సీఎం నివాసం వద్ద మీడియా మిత్రులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క తెలంగాణ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ రాఖీ శుభాకాంక్షలు ప్రతి సోదరుడు సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుంది వారి రక్షణ కోసం కట్టే రాఖీ బంధము 12 సంవత్సరాలుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను రాఖీ కడుతూనే ఉన్నాను *ఒక ఆదివాసి బిడ్డను, అడవి బిడ్డను, మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆడబిడ్డను ఈ స్థాయికి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాత్ర కృషి చాలా ఉంది* *వారి సహకారం మరువలేనిది* ప్రతి ఏడాది ములుగు నియోజకవర్గ ప్రజలకు రాఖీ కట్టి సంప్రదాయాన్ని ప్రారంభిస్తాను ములుగు ప్రజల ఆశీస్సులు దీవెనలతో ఈ నా జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తున్న నన్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన ములుగు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను సోదరుడు సీఎం రేవంత్ రెడ్డికి చాలామంది మహిళలు, సహచర మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ మహిళా నాయకులు, బ్రహ్మకుమారీలు వచ్చి రాఖీలు కట్టారు వందల మంది మహిళలు వచ్చినా ఓపిగ్గా సీఎం గారు రాఖీ కట్టించుకుంటున్నారు
సీఎం నివాసం వద్ద మీడియా మిత్రులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క తెలంగాణ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ రాఖీ శుభాకాంక్షలు ప్రతి సోదరుడు సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుంది వారి రక్షణ కోసం కట్టే రాఖీ బంధము 12 సంవత్సరాలుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను రాఖీ కడుతూనే ఉన్నాను *ఒక ఆదివాసి బిడ్డను, అడవి బిడ్డను, మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆడబిడ్డను ఈ స్థాయికి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాత్ర కృషి చాలా ఉంది* *వారి సహకారం మరువలేనిది* ప్రతి ఏడాది ములుగు నియోజకవర్గ ప్రజలకు రాఖీ కట్టి సంప్రదాయాన్ని ప్రారంభిస్తాను ములుగు ప్రజల ఆశీస్సులు దీవెనలతో ఈ నా జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తున్న నన్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన ములుగు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను సోదరుడు సీఎం రేవంత్ రెడ్డికి చాలామంది మహిళలు, సహచర మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ మహిళా నాయకులు, బ్రహ్మకుమారీలు వచ్చి రాఖీలు కట్టారు వందల మంది మహిళలు వచ్చినా ఓపిగ్గా సీఎం గారు రాఖీ కట్టించుకుంటున్నారు
- బీజేపీ అగ్ర నేతలకు రాఖీ కట్టిన బిజెపి ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి పలువురు బీజేపీ ప్రముఖులను ఈరోజు హైదరాబాద్ లోని వారి నివాసాల్లో కలిసి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు... ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు *ఎన్. రామచంద్ర రావు* గారిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి *జి. కిషన్ రెడ్డి గారిని* కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి *బండి సంజయ్* గారిని మల్కాజ్‌గిరి ఎంపీ *ఈటల రాజేందర్* వారి నివాసాల్లో కలిసి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి మాత్రమే కాకుండా సోదరభావం, పరస్పర విశ్వాసం, ఆత్మీయత, సమాజ ఐక్యతకు ప్రతీక అని కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. మన కుటుంబాల మధ్య ఉన్న ప్రేమాభిమానాలు సమాజం మొత్తం విస్తరించి, ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు. దేశ రక్షణ, ప్రజా సేవ, సమాజ సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులకు రాఖీ కట్టి వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని కందుల సంధ్యారాణి తెలిపారు. ఈ రాఖీ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని, ఆత్మీయతను నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.1
- కరీంనగర్ అర్బన్ తహశిల్దార్ కార్యాలయంలో చెత్తకుప్పలో జాతీయ జెండాలు... నిరూపయోగంగా పడేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ కరీంనగర్ అర్బన్ తహశిల్దార్ కార్యాలయ ఆవరణలో చెత్త కుప్పలో జాతీయ జెండాలు కనిపించడం కలకలం సృష్టిస్తుంది. కార్యాలయ ప్రవేశ మార్గంలో చెత్త కుప్పలో జాతీయ పతాకాలు కొన్ని కాలిపోయి కనిపించడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. కొబ్బరి పీచు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తతో పాటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉపయోగించిన జాతీయ జెండాలు అక్కడ పడివున్నాయి. అంతేకాకుండా, అక్కడ కనిపించిన కొన్ని జెండాలు పాక్షికంగా ధ్వంసమై కాలిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. జాతీయ జెండాలు చెత్తలో కలిసిపోవడం, కొన్ని కాలిన స్థితిలో ఉండటం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా–2002 ప్రకారం జాతీయ జెండాలను గౌరవప్రదంగా నిర్వహించాల్సి ఉంటుందని, వినియోగానికి పనికిరాని లేదా దెబ్బతిన్న జెండాలను గౌరవానికి భంగం కలగకుండా ప్రత్యేక విధానంలో నిర్వీర్యం చేయాలని నిబంధనలు ఉండగా నిరుపయోగంగా జాతీయ పతాకాలను పడేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెత్తను తొలగించి, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.1
- కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క* గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.1
- పాలకుర్తి మండల కేంద్రంలోని గోశాలలో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు జనగామ జిల్లా : పాలకుర్తి మండల కేంద్రంలోని గోశాల లో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెంపుడు గోవులకు రాఖీలు కట్టిన కుటుంబం. అర్చకుల వేదమంత్రాల మధ్య గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవులకు తిలకం దిద్ది, రాఖీలు కట్టి గోవులకు దీపహారతి ఇచ్చారు. స్వీట్లకు బదులుగా అరటిపండ్లు, ఆకుకూరలతో గోవులకు విందు ఇచ్చారు. గోవులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ రక్షాబంధన్ వేడుకలు చేశారు.మూగజీవులపై ప్రేమాభిమానాలు చాటుకున్న ఆ కుటుంబం. సంప్రదాయానికి జీవకారుణ్యాన్ని జోడించిన వినూత్న వేడుకలు జరిగాయి.పాలకుర్తిలో ఆకట్టుకున్న గోమాతలతో రక్షాబంధన్ వేడుకలు చేసుకున్నారు.1
- సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో ఘనంగా కర్ర శ్రీహరి జయంతి వేడుకలు శనిగరం గ్రామం లోని గ్రామపంచాయతీ వద్ద దివంగత నేత అనేక పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి జయంతి వేడుకలు సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో.... బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామని గుర్తు చేసుకున్నారు... వారి ఆశయాలను కొనసాగించే విధంగా కృషి చేస్తామని అన్నారు.4
- భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు 9 మంది యువకుల అరెస్ట్ – ప్రభుత్వ అంచనా ప్రకారం మత్తు పదార్థాల విలువ రూ.6.50 లక్షలు కరీంనగర్ రూరల్ పోలీసులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ అలాం మరియు రూరల్ ఏసీపీ ఏ. విజయ్ కుమార్ ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు మరియు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డికి అందిన నమ్మదగిన సమాచారం మేరకు, బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందింది. దీంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ అలాం గారు మరియు రూరల్ ఏసీపీ శ్రీ ఏ. విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం, రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా గుమిగూడి ఉన్న తొమ్మిది మంది వ్యక్తులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల మరియు సిరిసిల్ల ప్రాంతాలకు చెందిన మొర్రి ఆకాశ్, పుట్టపాక విష్ణు సాయి, భైనవేని నితీష్, కోసిని బాలచంద్ర్, గుండు మనోహర్, విస్కుమల్లి విశాల్, గుండు కృష్ణగిరి, సిరిసిల్ల ప్రభాస్, మాకుల శివప్రసాద్గా తమ వివరాలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో సుమారు రూ.7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అలాగే గంజాయిని వినియోగించడంతో పాటు, హాష్ ఆయిల్‌ను ప్రత్యేక పరికరాల ద్వారా పొగ రూపంలో తీసుకుంటున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు నిందితుల వద్ద తనిఖీ నిర్వహించగా: సుమారు 500 గ్రాములు/మిల్లీలీటర్ల హాష్ ఆయిల్ సుమారు 500 గ్రాముల గంజాయి 60 డ్రగ్ ట్యాబ్లెట్లు 14 సిరంజీలు హాష్ ఆయిల్ వినియోగానికి ఉపయోగించే పరికరాలు 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల ప్రభుత్వ అంచనా విలువ సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్వాధీనం ప్రక్రియను పంచుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేస్తూ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు విచారణలో నిందితుల్లో ఒకరు డీమార్ట్ సమీపంలోని మెడికల్ షాప్ నుంచి డ్రగ్ ట్యాబ్లెట్లను తరచుగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర అంశాలపై సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. NDPS Act తదితర చట్టాల కింద కేసులు నిందితులపై NDPS Act, Drugs Act మరియు వర్తించే ఇతర చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన ప్రక్రియ అనంతరం రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు తదితర పదార్థాలను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం FSLకు పంపించి, పరీక్షా నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత కూడా మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళనకరమైన విషయమని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలను విక్రయించే లేదా సరఫరా చేసే వ్యక్తుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కేసులో నమ్మదగిన సమాచారం సేకరించి, చాకచక్యంగా దాడి నిర్వహించి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకున్న కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలాం మరియు రూరల్ ఏసీపీ ఏ. విజయ్ కుమార్ అభినందించారు.1
- హెల్మెట్ ధరించి వచ్చిన వారికి రాఖిలు కట్టి ట్రాఫిక్ పై అవగాహన చేసిన ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ట్రాఫిక్ అవగాహన సదస్సు ఈరోజు రక్షాబంధన్ పండుగ పురస్కరించుకొని టాపిక్ పై అవగాహన కార్యక్రమం జరిగినది. ట్రాఫిక్ ఏసిపి రామగుండం ch. శ్రీనివాస్ ఆదేశానుసారం. రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక మున్సిపల్ చౌరస్తా వద్ద *హెల్మెట్ ధరించి వచ్చిన వారికి రాఖి కట్టడం జరిగింది. మీ రక్షనే మీ కుటుంబ శ్రీరామరక్ష అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో *ఎస్సై. G. హరి శేఖర్* మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్ రాజుకు రాఖీ కట్టిన అక్క స్వప్న అక్క తమ్ముళ్లు, అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకల సందర్భంగా కరీంనగర్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా పని చేసే రాజు విధి నిర్వహణలో ఉండగా అతని సోదరి బస్ ఆపి తమ్ముడికి రాఖీ కట్టారు. గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి డ్రైవర్ మెండ రాజుకు అక్క తమ్మనవేణి స్వప్న రాఖీ కట్టి రక్షా బందన్ ప్రత్యేకతను చాటి చెప్పారు. పండుగ పూట ప్రయాణికుల సౌకర్యార్థం డ్రైవర్ గా విధుల్లో ఉన్న తమ్ముడు రాజు హైదరాబాద్ రూట్ లో వెళ్తున్నాడని తెలుసుకుని రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టి తమ ఆత్మీయ అనుబంధం చాటుకున్నారు.1
- భూపాలపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు.. జయశంకర్ భూపాలపల్లి: జిల్లా కేంద్రం శివారు బాంబుల గడ్డ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. వారిలో సమ్మక్క పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు క్షతగాత్రులను భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.1