కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మేజర్ గ్రామపంచాయతీకి చెందిన బీఆర్ఎస్ నాయకులు మరియు సర్పంచ్ మహమ్మద్ మోయీజ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు, ఉపసర్పంచ్ పెందోట రాజ్ కుమార్, ఏడుగురు వార్డు సభ్యులతో పాటు దాదాపు 50 మంది గ్రామస్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ పట్టణంలోని తన నివాసంలో వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్ మహమ్మద్ మోయీజ్, ఉపసర్పంచ్ రాజ్ కుమార్, మరియు వార్డు సభ్యులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులయ్యామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు, తెల్ల రేషన్ కార్డులతో పేదలకు సన్న బియ్యం పంపిణీ, మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి ఎన్నో సంక్షేమ పథకాలు తమను ప్రభావితం చేశాయని తెలిపారు. అంతేకాకుండా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నాయకత్వంలోనే రామడుగు గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన రామడుగు సర్పంచ్, ఉపసర్పంచ్, మరియు వార్డు సభ్యులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుభాకాంక్షలు తెలిపారు. రామడుగు గ్రామ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని గ్రామానికి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సత్యం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పార్టీలో చేరిన గ్రామ వార్డు సభ్యులలో ఎండి ఆరీఫ్, వెంకటేష్, సిరికొండ సాయి తేజ, వెంకటేష్, యాగం రవి, అనిల్ ఉన్నారు. వీరితో పాటు మొత్తం దాదాపు 50 మంది గ్రామస్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మేజర్ గ్రామపంచాయతీకి చెందిన బీఆర్ఎస్ నాయకులు మరియు సర్పంచ్ మహమ్మద్ మోయీజ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు, ఉపసర్పంచ్ పెందోట రాజ్ కుమార్, ఏడుగురు వార్డు సభ్యులతో పాటు దాదాపు 50 మంది గ్రామస్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ పట్టణంలోని తన నివాసంలో వీరికి కాంగ్రెస్
కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్ మహమ్మద్ మోయీజ్, ఉపసర్పంచ్ రాజ్ కుమార్, మరియు వార్డు సభ్యులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులయ్యామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు, తెల్ల రేషన్ కార్డులతో పేదలకు సన్న బియ్యం పంపిణీ, మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి ఎన్నో సంక్షేమ పథకాలు తమను
ప్రభావితం చేశాయని తెలిపారు. అంతేకాకుండా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నాయకత్వంలోనే రామడుగు గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన రామడుగు సర్పంచ్, ఉపసర్పంచ్, మరియు వార్డు సభ్యులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుభాకాంక్షలు తెలిపారు. రామడుగు గ్రామ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ
ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని గ్రామానికి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సత్యం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పార్టీలో చేరిన గ్రామ వార్డు సభ్యులలో ఎండి ఆరీఫ్, వెంకటేష్, సిరికొండ సాయి తేజ, వెంకటేష్, యాగం రవి, అనిల్ ఉన్నారు. వీరితో పాటు మొత్తం దాదాపు 50 మంది గ్రామస్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
- విద్యారంగ సమస్యల పరిష్కారం, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడిని అరికట్టడం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే డిమాండ్లతో ఏబీవీపీ (అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్) పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాఠశాలల బంద్ సంపూర్ణంగా కొనసాగింది. ఏబీవీపీ పిలుపునకు మద్దతుగా ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించగా, ఏబీవీపీ కార్యకర్తలు ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయించారు. కరీంనగర్ నగరంలో ఏబీవీపీ కార్యకర్తలు తిరుగుతూ పాఠశాలల బందును పర్యవేక్షించారు; ప్రభుత్వ పాఠశాలల్లో బెల్ కొట్టి విద్యార్థులను బయటకు పంపించారు. ఈ బందుకు సహకరించాలని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను కూడా వారు కోరారు. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజులు పూర్తయినా ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం పుస్తకాలు, యూనిఫారాలు కూడా అందించలేని దుస్థితి నెలకొందని ఏబీవీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేతగాని పరిస్థితిలో ఉందని ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ విష్ణు ఆరోపించారు. రేషనలైజేషన్ పేరుతో 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదించడాన్ని, బాలికలకు మరుగుదొడ్లు లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కార్పొరేట్ సంస్థల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని ఏబీవీపీ నాయకుడు విష్ణు హెచ్చరించారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసిన వరి ధాన్యం కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యమకారుడు మరవేణి రంజిత్ కుమార్ సివిల్ సప్లైస్ మరియు డైరెక్టర్ జనరల్, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు యల్లారెడ్డిపేట కిషన్ దాస్ పేట్ పోస్ట్ ఆఫీస్ ద్వారా పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు మరియు మిల్లింగ్ ప్రక్రియలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయని రంజిత్ కుమార్ ఆరోపించారు. ఈ కుంభకోణం కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితం కాదని, గత అనేక సంవత్సరాలుగా ఇదే తరహా అక్రమాలు జిల్లాలో కొనసాగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కొంత మంది అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు కుమ్మక్కై రైతుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి పాత్రను లోతుగా విచారించి నిజాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని రంజిత్ కుమార్ అన్నారు. సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిల ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం, మిల్లింగ్‌కు పంపిన ధాన్యం, ప్రభుత్వానికి అప్పగించిన బియ్యం మరియు ప్రస్తుతం మిగిలి ఉన్న ధాన్యం, బియ్యం నిల్వలపై పూర్తి వివరాలను సేకరించి ప్రజలకు వెల్లడించాలని కోరారు. నిల్వలు, రికార్డులు, ఆన్‌లైన్ ఎంట్రీలు మరియు లెక్కల్లో ఉన్న వ్యత్యాసాలను గుర్తించి బాధ్యులను నిర్ధారించాలని సూచించారు. ఈ వ్యవహారం వల్ల రైతులకు, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధ్యుల నుండి రికవరీ చేయడంతో పాటు, విచారణ పూర్తయ్యే వరకు అనుమానిత అధికారులు మరియు సంబంధిత ఇన్‌చార్జిలను విధుల నుండి తప్పించి నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించాలని రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యం విషయంలో జరిగిన ఈ అక్రమాలపై విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ మరియు సివిల్ సప్లైస్ శాఖ సంయుక్తంగా ప్రత్యేక విచారణ చేపట్టి, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.3
- జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి పట్టణం ఆదర్శనగర్‌కు చెందిన బిల్డర్ దాసరి రాజేంద్రప్రసాద్ (55) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హనుమాన్ నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాజేంద్రప్రసాద్‌ను అతని వద్ద పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కార్మికుడు గౌతమ్ కుమార్ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన మెట్‌పల్లి పోలీసులు, సంఘటన స్థల పరిశీలన, గాయాలు, కనిపించని బంగారు గొలుసు, సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా ఇది హత్యగా నిర్ధారించారు. విచారణలో నిందితుడు గౌతమ్ కుమార్ (23), తన స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా బంస్గావ్ మండలం బర్దిహ్ గ్రామం అని, బతుకుదెరువు నిమిత్తం మెట్‌పల్లికి వచ్చి టైల్స్, పెయింటింగ్ పనులు చేసుకుంటున్నానని అంగీకరించాడు. రాజేంద్రప్రసాద్ మెడలోని బంగారు గొలుసు, చేతిలోని బంగారు ఉంగరాన్ని దొంగిలించి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పాటు, పని సక్రమంగా చేయడం లేదని రాజేంద్రప్రసాద్ పలుమార్లు మందలించడంతో అతనిపై కోపం పెంచుకున్నట్లు తెలిపాడు. దొంగిలించిన తర్వాత గుర్తింపునకు రాకుండా ఉండాలంటే చంపడమే మార్గమని భావించి, ముందుగానే పథకం వేసుకున్నట్లు చెప్పాడు. తేదీ 20-06-2026 రాత్రి నిర్మాణ స్థలం వద్ద రాజేంద్రప్రసాద్‌తో వాగ్వాదం జరిగిన అనంతరం, నిందితుడు తాను ముందుగా కొనుగోలు చేసి సిద్ధం చేసుకున్న గొడ్డలితో అతని తలపై బలంగా కొట్టి హత్య చేసి, అతని మెడలో ఉన్న బంగారు గొలుసును తీసుకుని వెళ్లిపోయాడు. నేరం తర్వాత తనపై అనుమానం రాకుండా ఉండేందుకు రాజేంద్రప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అతని భార్యకు చెప్పి, ఆ తర్వాత తిరిగి సంఘటన స్థలానికి వెళ్లి గొడ్డలిని పెయింట్ బకెట్‌లో పెట్టుకొని మృతుడి నివాసముండే ఇంటి వద్ద మెట్ల కింద దాచిపెట్టినట్లు నిందితుడు వెల్లడించాడు. నిందితుడి వద్ద నుండి మృతుడి మెడలో నుండి దొంగిలించిన 7.25 గ్రాముల బంగారు గొలుసు (గణపతి లాకెట్‌తో సహా), అతను ఉపయోగించిన ఐటెల్ స్మార్ట్ ఫోన్, సంఘటన సమయంలో ధరించిన రక్తపు మరకలతో కూడిన షర్టు మరియు ప్యాంటు, నేరానికి ఉపయోగించిన హీరో హోండా స్ప్లెండర్ బైక్ (రిజిస్ట్రేషన్ నెంబర్: AP-29-G-6199), మరియు హత్యకు ఉపయోగించిన ఇనుప గొడ్డలి, దానిని దాచిన పెయింట్ బకెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన మెట్‌పల్లి సీఐ బి. సురేష్ బాబు, ఎస్ఐ పి. కిరణ్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎస్ఐ జి. నవీన్ కుమార్, మల్లాపూర్ ఎస్ఐ ఏ. అనిల్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.1
- కమ్మర్పల్లి మండలం పరిధిలోని అమీర్ నగర్ గ్రామంలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో మానాల మరియు మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు.3
- జనగామ జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రం గుడివాడ చౌరస్తాలో మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రమాద సంఘటన జరిగింది. నిద్ర మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టినట్లు స్థానికుల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధి నిర్వహణలో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీవో వెంకన్న మృతి చెందడం అత్యంత బాధాకరమని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు. విధి పట్ల నిబద్ధతతో పనిచేసే అధికారిగా వెంకన్న గుర్తింపు పొందారని ఆయన కొనియాడారు. ఈ విషాదకర ఘటనను రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు జేటీసీ తెలిపారు. పోలీసులు ఈ ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారని, మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని చంద్రశేఖర్ గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీటీసీలు రవీందర్ కుమార్, సురేశ్ కూడా పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మేజర్ గ్రామపంచాయతీకి చెందిన బీఆర్ఎస్ నాయకులు మరియు సర్పంచ్ మహమ్మద్ మోయీజ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు, ఉపసర్పంచ్ పెందోట రాజ్ కుమార్, ఏడుగురు వార్డు సభ్యులతో పాటు దాదాపు 50 మంది గ్రామస్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ పట్టణంలోని తన నివాసంలో వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్ మహమ్మద్ మోయీజ్, ఉపసర్పంచ్ రాజ్ కుమార్, మరియు వార్డు సభ్యులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులయ్యామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు, తెల్ల రేషన్ కార్డులతో పేదలకు సన్న బియ్యం పంపిణీ, మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి ఎన్నో సంక్షేమ పథకాలు తమను ప్రభావితం చేశాయని తెలిపారు. అంతేకాకుండా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నాయకత్వంలోనే రామడుగు గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన రామడుగు సర్పంచ్, ఉపసర్పంచ్, మరియు వార్డు సభ్యులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుభాకాంక్షలు తెలిపారు. రామడుగు గ్రామ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని గ్రామానికి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సత్యం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పార్టీలో చేరిన గ్రామ వార్డు సభ్యులలో ఎండి ఆరీఫ్, వెంకటేష్, సిరికొండ సాయి తేజ, వెంకటేష్, యాగం రవి, అనిల్ ఉన్నారు. వీరితో పాటు మొత్తం దాదాపు 50 మంది గ్రామస్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.4
- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ఆలయాలను టెంపుల్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగాలని కోరుతూనే తాను పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచనల మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆధ్యాత్మిక గురువుల సలహాలు, సూచనలతోనే ఆలయాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు.3
- తంగళ్ళపల్లిలోని సిరిసిల్ల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆమె ఆదేశించారు. తనిఖీలో భాగంగా, కలెక్టర్ మొదట డైనింగ్ హాల్‌కు వెళ్లి భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు, వారికి వడ్డించిన ఆహార పదార్థాలపై ఆరా తీశారు. ఆమె మెనూ చార్ట్‌ను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిచెన్ గోదాంలో బియ్యం, పప్పులు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారనే విషయంపై కూడా ఆరా తీశారు. ఆ తర్వాత వసతి గదులు, టాయిలెట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థులందరూ తరగతులకు హాజరయ్యేలా చూడాలని సూచించడంతో పాటు, విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.1