గత ప్రభుత్వంలో చేసినవే సీఎం ప్రారంభిస్తున్నారు.. * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం చేసే ప్రతి అభివృద్ధి పని, గత ప్రభుత్వం హయంలో నిర్మించినవే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం సిద్దిపేట పర్యటన సందర్భంగా బహిరంగ లేఖను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విడుదల చేశారు. రేవంత్ రెడ్డి సిద్దిపేట కు చేసిన ద్రోహాన్ని లేఖ లో వివరించినట్లు పేర్కొన్నారు. కనపడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డి నేటికి కూడా రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దిపేట లో రూ.1070 కోట్ల పనులను అర్థాంతరంగా నిలిపి వేశారని, వాటిని వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకొని రేవంత్ రెడ్డి సిద్దిపేట కి వస్తున్నావు, ఇక్కడ అభివృద్ధి పనులు ఆపినందుకు వస్తున్నావా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి పనులు గత ప్రభుత్వం హయంలో చేసినవే అన్నారు . శ్రమ ఫలితం మాది శిలాఫలకాలు మీవి అని తెలిపారు. రిబ్బన్ లు కట్ చేయడం రేవంత్ రెడ్డి వంతు అయిందన్నారు. 2021 లోనే నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రూ.300 కోట్లతో గత ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఆయిల్ పామ్ సాగు లేదన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం కాదని అది తెలంగాణకి వరం అని అన్నారు.
గత ప్రభుత్వంలో చేసినవే సీఎం ప్రారంభిస్తున్నారు.. * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం చేసే ప్రతి అభివృద్ధి పని, గత ప్రభుత్వం హయంలో నిర్మించినవే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం సిద్దిపేట పర్యటన సందర్భంగా బహిరంగ లేఖను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విడుదల చేశారు. రేవంత్ రెడ్డి సిద్దిపేట కు చేసిన ద్రోహాన్ని లేఖ లో వివరించినట్లు పేర్కొన్నారు. కనపడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డి నేటికి కూడా రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దిపేట లో రూ.1070 కోట్ల పనులను అర్థాంతరంగా నిలిపి వేశారని, వాటిని వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకొని రేవంత్ రెడ్డి సిద్దిపేట కి వస్తున్నావు, ఇక్కడ అభివృద్ధి పనులు ఆపినందుకు వస్తున్నావా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి పనులు గత ప్రభుత్వం హయంలో చేసినవే అన్నారు . శ్రమ ఫలితం మాది శిలాఫలకాలు మీవి అని తెలిపారు. రిబ్బన్ లు కట్ చేయడం రేవంత్ రెడ్డి వంతు అయిందన్నారు. 2021 లోనే నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రూ.300 కోట్లతో గత ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఆయిల్ పామ్ సాగు లేదన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం కాదని అది తెలంగాణకి వరం అని అన్నారు.
- సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం చేసే ప్రతి అభివృద్ధి పని, గత ప్రభుత్వం హయంలో నిర్మించినవే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం సిద్దిపేట పర్యటన సందర్భంగా బహిరంగ లేఖను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విడుదల చేశారు. రేవంత్ రెడ్డి సిద్దిపేట కు చేసిన ద్రోహాన్ని లేఖ లో వివరించినట్లు పేర్కొన్నారు. కనపడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డి నేటికి కూడా రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దిపేట లో రూ.1070 కోట్ల పనులను అర్థాంతరంగా నిలిపి వేశారని, వాటిని వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకొని రేవంత్ రెడ్డి సిద్దిపేట కి వస్తున్నావు, ఇక్కడ అభివృద్ధి పనులు ఆపినందుకు వస్తున్నావా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి పనులు గత ప్రభుత్వం హయంలో చేసినవే అన్నారు . శ్రమ ఫలితం మాది శిలాఫలకాలు మీవి అని తెలిపారు. రిబ్బన్ లు కట్ చేయడం రేవంత్ రెడ్డి వంతు అయిందన్నారు. 2021 లోనే నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రూ.300 కోట్లతో గత ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఆయిల్ పామ్ సాగు లేదన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం కాదని అది తెలంగాణకి వరం అని అన్నారు.1
- వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామివారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంత పూజలు నిర్వహించి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.1
- కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడేందుకు సిద్ధమైన మాజీమంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పెద్దలు నిమగ్నమయ్యారు. మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డితో భేటీ అయి కాంగ్రెస్ ను వీడొద్దని కోరారు. జగిత్యాల లో ఉన్న జీవన్ రెడ్డి ఇంటికి రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి చేరుకుని గంట పాటు జీవన్ రెడ్డి తో చర్చించారు. ఈనెల 25న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు జీవన్ రెడ్డితో భేటీ అయి చర్చించడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు గంట పాటు జీవన్ రెడ్డితో చర్చించారు. ఈ నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి కావాలంటే తాను ఓడిపోవాలని, పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిండు అంటే రాజీవ్ గాంధీ లేకపోతేనే కదా అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నర్మగర్భంగా తన ఆవేదనను చెప్పిన జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. మంత్రులు శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఏ విధమైన నిర్ణయం తీసుకోవద్దని జీవన్ రెడ్డి ని కోరామని తెలిపారు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా నిలబడే ఆలోచన చేస్తుందని, ఆయనతో చర్చించిన అంశాలను పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి ఒక పెద్ద దిక్కులా ఉన్నారని, జీవన్ రెడ్డి గురించి తెలంగాణలో తెలియని వారు ఎవరు ఉండరని అలాంటి వ్యక్తిని పార్టీ వదులుకోదని తెలిపారు. అభివృద్ధి కోసమే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుక గా ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి అని, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు జీవన్ రెడ్డి తో గతం లో మాట్లాడారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల ను జీవన్ రెడ్డి తమ దృష్టికి తీసుకవచ్చారని, ఆయన చెప్పిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.4
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు చేరి సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.1
- రేవంత్ రెడ్డి..ముందు FTLలో ఉన్న మీ అన్న ఇల్లు కూలగొట్టు మా ఇంటికి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది రేవంత్ రెడ్డి అమెరికా పోయి కూడా చదువుకుని వస్తున్నాడు కదా ఏం నేర్చుకున్నాడో ఏమో మరి నువ్వు రాహుల్ గాంధీ విగ్రహమే కట్టుకో, సోనియా గాంధీ విగ్రహమే కట్టుకో.. హైదరాబాద్ మొత్తం చాలా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి మా ఇంటి దగ్గరనే కట్టాలా విగ్రహం? ఎక్కడ జాగా దొరకలేదా? ఖాళీగా ఉన్న స్థలంలో నువ్వు సముద్రమే కట్టుకో, పబ్బులే కట్టుకో, నైట్ లైఫ్ పెట్టుకుని కూరగాయలే అమ్ముకో మాకేం బాధ లేదు ప్రతిపక్షం బలంగా ఉందని వారి సహాయం కోసం వెళ్తే, రాజకీయ కుట్ర అని మమ్మల్ని బద్నాం చేస్తారా? –మూసీ బాధితురాలు1
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం : *విద్యాకు 8% శాతం బడ్జెట్ ప్రవేశపెట్టి విద్యార్థులను మరియు తెలంగాణ ఏర్పాటుకు కోసం ప్రాణాలను త్యాగం చేసిన విద్యార్థులను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం* *విద్యార్థుల సమస్యల పై మౌనం పాటించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు* అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా ఎబివిపి నాయకులు మాట్లాడుతూ నూతన తెలంగాణ ఏర్పాటుకు విద్యార్థులు కీలకపాత్ర అప్ పోషించి ఎంతో మంది విద్యార్థుల బలిదలన పై తెలంగాణ తెచ్చుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యార్థులకు కేటాయించింది కేవలం 8% మాత్రమే ఈ ఇది విద్యార్థులను అవమాన చేస్తూ తెలంగాణ వస్తే విద్యార్థుల బతుకులు మారుతాయి అని భావించిన శ్రీకాంతాచార్య లాంటి త్యాగ మూర్తులకు అవమాన పరిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాష్ట్రలను చూసి సిగ్గు తెచ్చుకోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకట్,కౌశిక్ తదితరులు పాల్గొనడం జరిగింది1
- ప్రజా పాలనలో - రైతు ఉత్సవాల్లోరైతులు పెద్ద సంఖ్య లో రైతులు పాల్గొనాలి* జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ జిల్లా పరిధిలోని 21 మండలాలకు చెందిన 2,650 మంది రైతులను 55బస్సుల ద్వారా నర్మెట్ట గ్రామానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లుమెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం రాత్రి విడుదలచేసిన ప్రకటనలో తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన రైతు ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం ఒక ప్రకటన తెలిపారు. మొదటి రోజు అనగా 20-03-2026 నాడు మెదక్ జిల్లా పరిధిలోని 10 మండలాలకు చెందిన 500 మంది రైతులను 10 బస్సుల ద్వారా తరలించి, అలాగే 21-03-2026 నాడు మరొక 10 మండలాలకు చెందిన 500 మంది రైతులను నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో సిద్దిపేట జిల్లాలో నిర్వహిస్తున్న రైతు ఉత్సవాలకు పంపించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు వ్యవసాయ మరియు అనుబంధ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలతో సాంకేతిక చర్చలు జరిపి, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పొందారు. అదేవిధంగా, ఉత్తమ రైతుల అనుభవాలను తెలుసుకొని తమ వ్యవసాయంలో అమలు చేయదగిన పద్ధతులను గ్రహించినట్లు వివరించారు అలాగే, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ మరియు అనుబంధ శాఖలకు చెందిన అధునాతన సాంకేతిక ప్రదర్శన స్టాళ్లను సందర్శించి, కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుంటున్నారని చెప్పారు. రేపు అనగా 22-03-2026 నాడు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మరియు ఆయిల్ ఫామ్ రిఫైనరీ శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెదక్ జిల్లా పరిధిలోని 21 మండలాలకు చెందిన 2,650 మంది రైతులను 53 బస్సుల ద్వారా నర్మెట్ట గ్రామానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.1
- తెలంగాణలో రైతు సంక్షేమం, అభివృద్ధి పనులపై ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నర్మేటలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.ముందుగా హెలిప్యాడ్‌ను పరిశీలించిన మంత్రులు, భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఫ్యాక్టరీ ప్రాంగణం, రిఫైనరీ శంకుస్థాపన స్థలం, సభ వేదికలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సుమారు 150 స్టాళ్లను కూడా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ...32 ఎకరాల్లో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందని తెలిపారు. కేవలం 16 నెలల్లో పూర్తి చేయడం విశేషమని చెప్పారు. గంటకు 30 నుంచి 120 టన్నుల వరకు క్రషింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఫ్యాక్టరీ రాష్ట్రంలో కీలకంగా మారుతుందని అన్నారు. ఇక్కడే ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుతో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి, తక్కువ సమయంలో చెల్లింపులు జరిపే విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. సుమారు 25 లక్షల మంది రైతులకు లాభం చేకూరేలా చర్యలు తీసుకున్నామని, దేశంలోనే ఒకేసారి భారీ స్థాయిలో రుణమాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారిస్తే లాభాలు పొందవచ్చని చెప్పారు.1