logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

స్కూలుకు 'తాళం'.. విద్యార్థుల 'ఆక్రందన..* *విట్యాల హెచ్‌ఎం నిర్లక్ష్యంపై ఉగ్రరూపం దాల్చిన విద్యార్థులు..* *హెచ్‌ఎం రాకను నిరసిస్తూ విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి, నేరుగా సర్పంచ్ ఇంటికి వెళ్లారు..* *మీకు పనులు ఉంటే మా సార్ ని అక్కడే ఉంచుకోండి..* *మాకు పాఠాలు చెప్పేందుకు ఇంకో టీచర్‌ని పంపండి..* ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం "బడిబాట" అంటూ విద్యార్థులను బడికి రమ్మని పిలుస్తుంటే, మరోవైపు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ప్రధానోపాధ్యాయుడు మాత్రం విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం విట్యాల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది... *జనవరి 26న కనిపించారు.. మళ్ళీ ఇప్పుడో..* పాఠశాలకు హెడ్ మాస్టర్ (HM), పైగా ఆయనే ఇంగ్లీష్ టీచర్. కానీ, ఆయన దర్శనం విద్యార్థులకు 'అమావాస్య కో పున్నానికో' అన్నట్లుగా మారింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేసేందుకు వచ్చిన సార్, మళ్ళీ ఇప్పటివరకు పాఠశాల గడప తొక్కలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్ బోధించే వారు లేక వారి చదువులు "ఎక్కడ వేసిన గొంగడి అక్కడే" అన్న చందంగా మారాయి. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం మరో కొన్ని రోజుల్లో వార్షిక పరీక్షలు (SSC Exams) ఉన్న తరుణంలో, సిలబస్ పూర్తి చేయాల్సింది పోయి, 'ఏదో పని ఉంది' అంటూ కాలక్షేపం చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినా మా జీవితాలు ఆగమైపోతాయి, మా బతుకులతో ఎందుకు ఆడుకుంటున్నారు?" అంటూ పదో తరగతి విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అరకొరగా వచ్చి వెళ్లే సార్, కనీసం పాఠాలు చెప్పే తీరిక లేనంతగా ఏ పనుల్లో నిమగ్నమయ్యారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఎంఈఓ సమాధానంపై విస్మయం.. హెచ్‌ఎం రాకను నిరసిస్తూ విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి, నేరుగా సర్పంచ్ ఇంటికి వెళ్లారు. సర్పంచ్ ఈ విషయంపై ఎంఈఓ (MEO) కి ఫోన్ చేయగా,మీ ప్రిన్సిపాల్ గారికి వేరే పని ఉంది, 12వ తేదీ తర్వాత వస్తారు" అని సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ప్రభుత్వ పాఠశాల అంటే విద్యార్థులకు విద్యను అందించడమా.. ? లేక అధికారుల వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడమా? అని విద్యార్థులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీకు పనులు ఉంటే మా సార్ ని అక్కడే ఉంచుకోండి, మాకు పాఠాలు చెప్పేందుకు ఇంకో టీచర్‌ని పంపండి. మా చదువులను ఎందుకు ఆగం చేస్తున్నారు..? *విట్యాల పాఠశాల విద్యార్థుల ఆవేదన.* సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు తూట్లు! ఒక్క విద్యార్థి ఉన్నా సరే పాఠశాలను నడిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తుంటే, ఇక్కడ వందలాది మంది విద్యార్థులు ఉన్నా బోధించే టీచర్ లేకపోవడం ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతోంది. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ, విధులకు గైర్హాజరవుతూ, విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తున్న ఇలాంటి టీచర్లపై మరియు వారికి వత్తాసు పలుకుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే సదరు హెచ్‌ఎంను సస్పెండ్ చేయాలని విట్యాల గ్రామస్థులు మరియు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

5 hrs ago
user_Rameshu Avula
Rameshu Avula
Electronics ఫరూఖ్‌నగర్, రంగారెడ్డి, తెలంగాణ•
5 hrs ago
8e9fc361-e547-4a85-9e11-4d0b72cf1fad

స్కూలుకు 'తాళం'.. విద్యార్థుల 'ఆక్రందన..* *విట్యాల హెచ్‌ఎం నిర్లక్ష్యంపై ఉగ్రరూపం దాల్చిన విద్యార్థులు..* *హెచ్‌ఎం రాకను నిరసిస్తూ విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి, నేరుగా సర్పంచ్ ఇంటికి వెళ్లారు..* *మీకు పనులు ఉంటే మా సార్ ని అక్కడే ఉంచుకోండి..* *మాకు పాఠాలు చెప్పేందుకు ఇంకో టీచర్‌ని పంపండి..* ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం "బడిబాట" అంటూ విద్యార్థులను బడికి రమ్మని పిలుస్తుంటే, మరోవైపు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ప్రధానోపాధ్యాయుడు మాత్రం విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం విట్యాల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది... *జనవరి 26న కనిపించారు.. మళ్ళీ ఇప్పుడో..* పాఠశాలకు హెడ్ మాస్టర్ (HM), పైగా ఆయనే ఇంగ్లీష్ టీచర్. కానీ, ఆయన దర్శనం విద్యార్థులకు 'అమావాస్య కో పున్నానికో' అన్నట్లుగా మారింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేసేందుకు వచ్చిన సార్, మళ్ళీ ఇప్పటివరకు పాఠశాల గడప తొక్కలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్ బోధించే వారు లేక వారి చదువులు "ఎక్కడ వేసిన గొంగడి అక్కడే" అన్న చందంగా మారాయి. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం మరో కొన్ని రోజుల్లో వార్షిక పరీక్షలు (SSC Exams) ఉన్న తరుణంలో, సిలబస్ పూర్తి చేయాల్సింది పోయి, 'ఏదో పని ఉంది' అంటూ కాలక్షేపం చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినా మా జీవితాలు ఆగమైపోతాయి,

dec2d5e4-1e7b-4bc2-aeb9-f26c9f2d2f5c

మా బతుకులతో ఎందుకు ఆడుకుంటున్నారు?" అంటూ పదో తరగతి విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అరకొరగా వచ్చి వెళ్లే సార్, కనీసం పాఠాలు చెప్పే తీరిక లేనంతగా ఏ పనుల్లో నిమగ్నమయ్యారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఎంఈఓ సమాధానంపై విస్మయం.. హెచ్‌ఎం రాకను నిరసిస్తూ విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి, నేరుగా సర్పంచ్ ఇంటికి వెళ్లారు. సర్పంచ్ ఈ విషయంపై ఎంఈఓ (MEO) కి ఫోన్ చేయగా,మీ ప్రిన్సిపాల్ గారికి వేరే పని ఉంది, 12వ తేదీ తర్వాత వస్తారు" అని సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ప్రభుత్వ పాఠశాల అంటే విద్యార్థులకు విద్యను అందించడమా.. ? లేక అధికారుల వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడమా? అని విద్యార్థులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీకు పనులు ఉంటే మా సార్ ని అక్కడే ఉంచుకోండి, మాకు పాఠాలు చెప్పేందుకు ఇంకో టీచర్‌ని పంపండి. మా చదువులను ఎందుకు ఆగం చేస్తున్నారు..? *విట్యాల పాఠశాల విద్యార్థుల ఆవేదన.* సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు తూట్లు! ఒక్క విద్యార్థి ఉన్నా సరే పాఠశాలను నడిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తుంటే, ఇక్కడ వందలాది మంది విద్యార్థులు ఉన్నా బోధించే టీచర్ లేకపోవడం ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతోంది. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ, విధులకు గైర్హాజరవుతూ, విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తున్న ఇలాంటి టీచర్లపై మరియు వారికి వత్తాసు పలుకుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే సదరు హెచ్‌ఎంను సస్పెండ్ చేయాలని విట్యాల గ్రామస్థులు మరియు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • యాంకర్:గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి,భారతదేశంలో గోవధ నిషేద ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని గోమాత గౌరవ ప్రచారాన్నీ హైద్రాబాద్,గోశామహల్ బేగంబజార్ నుండి ప్రారంభించింది.ఏప్రిల్ 27న భారతీయులు,గో ప్రేమికులు అందరూ గో సంరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి తహసీల్దార్, పోస్టాఫీస్ ల ద్వారా దరఖాస్తులు,లేటర్ లు రాష్ట్రపతి, ప్రధానమంత్రి,గవర్నర్, ముఖ్యమంత్రులకు సమర్పించాలని కోరుతూ గోమాత ప్రచారాం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
    2
    యాంకర్:గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి,భారతదేశంలో గోవధ నిషేద ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని గోమాత గౌరవ ప్రచారాన్నీ హైద్రాబాద్,గోశామహల్ బేగంబజార్ నుండి ప్రారంభించింది.ఏప్రిల్ 27న భారతీయులు,గో ప్రేమికులు అందరూ గో సంరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి తహసీల్దార్, పోస్టాఫీస్ ల ద్వారా దరఖాస్తులు,లేటర్ లు రాష్ట్రపతి, ప్రధానమంత్రి,గవర్నర్, ముఖ్యమంత్రులకు సమర్పించాలని  కోరుతూ గోమాత ప్రచారాం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమ్ నరేందర్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన వేమ్ నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. వేమ్ నరేందర్ రెడ్డి కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
    1
    రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమ్ నరేందర్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన వేమ్ నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. వేమ్ నరేందర్ రెడ్డి కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి! వరంగల్: జిల్లాలోని దుగ్గొండి మండలంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొగరాయి ప్రధాన రహదారిపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో, సదరు వాహనదారుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ​మంగళవారం జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తొగరాయి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
    2
    వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి!
వరంగల్: జిల్లాలోని దుగ్గొండి మండలంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొగరాయి ప్రధాన రహదారిపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో, సదరు వాహనదారుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
​మంగళవారం జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తొగరాయి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • మహిళలు పురుషులతో సమానంగా ఎదుగుతున్నారు: సంగారెడ్డిలో TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి
    1
    మహిళలు పురుషులతో సమానంగా ఎదుగుతున్నారు: సంగారెడ్డిలో TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు
    1
    మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో  త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    4 hrs ago
  • Post by Narasimulu Narasimulu
    1
    Post by Narasimulu Narasimulu
    user_Narasimulu Narasimulu
    Narasimulu Narasimulu
    మనోహరాబాద్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 10 ప్రజా తెలంగాణ న్యూస్ / సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయం చైర్మన్ జగ్గయ్యగారి శ్రీనివాస్ శ్రీ గౌరీ దంపతుల ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, ఈ రోజు పులిహోర పంపిణీ దాత జగ్గయ్యగారి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో తొడుపునూరి కాశీనాథ్,శ్రీహరి,రవీందర్,కైలాస ప్రశాంత్,రమేష్,దుబకుంట లచ్చల్ మణిదీప్ తదితరులు పాల్గొన్నారు
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 10 ప్రజా తెలంగాణ న్యూస్ /
సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయం చైర్మన్ జగ్గయ్యగారి శ్రీనివాస్ శ్రీ గౌరీ దంపతుల ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, ఈ రోజు పులిహోర పంపిణీ దాత జగ్గయ్యగారి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో తొడుపునూరి కాశీనాథ్,శ్రీహరి,రవీందర్,కైలాస ప్రశాంత్,రమేష్,దుబకుంట లచ్చల్ మణిదీప్ తదితరులు పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ లో అర్బన్ నక్సల్స్, మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. అలాంటి భావజాలం ఉన్నవారితో తెలంగాణ విద్యా విధానం-2026" పేరిట రిపోర్ట్ తయారు చేయించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. విద్యార్థులపై వామపక్ష భావజాలాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో “తెలంగాణ విద్యా విధానం – 2026” అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఉస్మానియా యూనివర్సిటీ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచందర్ రావు, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యా రంగానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు విద్యావేత్తలు, నిపుణులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌లు ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి, ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. తిరుపతి రావు, ప్రొఫెసర్ పి. మురళి మనోహర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ,.. ఇటీవల విద్యా కమిషన్ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానం తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. విద్యా విధానం లక్ష్యం రాష్ట్రంలో అక్షరాస్యత పెంపు, విద్యార్థులను ఉన్నత విద్య వైపు దారి చూపేలా ఉండాలని సూచించారు. కాని తెలంగాణలో విద్యా వ్యవస్థ గత బీఆర్‌ఎస్ పాలనలోనే పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అర్హత కలిగిన బీఈడీ టీచర్లు ఉన్నప్పటికీ వారికి సరైన అవకాశాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. టీచర్లకు జీతాల చెల్లింపుల్లో ఆలస్యం, ప్రమోషన్లలో జాప్యం, విద్యా పరిపాలనలో డీఈవోలు, ఎంఈవోల స్థాయిలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న పరిస్థితి ఏర్పడిందని, అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతోందన్నారు. విద్యార్థులు ఉన్న చోట టీచర్లు లేకపోవడం, టీచర్లు ఉన్న చోట విద్యార్థులు లేకపోవడం వంటి పరిస్థితి విద్యా వ్యవస్థలో ఏర్పడిందని అన్నారు. పాఠశాలల్లో టాయిలెట్స్, మిడ్‌డే మీల్స్ వంటి కనీస సదుపాయాలు కూడా సరిపడా లేవని తెలిపారు. గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, అలాంటి ఘటనల్లో సుమారు 44 మంది విద్యార్థులు మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని, రైట్ టు ఎడ్యుకేషన్ అమలుపై కూడా కేంద్ర విధానంలో స్పష్టమైన సూచనలు ఉన్నాయని రాంచందర్ రావు గుర్తు చేశారు. అయితే రాష్ట్ర విద్యా కమిషన్ సూచనలు వివాదాస్పదంగా మారాయని తెలిపారు. నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, భారతీయ సంస్కృతి, విలువలను ప్రతిబింబించే విధంగా విద్యా విధానం ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ రిపోర్టులో సంస్కృతాన్ని తొలగించాలని సూచించడం సరైంది కాదని, సంస్కృతం ప్రాచీన భాషగా దేశ సంస్కృతిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా సంస్కృతాన్ని తొలగించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ట్రైబల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలను తొలగించాలనడం కూడా అభ్యంతరకరమని అన్నారు. ప్రభుత్వ టీచర్ల జీతాల్లో కోత విధించాలని కమిషన్ సూచించిందన్న ప్రచారం సరికాదని, టీచర్ల జీతాలు తగ్గించి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన తప్పుదారి పట్టించేదని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ విద్యా వ్యవస్థ తీవ్ర వైఫల్యాన్ని ఎదుర్కొంటోందని ఆయన విమర్శించారు. తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టు తయారుచేసేటప్పుడు విద్యావంతులు, విద్యా నిపుణులతో సరైన సంప్రదింపులు జరపలేదని అన్నారు.
    2
    తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ లో అర్బన్ నక్సల్స్, మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. అలాంటి భావజాలం ఉన్నవారితో తెలంగాణ విద్యా విధానం-2026" పేరిట రిపోర్ట్ తయారు చేయించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. విద్యార్థులపై వామపక్ష భావజాలాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో “తెలంగాణ విద్యా విధానం – 2026” అంశంపై  రౌండ్ టేబుల్ సమావేశం ఉస్మానియా యూనివర్సిటీ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  రామచందర్ రావు, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యా రంగానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు విద్యావేత్తలు, నిపుణులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌లు ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి, ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. తిరుపతి రావు,  ప్రొఫెసర్ పి. మురళి మనోహర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ,.. ఇటీవల విద్యా కమిషన్ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానం తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. విద్యా విధానం లక్ష్యం రాష్ట్రంలో అక్షరాస్యత పెంపు, విద్యార్థులను ఉన్నత విద్య వైపు దారి చూపేలా ఉండాలని సూచించారు. కాని తెలంగాణలో విద్యా వ్యవస్థ గత బీఆర్‌ఎస్ పాలనలోనే పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అర్హత కలిగిన బీఈడీ టీచర్లు ఉన్నప్పటికీ వారికి సరైన అవకాశాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. టీచర్లకు జీతాల చెల్లింపుల్లో ఆలస్యం, ప్రమోషన్లలో జాప్యం, విద్యా పరిపాలనలో డీఈవోలు, ఎంఈవోల స్థాయిలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న పరిస్థితి ఏర్పడిందని, అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతోందన్నారు. విద్యార్థులు ఉన్న చోట టీచర్లు లేకపోవడం, టీచర్లు ఉన్న చోట విద్యార్థులు లేకపోవడం వంటి పరిస్థితి విద్యా వ్యవస్థలో ఏర్పడిందని అన్నారు. పాఠశాలల్లో టాయిలెట్స్, మిడ్‌డే మీల్స్ వంటి కనీస సదుపాయాలు కూడా సరిపడా లేవని తెలిపారు. గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, అలాంటి ఘటనల్లో సుమారు 44 మంది విద్యార్థులు మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని, రైట్ టు ఎడ్యుకేషన్ అమలుపై కూడా కేంద్ర విధానంలో స్పష్టమైన సూచనలు ఉన్నాయని రాంచందర్ రావు గుర్తు చేశారు. అయితే రాష్ట్ర విద్యా కమిషన్ సూచనలు వివాదాస్పదంగా మారాయని తెలిపారు. నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, భారతీయ సంస్కృతి, విలువలను ప్రతిబింబించే విధంగా విద్యా విధానం ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ రిపోర్టులో సంస్కృతాన్ని తొలగించాలని సూచించడం సరైంది కాదని, సంస్కృతం ప్రాచీన భాషగా దేశ సంస్కృతిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా సంస్కృతాన్ని తొలగించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ట్రైబల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలను తొలగించాలనడం కూడా అభ్యంతరకరమని అన్నారు. ప్రభుత్వ టీచర్ల జీతాల్లో కోత విధించాలని కమిషన్ సూచించిందన్న ప్రచారం సరికాదని, టీచర్ల జీతాలు తగ్గించి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన తప్పుదారి పట్టించేదని విమర్శించారు.
గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ విద్యా వ్యవస్థ తీవ్ర వైఫల్యాన్ని ఎదుర్కొంటోందని ఆయన విమర్శించారు. తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టు తయారుచేసేటప్పుడు విద్యావంతులు, విద్యా నిపుణులతో సరైన సంప్రదింపులు జరపలేదని అన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్! బాధితుల కోసం దీక్ష..కవితను, విశారదన్ మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనం వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.​దీక్షలో ఆమెతో పాటు డీఎస్సీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ మరియు ఇతర ప్రతినిధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రంతా దీక్ష కొనసాగించిన వీరిని, మంగళవారం ఉదయం పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు వీరిని హైదరాబాద్ రోడ్డు మీదుగా తరలిస్తున్నారు. ఈ అరెస్టులతో ఖమ్మం పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
    1
    తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్!
బాధితుల కోసం దీక్ష..కవితను, విశారదన్ మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనం వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.​దీక్షలో ఆమెతో పాటు  డీఎస్సీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ మరియు ఇతర ప్రతినిధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రంతా దీక్ష కొనసాగించిన వీరిని, మంగళవారం ఉదయం పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు వీరిని హైదరాబాద్ రోడ్డు మీదుగా తరలిస్తున్నారు. ఈ అరెస్టులతో ఖమ్మం పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.