Shuru
Apke Nagar Ki App…
భూపాలపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు.. జయశంకర్ భూపాలపల్లి: జిల్లా కేంద్రం శివారు బాంబుల గడ్డ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. వారిలో సమ్మక్క పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు క్షతగాత్రులను భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
M D Azizuddin
భూపాలపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు.. జయశంకర్ భూపాలపల్లి: జిల్లా కేంద్రం శివారు బాంబుల గడ్డ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. వారిలో సమ్మక్క పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు క్షతగాత్రులను భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- రాఖీ పండుగ వేళ ఆయుర్వేద విద్యార్థుల నిరసన.. స్టైఫండ్ పెంపు జీవో కోసం ఆందోళన వరంగల్: రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులు పండుగను ఆనందంగా జరుపుకుంటుండగా, అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థులు, హౌస్ సర్జన్లు మాత్రం తమ డిమాండ్ల సాధన కోసం నిరసన కొనసాగించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ హక్కులు, భవిష్యత్తు కోసం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. స్టైఫండ్ పెంపు కోసం ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఆయుష్ వైద్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. స్టైఫండ్ పెంపు జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో విడుదల చేసే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని విద్యార్థులు, హౌస్ సర్జన్లు స్పష్టం చేశారు.1
- రైతులు ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లికి చెందిన రైతు పిట్టల రాజు వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించారు. రైతు పందిళ్ల విధానంలో సాగు చేస్తున్న దొండ, సొర, పొట్లకాయ పంటలను పరిశీలించారు. తోట నిర్వహణ తీరు, పంట ఎదుగుదల, నీటి వినియోగం, దిగుబడి అవకాశాలపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తోటను చక్కగా నిర్వహిస్తున్నందుకు రైతును అభినందించారు. పంటలు మరింత ఆరోగ్యంగా ఎదగాలంటే పిచ్చి మొక్కలను తొలగించి కలుపు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి యాజమాన్యం, పందిళ్ల నిర్వహణ, పంట సంరక్షణ చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలని తెలిపారు. రైతు సాగు చేస్తున్న పంటల విస్తీర్ణం, పెట్టుబడి వ్యయం, నీటి వనరు, ప్రభుత్వ సబ్సిడీ ద్వారా పొందిన లబ్ధి, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలో సాగు చేస్తున్న పంటలను కూడా పరిశీలించి పంట ఆరోగ్యం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణపై పలు సూచనలు చేశారు. పంటల వైవిధ్యీకరణతో పాటు ఉద్యానవన పంటల సాగు చేపట్టడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ వ్యవసాయ, ఉద్యానవన పథకాలను రైతులు వినియోగించుకుని ఆధునిక సాగు విధానాల వైపు అడుగులు వేయాలని సూచించారు. కలెక్టర్ పర్యటనలో ఉద్యానవన శాఖ అధికారి సందీప్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- అడ్డంగా వచ్చిన బైక్ ను తప్పించబోయి పల్టీ కొట్టిన వోల్వో బస్సు కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడ్డుగావచ్చిన బైక్ ను తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంపు ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.1
- *కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క* గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది. *కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క* గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.1
- బెయిల్ .. 40 ఏళ్లు పరార్... హత్య కేసులో జీవిత ఖైదీ.. పేరు మార్చుకుని ఉద్యోగం.. 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు.. చివరకు అరెస్టు.. ఒక హత్య కేసులో జీవిత ఖైదు.. జైల్లో గడిపింది కేవలం ఆరు నెలల ఏడు రోజులు.. పెరోల్ పై బయటకు వచ్చి జైలుకు వెళ్లకుం డా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపాడు .. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం.. ఏకంగా 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు. గెలుచుకొన్నాడు .. చివరకు 73 ఏళ్ల వయసులో మళ్లీ అరెస్టు.. అయ్యాడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మం డలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది 1982లో మహబూబాబాద్ లో ఓ పాన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణలో మార్వాడీ వ్యాపారి జవార్ పండరిని తూకం బాటుతో మోది హత్య చేశారు, ఈ కేసులో నిందితుడుగా ఉన్న వీరన్న కు వరంగల్ అద నపు జిల్లా కోర్టు 1983 జూన్ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలులో (ఖైదీ నంబర్ 1567) ఉంచారు. మొత్తం శిక్షలో కేవలం 6 నెలల 7 రోజులు జైలు జీవితం గడిపిన ఆయన 1983 డిసెంబర్ 17న 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చాడు. పెరోల్ పై 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లలేదు. అక్కడి నుంచి మొదలైంది నాలుగు దశాబ్దాల పాటు పోలీస్ ల కళ్ళకు దొరకకుండా తిరిగాడు. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అతడిని పట్టు కుంది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలు మూసివేత కారణంగా చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంతకాలం అధికారులకు చిక్కకుండా ఉన్న వీరన్న పేరు మార్చుకుని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లా గుడివాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి 2013లో పదవీ విరమణ చేశాడు. కోసమేరుపు ఏమిటంటే పెన్షన్ కూడా పొందుతున్నాడు. ఉద్యోగ కాలంలో 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు కూడా అందుకున్నరు 2013 నుంచి మహబూబాబాద్ జిల్లాలోనే నివసిస్తున్నప్పటికీ 2024 వరకు అధికారులు అతడిని పట్టు కోలేకపోయారు. స్వగ్రామమైన పెద్దముప్పారానికి అప్పుడప్పుడు వచ్చేవాడని సమాచారం. వీరన్నను పట్టుకునేందుకు అధికారులు పలు దశల్లో ప్రయ త్నాలు చేశారు 2012 నవంబర్ 19 నుంచి 2020 అక్టోబర్ 3 వరకు మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల పోలీసు అధికారులకు లేఖలు పంపినట్లు, చివరిగా తెలిసిన చిరునామా, సమీప గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు ఎట్టకేలకు 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వీరన్న ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలు కు తరలించారు.... అయితే వీరన్న భార్య సందుల చారమ్మ 2026లో హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్ రద్దు. మూడేళ్ల పాటు పెరోల్ తిరస్కరణ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి. మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్ పై వెళ్లి తిరిగి జైలుకు రాకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగిన జీవిత ఖైదీ విషయంలో హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెరోల్ పై వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పాందడం ఆశ్చర్యకరమని.... అంతే కాకుండా జైళ్ల శాఖలోని లోపాలను ఎత్తిచూపుతోందని, అధికారుల అలసత్వం తెలియజేస్తోందని అందోళన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మోసపూరితంగా పొందడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ఘటనలు ఇతర ఖైదీలు నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రోత్సాహకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. భవిష్య త్లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరోల్ గడువు ముగిసే తేదీని నిరంతరం పర్యవేక్షించడం, గడువు ముగిసిన వెంటనే ఖైదీ జైలుకు హాజరయ్యాడా చూడాలని హాజరుకాని వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోర్టు తెలియజేసింది ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాక రిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో అతడిపై విధించిన జీవిత ఖైదులో మిగిలిన శిక్షను అనుభవించాల్సిం దేనని స్పష్టం చేశారు న్యాయమూర్తి.... ఫెరోల్ నిరాకరణతో..ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నాడు.1
- బొమ్మకల్ శివారులో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం...9 మంది యువకుల అరెస్ట్ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ శివారులో అక్రమంగా విక్రయించే 9 మందిని అరెస్ట్ చేసి ఆరు లక్షల 50 వేల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరగా 9 మంది పట్టుబడ్డారని తెలిపారు. అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. ఏపిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో 7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.1
- ములుగు జిల్లా కేంద్రంలో సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క1
- జనగామలో ఇంటి దొంగ అరెస్ట్.. 45 గ్రాముల బంగారం స్వాధీనం.. జనగామ: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా రాయవరం గ్రామానికి చెందిన దబ్బేట బాలలింగం అలియాస్ బాలు అలియాస్ ప్రవీణ్ రాజు (29)ను జనగామ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జనగామలో ఓ ఇంటి తాళం పగులగొట్టి బంగారం చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. వరంగల్‌లో బంగారం విక్రయించేందుకు వెళ్తుండగా అతడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి రెండు జతల కమ్మలు, రెండు వరుసల చైన్, మరో చైన్ కలిపి 44.990 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో సుమారు 90 కేసులు ఉండగా, పీడీ యాక్ట్ కింద కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.1