Shuru
Apke Nagar Ki App…
కళ్యాణదుర్గం (M) పాత చెరువులో కట్టుకున్న భర్తనే భార్య కడతేర్చి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన ఘటన కట్టుకున్న భర్తనే భార్య కడతేర్చి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన ఘటన కళ్యాణదుర్గం (M) పాత చెరువులో జరిగింది. హనుమంతు, సుకన్య భార్యాభర్తలు. 3 నెలల క్రితం భర్త హనుమంతును సుకన్య చంపి ఇంటి ఆవరణలోనే పాతి పెట్టింది. శుక్రవారం సుకన్య తన కూతురితో గొడవ పడింది. ఈ క్రమంలో సుకన్య భర్త హనుమంతుని చంపిన విషయం బయటపడింది. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు తెలిసింది. ఆమె పోలీసులకు లొంగిపోయింది.
Merzaa Tv
కళ్యాణదుర్గం (M) పాత చెరువులో కట్టుకున్న భర్తనే భార్య కడతేర్చి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన ఘటన కట్టుకున్న భర్తనే భార్య కడతేర్చి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన ఘటన కళ్యాణదుర్గం (M) పాత చెరువులో జరిగింది. హనుమంతు, సుకన్య భార్యాభర్తలు. 3 నెలల క్రితం భర్త హనుమంతును సుకన్య చంపి ఇంటి ఆవరణలోనే పాతి పెట్టింది. శుక్రవారం సుకన్య తన కూతురితో గొడవ పడింది. ఈ క్రమంలో సుకన్య భర్త హనుమంతుని చంపిన విషయం బయటపడింది. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు తెలిసింది. ఆమె పోలీసులకు లొంగిపోయింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాష్ట్రంలో వార్డు వాలెంటీర్ల సేవలను పునరుద్దించి నిరుద్యోగులను ఆదుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోట్రేష్ డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 99 వేల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఇచ్చిన 3000 నిరుద్యోగ భృతి హామీని తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గత వైకాపా పాలనలో ప్రజలకు సేవాలందించిన వాలంటీర్లకి ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి రాగానే 10,000 జీతం అందిస్తామని హామీ ఇచ్చి వారిని నిర్దాక్షిణ్యంగా తీసివేసి వారిని బజారులు పాలు చేయడం దుర్మార్గమన్నారు.1
- ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ నైట్ సేఫ్టీ అమలు.రాత్రంతా SP వీధిలోనే. అనంవసరంగా రాత్రి వేళ బయట తిరిగితే చర్యలు తప్పవు, ట్రీట్మెంట్ తప్పదు1
- సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలo కటారుపల్లి గ్రామంలో యోగువేమన ఉత్సవాలు రెండో రోజు వైభవంగా నిర్వహించారు. సోమవారం చాందిని బండ్లు పానక పన్నీరు తోపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి యోగివేమన భక్తాదులు హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ పీఠాధిపతులు నంద వేమారెడ్డి తెలిపారు.1
- 30-03-2026 కర్నూల్ జిల్లా ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ నందు *_ఆలూరు నియోజకవర్గం MLA బుసినే విరుపాక్షి గారు_* మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని అన్నారు... అమరావతిలో ఇప్పుటీ వరకు అభివృద్ధి పనులు జరగలేదు అని అన్నారు.. నారా చంద్రబాబు బాబు నాయుడు, 7 సంవత్సరలు ముఖ్యమంత్రి గా ఉన్న అమరావతిని అభివృద్ధి చేయలేదు అని అన్నారు.. అమరావతిలో ఒక శాశ్వత భవనని కట్టలేదు చంద్రబాబు అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక మెయిన్ రోడ్ కూడా వేయలేదు అని అన్నారు.... ఇక్కడ ఉన్న టీడీపీ ఇంచార్జ్ గారు మాటలు తప్ప ఆలూరు నియోజకవర్గని అభివృద్ధి చేయడం లేదు అన్నారు... *_మా నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి_* గురించి తప్పు గా మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు.... రాజధాని అమరావతి పేరు తో కూటమి నాయకులు ఇస్టానుసారంగా దోచుకుంటున్నారు అని అన్నారు.... నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదు అని తెలిపారు... ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు పాల్గొన్నారు.. 😎TEAM_BCS🇸🇱 #YSJagan #Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA1
- ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు. అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.1
- *జాతీయ రహదారి 40(కర్నూల్ - కడప) రోడ్డు లో వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి మనిషి చనిపోవడానికి కారణం అయిన వ్యక్తి అరెస్టు* *మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ వేసి కోర్టు ముందు హాజరు పరచడం అయినది* ముద్దాయి పేరు: షేక్ మస్తాన్, వయసు: 58 సం’’రాలు తండ్రి: లేట్ మౌలాలి, వృత్తి: కూలి, కులం: ముస్లిం, D.No.01/15, అద్దంకి రోడ్డు, St కాలనీ, దర్శి టౌన్ & మండలం, ప్రకాశం జిల్లా. నేరము జరిగిన తేది సమయము మరియు స్థలము: 25.03.2026 వ తేదీన మద్యాహ్నం సుమారు 02.30 గంటల సమయం లో కడప జిల్లా, మైదుకూరు టౌన్, ప్రొద్దుటూరు రోడ్డులో జాతీయ రహదారి- 40 (కర్నూల్ - కడప రోడ్డు)లో నుండి సర్వీసు రోడ్డు కలిసే ప్రదేశం అరెస్ట్ జరిగిన తేది మరియు సమయము: On 30.03.2026 at 11.30 AM కడప - కర్నూల్ రోడ్డులోని శ్రీనగరము గ్రామము దగ్గర. Seizure:- AP39 VE 0499 పాల ట్యాంకర్. Brief facts of the case: పైన తెలిపిన ముద్దాయి AP 39 VE 0499 పాల ట్యాంకర్ లో ధర్మవరము నుండి మైదుకూరు లోని అమృత మిల్క్ డైరీకి పాలు తోలుతూ ఉన్న క్రమములో 25.03.2026 వ తేదిన పాలు అమృత మిల్క్ డైరి నందు దించి మరలా ధర్మవరానికి వెళ్తున్న క్రమములో సుమారు 02.30 PM గంటల సమయములో పైన తెలిపిన ముద్దాయి, పైన తెలిపిన స్థలం వద్దకు పాల ట్యాంకర్ ను నడుపుతూ ఆపోసిట్/ రాంగు రోడ్డులో వెళితే ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ఆపోసిట్/ రాంగు రోడ్డులో ట్యాంకర్ ను నిర్లక్షంగా నడిపి మోటర్ సైకిల్ పైన వస్తున్న వారికి తగిలించి దువ్వూరు కు చెందిన భాను ప్రకాష్ చనిపోడానికి, గంగా ప్రసాద్ గాయపడటానికి కారణము అయినాడు కాబట్టి అతనిని మైదుకూరు పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. రమణారెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడమైనది. జాతీయ రహదారి మరియు ఇతర రోడ్డులలో వ్యతిరేక దిశలో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం అయితే వారిపై మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ను పెట్టి, అరెస్టు చేసి, ప్రమాదాలకు కారణం అయిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. కె.రమణా రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మైదుకూరు అర్బన్ పీఎస్.1
- ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.1
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కటారుపల్లి గ్రామంలో కళాకారులు చేసిన అమ్మవారి నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. రాక్షసుణ్ణి అమ్మవారు వేటాడి చంపినట్లు చేసిన కళారూపాలను వేమన భక్తులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి శక్తి పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.1