logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణలో రైతు సంక్షేమం, అభివృద్ధి పనులపై ప్రభుత్వం కట్టుబడి ఉంది.. - రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తెలంగాణలో రైతు సంక్షేమం, అభివృద్ధి పనులపై ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి‌ తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.‌ సిద్దిపేట జిల్లా నర్మేటలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.ముందుగా హెలిప్యాడ్‌ను పరిశీలించిన మంత్రులు, భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఫ్యాక్టరీ ప్రాంగణం, రిఫైనరీ శంకుస్థాపన స్థలం, సభ వేదికలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సుమారు 150 స్టాళ్లను కూడా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ...32 ఎకరాల్లో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందని తెలిపారు. కేవలం 16 నెలల్లో పూర్తి చేయడం విశేషమని చెప్పారు. గంటకు 30 నుంచి 120 టన్నుల వరకు క్రషింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఫ్యాక్టరీ రాష్ట్రంలో కీలకంగా మారుతుందని అన్నారు. ఇక్కడే ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుతో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి, తక్కువ సమయంలో చెల్లింపులు జరిపే విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. సుమారు 25 లక్షల మంది రైతులకు లాభం చేకూరేలా చర్యలు తీసుకున్నామని, దేశంలోనే ఒకేసారి భారీ స్థాయిలో రుణమాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారిస్తే లాభాలు పొందవచ్చని చెప్పారు.

3 hrs ago
user_RAMESH P
RAMESH P
కుశాల్ నగర్, సిద్దిపేట•
3 hrs ago

తెలంగాణలో రైతు సంక్షేమం, అభివృద్ధి పనులపై ప్రభుత్వం కట్టుబడి ఉంది.. - రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తెలంగాణలో రైతు సంక్షేమం, అభివృద్ధి పనులపై ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి‌ తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.‌ సిద్దిపేట జిల్లా నర్మేటలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.ముందుగా హెలిప్యాడ్‌ను పరిశీలించిన మంత్రులు, భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఫ్యాక్టరీ ప్రాంగణం, రిఫైనరీ శంకుస్థాపన స్థలం, సభ వేదికలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సుమారు 150 స్టాళ్లను కూడా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ...32 ఎకరాల్లో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందని తెలిపారు. కేవలం 16 నెలల్లో పూర్తి చేయడం విశేషమని చెప్పారు. గంటకు 30 నుంచి 120 టన్నుల వరకు క్రషింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఫ్యాక్టరీ రాష్ట్రంలో కీలకంగా మారుతుందని అన్నారు. ఇక్కడే ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుతో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి, తక్కువ సమయంలో చెల్లింపులు జరిపే విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. సుమారు 25 లక్షల మంది రైతులకు లాభం చేకూరేలా చర్యలు తీసుకున్నామని, దేశంలోనే ఒకేసారి భారీ స్థాయిలో రుణమాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారిస్తే లాభాలు పొందవచ్చని చెప్పారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాష్ట్రంలో మెడిసిన్స్ కొనుగోలు సామాన్య ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ లోని ముకరంపుర డాక్టర్ స్ట్రీట్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘‘ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం’’ను ప్రారంభించారు. పేద ప్రజలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో నరేంద్రమోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. దీంతోపాటు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మెడిసిన్స్ కొనుగోలు చేయాలంటే అత్యంత ఖరీదైన వ్యవహారమైందన్నారు. మెడిసిన్ కొనుగోలు చేసే స్థోమత లేక ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలు, ఆర్ధిక కష్టాలు తెలుసు కాబట్టే నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘‘ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు’’ తెరిచి చౌక ధరకే మెడిసిన్స్ అందిస్తున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలు అంటే ప్రభుత్వం తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ మందులు అందించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక మెడికల్ స్టోర్లు అని, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే పథకం కింద నిర్వహించబడుతున్నాయని తెలిపారు. బ్రాండెడ్ మందులపై ఖర్చు తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చౌక ధరలకే మందుల అందుబాటులో ఉంచడం, ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడంతోపాటు ప్రజలను జనరిక్ మెడిసిన్ వాడకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఈ జన ఔషధీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కరీంనగర్ ప్రజలంతా పీఎం జన ఔషధి కేంద్రాల్లో దొరికే చౌక మందులను వినియోగించుకోవాలని కోరారు.
    1
    రాష్ట్రంలో మెడిసిన్స్ కొనుగోలు సామాన్య ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ లోని ముకరంపుర డాక్టర్ స్ట్రీట్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘‘ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం’’ను ప్రారంభించారు. పేద ప్రజలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో నరేంద్రమోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. దీంతోపాటు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మెడిసిన్స్ కొనుగోలు చేయాలంటే అత్యంత ఖరీదైన వ్యవహారమైందన్నారు. మెడిసిన్ కొనుగోలు చేసే స్థోమత లేక ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలు, ఆర్ధిక కష్టాలు తెలుసు కాబట్టే నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘‘ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు’’ తెరిచి చౌక ధరకే మెడిసిన్స్ అందిస్తున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలు అంటే ప్రభుత్వం తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ మందులు అందించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక మెడికల్ స్టోర్లు అని, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే పథకం కింద నిర్వహించబడుతున్నాయని తెలిపారు. బ్రాండెడ్ మందులపై ఖర్చు తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చౌక ధరలకే మందుల అందుబాటులో ఉంచడం, ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడంతోపాటు ప్రజలను జనరిక్ మెడిసిన్ వాడకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఈ జన ఔషధీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కరీంనగర్  ప్రజలంతా పీఎం జన ఔషధి కేంద్రాల్లో దొరికే చౌక మందులను వినియోగించుకోవాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త బస్టాండ్ సమీపంలోని ఈద్గా లో ముస్లిం మత గురువుల చే నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలలో బి ఆర్ ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి పాల్గొని సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీ గారిని మరియు మత గురువులను, మాజీ మజీద్ కమిటీ అధ్యక్షులను, పుర ప్రముఖులను మొదలగు ముస్లిం సోదరులందరిని కలుసుకొని (రంజాన్ పండుగ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీరి వెంట కౌన్సిలర్ లు కూరపాటి శ్రీశైలం, మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నంది శంకర్ మొదలగు నాయకులు పాల్గొని అందరికీ (రంజాన్ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.
    1
    రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని  కొత్త బస్టాండ్ సమీపంలోని ఈద్గా లో ముస్లిం మత గురువుల చే నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలలో బి ఆర్ ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి పాల్గొని  సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీ గారిని మరియు మత గురువులను, మాజీ మజీద్ కమిటీ  అధ్యక్షులను, పుర ప్రముఖులను మొదలగు ముస్లిం సోదరులందరిని కలుసుకొని (రంజాన్ పండుగ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీరి వెంట కౌన్సిలర్ లు కూరపాటి శ్రీశైలం,  మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నంది శంకర్ మొదలగు నాయకులు పాల్గొని అందరికీ (రంజాన్ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు ఈ వీడియోను సమయము అనుకూలంత చేసుకుని తప్పక విని బంధుత్వాలను ఎలా బలపరుచుకోవాలో తెలుసుకుంటారని కోరుకుంటున్నాను ఇట్లు మీ రేషన్ డీలర్ జాటోత్ రమేష్ నాయక్ రాథోడ్ (అల్ ఇండియా రేషన్ డీలర్ సోషల్ మీడియా)
    1
    కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు ఈ వీడియోను సమయము అనుకూలంత చేసుకుని తప్పక విని  బంధుత్వాలను ఎలా బలపరుచుకోవాలో తెలుసుకుంటారని కోరుకుంటున్నాను 
ఇట్లు
మీ 
రేషన్ డీలర్ 
జాటోత్ రమేష్ నాయక్ రాథోడ్ 
(అల్ ఇండియా రేషన్ డీలర్ సోషల్ మీడియా)
    user_Tagore Thakur
    Tagore Thakur
    ఆలేరు, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    8 hrs ago
  • కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నెక్ బీబీ దర్గా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పట్టణంలో సోదరభావం వెల్లివిరిసింది.
    1
    కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నెక్ బీబీ దర్గా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పట్టణంలో సోదరభావం వెల్లివిరిసింది.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • Shivampet Mandal లో గ్రామ పంచాయతీ కార్యాలయం 60 గజాల్లో ఉండటంతో 10మంది కూడా కూర్చోలేని పరిస్థితి నెలకొంది. 15 ఏళ్లుగా అభివృద్ధి జరగలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన కార్యాలయం నిర్మించాలని బీజేపీ అభ్యర్థి Shyam Vanjari కోరారు.
    1
    Shivampet Mandal లో గ్రామ పంచాయతీ కార్యాలయం 60 గజాల్లో ఉండటంతో 10మంది కూడా కూర్చోలేని పరిస్థితి నెలకొంది. 15 ఏళ్లుగా అభివృద్ధి జరగలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన కార్యాలయం నిర్మించాలని బీజేపీ అభ్యర్థి Shyam Vanjari కోరారు.
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    14 hrs ago
  • Post by Venu Gopal
    1
    Post by Venu Gopal
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టులో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన దుంపటి వినయ్ కుమార్ మృతదేహం లభించింది. ఇటీవల వివాహమైన వినయ్ కుమార్ ఉగాది రోజున బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోగా ఈరోజు నర్మాల ప్రాజెక్టులో మృతదేహం లభించడం పలు అనుమానాలకు తావిస్తుంది. వినయ్ ఆయన సోదరుడు మహేష్ కవల పిల్లలు కాగ మరో ఇద్దరు కవలలైన యువతులనే ఇటీవల వివాహం చేసుకున్నారు. ఉగాది పండుగ రోజున బయటికి వెళ్లిన వినయ్ తిరిగి రాకపోవడం మృతదేహం నర్మాల ప్రాజెక్టులో తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదవశాత్తు డ్యామ్‌లో పడిపోయి మృతి చెందినట్లు మృతుడి అన్న మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పెళ్లయిన కొద్ది రోజులకే వినయ్ డ్యామ్ లో పడి మృతి చెందడం పెళ్ళంట విషాదం అలుముకుంది.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టులో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన దుంపటి వినయ్ కుమార్ మృతదేహం లభించింది. ఇటీవల వివాహమైన వినయ్ కుమార్ ఉగాది రోజున బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోగా ఈరోజు నర్మాల ప్రాజెక్టులో మృతదేహం లభించడం పలు అనుమానాలకు తావిస్తుంది. వినయ్ ఆయన సోదరుడు మహేష్ కవల పిల్లలు కాగ మరో ఇద్దరు కవలలైన యువతులనే ఇటీవల వివాహం చేసుకున్నారు. ఉగాది పండుగ రోజున బయటికి వెళ్లిన వినయ్ తిరిగి రాకపోవడం మృతదేహం నర్మాల ప్రాజెక్టులో తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదవశాత్తు డ్యామ్‌లో పడిపోయి మృతి చెందినట్లు మృతుడి అన్న మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పెళ్లయిన కొద్ది రోజులకే వినయ్ డ్యామ్ లో పడి మృతి చెందడం పెళ్ళంట విషాదం అలుముకుంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకున్నారు.
    1
    దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకున్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • కామారెడ్డి జిల్లా బిక్కనూర్ : ఈనెల 23న తై బజార్ వేలంపాట, బిక్కనూరు పట్టణ తై బజార్ వేలంపాటను ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు గ్రామ సచివాలయ కార్యదర్శి మహేష్ గౌడ్ తెలిపారు. వారసంతతో పాటు రోజువారీ సంతలకు ఈ వేలం జరుగుతుందన్నారు. పాల్గొనేవారు రూ. 10,000 డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం గ్రామ సచివాలయంలో సంప్రదించాలని కోరారు. నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియ పారదర్శకగా జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా బిక్కనూర్ : ఈనెల 23న తై బజార్ వేలంపాట, బిక్కనూరు పట్టణ తై బజార్ వేలంపాటను ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు గ్రామ సచివాలయ కార్యదర్శి మహేష్ గౌడ్ తెలిపారు. వారసంతతో పాటు రోజువారీ సంతలకు ఈ వేలం జరుగుతుందన్నారు. పాల్గొనేవారు రూ. 10,000 డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం గ్రామ సచివాలయంలో సంప్రదించాలని కోరారు. నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియ పారదర్శకగా జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.