logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*బడ్జెట్ లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన ఎబివిపి నాయకులు* జగిత్యాల మార్చి 21 : 2026 27 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ తహసిల్ చౌక్ వద్ద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో అంకెల గారడితో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీలు ఊహ కందలేనంత ఎత్తుగడలతో విద్యార్థులను నిరుద్యోగులను మభ్యపెట్టి విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పనికి కేవలం పేపర్ల ప్రకటనలకే పరిమితం అయిపోయిందని తెలిపారు.

3 hrs ago
user_Venu Gopal
Venu Gopal
జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
3 hrs ago

*బడ్జెట్ లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన ఎబివిపి నాయకులు* జగిత్యాల మార్చి 21 : 2026 27 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ తహసిల్ చౌక్ వద్ద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో అంకెల గారడితో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీలు ఊహ కందలేనంత ఎత్తుగడలతో విద్యార్థులను నిరుద్యోగులను మభ్యపెట్టి విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పనికి కేవలం పేపర్ల ప్రకటనలకే పరిమితం అయిపోయిందని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Venu Gopal
    1
    Post by Venu Gopal
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కడెంలో నిర్వహిస్తున్న బీజేపీ శిక్షణా తరగతులకు జన్నారం మండలం నుండి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. శనివారం మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో తరలివెళ్లిన ఈ బృందం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ​సంస్థాగత బలోపేతమే ధ్యేయం ​ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, గ్రామాల్లో పార్టీని సంస్థగతంగా పటిష్టం చేయడమే ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, బీజేపీని మండలంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.
    1
    భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కడెంలో నిర్వహిస్తున్న బీజేపీ శిక్షణా తరగతులకు జన్నారం మండలం నుండి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. శనివారం మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో తరలివెళ్లిన ఈ బృందం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.
​సంస్థాగత బలోపేతమే ధ్యేయం
​ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, గ్రామాల్లో పార్టీని సంస్థగతంగా పటిష్టం చేయడమే ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, బీజేపీని మండలంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామివారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంత పూజలు నిర్వహించి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
    1
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా:
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామివారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంత పూజలు నిర్వహించి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు చేరి సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.
    1
    కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు చేరి సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో  పండుగ వాతావరణం నెలకొంది.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడేందుకు సిద్ధమైన మాజీమంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పెద్దలు నిమగ్నమయ్యారు. మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డితో భేటీ అయి కాంగ్రెస్ ను వీడొద్దని కోరారు. జగిత్యాల లో ఉన్న జీవన్ రెడ్డి ఇంటికి రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి చేరుకుని గంట పాటు జీవన్ రెడ్డి తో చర్చించారు. ఈనెల 25న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు జీవన్ రెడ్డితో భేటీ అయి చర్చించడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు గంట పాటు జీవన్ రెడ్డితో చర్చించారు. ఈ నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి కావాలంటే తాను ఓడిపోవాలని, పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిండు అంటే రాజీవ్ గాంధీ లేకపోతేనే కదా అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.‌ నర్మగర్భంగా తన ఆవేదనను చెప్పిన జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.‌ మంత్రులు శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఏ విధమైన నిర్ణయం తీసుకోవద్దని జీవన్ రెడ్డి ని కోరామని తెలిపారు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా నిలబడే ఆలోచన చేస్తుందని, ఆయనతో చర్చించిన అంశాలను పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి ఒక పెద్ద దిక్కులా ఉన్నారని, జీవన్ రెడ్డి గురించి తెలంగాణలో తెలియని వారు ఎవరు ఉండరని అలాంటి వ్యక్తిని పార్టీ వదులుకోదని తెలిపారు. అభివృద్ధి కోసమే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుక గా ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి అని, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు జీవన్ రెడ్డి తో గతం లో మాట్లాడారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల ను జీవన్ రెడ్డి తమ దృష్టికి తీసుకవచ్చారని, ఆయన చెప్పిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
    4
    కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడేందుకు సిద్ధమైన మాజీమంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పెద్దలు నిమగ్నమయ్యారు. మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డితో భేటీ అయి కాంగ్రెస్ ను వీడొద్దని కోరారు. జగిత్యాల లో ఉన్న జీవన్ రెడ్డి ఇంటికి రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి చేరుకుని గంట పాటు జీవన్ రెడ్డి తో చర్చించారు. ఈనెల 25న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు జీవన్ రెడ్డితో భేటీ అయి చర్చించడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు గంట పాటు జీవన్ రెడ్డితో చర్చించారు. ఈ నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి కావాలంటే తాను ఓడిపోవాలని, పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిండు అంటే రాజీవ్ గాంధీ లేకపోతేనే కదా అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.‌ నర్మగర్భంగా తన ఆవేదనను చెప్పిన జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.‌ మంత్రులు శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఏ విధమైన నిర్ణయం తీసుకోవద్దని జీవన్ రెడ్డి ని కోరామని తెలిపారు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా నిలబడే ఆలోచన చేస్తుందని, ఆయనతో చర్చించిన అంశాలను పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి ఒక పెద్ద దిక్కులా ఉన్నారని, జీవన్ రెడ్డి గురించి తెలంగాణలో తెలియని వారు ఎవరు ఉండరని అలాంటి వ్యక్తిని పార్టీ వదులుకోదని తెలిపారు. అభివృద్ధి కోసమే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుక గా ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి అని, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు జీవన్ రెడ్డి తో గతం లో మాట్లాడారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల ను జీవన్ రెడ్డి తమ దృష్టికి తీసుకవచ్చారని, ఆయన చెప్పిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    9 hrs ago
  • సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం చేసే ప్రతి అభివృద్ధి పని, గత ప్రభుత్వం హయంలో నిర్మించినవే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం సిద్దిపేట పర్యటన సందర్భంగా బహిరంగ లేఖను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విడుదల చేశారు. రేవంత్ రెడ్డి సిద్దిపేట కు చేసిన ద్రోహాన్ని లేఖ లో వివరించినట్లు పేర్కొన్నారు. కనపడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డి నేటికి కూడా రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దిపేట లో రూ.1070 కోట్ల పనులను అర్థాంతరంగా నిలిపి వేశారని, వాటిని వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకొని రేవంత్ రెడ్డి సిద్దిపేట కి వస్తున్నావు, ఇక్కడ అభివృద్ధి పనులు ఆపినందుకు వస్తున్నావా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి పనులు గత ప్రభుత్వం హయంలో చేసినవే అన్నారు . శ్రమ ఫలితం మాది శిలాఫలకాలు మీవి అని తెలిపారు. రిబ్బన్ లు కట్ చేయడం రేవంత్ రెడ్డి వంతు అయిందన్నారు. 2021 లోనే నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రూ.300 కోట్లతో గత ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.‌ కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఆయిల్ పామ్ సాగు లేదన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం కాదని అది తెలంగాణకి వరం అని అన్నారు.
    1
    సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం చేసే ప్రతి అభివృద్ధి పని, గత ప్రభుత్వం హయంలో నిర్మించినవే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం సిద్దిపేట పర్యటన సందర్భంగా బహిరంగ లేఖను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విడుదల చేశారు. రేవంత్ రెడ్డి సిద్దిపేట కు చేసిన ద్రోహాన్ని లేఖ లో వివరించినట్లు పేర్కొన్నారు. కనపడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డి నేటికి కూడా రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దిపేట లో  రూ.1070 కోట్ల పనులను అర్థాంతరంగా నిలిపి వేశారని, వాటిని వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకొని రేవంత్ రెడ్డి సిద్దిపేట కి వస్తున్నావు, ఇక్కడ అభివృద్ధి పనులు ఆపినందుకు వస్తున్నావా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి పనులు గత ప్రభుత్వం హయంలో చేసినవే అన్నారు . శ్రమ ఫలితం మాది శిలాఫలకాలు మీవి అని తెలిపారు. రిబ్బన్ లు కట్ చేయడం రేవంత్ రెడ్డి వంతు అయిందన్నారు. 2021 లోనే నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రూ.300 కోట్లతో గత ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.‌ కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఆయిల్ పామ్ సాగు లేదన్నారు.
కాళేశ్వరం కూలేశ్వరం కాదని అది తెలంగాణకి వరం అని అన్నారు.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    3 hrs ago
  • రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త బస్టాండ్ సమీపంలోని ఈద్గా లో ముస్లిం మత గురువుల చే నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలలో బి ఆర్ ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి పాల్గొని సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీ గారిని మరియు మత గురువులను, మాజీ మజీద్ కమిటీ అధ్యక్షులను, పుర ప్రముఖులను మొదలగు ముస్లిం సోదరులందరిని కలుసుకొని (రంజాన్ పండుగ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీరి వెంట కౌన్సిలర్ లు కూరపాటి శ్రీశైలం, మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నంది శంకర్ మొదలగు నాయకులు పాల్గొని అందరికీ (రంజాన్ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.
    1
    రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని  కొత్త బస్టాండ్ సమీపంలోని ఈద్గా లో ముస్లిం మత గురువుల చే నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలలో బి ఆర్ ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి పాల్గొని  సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీ గారిని మరియు మత గురువులను, మాజీ మజీద్ కమిటీ  అధ్యక్షులను, పుర ప్రముఖులను మొదలగు ముస్లిం సోదరులందరిని కలుసుకొని (రంజాన్ పండుగ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీరి వెంట కౌన్సిలర్ లు కూరపాటి శ్రీశైలం,  మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నంది శంకర్ మొదలగు నాయకులు పాల్గొని అందరికీ (రంజాన్ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.