logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బొమ్మకల్ శివారులో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం...9 మంది యువకుల అరెస్ట్ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ శివారులో అక్రమంగా విక్రయించే 9 మందిని అరెస్ట్ చేసి ఆరు లక్షల 50 వేల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరగా 9 మంది పట్టుబడ్డారని తెలిపారు. అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. ఏపిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో 7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

1 hr ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
1 hr ago

బొమ్మకల్ శివారులో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం...9 మంది యువకుల అరెస్ట్ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ శివారులో అక్రమంగా విక్రయించే 9 మందిని అరెస్ట్ చేసి ఆరు లక్షల 50 వేల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరగా 9 మంది పట్టుబడ్డారని తెలిపారు. అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. ఏపిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో 7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • బొమ్మకల్ శివారులో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం...9 మంది యువకుల అరెస్ట్ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ శివారులో అక్రమంగా విక్రయించే 9 మందిని అరెస్ట్ చేసి ఆరు లక్షల 50 వేల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరగా 9 మంది పట్టుబడ్డారని తెలిపారు. అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. ఏపిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో 7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
    1
    బొమ్మకల్ శివారులో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం...9 మంది యువకుల అరెస్ట్
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ శివారులో అక్రమంగా విక్రయించే 9 మందిని అరెస్ట్ చేసి ఆరు లక్షల 50 వేల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరగా 9 మంది పట్టుబడ్డారని తెలిపారు.
అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. ఏపిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో 7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో నువులు పౌర్ణమి వేడుకలలో ఆధ్యాత్మిక శోభ బెజ్జంకి మండల కేంద్రంలో నూలు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై మగ్గాన్ని ఏర్పాటు చేసి, సంప్రదాయ పద్ధతిలో వస్త్రాన్ని నేస్తూ భజనలు, భక్తిగీతాలు ఆలపిస్తూ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పద్మశాలీలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న చేనేత కళను ప్రదర్శించారు. అంతరించిపోతున్న చేనేత సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు వాటి పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని వారు తెలిపారు.
    4
    సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో నువులు పౌర్ణమి వేడుకలలో ఆధ్యాత్మిక శోభ
బెజ్జంకి మండల కేంద్రంలో నూలు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై మగ్గాన్ని ఏర్పాటు చేసి, సంప్రదాయ పద్ధతిలో వస్త్రాన్ని నేస్తూ భజనలు, భక్తిగీతాలు ఆలపిస్తూ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పద్మశాలీలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న చేనేత కళను ప్రదర్శించారు. అంతరించిపోతున్న చేనేత సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు వాటి పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని వారు తెలిపారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    15 min ago
  • భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు 9 మంది యువకుల అరెస్ట్ – ప్రభుత్వ అంచనా ప్రకారం మత్తు పదార్థాల విలువ రూ.6.50 లక్షలు కరీంనగర్ రూరల్ పోలీసులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ అలాం మరియు రూరల్ ఏసీపీ ఏ. విజయ్ కుమార్ ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు మరియు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డికి అందిన నమ్మదగిన సమాచారం మేరకు, బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందింది. దీంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ అలాం గారు మరియు రూరల్ ఏసీపీ శ్రీ ఏ. విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం, రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా గుమిగూడి ఉన్న తొమ్మిది మంది వ్యక్తులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల మరియు సిరిసిల్ల ప్రాంతాలకు చెందిన మొర్రి ఆకాశ్, పుట్టపాక విష్ణు సాయి, భైనవేని నితీష్, కోసిని బాలచంద్ర్, గుండు మనోహర్, విస్కుమల్లి విశాల్, గుండు కృష్ణగిరి, సిరిసిల్ల ప్రభాస్, మాకుల శివప్రసాద్గా తమ వివరాలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో సుమారు రూ.7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అలాగే గంజాయిని వినియోగించడంతో పాటు, హాష్ ఆయిల్‌ను ప్రత్యేక పరికరాల ద్వారా పొగ రూపంలో తీసుకుంటున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు నిందితుల వద్ద తనిఖీ నిర్వహించగా: సుమారు 500 గ్రాములు/మిల్లీలీటర్ల హాష్ ఆయిల్ సుమారు 500 గ్రాముల గంజాయి 60 డ్రగ్ ట్యాబ్లెట్లు 14 సిరంజీలు హాష్ ఆయిల్ వినియోగానికి ఉపయోగించే పరికరాలు 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల ప్రభుత్వ అంచనా విలువ సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్వాధీనం ప్రక్రియను పంచుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేస్తూ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు విచారణలో నిందితుల్లో ఒకరు డీమార్ట్ సమీపంలోని మెడికల్ షాప్ నుంచి డ్రగ్ ట్యాబ్లెట్లను తరచుగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర అంశాలపై సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. NDPS Act తదితర చట్టాల కింద కేసులు నిందితులపై NDPS Act, Drugs Act మరియు వర్తించే ఇతర చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన ప్రక్రియ అనంతరం రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు తదితర పదార్థాలను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం FSLకు పంపించి, పరీక్షా నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత కూడా మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళనకరమైన విషయమని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలను విక్రయించే లేదా సరఫరా చేసే వ్యక్తుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కేసులో నమ్మదగిన సమాచారం సేకరించి, చాకచక్యంగా దాడి నిర్వహించి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకున్న కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలాం మరియు రూరల్ ఏసీపీ ఏ. విజయ్ కుమార్ అభినందించారు.
    1
    భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు 
9 మంది యువకుల అరెస్ట్ – ప్రభుత్వ అంచనా ప్రకారం మత్తు పదార్థాల విలువ రూ.6.50 లక్షలు

కరీంనగర్ రూరల్ పోలీసులు
కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ అలాం మరియు రూరల్ ఏసీపీ ఏ. విజయ్ కుమార్ ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు మరియు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేశారు.
ఈరోజు ఉదయం కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డికి అందిన నమ్మదగిన సమాచారం మేరకు, బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందింది.
దీంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ అలాం గారు మరియు రూరల్ ఏసీపీ శ్రీ ఏ. విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం, రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా గుమిగూడి ఉన్న తొమ్మిది మంది వ్యక్తులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో వారు కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల మరియు సిరిసిల్ల ప్రాంతాలకు చెందిన మొర్రి ఆకాశ్, పుట్టపాక విష్ణు సాయి, భైనవేని నితీష్, కోసిని బాలచంద్ర్, గుండు మనోహర్, విస్కుమల్లి విశాల్, గుండు కృష్ణగిరి, సిరిసిల్ల ప్రభాస్, మాకుల శివప్రసాద్గా తమ వివరాలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం
పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో సుమారు రూ.7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం
నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
అలాగే గంజాయిని వినియోగించడంతో పాటు, హాష్ ఆయిల్‌ను ప్రత్యేక పరికరాల ద్వారా పొగ రూపంలో తీసుకుంటున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు
నిందితుల వద్ద తనిఖీ నిర్వహించగా:
సుమారు 500 గ్రాములు/మిల్లీలీటర్ల హాష్ ఆయిల్
సుమారు 500 గ్రాముల గంజాయి
60 డ్రగ్ ట్యాబ్లెట్లు
14 సిరంజీలు
హాష్ ఆయిల్ వినియోగానికి ఉపయోగించే పరికరాలు
8 మొబైల్ ఫోన్లు
స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల ప్రభుత్వ అంచనా విలువ సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
స్వాధీనం ప్రక్రియను పంచుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేస్తూ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు
విచారణలో నిందితుల్లో ఒకరు డీమార్ట్ సమీపంలోని మెడికల్ షాప్ నుంచి డ్రగ్ ట్యాబ్లెట్లను తరచుగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర అంశాలపై సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
NDPS Act తదితర చట్టాల కింద కేసులు
నిందితులపై NDPS Act, Drugs Act మరియు వర్తించే ఇతర చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన ప్రక్రియ అనంతరం రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు తదితర పదార్థాలను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం FSLకు పంపించి, పరీక్షా నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత కూడా మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళనకరమైన విషయమని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలను విక్రయించే లేదా సరఫరా చేసే వ్యక్తుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
ఈ కేసులో నమ్మదగిన సమాచారం సేకరించి, చాకచక్యంగా దాడి నిర్వహించి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకున్న కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలాం మరియు రూరల్ ఏసీపీ ఏ. విజయ్ కుమార్ అభినందించారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    42 min ago
  • కరీంనగర్ అర్బన్ ఎమ్మార్వో ఆఫీసు వద్ద చెత్తలో జాతీయ జెండాలు కరీంనగర్ లోని స్థానిక అర్బన్ రెవెన్యూ (ఎమ్మార్వో) కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద జాతీయ జెండాలు చెత్తకుప్పలో దర్శనమివ్వడం కలకలం రేపింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం ఉపయోగించిన జెండాలను ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిపి పారవేశారు. కొబ్బరి పీచుతో పాటు పడివున్న కొన్ని జెండాలు పాక్షికంగా కాలిన స్థితిలో ఉన్నట్లు ఆఫీసు పనిమీద వచ్చిన చంద్రశేఖర్ అనే యువకుడు, ఇతర పౌరులు గమనించారు. 'ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002' ప్రకారం దెబ్బతిన్న జెండాలను గౌరవప్రదంగా నిర్వీర్యం చేయాల్సి ఉండగా, ప్రభుత్వ కార్యాలయం వద్దే ఇలా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
    3
    కరీంనగర్ అర్బన్ ఎమ్మార్వో ఆఫీసు వద్ద చెత్తలో జాతీయ జెండాలు
కరీంనగర్ లోని స్థానిక అర్బన్ రెవెన్యూ (ఎమ్మార్వో) కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద జాతీయ జెండాలు చెత్తకుప్పలో దర్శనమివ్వడం కలకలం రేపింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం ఉపయోగించిన జెండాలను ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిపి పారవేశారు.
కొబ్బరి పీచుతో పాటు పడివున్న కొన్ని జెండాలు పాక్షికంగా కాలిన స్థితిలో ఉన్నట్లు ఆఫీసు పనిమీద వచ్చిన చంద్రశేఖర్ అనే యువకుడు, ఇతర పౌరులు గమనించారు. 'ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002' ప్రకారం దెబ్బతిన్న జెండాలను గౌరవప్రదంగా నిర్వీర్యం చేయాల్సి ఉండగా, ప్రభుత్వ కార్యాలయం వద్దే ఇలా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందజేశారు.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రీజినల్ మేనేజర్ చి. రాజా నరేంద్ర ఈ వాహనాన్ని ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రతాప నవీన్ కుమార్, ఈ ఈ శ్రీ రాజేష్‌లకు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు రూ.7.25 లక్షల విలువైన ఈ వాహనం ఆలయ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ సి. ప్రతాప్ రెడ్డి, రీజినల్ మేనేజర్ శ్రీ చి. రాజా నరేంద్రతో పాటు బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందజేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందజేశారు.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రీజినల్ మేనేజర్ చి. రాజా నరేంద్ర ఈ వాహనాన్ని ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రతాప నవీన్ కుమార్, ఈ ఈ  శ్రీ రాజేష్‌లకు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు రూ.7.25 లక్షల విలువైన ఈ వాహనం ఆలయ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ సి. ప్రతాప్ రెడ్డి, రీజినల్ మేనేజర్ శ్రీ చి. రాజా నరేంద్రతో పాటు బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి* రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు...
    1
    *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి*

రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. 
అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు...
    user_Sai
    Sai
    Local News Reporter వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నేతలపై స్టేషన్‌ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న 1,400 కోట్లు అక్రమంగా వచ్చినవే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటన వీడియోలో నేనే ఉన్నానని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తున్నారన్నారు.
    1
    బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నేతలపై స్టేషన్‌ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం  ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న 1,400 కోట్లు అక్రమంగా వచ్చినవే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటన వీడియోలో నేనే ఉన్నానని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తున్నారన్నారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    22 hrs ago
  • కరీంనగర్ అర్బన్ తహశిల్దార్ కార్యాలయంలో చెత్తకుప్పలో జాతీయ జెండాలు... నిరూపయోగంగా పడేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ కరీంనగర్ అర్బన్ తహశిల్దార్ కార్యాలయ ఆవరణలో చెత్త కుప్పలో జాతీయ జెండాలు కనిపించడం కలకలం సృష్టిస్తుంది. కార్యాలయ ప్రవేశ మార్గంలో చెత్త కుప్పలో జాతీయ పతాకాలు కొన్ని కాలిపోయి కనిపించడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. కొబ్బరి పీచు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తతో పాటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉపయోగించిన జాతీయ జెండాలు అక్కడ పడివున్నాయి. అంతేకాకుండా, అక్కడ కనిపించిన కొన్ని జెండాలు పాక్షికంగా ధ్వంసమై కాలిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. జాతీయ జెండాలు చెత్తలో కలిసిపోవడం, కొన్ని కాలిన స్థితిలో ఉండటం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా–2002 ప్రకారం జాతీయ జెండాలను గౌరవప్రదంగా నిర్వహించాల్సి ఉంటుందని, వినియోగానికి పనికిరాని లేదా దెబ్బతిన్న జెండాలను గౌరవానికి భంగం కలగకుండా ప్రత్యేక విధానంలో నిర్వీర్యం చేయాలని నిబంధనలు ఉండగా నిరుపయోగంగా జాతీయ పతాకాలను పడేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెత్తను తొలగించి, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
    1
    కరీంనగర్ అర్బన్ తహశిల్దార్ కార్యాలయంలో చెత్తకుప్పలో జాతీయ జెండాలు... నిరూపయోగంగా పడేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్
కరీంనగర్ అర్బన్ తహశిల్దార్ కార్యాలయ ఆవరణలో చెత్త కుప్పలో జాతీయ జెండాలు కనిపించడం కలకలం సృష్టిస్తుంది. కార్యాలయ ప్రవేశ మార్గంలో చెత్త కుప్పలో జాతీయ పతాకాలు కొన్ని కాలిపోయి కనిపించడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. కొబ్బరి పీచు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తతో పాటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉపయోగించిన జాతీయ జెండాలు అక్కడ పడివున్నాయి. అంతేకాకుండా, అక్కడ కనిపించిన కొన్ని జెండాలు పాక్షికంగా ధ్వంసమై కాలిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. జాతీయ జెండాలు చెత్తలో కలిసిపోవడం, కొన్ని కాలిన స్థితిలో ఉండటం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా–2002 ప్రకారం జాతీయ జెండాలను గౌరవప్రదంగా నిర్వహించాల్సి ఉంటుందని,  వినియోగానికి పనికిరాని లేదా దెబ్బతిన్న జెండాలను గౌరవానికి భంగం కలగకుండా ప్రత్యేక విధానంలో నిర్వీర్యం చేయాలని నిబంధనలు ఉండగా నిరుపయోగంగా జాతీయ పతాకాలను పడేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెత్తను తొలగించి, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.