Shuru
Apke Nagar Ki App…
*ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి* రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు...
Sai
*ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి* రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు...
More news from తెలంగాణ and nearby areas
- *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి* రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు...1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందజేశారు.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రీజినల్ మేనేజర్ చి. రాజా నరేంద్ర ఈ వాహనాన్ని ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రతాప నవీన్ కుమార్, ఈ ఈ శ్రీ రాజేష్‌లకు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు రూ.7.25 లక్షల విలువైన ఈ వాహనం ఆలయ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ సి. ప్రతాప్ రెడ్డి, రీజినల్ మేనేజర్ శ్రీ చి. రాజా నరేంద్రతో పాటు బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.1
- సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో ఘనంగా కర్ర శ్రీహరి జయంతి వేడుకలు శనిగరం గ్రామం లోని గ్రామపంచాయతీ వద్ద దివంగత నేత అనేక పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి జయంతి వేడుకలు సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో.... బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామని గుర్తు చేసుకున్నారు... వారి ఆశయాలను కొనసాగించే విధంగా కృషి చేస్తామని అన్నారు.4
- భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు 9 మంది యువకుల అరెస్ట్ – ప్రభుత్వ అంచనా ప్రకారం మత్తు పదార్థాల విలువ రూ.6.50 లక్షలు కరీంనగర్ రూరల్ పోలీసులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ అలాం మరియు రూరల్ ఏసీపీ ఏ. విజయ్ కుమార్ ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు మరియు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డికి అందిన నమ్మదగిన సమాచారం మేరకు, బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందింది. దీంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ అలాం గారు మరియు రూరల్ ఏసీపీ శ్రీ ఏ. విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం, రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా గుమిగూడి ఉన్న తొమ్మిది మంది వ్యక్తులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల మరియు సిరిసిల్ల ప్రాంతాలకు చెందిన మొర్రి ఆకాశ్, పుట్టపాక విష్ణు సాయి, భైనవేని నితీష్, కోసిని బాలచంద్ర్, గుండు మనోహర్, విస్కుమల్లి విశాల్, గుండు కృష్ణగిరి, సిరిసిల్ల ప్రభాస్, మాకుల శివప్రసాద్గా తమ వివరాలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో సుమారు రూ.7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అలాగే గంజాయిని వినియోగించడంతో పాటు, హాష్ ఆయిల్‌ను ప్రత్యేక పరికరాల ద్వారా పొగ రూపంలో తీసుకుంటున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు నిందితుల వద్ద తనిఖీ నిర్వహించగా: సుమారు 500 గ్రాములు/మిల్లీలీటర్ల హాష్ ఆయిల్ సుమారు 500 గ్రాముల గంజాయి 60 డ్రగ్ ట్యాబ్లెట్లు 14 సిరంజీలు హాష్ ఆయిల్ వినియోగానికి ఉపయోగించే పరికరాలు 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల ప్రభుత్వ అంచనా విలువ సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్వాధీనం ప్రక్రియను పంచుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేస్తూ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు విచారణలో నిందితుల్లో ఒకరు డీమార్ట్ సమీపంలోని మెడికల్ షాప్ నుంచి డ్రగ్ ట్యాబ్లెట్లను తరచుగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర అంశాలపై సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. NDPS Act తదితర చట్టాల కింద కేసులు నిందితులపై NDPS Act, Drugs Act మరియు వర్తించే ఇతర చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన ప్రక్రియ అనంతరం రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు తదితర పదార్థాలను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం FSLకు పంపించి, పరీక్షా నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత కూడా మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళనకరమైన విషయమని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలను విక్రయించే లేదా సరఫరా చేసే వ్యక్తుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కేసులో నమ్మదగిన సమాచారం సేకరించి, చాకచక్యంగా దాడి నిర్వహించి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకున్న కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలాం మరియు రూరల్ ఏసీపీ ఏ. విజయ్ కుమార్ అభినందించారు.1
- కరీంనగర్ అర్బన్ ఎమ్మార్వో ఆఫీసు వద్ద చెత్తలో జాతీయ జెండాలు కరీంనగర్ లోని స్థానిక అర్బన్ రెవెన్యూ (ఎమ్మార్వో) కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద జాతీయ జెండాలు చెత్తకుప్పలో దర్శనమివ్వడం కలకలం రేపింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం ఉపయోగించిన జెండాలను ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిపి పారవేశారు. కొబ్బరి పీచుతో పాటు పడివున్న కొన్ని జెండాలు పాక్షికంగా కాలిన స్థితిలో ఉన్నట్లు ఆఫీసు పనిమీద వచ్చిన చంద్రశేఖర్ అనే యువకుడు, ఇతర పౌరులు గమనించారు. 'ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002' ప్రకారం దెబ్బతిన్న జెండాలను గౌరవప్రదంగా నిర్వీర్యం చేయాల్సి ఉండగా, ప్రభుత్వ కార్యాలయం వద్దే ఇలా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.3
- కోరుట్లలో పెరుగుతున్న కుక్కల బెడద పట్టించుకోని అధికారులు.. భయాందోళనలో పట్టణ ప్రజలు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు, పాఠశాలల పరిసరాల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు కుక్కల కారణంగా భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు వాహనదారులను వెంబడిస్తుండటంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒంటరిగా వెళ్లే చిన్నారులు, మహిళలు కుక్కల దాడుల భయంతో బయటకు రావడానికి జంకుతున్నారు. కుక్కల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం, ఆహార వ్యర్థాలు బహిరంగంగా పడేయడం కూడా వీధి కుక్కల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, కుక్కల నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. “కుక్కల బెడదతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజలకు రక్షణ కల్పించాలి” అని పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- బొమ్మకల్ శివారులో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం...9 మంది యువకుల అరెస్ట్ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ శివారులో అక్రమంగా విక్రయించే 9 మందిని అరెస్ట్ చేసి ఆరు లక్షల 50 వేల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరగా 9 మంది పట్టుబడ్డారని తెలిపారు. అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. ఏపిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో 7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.1
- శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ఈవో ప్రత్యేక పర్యవేక్షణ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి , డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్ కుమార్ ఆలయ ఏర్పాట్లను పరిశీలించి ప్రత్యేకంగా పర్యవేక్షించారు.శ్రావణ మాసం సందర్భంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ఓడి బియ్యం, కుంకుమ పూజ, చీరె-సారెలు సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటారని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం ఈవో రమాదేవి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, వాయినాలు పంపిణీ చేశారు.వారి వెంట ఏ ఈ ఓ లక్ష్మణ్ కుమార్ పి ఆర్ ఓ పెరిక శ్రీనివాస్ ఆలయ ఉద్యోగులు ఉన్నారు.1