వరంగల్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు – నలుగురు అంతర్ రాష్ట్ర ముఠా అరెస్ట్ వరంగల్:ఒడిశా నుంచి ముంబైకి సుమారు రూ.2.5 కోట్ల విలువైన హషీష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుండి తీసిన నూనె) తరలిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను వరంగల్ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్‌గంజ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముఠా సభ్యులు గంజాయి మొక్కలను పెంచి వాటి నుండి హషీష్ ఆయిల్ తయారు చేసి ముంబైలో విక్రయించేందుకు ప్రయత్నించారు. మొత్తం 40 కిలోల హషీష్ ఆయిల్ తయారు చేసినట్లు సమాచారం. అందులో 20 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన హంటల్ సన్ను (23), హంటల్ సన్యాసి (23), కండెల చిన్నబాబు (56), కృష్ణా హంటల్ (56) ఉన్నారు. మరో నిందితుడు కిలో పాండు పరారీలో ఉన్నాడు. ఈ ముఠా ఈ నెల 19న తుని రైల్వే స్టేషన్ నుంచి కోనార్క్ రైల్లో ప్రయాణించి, వరంగల్ రైల్వే స్టేషన్‌లో అనుమానంతో దిగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గూడ్స్ షెడ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు.

- ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.1
- Post by JADI RAJU1
- వరంగల్ రంగంపేటలోని శ్రీ భద్రకాళి రోడ్‌పై ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయం, శ్రీ గాయత్రి మాత దేవాలయాల సముదాయంలో ఈ ఉదయం భక్తి వైభవం నెలకొంది. ఆలయ అర్చకులు జి. కార్తిక్ చారి ఆధ్వర్యంలో శ్రీ రామదూత హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం నిర్వహించారు. ఇది 101వ దేవాలయ కార్యక్రమంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆకుతోట బాల కొమురెల్లి స్వామి, మాటేటి సత్యనారాయణ (సత్యం) స్వామి, జగన్మోహన్ రెడ్డి, మూడు నగేష్ స్వామి, లాస్య శ్రీ స్వామి, అరవింద స్వామి, ఎం. రాజేందర్ చారి, జి. కృష్ణ స్వామి, ప్రదీప్, గోపీచంద్, ఆర్. సాత్విక, ఏ. వినయ్, ఈశ్వర్, శిల్ప తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామస్మరణ, రామకీర్తనలు, భజనలు ఘనంగా నిర్వహించబడాయి. ఈ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసా పఠిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.2
- ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -1
- ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.1
- మహిళా బిల్లుకు కాంగ్రెస్ ఇండియా కూటమి లోని వారసత్వ పార్టీలే అడ్డుపడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రేకుర్తిలో చెరువు పునర్జీవం పనులను మేయర్ శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు తో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. కరీంనగర్ లో గల్లీ రోడ్డును అమృత్ నిధులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. మహిళా బిల్లు కు సీఎం రేవంత్ రెడ్డి, స్టాలిన్ అడ్డుపడ్డారని ఆరోపించారు. వారసత్వ కుటుంబ పార్టీలు మాత్రమే మహిళా బిల్లును అడ్డుకున్నాయని తెలిపారు. మహిళలు ఆ పార్టీలను క్షమించరని చెప్పారు. కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును వ్యతిరేకిస్తుందని ఆరోపించారు. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయని, 140 కోట్ల జనాభా ఉంటే ఎన్ని పార్లమెంటు స్థానాలు ఉండాలని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అస్తవ్యస్తంగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను డీలిమిటేషన్ ద్వారా పెంచాలని చూస్తే కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకించిందని తెలంగాణ సమాజం గమనించాలని బండి సంజయ్ కోరారు.4
- Post by Tagore1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన నెల వేతనంతో ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీ మేరకు తన వేతనంతో ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గం నుంచి 450 మంది యువత శిక్షణకు ముందుకు వచ్చారని చెప్పారు. యువత చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. కంప్యూటర్ వర్క్ ఉంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని పేర్కొంటూ, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.1