logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కోరుట్లలో పెరుగుతున్న కుక్కల బెడద పట్టించుకోని అధికారులు.. భయాందోళనలో పట్టణ ప్రజలు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు, పాఠశాలల పరిసరాల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు కుక్కల కారణంగా భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు వాహనదారులను వెంబడిస్తుండటంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒంటరిగా వెళ్లే చిన్నారులు, మహిళలు కుక్కల దాడుల భయంతో బయటకు రావడానికి జంకుతున్నారు. కుక్కల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం, ఆహార వ్యర్థాలు బహిరంగంగా పడేయడం కూడా వీధి కుక్కల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, కుక్కల నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. “కుక్కల బెడదతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజలకు రక్షణ కల్పించాలి” అని పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

46 min ago
user_అబ్దుల్ ముసవ్విర్
అబ్దుల్ ముసవ్విర్
Insurance Agent జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
46 min ago

కోరుట్లలో పెరుగుతున్న కుక్కల బెడద పట్టించుకోని అధికారులు.. భయాందోళనలో పట్టణ ప్రజలు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు, పాఠశాలల పరిసరాల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు కుక్కల కారణంగా భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు వాహనదారులను వెంబడిస్తుండటంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒంటరిగా వెళ్లే చిన్నారులు, మహిళలు కుక్కల దాడుల భయంతో బయటకు రావడానికి జంకుతున్నారు. కుక్కల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం, ఆహార వ్యర్థాలు బహిరంగంగా పడేయడం కూడా వీధి కుక్కల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, కుక్కల నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. “కుక్కల బెడదతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజలకు రక్షణ కల్పించాలి” అని పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ఈవో ప్రత్యేక పర్యవేక్షణ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి , డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్ కుమార్ ఆలయ ఏర్పాట్లను పరిశీలించి ప్రత్యేకంగా పర్యవేక్షించారు.శ్రావణ మాసం సందర్భంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ఓడి బియ్యం, కుంకుమ పూజ, చీరె-సారెలు సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటారని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం ఈవో రమాదేవి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, వాయినాలు పంపిణీ చేశారు.వారి వెంట ఏ ఈ ఓ లక్ష్మణ్ కుమార్ పి ఆర్ ఓ పెరిక శ్రీనివాస్ ఆలయ ఉద్యోగులు ఉన్నారు.
    1
    శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ఈవో  ప్రత్యేక పర్యవేక్షణ
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి , డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్ కుమార్ ఆలయ ఏర్పాట్లను పరిశీలించి ప్రత్యేకంగా పర్యవేక్షించారు.శ్రావణ మాసం సందర్భంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ఓడి బియ్యం, కుంకుమ పూజ, చీరె-సారెలు సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటారని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను సమీక్షించారు.
అనంతరం ఈవో రమాదేవి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, వాయినాలు పంపిణీ చేశారు.వారి వెంట ఏ ఈ ఓ లక్ష్మణ్ కుమార్ పి ఆర్ ఓ  పెరిక శ్రీనివాస్ ఆలయ ఉద్యోగులు ఉన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క.. గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.
    1
    కరీంనగర్ ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క..
గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్  మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. 
తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    8 hrs ago
  • సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో ఘనంగా కర్ర శ్రీహరి జయంతి వేడుకలు శనిగరం గ్రామం లోని గ్రామపంచాయతీ వద్ద దివంగత నేత అనేక పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి జయంతి వేడుకలు సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో.... బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామని గుర్తు చేసుకున్నారు... వారి ఆశయాలను కొనసాగించే విధంగా కృషి చేస్తామని అన్నారు.
    4
    సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో ఘనంగా కర్ర శ్రీహరి జయంతి వేడుకలు
శనిగరం గ్రామం లోని గ్రామపంచాయతీ వద్ద దివంగత నేత అనేక పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి  జయంతి వేడుకలు సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో.... బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామని గుర్తు చేసుకున్నారు... వారి ఆశయాలను కొనసాగించే విధంగా కృషి చేస్తామని అన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    58 min ago
  • బొమ్మకల్ శివారులో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం...9 మంది యువకుల అరెస్ట్ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ శివారులో అక్రమంగా విక్రయించే 9 మందిని అరెస్ట్ చేసి ఆరు లక్షల 50 వేల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరగా 9 మంది పట్టుబడ్డారని తెలిపారు. అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. ఏపిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో 7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
    1
    బొమ్మకల్ శివారులో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం...9 మంది యువకుల అరెస్ట్
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ శివారులో అక్రమంగా విక్రయించే 9 మందిని అరెస్ట్ చేసి ఆరు లక్షల 50 వేల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరగా 9 మంది పట్టుబడ్డారని తెలిపారు.
అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. ఏపిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో 7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • సీఎంఆర్ బియ్యం బకాయిలపై కఠిన చర్యలు.....జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష * డిఫాల్ట్ మిల్లర్‌తో పాటు ట్రక్ చిట్టీల్లో సంతకాలు చేసిన మరో వ్యక్తిపై కేసు నమోదు పవన సుత రైస్ మిల్ సీఎంఆర్ బియ్యం డిఫాల్ట్‌కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం తెలిపారు. రావికంటి పవన్ కుమార్ యాజమాన్యంలోని పవన సుత రైస్ మిల్‌కు ఖరీఫ్, రబీ 2021-22 సీజన్లలో మొత్తం 5,798.080 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించగా, దానికి సమానంగా 3,891.295 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉందని తెలిపారు. అయితే మిల్లర్ ఇప్పటివరకు 1,069.380 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐ/టీజీఎస్‌సీఎస్‌సీఎల్‌కు అందించారని పేర్కొన్నారు. దీంతో 2,821.915 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం బకాయి ఉన్నట్లు తెలిపారు. ఇది 4,211.813 మెట్రిక్ టన్నుల సమాన ధాన్యానికి సమానమని, దీని విలువ రూ.9,82,51,492గా ఉందని పేర్కొన్నారు. 25 శాతం పెనాల్టీ రూ.2,45,62,873 కలిపి మొత్తం డిఫాల్ట్ మొత్తం రూ.12,28,14,365గా నిర్ధారించినట్లు తెలిపారు. రబీ 2021-22కు సంబంధించి పవన సుత రైస్ మిల్లుకు అప్పగించిన ధాన్యాన్ని మంథనిలోని శ్రీలక్ష్మి ఎంఆర్ఎం సూరయ్య పల్లి మిల్లుకు తరలించినట్లు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి పీపీసీల ద్వారా సమర్పించిన ట్రక్ చిట్టీలు, జాయింట్ సంతకాలను అధికారులు పరిశీలించగా, శ్రీలక్ష్మి ఎంఆర్ఎం, సూరయ్యపల్లికి చెందిన భాగస్వామి వొల్లాల నవీన్ కుమార్ సంతకాలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి అప్పగించిన ధాన్యం స్వీకరణ, అంగీకారానికి సంబంధించిన ట్రక్ చిట్టీల్లో నవీన్ కుమార్ సంతకాలు ఉన్న నేపథ్యంలో ఆయన పాత్రపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పవన సుత రైస్ మిల్ యాజమాని రావికంటి పవన్ కుమార్, శ్రీలక్ష్మి ఎంఆర్ఎం భాగస్వామి వొల్లాల నవీన్ కుమార్‌లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం, సీఎంఆర్ బియ్యం విషయంలో డిఫాల్ట్‌కు పాల్పడిన మిల్లర్లపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసులు, రికవరీ తదితర చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
    1
    సీఎంఆర్ బియ్యం బకాయిలపై కఠిన చర్యలు.....జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* డిఫాల్ట్ మిల్లర్‌తో పాటు ట్రక్ చిట్టీల్లో సంతకాలు చేసిన మరో వ్యక్తిపై కేసు నమోదు
పవన సుత రైస్ మిల్ సీఎంఆర్ బియ్యం డిఫాల్ట్‌కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం తెలిపారు. రావికంటి పవన్ కుమార్ యాజమాన్యంలోని పవన సుత రైస్ మిల్‌కు ఖరీఫ్, రబీ 2021-22 సీజన్లలో మొత్తం 5,798.080 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించగా, దానికి సమానంగా 3,891.295 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉందని  తెలిపారు. అయితే మిల్లర్ ఇప్పటివరకు 1,069.380 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐ/టీజీఎస్‌సీఎస్‌సీఎల్‌కు అందించారని పేర్కొన్నారు. దీంతో 2,821.915 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం బకాయి ఉన్నట్లు తెలిపారు. ఇది 4,211.813 మెట్రిక్ టన్నుల సమాన ధాన్యానికి సమానమని, దీని విలువ రూ.9,82,51,492గా ఉందని పేర్కొన్నారు. 25 శాతం పెనాల్టీ రూ.2,45,62,873 కలిపి మొత్తం డిఫాల్ట్ మొత్తం రూ.12,28,14,365గా నిర్ధారించినట్లు  తెలిపారు. రబీ 2021-22కు సంబంధించి పవన సుత రైస్ మిల్లుకు అప్పగించిన ధాన్యాన్ని మంథనిలోని శ్రీలక్ష్మి ఎంఆర్ఎం సూరయ్య పల్లి మిల్లుకు తరలించినట్లు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి పీపీసీల ద్వారా సమర్పించిన ట్రక్ చిట్టీలు, జాయింట్ సంతకాలను అధికారులు పరిశీలించగా, శ్రీలక్ష్మి ఎంఆర్ఎం, సూరయ్యపల్లికి చెందిన భాగస్వామి వొల్లాల నవీన్ కుమార్ సంతకాలు ఉన్నట్లు గుర్తించినట్లు  పేర్కొన్నారు. ప్రభుత్వానికి అప్పగించిన ధాన్యం స్వీకరణ, అంగీకారానికి సంబంధించిన ట్రక్ చిట్టీల్లో నవీన్ కుమార్ సంతకాలు ఉన్న నేపథ్యంలో ఆయన పాత్రపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పవన సుత రైస్ మిల్ యాజమాని రావికంటి పవన్ కుమార్, శ్రీలక్ష్మి ఎంఆర్ఎం భాగస్వామి వొల్లాల నవీన్ కుమార్‌లపై కేసు నమోదు చేసినట్లు  వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం, సీఎంఆర్ బియ్యం విషయంలో డిఫాల్ట్‌కు పాల్పడిన మిల్లర్లపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసులు, రికవరీ తదితర చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    2 hrs ago
  • వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్... వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్... పిండ ప్రదానాల నాటకాలకు కామారెడ్డి ప్రజలే బుద్ధి చెబుతారు! కామారెడ్డి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ... ముందస్తు చూపు లేకుండా, ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా పదేళ్ల పాలనలో ఇష్టారీతిన డివైడర్లు నిర్మించి కామారెడ్డిలో వరద వినాశనానికి BRS పార్టీయే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు BRS నాయకులకు లేదని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ... గతంలో వచ్చిన వరదల వల్ల ప్రజలు పడిన అపారమైన ఇబ్బందులకు BRS నాయకులు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పాలనలో చేసిన చారిత్రక తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు 'పిండ ప్రదానాలు' అంటూ చౌకబారు రాజకీయాలు, నాటకాలు ఆడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాశ్వత పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం:- BRS చేసిన తప్పులను సరిదిద్ది, కామారెడ్డి ప్రజలకు వరద ముప్పు నుండి శాశ్వత ఉపశమనం కలిగించేందుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారు ఇప్పటికే తీసుకెళ్లారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధి, ప్రజల భద్రతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ షబ్బీర్ అలీ:- కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ కృషి వల్లే ప్రతీ ఊరికి సబ్ స్టేషన్లు, మల్లన్న గుట్ట వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మాణం సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. ఈ వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా పోవడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. "గతంలో పట్టణానికి 7 MLD నీరు మాత్రమే వస్తే, ఇప్పుడు అది 11 MLD కి పెరిగింది. అది షబ్బీర్ అలీ సామర్థ్యానికి తార్కాణం. ఇందిరా గాంధీ స్టేడియం నిర్మాణం, ఫ్లడ్ లైట్లు, ప్రధాన రహదారుల అభివృద్ధి అంతా ఆయన హయాంలోనే జరిగింది" అని పేర్కొన్నారు. BRS కు సవాల్:- ప్రజలను మభ్యపెట్టి, కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం ధర్నాలు, నాటకాలు చేయడం BRS నాయకులు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యకమంలో పట్టణ అధ్యక్షులు సందీప్,రాజగౌడ్,గూడెం శ్రీనివాస్,పండ్లరాజు,గోనె శ్రీనివాస్ గొడుగుల,శ్రీనివాస్,కౌన్సిలర్స్ అంజాద్,జావీద్,నిట్టూ గంగాధర్,కాళ్ళ గణేష్,లడ్డు,కన్నయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    1
    వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్...
వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్...
పిండ ప్రదానాల నాటకాలకు కామారెడ్డి ప్రజలే బుద్ధి చెబుతారు!
కామారెడ్డి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ...
ముందస్తు చూపు లేకుండా, ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా పదేళ్ల పాలనలో ఇష్టారీతిన డివైడర్లు నిర్మించి కామారెడ్డిలో వరద వినాశనానికి BRS పార్టీయే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు BRS నాయకులకు లేదని ఆయన ఖండించారు.
ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ... గతంలో వచ్చిన వరదల వల్ల ప్రజలు పడిన అపారమైన ఇబ్బందులకు BRS నాయకులు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పాలనలో చేసిన చారిత్రక తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు 'పిండ ప్రదానాలు' అంటూ చౌకబారు రాజకీయాలు, నాటకాలు ఆడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
శాశ్వత పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం:-
BRS చేసిన తప్పులను సరిదిద్ది, కామారెడ్డి ప్రజలకు వరద ముప్పు నుండి శాశ్వత ఉపశమనం కలిగించేందుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారు ఇప్పటికే తీసుకెళ్లారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధి, ప్రజల భద్రతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు.
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ షబ్బీర్ అలీ:-
కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ  కృషి వల్లే ప్రతీ ఊరికి సబ్ స్టేషన్లు, మల్లన్న గుట్ట వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మాణం సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. ఈ వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా పోవడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. "గతంలో పట్టణానికి 7 MLD నీరు మాత్రమే వస్తే, ఇప్పుడు అది 11 MLD కి పెరిగింది. అది షబ్బీర్ అలీ  సామర్థ్యానికి తార్కాణం. ఇందిరా గాంధీ స్టేడియం నిర్మాణం, ఫ్లడ్ లైట్లు, ప్రధాన రహదారుల అభివృద్ధి అంతా ఆయన హయాంలోనే జరిగింది" అని పేర్కొన్నారు.
BRS కు సవాల్:-
ప్రజలను మభ్యపెట్టి, కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం ధర్నాలు, నాటకాలు చేయడం BRS నాయకులు మానుకోవాలని హెచ్చరించారు.
ఈ కార్యకమంలో పట్టణ  అధ్యక్షులు సందీప్,రాజగౌడ్,గూడెం శ్రీనివాస్,పండ్లరాజు,గోనె శ్రీనివాస్ గొడుగుల,శ్రీనివాస్,కౌన్సిలర్స్ అంజాద్,జావీద్,నిట్టూ గంగాధర్,కాళ్ళ గణేష్,లడ్డు,కన్నయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
    1
    ప్రభుత్వ విప్  వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలోజిల్లా సమావేశంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిచాలి.. జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల 4వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 9.30 గంటలకు శ్రీ కృష్ణా పూజ కార్యక్రమం. 10.30హోమం.పూజ కార్యక్రమంలో పాల్గొనే దంపతులు జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్ కి పేర్లు నమోదు చేసుకోగలరు. 12.15 నిమిషాలకి ఉట్ల కార్యక్రమం.అనంతరం ప్రసాద పంపిణీ. ఈ కార్యక్రమంలో భాగంగా యాదవ్ కులస్థూలు అందరూ భాగస్వాములు అయి ఇట్టి కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు అంబటి సంతోష్ యాదవ్ , జిల్లా అధ్యక్షులకు,ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘం జిల్లా డైరెక్టర్ సందబోయిన ప్రసాద్ యాదవ్,గీతాంజలి యాదవ్, బొబ్బూరి కుమార్ యాదవ్ ,రాజేందర్ యాదవ్,వేల్పుల కొమురయ్య యాదవను సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ సందబోయిన ప్రసాద్ యాదవ్.శ్రీ క్రిష్ణ ట్రస్ట్ చైర్మన్ బబ్బూరు కుమార్ యాదవ్.జిల్లా మహిళా అధ్యక్షురాలు సందబోయిన గీతాంజలి యాదవ్,యాదవ్ సంఘం జిల్లా కార్యదర్శి కాల్వ మల్లేశ్ యాదవ్.ఉపాధ్యక్షులు ముంజ రాజేందర్ యాదవ్. కొండ రవి యాదవ్ జాతీయ అవార్డు గ్రహీత గారు.యూత్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ యాదవ్. యాదవ్ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బండి మల్లయ్య యాదవ్.కరీంనగర్ టౌన్ ఉపాధ్యక్షులు మెండ రాజు యాదవ్. జంగా కొమురయ్య యాదవ్.8వ డివిజన్ అధ్యక్షులు వేలుపుల కొమురయ్య యాదవ్.యువజన విభాగం కార్యదర్శి అంబటి సంతోష్ యాదవ్ ,మరియు కుల బంధువులు పాల్గొన్నారు..
    1
    కరీంనగర్ జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలోజిల్లా సమావేశంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిచాలి.. 
జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల 4వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 9.30 గంటలకు శ్రీ కృష్ణా పూజ కార్యక్రమం. 10.30హోమం.పూజ కార్యక్రమంలో పాల్గొనే దంపతులు జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్ కి పేర్లు నమోదు చేసుకోగలరు. 12.15 నిమిషాలకి ఉట్ల కార్యక్రమం.అనంతరం ప్రసాద పంపిణీ. ఈ కార్యక్రమంలో భాగంగా యాదవ్ కులస్థూలు అందరూ భాగస్వాములు అయి ఇట్టి కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు అంబటి సంతోష్ యాదవ్ , జిల్లా అధ్యక్షులకు,ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘం జిల్లా డైరెక్టర్ సందబోయిన ప్రసాద్ యాదవ్,గీతాంజలి యాదవ్, బొబ్బూరి కుమార్ యాదవ్ ,రాజేందర్ యాదవ్,వేల్పుల కొమురయ్య
యాదవను సన్మానించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ సందబోయిన ప్రసాద్ యాదవ్.శ్రీ క్రిష్ణ ట్రస్ట్ చైర్మన్ బబ్బూరు కుమార్ యాదవ్.జిల్లా మహిళా అధ్యక్షురాలు సందబోయిన గీతాంజలి యాదవ్,యాదవ్ సంఘం జిల్లా కార్యదర్శి కాల్వ మల్లేశ్ యాదవ్.ఉపాధ్యక్షులు  ముంజ రాజేందర్ యాదవ్. కొండ రవి యాదవ్ జాతీయ అవార్డు గ్రహీత గారు.యూత్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ యాదవ్. యాదవ్ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బండి మల్లయ్య యాదవ్.కరీంనగర్ టౌన్ ఉపాధ్యక్షులు మెండ రాజు యాదవ్. జంగా కొమురయ్య యాదవ్.8వ డివిజన్ అధ్యక్షులు వేలుపుల కొమురయ్య యాదవ్.యువజన విభాగం కార్యదర్శి అంబటి సంతోష్ యాదవ్ ,మరియు కుల బంధువులు పాల్గొన్నారు..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    11 hrs ago
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో నువులు పౌర్ణమి వేడుకలలో ఆధ్యాత్మిక శోభ బెజ్జంకి మండల కేంద్రంలో నూలు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై మగ్గాన్ని ఏర్పాటు చేసి, సంప్రదాయ పద్ధతిలో వస్త్రాన్ని నేస్తూ భజనలు, భక్తిగీతాలు ఆలపిస్తూ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పద్మశాలీలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న చేనేత కళను ప్రదర్శించారు. అంతరించిపోతున్న చేనేత సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు వాటి పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని వారు తెలిపారు.
    4
    సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో నువులు పౌర్ణమి వేడుకలలో ఆధ్యాత్మిక శోభ
బెజ్జంకి మండల కేంద్రంలో నూలు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై మగ్గాన్ని ఏర్పాటు చేసి, సంప్రదాయ పద్ధతిలో వస్త్రాన్ని నేస్తూ భజనలు, భక్తిగీతాలు ఆలపిస్తూ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పద్మశాలీలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న చేనేత కళను ప్రదర్శించారు. అంతరించిపోతున్న చేనేత సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు వాటి పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని వారు తెలిపారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.