భద్రత ప్రమాణాల పట్ల అవగాహన, ఆచరణతోనే ప్రమాదాల నియంత్రణ సాధ్యం.. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. విజయనగరం జిల్లా, ప్రజాకాంక్ష న్యూస్, స్టాఫ్ రిపోర్టర్ రాము: ప్రమాదాల నియంత్రణకు భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై ఈ సం.లో ఇప్పటికే 35,204 కేసులు నమోదు చేసిన జిల్లా పోలీసులు. రహదారి భద్రత ప్రమాణాలు పట్ల అవాహన, ఆచరణతోనే జిల్లాలో రహదారి ప్రమాదాలను నియంత్రించ వచ్చునని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ డిసెంబరు 22న అన్నారు. రహదారి భద్రతకు ప్రాధాన్యత కల్పించి, భద్రత చర్యలుచేపట్టాలని, ప్రజలకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - రహదారి ప్రమాదాలను నియంత్రించుటలో భాగంగా భద్రత చర్యలను చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా వాహనదారులకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలని, హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలను, పెద్ద ప్రమాదాలు జరిగినప్పటికీ స్వల్ప గాయాలతో ఎలా ప్రాణాలతో సురక్షితంగా భయటపడవచ్చునో ద్విచక్ర వాహనదారులకు వివరించాలన్నారు. హెల్మెట్స్ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో గాలి, దుమ్ము నుండి రక్షించడంతోపాటు, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తాయన్నారు. ఊహించని రహదారి ప్రమాదాల నుండి రక్షించే రక్షణ రేఖ హెల్మెట్ ధారణ అని అన్నారు. కావున, ప్రతీ వాహనదారుడు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో నాణ్యత కలిగిన సరిగ్గా అమర్చిన హెల్మెట్స్ ను ధరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజూ విజిబుల్ పోలీసింగు నిర్వహించాలని, వాహన తనిఖీలు చేపట్టి, ప్రజలకు, వాహనదారులకు రహదారి భద్రత, మోటారు వాహన చట్టం గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాలను నియంత్రించుటలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. డ్రంకన్ డ్రైవ్ చేసిన వారిపై కఠినంగా వ్యవహరించి, కేసులు నమోదు చేయాలన్నారు. అంతేకాకుండా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై దాడులు చేపట్టి, ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై ఓపెన్ డ్రింకింగు కేసులు నమోదు చేయాలన్నారు. ప్రజలకు రహదారి ప్రమాదాల పట్ల అవగాహన కల్పిస్తునే, మరో వైపు ఎం.వి. నిబంధలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రమాదాల నియంత్రణలో భాగంగా ఇప్పటికే ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద రహదారి ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్స్ కు ఇరువైపుల కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయడం, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లు, డ్రమ్ములు ఏర్పాటు చేసి, రాత్రి సమయాల్లో వాహనదారులకు కనిపించే విధంగా వాటిపై రేడియం స్టిక్కర్లు అతికించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. హెల్మెట్స్ ధరించని వారిపై ఈ సంవత్సరంలో ఇప్పటికే 35,204 మందిపై ఎం.వి. చలానాలను విధంచామన్నారు.

- Dattatreya Carbon Cleaning Center 📍Near Satya Venkateswara Kalyana Mandapam Opposite Tea Time PhoolBaugh Road Vizianagaram Fully Automated Carbon Cleaning Center 100cc To 10,000cc Any Vehicle Service Available For More Details Contact:- 8978921418 , 94918214181
- వర్షాలు పడేటప్పుడు హైవేపై నీరు నిల్వ ఉండడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి అందుకుగాను NHAI అధికారులతో మాట్లాడి వర్షాలు పడేటప్పుడు రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా కొన్ని చోట్ల చేసినప్పటికి మిగిలిన ప్రాంతాల్లో కూడా మరమ్మత్తు పనులు సత్వరమే చెప్పట్టాలని ఫోన్ ద్వారా మరోసారి మేము సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది1
- ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మా అధ్యక్షతన "DISHA" (డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ బి.ఆర్ అంబేద్కర్ గారు, ఎస్.కోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారు, నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు, ZP CEO గారు పాల్గొన్నారు సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ముఖ్య పథకాలు, పాలసీలపై చర్చ జరిగింది ప్రధానంగా పీఎం కౌశల్ వికాస్ యోజన (PMKVY), ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, పంట బీమా, డ్రోన్ల వినియోగం, సోలార్ పవర్, ప్రాథమిక విద్య, గ్యాస్ కనెక్షన్, ఆరోగ్యం, బాలికల విద్య, బేటీ బచావో బేటీ పడావో, గోడౌన్లు మరియు కోల్డ్ స్టోరేజెస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించడంపై చర్చ జరిగింది ఈ సందర్భంగా మేము పై స్కీమ్స్ గురించి మాట్లాడుతూ సెంట్రల్ మరియు స్టేట్ స్కీమ్స్ రెండు సమన్వయంతో జిల్లా అభివృద్ధిని ముందుకు నడిపించాలని అధికారులకు సూచించడం జరిగింది ఈ సమావేశం లో జిల్లా ముఖ్య అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు kondapallisrinivasofficial madhavilokam3
- విజయనగరం:మాజీముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డిజన్మదిన వేడుకలు-దేవితల్లిగుడిలో పూజలుచేసి అనంతరంకేక్ కట్|BT1
- ☔❤️🩹1