వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్... వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్... పిండ ప్రదానాల నాటకాలకు కామారెడ్డి ప్రజలే బుద్ధి చెబుతారు! కామారెడ్డి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ... ముందస్తు చూపు లేకుండా, ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా పదేళ్ల పాలనలో ఇష్టారీతిన డివైడర్లు నిర్మించి కామారెడ్డిలో వరద వినాశనానికి BRS పార్టీయే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు BRS నాయకులకు లేదని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ... గతంలో వచ్చిన వరదల వల్ల ప్రజలు పడిన అపారమైన ఇబ్బందులకు BRS నాయకులు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పాలనలో చేసిన చారిత్రక తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు 'పిండ ప్రదానాలు' అంటూ చౌకబారు రాజకీయాలు, నాటకాలు ఆడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాశ్వత పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం:- BRS చేసిన తప్పులను సరిదిద్ది, కామారెడ్డి ప్రజలకు వరద ముప్పు నుండి శాశ్వత ఉపశమనం కలిగించేందుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారు ఇప్పటికే తీసుకెళ్లారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధి, ప్రజల భద్రతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ షబ్బీర్ అలీ:- కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ కృషి వల్లే ప్రతీ ఊరికి సబ్ స్టేషన్లు, మల్లన్న గుట్ట వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మాణం సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. ఈ వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా పోవడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. "గతంలో పట్టణానికి 7 MLD నీరు మాత్రమే వస్తే, ఇప్పుడు అది 11 MLD కి పెరిగింది. అది షబ్బీర్ అలీ సామర్థ్యానికి తార్కాణం. ఇందిరా గాంధీ స్టేడియం నిర్మాణం, ఫ్లడ్ లైట్లు, ప్రధాన రహదారుల అభివృద్ధి అంతా ఆయన హయాంలోనే జరిగింది" అని పేర్కొన్నారు. BRS కు సవాల్:- ప్రజలను మభ్యపెట్టి, కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం ధర్నాలు, నాటకాలు చేయడం BRS నాయకులు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యకమంలో పట్టణ అధ్యక్షులు సందీప్,రాజగౌడ్,గూడెం శ్రీనివాస్,పండ్లరాజు,గోనె శ్రీనివాస్ గొడుగుల,శ్రీనివాస్,కౌన్సిలర్స్ అంజాద్,జావీద్,నిట్టూ గంగాధర్,కాళ్ళ గణేష్,లడ్డు,కన్నయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్... వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్... పిండ ప్రదానాల నాటకాలకు కామారెడ్డి ప్రజలే బుద్ధి చెబుతారు! కామారెడ్డి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ... ముందస్తు చూపు లేకుండా, ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా పదేళ్ల పాలనలో ఇష్టారీతిన డివైడర్లు నిర్మించి కామారెడ్డిలో వరద వినాశనానికి BRS పార్టీయే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు BRS నాయకులకు లేదని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ... గతంలో వచ్చిన వరదల వల్ల ప్రజలు పడిన అపారమైన ఇబ్బందులకు BRS నాయకులు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పాలనలో చేసిన చారిత్రక తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు 'పిండ ప్రదానాలు' అంటూ చౌకబారు రాజకీయాలు, నాటకాలు ఆడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాశ్వత పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం:- BRS చేసిన తప్పులను సరిదిద్ది, కామారెడ్డి ప్రజలకు వరద ముప్పు నుండి శాశ్వత ఉపశమనం కలిగించేందుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారు ఇప్పటికే తీసుకెళ్లారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధి, ప్రజల భద్రతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ షబ్బీర్ అలీ:- కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ కృషి వల్లే ప్రతీ ఊరికి సబ్ స్టేషన్లు, మల్లన్న గుట్ట వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మాణం సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. ఈ వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా పోవడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. "గతంలో పట్టణానికి 7 MLD నీరు మాత్రమే వస్తే, ఇప్పుడు అది 11 MLD కి పెరిగింది. అది షబ్బీర్ అలీ సామర్థ్యానికి తార్కాణం. ఇందిరా గాంధీ స్టేడియం నిర్మాణం, ఫ్లడ్ లైట్లు, ప్రధాన రహదారుల అభివృద్ధి అంతా ఆయన హయాంలోనే జరిగింది" అని పేర్కొన్నారు. BRS కు సవాల్:- ప్రజలను మభ్యపెట్టి, కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం ధర్నాలు, నాటకాలు చేయడం BRS నాయకులు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యకమంలో పట్టణ అధ్యక్షులు సందీప్,రాజగౌడ్,గూడెం శ్రీనివాస్,పండ్లరాజు,గోనె శ్రీనివాస్ గొడుగుల,శ్రీనివాస్,కౌన్సిలర్స్ అంజాద్,జావీద్,నిట్టూ గంగాధర్,కాళ్ళ గణేష్,లడ్డు,కన్నయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.1
- రక్షాబంధన్ ఎఫెక్ట్... రద్దీగా బస్సులు........( వీడియో) బిక్కనూర్ రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుండి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులలో మహిళా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లడంతో బస్సులు రద్దీగా మారాయి. దీనికి తోడు బస్సుల సంఖ్యను తగ్గించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులో చోటు కోసం మహిళల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కొందరు చేసేది ఏమీ లేక ఆటోలలో ప్రయాణాలు కొనసాగించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందజేశారు.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రీజినల్ మేనేజర్ చి. రాజా నరేంద్ర ఈ వాహనాన్ని ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రతాప నవీన్ కుమార్, ఈ ఈ శ్రీ రాజేష్‌లకు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు రూ.7.25 లక్షల విలువైన ఈ వాహనం ఆలయ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ సి. ప్రతాప్ రెడ్డి, రీజినల్ మేనేజర్ శ్రీ చి. రాజా నరేంద్రతో పాటు బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.1
- *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి* రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు...1
- బోధన్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్.. కాంగ్రెస్, మజ్లిస్ మధ్య రాజకీయ విభేదాలపై చర్చ బోధన్ రాజకీయాల్లో మరోసారి రాజకీయ వేడి కనిపిస్తోంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) తరఫున కాంగ్రెస్‌కు గట్టి రాజకీయ సందేశం రావడంతో బోధన్‌లో రాజకీయ వాతావరణంపై చర్చ మొదలైంది. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి బుల్డోజర్ చర్యల విషయంలో హెచ్చరిక చేసిన నేపథ్యంలో బోధన్ రాజకీయ పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది. రానున్న 2028 ఎన్నికల్లో ఈ రాజకీయ విభేదాల ప్రభావం ఎవరిపై పడుతుంది? ప్రజలు ఈ వ్యవహారంపై ఎలాంటి తీర్పు ఇస్తారు? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య పలు అంశాల్లో సహకారం, రాజకీయ సమన్వయం కనిపిస్తూ వచ్చింది. అయితే బోధన్‌లో కాంగ్రెస్, మజ్లిస్ స్థానిక నాయకుల మధ్య ఏర్పడుతున్న రాజకీయ ఉద్రిక్తతలు పలు ప్రశ్నలకు దారితీస్తున్నాయి. బోధన్ ప్రజల్లో ఇప్పుడు ఒక చర్చ కొనసాగుతోంది. ఈ రాజకీయ వివాదం తర్వాత బోధన్ రాజకీయ వాతావరణం మారుతుందా? రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈ రాజకీయ పరిణామాలపై సమాధానం ఇస్తారా? బోధన్ కాంగ్రెస్ నాయకులు, మజ్లిస్ నాయకుల మధ్య ఇదే విధమైన రాజకీయ పోరు కొనసాగుతుందా? అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న... ఈ రాజకీయ విభేదాల కారణంగా బోధన్ అభివృద్ధి ప్రభావితమవుతుందా? గతంలో కూడా రాజకీయ విభేదాలు, రాజకీయ ఆధిపత్య పోరు కారణంగా బోధన్ అభివృద్ధి దెబ్బతిన్నదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మరోసారి రాజకీయ వివాదాల కారణంగా బోధన్ అభివృద్ధి పనులు ప్రభావితమవుతాయా? అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అలాగే ప్రజల్లో మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది... అసలు బోధన్‌లో కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటోంది? తెలంగాణ స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్‌తో కలిసి పనిచేయగలిగినప్పుడు, బోధన్‌లో మాత్రం కాంగ్రెస్, మజ్లిస్ స్థానిక నాయకుల మధ్య రాజకీయ విభేదాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? బోధన్ అభివృద్ధే లక్ష్యమైతే, రెండు పార్టీల స్థానిక నాయకులు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేయకూడదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బుల్డోజర్ చర్యలు, రాజకీయ వివాదాల విషయంలో కూడా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ విభేదాలు ఎవరి మధ్య ఉన్నా, వాటి ప్రభావం బోధన్ అభివృద్ధిపై పడకూడదని ప్రజలు కోరుతున్నారు. బోధన్ ప్రజల డిమాండ్ ఏమిటంటే.. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకు అతీతంగా పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఆరోగ్యం, విద్య, ఉపాధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే... బోధన్‌లో కొనసాగుతున్న ఈ రాజకీయ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుంది? కాంగ్రెస్, మజ్లిస్ స్థానిక నాయకుల మధ్య విభేదాలు మరింత తీవ్రతరం అవుతాయా?** లేక బోధన్ ప్రజా ప్రయోజనాలు, పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఇరు వర్గాలు కలిసి పనిచేస్తాయా? బోధన్ రాజకీయ పరిణామాలపై ఇప్పుడు ప్రజల దృష్టి అంతా ఉంది. రానున్న ఎన్నికల్లో ప్రజల ఓటే ఈ రాజకీయ పరిస్థితికి అసలైన సమాధానం కానుంది.1
- తూప్రాన్ పట్టణంలోని శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సంతోషిమాత జయంతి ఉత్సవాలు తూప్రాన్ పట్టణంలోని శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సంతోషిమాత జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు సోమయాజుల రవీంద్రశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, చతుష్షష్టి ఉపచార పూజలు, రక్షాబంధన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కొడిప్యాక అన్నపూర్ణ, నారాయణగుప్త దంపతులతో పాటు పలువురు భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.1
- అనుబంధాలకు ప్రతీక.. రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల ఆత్మీయ బంధానికి వేడుక1
- *SIR ప్రక్రియపై ( డ్రప్ట్ ఓటర్ లిస్టు పై ) అవగాహన కోసం 46 & 47వ పరిదిలోని భారత్ రోడ్డులో వార్డు సభ* *కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 46 & 47వ వార్డు కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో 46 & 47వ వార్డు పరిధిలోని భారత్ రోడ్ లో SIR ప్రక్రియపై ఈ రోజు వార్డు సభ నిర్వహించడం జరిగింది. వార్డులో నిర్వహించిన సమావేశంలో ఓటర్ జాబితా చదివి వినిపించారు. ఓటర్లకు పలు అనుమానాలపై అవగాహన కల్పించారు. జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఓటర్లకు పలు విషయాలపై వివరించారు. ఇట్టి వార్డు సభ కార్యక్రమంలో మున్సిపల్ RO రవి గోపాల్ రెడ్డి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసన్న, మున్సిపల్ అధికారి భాగ్యలక్ష్మీ, 46, 47 వార్డు అధికారి కిశోర్, BLO లు కాశీరాం, పిట్ల రేఖ, వేంకట లక్ష్మి, బాబిత మరియు స్థానిక 46 & 47వ వార్డు ఓటర్లు తదితరులు పాల్గొన్నారు1