠిన చట్టాల కింద కేసు నమోదు చేయాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. విషయం తెలిసిన వెంటనే, మంత్రి పొంగులేటి బాధిత బాలిక తండ్రితో, స్థానిక సర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. "ముందు మన పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి.. నేనున్నా" అంటూ వారికి ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం ఆమెను తక్షణమే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని మంత్రి సూచించారు. పాప వైద్య ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి పొంగులేటి భరోసానిచ్చారు.1
- తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన 'ప్రజా దర్బార్' విజయవంతం కావడమే నిదర్శనమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ జూలై 12 నాటికి పూర్తి కాబోతోందని వెల్లడించారు. పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్‌లుగా విభజించి, గత 25 నుండి 30 రోజులుగా 'ప్రజల వద్దకే ప్రభుత్వం' అనే నినాదంతో ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. సోమవారంతో ఈ కార్యక్రమం ఆఖరి విభాగం పూర్తైందని, ఈ దర్బార్‌ల ద్వారా తాను వ్యక్తిగతంగా దాదాపు 25 వేల మంది ప్రజలను కలిసి, వారి సమస్యలను స్వయంగా చూసి, విన్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రజా దర్బార్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి మొత్తం 24 వేల పైచిలుకు దరఖాస్తులు అందినట్లు మంత్రి తెలిపారు. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 11,000 అర్జీలు, ఆసరా పింఛన్ల కోసం 5,200 అర్జీలు వచ్చాయని వివరించారు. అలాగే గృహజ్యోతి పథకం దరఖాస్తులతో పాటు అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, తాగునీరు వంటి స్థానిక సమస్యలపై కూడా ప్రజలు పెద్ద ఎత్తున వినతులు సమర్పించారని ఆయన తెలియజేశారు. ప్రజా నమ్మకమే ఈ ప్రభుత్వ బలం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు.1
- మణుగూరు కోర్టులో వాయిదాకు హాజరయ్యేందుకు వెళ్లిన మద్దిశెట్టిపై కొల్లిపాక నరసరావు, వారి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిని ఎన్సీపీ పార్టీ తీవ్రంగా ఖండించింది.1
- పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు రేపల్లెలో రాస్తారోకో నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా మంగళవారం సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) పార్టీల ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణిలాల్, సీపీఐ నాయకులు కె. రమేష్, సీపీఐ (ఎంఎల్) నాయకులు ఎం. శోభారాణి మాట్లాడుతూ, సామాన్య ప్రజలపై భారం తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడం లేదని ఆరోపించారు. బదులుగా, పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలను పేదల నుండి వసూలు చేస్తున్నాయని వారు విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని వామపక్ష పార్టీలు ఈ నిరసన ద్వారా మరోసారి డిమాండ్ చేశాయి.1
- ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యాయత్నం ఘటనపై తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆ కఠినాత్ముడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. తల్లంపాడు గ్రామానికి చెందిన రేగళ్ల రమేశ్ కుమార్తెపై జరిగిన ఈ ఘాతుకం తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి తెలిపారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి పొంగులేటి బాధిత బాలిక తండ్రితో, స్థానిక సర్పంచ్‌తో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. ఈ సందర్భంగా "ముందు మన పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి.. నేనున్నా" అని వారికి ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం తక్షణమే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని ఆయన సూచించారు. నిందితుడిపై తక్షణమే కఠిన చట్టాల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన మంత్రి, పాప వైద్య ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని భరోసానిచ్చారు.1
- 😭🙏1
- రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం బాపట్ల మండలం, నగరవనం నందు నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ. జి. గంగాధర్ గౌడ్, డి.యం. & హెచ్.ఓ. డాక్టర్ ఎస్. విజయమ్మ, డి.ఎఫ్.ఓ. రవిశంకర్, మున్సిపల్ కమిషనర్ హాసిని, మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నగరవనంలో యోగాసనాలు వేయడం విశేషం.1